30, అక్టోబర్ 2018, మంగళవారం

శబ్దం

శ్రీ గురుభ్యోనమః.  శబ్దం అమ్మవారు,మౌనం అయ్యవారు. శబ్దాన్ని మౌనంలో సమర్పించడం కల్యాణం. అది వర్తమానంలో సాధ్యం,కనుక కల్యాణం చేస్తున్నది విష్ణువు.

5, జులై 2018, గురువారం

వైరాగ్యం

వైరాగ్యం. 
      వైరాగ్యం  అనేది ప్రధాన భూమిక ముముక్షువులకి. అన్నీ వదిలెయ్యడం అనేది లౌకికర్ధం. వదిలెయ్యడంలోని అర్ధం తెలియడం వైరాగ్యం . తాడుని చూసి పాము అనుకున్నా,లేదా ఏదైనా నీడచూసి పాము అనుకున్నా, జ్ఞానం వల్ల మాత్రమే భయం పోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా మరి భయం కలగదు .అలానే ముత్యపు చిప్పలోని వెండి.
       చూడడానికి రెండు వెలుగులు కావాలి . బయటివెలుగు,మనసు కళ్ళు వలన మనదృష్టి. ఈ రెంటితో 
భయం పోయింది.భౌతిక ప్రపంచము ఈ తాడు వంటిదే. కానీ పరమాత్మ విషయం తెలుసుకోడానికి ఈ వైరాగ్యం ఒకటి సరిపోదు .ఈ జ్ఞానం ఏమిటో తెలియాలి. ఎందుకంటే రెండు వెలుగులు భౌతిక వస్తువులు 
చూడడానికి పనికివస్తాయి. కానీ జ్ఞాన అజ్ఞానాలకు ఆవల పరమాత్మ. 
       గదిలోఉన్న దీపం వస్తువులను ప్రకాశింప చేస్తుంది. కానీ దీపాన్ని ఎవరూ ప్రకాశింప చెయ్యలేరు. 
ప్రకాశంలోని వస్తువులు,దీపముకూడా తెలియడం,అలానే ప్రకాశం లేనప్పుడు అవి తెలియక పోవడం కూడా 
మనకు తెలుస్తోంది.అంటే జ్ఞానము అజ్ఞానము కూడా తెలుస్తున్నాయి.పరకాశిస్తున్న వస్తువులు ,పై  ఉదాహరణ
లోని తాడు ,పాము వంటివి. అంటే అస్థిత్వం లేదు . ఏది ఒకసమయంలో మాత్రమే ప్రకాశిస్తుందో ,అది 
నిజానికి లేదు .రెండు వెలుగులు లేకపోతె సృష్టి మృగ్యం. మొదలు తుది ఉన్నది భ్రాంతి. ఈ రెండు లేనిది పరమాత్మ తత్త్వం ఒకటే. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ప్రకాశింప చేస్తున్న తాను మాత్రమే నిజం. ప్రకాశింప బడుతున్న 
శరీరం అజ్ఞానం . శరీర జ్ఞానం కలిగిఉన్న తాను పరమాత్మ.

2, జూన్ 2018, శనివారం

జీవితం

పెద్దల జీవితం -పిల్లల భవిష్యత్తు.
      పెద్దల జీవన విధానమే, పిల్లలకు జీవిత పాఠాలుగా మారతాయి.వివాహంతో ప్రారంభమౌతుంది జీవితం.పిల్లలకు పూర్వరంగం.
అత్తవారింటికి చేరింది కోడలు.చక్కగా అత్తగారింటిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.అత్తగారుకుడా ఎంతో ఓపికగా అన్నీ చె పుతారు. అపుడు ఆమె తమ అత్తగారి ఔన్నత్యం,తనకు అన్నీ నేర్పిన వైనం,అలానే ఆడ పడుచులతోఉన్న చక్కని అనుబంధం,
అలానే బావ గారిని గౌరవించడం కానీ,మరుదులతో సోదరిలా మెలగడం గాని,ఇలా ఎన్నో సంగతులు తెలియజేస్తారు.దీనికి ఆమె
ఎంతో సంయమనం పాటిస్తారు.తన పుట్టింటిని గురించి ఏమీ చెప్పరు. ఇలా ప్రవర్తించడం వలన,వచ్చిన కోడలికి కూడ చక్కని
అవగాహన ఏర్పడుతుంది తన ఇంటి గురించి.అంతేకాదు తన పుట్టింటి గురించిన ఆలోచనలు కూడా తగ్గు ముఖం పడతాయి.అదే
అత్తగారు తన పుట్టింటి కబుర్లతో కాలక్షేపం చేస్తే,కొడలుకూడ తన పుట్టింటిని విడిచి వేరే ఆలోచనను చెయ్యదు.
             అలానే భగవంతుని పూజ,వారి ఇంట్లోని విషయాలు,నమ్మకాలు తెలియజేస్తారు.చక్కని నియమాలు పాటిస్తూ మార్గ
దర్శనం చేస్తారు.ఇందులో భాగంగా విష్ణువు,లక్ష్మీదేవి,తల్లి,తండ్రులుగాను,శివ,పార్వతులు వారికి తల్లితండ్రులుగాను భావించి
ప్రతి విషయాన్ని వారి ముందు ఉంచి,ప్రయత్నం చేసి,అయితే,దానితో తమకు అవసరం ఉందని,అవకపోతే ఇబ్బందులు పడకుండా
భగవంతుడు రక్షించాడని, ఎప్పుడూ తమకు భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉందనే భావాన్ని గృహంలో కలిగిఉండాలి.
దీనివలన ఇంట్లో పాజిటివ్ ఏటిట్యూడ్ పెరుగుతుంది.
       
      ఈ రకమైన వాతావరణంలో వచ్చిన పిల్లలు చక్కని భవిష్యత్తు కలిగి ఉంటారు.వీరికి జీవితాన్ని ఏకోణంలో చూడలో తెలుస్తుంది.
ఎప్పుడూ, ఎక్కువగా పొంగిపోకుండా,అలానే కుంగిపోకుండా జీవితాన్ని చాలా స్పష్టంగా జీవిస్తారు.అలానే భావితరాలకు చక్కని
మార్గదర్శనం చెయ్య గలుగుతారు.

4, మే 2018, శుక్రవారం

కాల భైరవ

మన బ్రతుకులన్నీ కాలాధీనం. కాలం అనుకూలిస్తేనే ఏదైనా సాధించగలం. ఎవరికైనా కాలం అనుకూలించేటట్లు చేసే దైవం "శ్రీ కాలభైరవుడు". కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున (ప్రత్యేకంగా సాయంత్రం) ఆ దేవుని స్మరించుకోవడం సర్వాభీష్ట ప్రదాయకం. శ్రీ శైవ మహాపురాణంలో శ్రీ ఉపమన్యు మహర్షి వారు దర్శించిన "శ్రీ శివ పంచావరణ స్తోత్రం"లో చెప్పబడ్డ కాలభైరవుని ప్రార్థిద్దాం.
ఇది శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి పోస్టు..

క్షేత్రపాలో మహతేజా నీలజీమూత సన్నిభః;
దంష్ట్రాకరాళ వదనః స్ఫురద్రక్తాధరోజ్జ్వలః

రక్తోర్ధ్వ మూర్ధజశ్శ్రీమాన్ భ్రుకుటీ కుటిలేక్షణః;
రక్తవృత్త త్రినయనశ్శశి పన్నగ భూషణః

నగ్నస్త్రిశూల పాశాసి కపాలోద్యత పాణికః ;
భైరవో భైరవైస్సిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః

క్షేత్రే క్షేత్రే సమాసీనః స్థితో యో రక్షకస్సతాం;
శివప్రణామ పరమః శివ సద్భావ భావితః

శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ ;
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం

వీరభద్రో మహాతేజా హిమకుందేందు సన్నిభః ;
భద్రకాళీ ప్రియో నిత్యం మాతౄణాంచాభిరక్షితా

యఙ్ఞస్య చ శిరోహర్తా దక్షస్య చ దురాత్మనః ;
ఉపేంద్రేంద్ర యమాదీనాం దేవానాం అంగ తక్షకః

శివస్యానుచరః శ్రీమాన్ శివశాసన పాలకః ;
శివయోశ్శాసనాదేవ స మే దిశతు కాంక్షితం

29, ఏప్రిల్ 2018, ఆదివారం

నావ

నావ.
     శరీరాన్ని నావ తో పోల్చారు.ఇది ప్రయాణిస్తుంది లేదా లంగర్ వేయబడుతుంది.దీన్ని సాధనకు అనుకూలంగా అన్వయిస్తే ,ఆలోచనలు ప్రయాణిస్తున్నప్పుడు తెలివి అనే తెడ్డుతో ప్రయాణం సాగించాలి.అంటే ఆలోచనలు చూస్తున్నానే తెలివి.కానీ తెడ్డు వదిలేసి,ఆలోచనలతో కలిసి పోకూడదు.అలానే లంగర్ వేసినప్పుడు అహం అనేదానికి కట్టకూడదు.అంతా పరమాత్మదనే ఎరుకతో ,పరమాత్మనే ఆధారంగా లంగర్ వేసి 
విశ్రాంతి పొందాలి.

21, ఏప్రిల్ 2018, శనివారం

శివ

శివ పంచావరణ స్తోత్రమ్
శ్రీ ఉపమన్యు మహర్షి శ్రీ కృష్ణునకు ఉపదేశించిన పంచావరణ స్తోత్రం చాలా విశిష్టమైనది. ఇందులో ఐదు ఆవరణలలో ఉండే అనేక దేవతలను ప్రార్థిస్తూ పరమేశ్వరుని శాసనంతో వారందరూ మనలను రక్షించాలనే ప్రార్థన ఉంటుంది. ఈ స్తోత్రం చదువుతున్నంతసేపు పరమేశ్వరుడు అమ్మవారితో కలసి ఆకాశంలో ఉండి ఈ స్తోత్రాన్ని చదివేవారిని చూస్తూ ఉంటారుట. పూజ్యగురువుల నాన్నగారు ఇది సేకరించి తనకోసం వ్రాసుకున్నారు. వీలున్నపుడల్లా గురువు గారు వారి సోదరులు చదివేవారట.ఇది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి పోస్ట్.
ధ్యానం:
సకల భువన భూత భావనాభ్యాం, జనన వినాశవిహీన విగ్రహాభ్యాం
నరవరయువతీ వపుర్ధరాభ్యాం, సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం
ఉపమన్యురువాచ:
స్తోత్రం వక్ష్యామి తే కృష్ణ! పంచావరణ మార్గతః
యోగేశ్వరమిదం పుణ్యం కర్మ యేన సమాప్యతే
జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్స్వభావ;
అపగతకలుష ప్రపంచవాచామపి మనసో పదవీమతీత తత్త్వ ...........1
స్వభావ నిర్మలాభోగ జయసుందర చేష్టిత;
స్వాత్మతుల్య మహాశక్తే జయ శుద్ధ గుణార్ణవ...2
అనంత కాంతి సంపన్న జయాసదృశ విగ్రహ;
అతర్క్య మహిమాధార జయానాకుల మంగళ...3
నిరంజన నిరాధార, జయనిష్కారణోదయ;
నిరంతర పరానంద జయ నిర్వృతి కారణ ..4
జయాతి పరమైశ్వర్య జయాతి కరుణాస్పద;
జయ స్వతంత్ర సర్వస్వ జయాసదృశ వైభవ...5
జయావృత మహావిశ్వ జయానావృత కేనచిత్;
జయోత్తర సమస్తస్య జయాత్యంత నిరుత్తర
జయాద్భుత జయాక్షుద్ర జయాక్షత జయావ్యయ;
జయామేయ జయామాయ జయా+అభయ జయా+అమల
మహాభుజ మహాసార మహాగుణ మహా కథ;
మహాబల మహా మాయ మహారస మహారథ;
నమః పరమదేవాయ నమః పరమహేతవే;
నమశ్శివాయ శాంతాయ నమశ్శివ తరాయతే
త్వదధీనమిదం కృత్స్నం జగద్ధిససురాసురం;
అతస్త్వద్విహితామాఙ్ఞాం క్షమతేకోతివర్తితుం
అయం పునర్జనో నిత్యం భవదేక సమాశ్రయః;
భవానతోనుగృహ్యాస్మై ప్రార్థితం సంప్రయచ్ఛతు
జయాంబికే జగన్మాతర్జయ సర్వ జగన్మయి;
జయానవధికైశ్వర్యే జయానుపమవిగ్రహే
జయవాఙ్మనసాతీతే జయాచిద్ధ్వాంత భంజికే ;
జయజన్మ జరాహీనే జయకాలోత్తరోత్తరే
జయానేక విధావస్థే జయానేక సుఖాత్మికే;
జయానేక మహాసత్త్వే జయానేక గుణోజ్ఝితే
జయానేక గుణాత్మస్థే జయలోక మహేశ్వరి;
జయవిశ్వాధికాత్మస్థే జయవిశ్వేశ్వరప్రియే
జయవిశ్వ సురారాధ్యే జయ మంగళదీపికే;
జయమంగళ చారిత్రే జయమంగళదాయిని
నమః పరమకళ్యాణి గుణ సంచయమూర్తయే;
నమశ్శివాయై విశ్వస్మాత్ పరస్మై శివశక్తయే
త్వత్తః ఖలు సముత్పన్నం జగత్త్వయ్యేవ లీయతే;
త్వద్వినాతః ఫలం దాతుం ఈశ్వరోపి నశక్నుయత్
జన్మప్రభృతి దేవేశి జనోయం త్వదుపాశ్రితః;
అతోస్య తవ భక్తస్య నిర్వర్తయ మనోరథం
పంచవక్త్రో దశభుజః శుద్ధస్ఫటిక సన్నిభః; వర్ణబ్రహ్మకలాదేహో దేవస్సకల నిష్కళః;
శివమూర్తిసమారూఢః శాంత్యతీతస్సదాశివః ; భక్త్యామయార్చితో మహ్యం ప్రార్థితం సంప్రయచ్ఛతు
సదా శివాంకమారూఢా శక్తిరిచ్ఛాశివాహ్వయా; జననీ సర్వలోకానాం ప్రయచ్ఛతు మనోరథం
శివయోర్దయితౌ పుత్రౌ దేవౌ హేరంబషణ్ముఖౌ ; శివానుభౌ వౌచ శివౌ శివఙ్ఞానామృతాశినౌ
తృప్తౌ పరస్పరం స్నిగ్ధౌ శివాభ్యాం నిత్య సత్కృతౌ; ఆరాధితౌ సదాదేవౌ బ్రహ్మాద్యైస్త్రిదశైరపి
సర్వలోకపరిత్రాణం కర్తుమభ్యుదితౌసదా ; స్వేచ్ఛావతారం కుర్వంతౌ స్వాంశ భేదైరనేకశః
తావిమౌ శివయోః పార్శ్వే నిత్యమిత్థం మయా+అర్చితౌ; తయోరాఙ్ఞాం పురస్కృత్య ప్రార్థితంమే ప్రయచ్ఛతాం
శుద్ధస్ఫటికసంకాశం ఈశానాఖ్యం సదాశివం; మూర్ధాభిమానినీ మూర్తిశ్శివస్య పరమాత్మనః
శివార్చనరతం శాంతం శాంత్యతీతం ఖమాస్థితం ; పంచాక్షరాంతిమం బీజం కలాభిః పంచభిర్యుతం
ప్రథమావరణే పూర్వం శక్త్యా సహ సమర్చితం ; పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు
బాలసూర్య ప్రతీకాశం పురుషాఖ్యం పురాతనం; పూర్వవక్త్రాభిమానంచ శివస్య పరమేష్ఠినః
శాంత్యాత్మకం మరుత్సంస్థం శంభోః పాదార్చనే రతం ; తురీయం శివబీజేషు కలాసు చ చతుష్కళం
పూర్వభాగే మయాభక్త్యా శక్త్యా సహ సమన్వితం ; పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు
అంజనాద్రి ప్రతీకాశం అఘోరం ఘోర విగ్రహం ; దేవస్య దక్షిణం వక్త్రం దేవదేవ పదార్చకం
విద్యాపదం సమారూఢం వహ్ని మండల మధ్యగం ; తృతీయం శివబీజేషు కలాస్వష్ట కలాన్వితం
శంభోర్దక్షిణ దిగ్భాగే శక్త్యా సహ సమర్చితం ; పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం సంప్రయచ్ఛతు
కుంకుమక్షోద సంకాశం వామాఖ్యం వరవేషధృక్ ; వక్త్రముత్తరమీశస్య ప్రతిష్ఠాయాం ప్రతిష్ఠితం
వారిమండలమధ్యస్థం మహాదేవార్చనేరతం ; ద్వితీయం శివబీజేషు త్రయోదశ కలాన్వితం
దేవేశోత్తర దిగ్భాగే శక్త్యా సహ సమర్చితం; పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు
శంఖకుందేందుధవళం సద్యాఖ్యం సౌమ్యలక్షణం; శివస్య పశ్చిమం వక్త్రం శివపాదర్చనే రతం
నివృత్తిపదనిష్ఠంచ పృథివ్యాం సమవస్థితం ; ప్రథమం శివ బీజేషు కలాభిశ్చాష్టభిర్యుతం
దేవస్య పశ్చిమే భాగే శక్త్యా సహ సమర్చితం; పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు
శివస్య చ శివాయాశ్చ హృన్మూర్తీ శివభావితే ; తయోరాఙ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్ఛాతాం
శివస్య చ శివాయాశ్చ శిరోమూర్తీ శివాశ్రితే; తయోరాఙ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్ఛతాం
శివస్య చ శివాయాశ్చ శిఖామూర్తీ శివాశ్రితే; సత్కృత్య శివయోరాఙ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతాం
శివస్యచ శివాయశ్చ నేత్రమూర్తీ శివాశ్రితే; సత్కృత్య శివయోరాఙ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతాం
శివస్య చ శివాయాశ్చ వర్మిణీ శివ భావితే; సత్కృత్య శివయోరాఙ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతాం
అస్త్రమూర్తీ చ శివయోర్నిత్యమర్చన తత్పరే; సత్కృత్య శివయోరాఙ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతాం
వామో జ్యేష్ఠస్తథా రుద్రః కాలో వికరణస్తథా; బలో వికరణశ్చైవ బలప్రమథనః పరః
సర్వభూతస్య దమనస్తాద్ర్శశ్చాష్టశక్తయః ; ప్రార్థితం మే ప్రయచ్ఛంతు పరమేశస్య శాసనాత్
అథానంతశ్చ సూక్ష్మశ్చ శివశ్చాప్యేకనేత్రకః; ఏకరుద్రస్త్రిమూర్తిశ్చ శ్రీకంఠశ్చ శిఖండకః
తథాష్టౌ శక్తయస్తేషాం ద్వితేయావరణేడితా; తే మే కామం ప్రయచ్ఛంతు శివయోరేవశాసనాత్
భవాద్యామూర్తయశ్చాష్టౌ తేషామపి చ శక్తయః ; మహాదేవాదయశ్చాన్యే తథైకాదశ మూర్తయః
శక్తిభిస్సహితాః సర్వే తృతీయావరణే స్థితాః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం దిశంతు ఫలమీప్సితం
వృషరాజో మహాతేజా మహామేఘ సమస్వనః ; మేరుమందర కైలాస హిమాద్రి శిఖరోపమః
సితాభ్ర శిఖరాకారః కకుదా పరిశోభితః ; మహాభోగీంద్ర కల్పేన వాలేన చ విరాజితః
రక్తాస్య శృంగ చరణో రక్త ప్రాయ విలోచనః ; పీవరోన్నత సర్వాంగః సుచారు గమనోజ్జ్వలః
ప్రశస్త లక్షణః శ్రీమాన్ ప్రజ్జ్వలన్మణి భూషణః; శివప్రియః శివాసక్తః శివయోర్ధ్వజ వాహనః
తథాతచ్చరణన్యాస-భావితా పర విగ్రహః ; గోరాజ పురుషశ్శ్రీమాన్ శ్రీమచ్ఛూల వరాయుధః
తయోరాఙ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు ;
నందీశ్వరో మహాతేజా నగేంద్ర తనయాత్మజః ; స నారాయణకైర్దేవైర్నిత్యమభ్యర్చ్య వందితః ;
శర్వస్యాంతః పురద్వారి సార్థం పరిజనైః స్థితః ; సర్వేశ్వర సమప్రఖ్యః సర్వాసుర విమర్దనః ;
సర్వేషాం శివధర్మాణాం అధ్యక్షత్వేభిషేచితః ; శివ ప్రియః శివాసక్తః శ్రీమచ్ఛూల వరాయుధః ;
శివాశ్రితేషు సంసక్తస్త్వనురక్తశ్చతైరపి ; సత్కృత్య శివయోరాఙ్ఞాం సమే కామం ప్రయచ్ఛతు ;
మహాకాలో మహాబాహుర్మహాదేవ ఇవా పరః ; మహాదేవాశ్రితానాంతు నిత్యమేవాభిరక్షితా ;
శివప్రియశ్శివాసక్తః శివయోరర్చకస్సదా ; సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు కాంక్షితం ;
సర్వశాస్త్రార్థ తత్త్వఙ్ఞః శాస్తా విష్ణోః పరా తనుః ; మహా మోహాత్మ తనయః మధుమాంసా సవ ప్రియః ;
తయోరాఙ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు
బ్రహ్మాణీ చైవ మాహేశీ కౌమారీ వైష్ణవీ పరా; వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చండ విక్రమా
ఏతావై మాతరస్సప్త సర్వలోకస్య మాతరః ; ప్రార్థితం మే ప్రయచ్ఛంతు పరమేశ్వర శాసనాత్
మత్తమాతంగ వదనో గంగోమా శంకరాత్మజః ; ఆకాశదేహో దిగ్బాహుః సోమ సూర్యాగ్ని లోచనః
ఐరావతాదిభిర్దివ్యైః దిగ్గజైః నిత్యమర్చితః ; శివఙ్ఞాన మదోద్భిన్నస్త్రిదశానామవిఘ్నకృత్
విఘ్నకృచ్చాసురాదీనాం విఘ్నేశః శివభావితః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు కాంక్షితం
షణ్ముఖః శివ సంభూతః శక్తి వజ్ర ధరః ప్రభుః ; అగ్నేశ్చ తనయో దేవోహ్యపర్ణా తనయః ప్రభుః
గంగాయాశ్చ గణాంబాయాః కృత్తికాయాస్తథైవ చ; విశాఖేన చ శాఖేన నైగమేయేన చ ఆవృతః
ఇంద్రజిచ్చేంద్రసేనానీస్తారకాసురజిత్తథా ; శైలానాం మేరు ముఖ్యానాం వేధకశ్చ స్వతేజసా
తప్తచామీకర ప్రఖ్యః శతపత్రదళేక్షణః ; కుమారస్సుకుమారాణాం రూపోదాహరణం మహత్
శివప్రియః శివాసక్తః శివ పాదార్చకస్సదా ; సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు కాంక్షితం
జ్యేష్ఠా వరిష్ఠా వరదా శివయోః పూజనే రతా; తయోరాఙ్ఞాం పురస్కృత్య సా మే దిశతు కాంక్షితం
త్రైలోక్య వందితా సాక్షాదుల్కాకారా గణాంబికా; జగత్సృష్టి వివృధ్యర్థం బ్రహ్మణాభ్యర్థితా శివాత్
శివాయాః ప్రవిభక్తాయా భ్రువోరంతర నిష్ఠితః ; దాక్షాయణీ సతీ మేనా తథా హైమవతీహ్యుమా
కౌశికాయాశ్చ జననీ భద్రకాళ్యాస్తథైవ చ ; అపర్ణాయాశ్చ జననీ పాటలాయాస్తథైవ చ
శివార్చన రతా నిత్యం రుద్రాణీ రుద్ర వల్లభా ; సత్కృత్య శివయోరాఙ్ఞాం సా మే దిశతు కాంక్షితం
చండః సర్వగణేశానః శంభోర్వదన సంభవః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు కాంక్షితం
వృషభో నామ గణపః శివారాధన తత్పరః; పింగళో గణపశ్శ్రీమాన్ శివాసక్తః శివ ప్రియః
ఆఙ్ఞయా శివయోరేవ స మే కామం ప్రయచ్ఛతు
భృంగీశో నామ గణపః శివారాధన తత్పరః ; ప్రయచ్ఛతు స మే కామం పత్యురాఙ్ఞా పురస్సరం
వీరభద్రో మహాతేజా హిమకుందేందు సన్నిభః ; భద్రకాళీ ప్రియో నిత్యం మాతౄణాంచాభిరక్షితా
యఙ్ఞస్య చ శిరోహర్తా దక్షస్య చ దురాత్మనః ; ఉపేంద్రేంద్ర యమాదీనాం దేవానాం అంగ తక్షకః
శివస్యానుచరః శ్రీమాన్ శివశాసన పాలకః ; శివయోశ్శాసనాదేవ స మే దిశతు కాంక్షితం
సరస్వతీ మహేశస్య వాక్సరోజ సముద్భవా; శివయోః పూజనే నిత్యం సా మే దిశతు కాంక్షితం
విష్ణోర్వక్షః స్థితా లక్ష్మీః శివయోః పూజనే రతా; శివయోశ్శాసనాదేవ సా మే దిశతు కాంక్షితం
మహా మోటీ మహా దేవ్యాః పాదపూజా పరాయణా; తస్యా ఏవ నియోగేన సా మే దిశతు కాంక్షితం
కౌశికీ సింహమారూఢా పార్వత్యాః పరమా సుతా ; విష్ణోర్నిద్రా మహా మయా మహా మహిష మర్దినీ
నిశుంభ శుంభ సంహర్త్రీ మధుమాంసా సవ ప్రియా; సత్కృత్య శాసనం మాతుః సా మే కామం ప్రయచ్ఛతు
రుద్రా రుద్ర సమప్రఖ్యాః ప్రమథాః ప్రథితౌజసః; భూతాఖ్యాశ్చ మహావీర్యా మహాదేవ సమ ప్రభాః
నిత్యముక్తా నిరుపమా నిర్ద్వంద్వా నిరుపప్లవాః; స శక్తయస్సానుచరాః సర్వలోక నమస్కృతాః
సర్వేషామేవ లోకానాం సృష్టి సంహరణక్షమాః ; పరస్పరానురక్తాశ్చ పరస్పరమనువ్రతాః
పరస్పరమతిస్నిగ్ధాః పరస్పరనమస్కృతాః ; శివప్రియతమా నిత్యం శివలక్షణలక్షితాః
సౌమ్యాఘోరాస్తథామిశ్రాశ్చాంతరాళ ద్వయాత్మజాః ; విరూపాశ్చ సురూపాశ్చ నానా రూపధరాస్తథా
సత్కృత్య శివయోరాఙ్ఞాం తే మే కామం దిశంతువై ;
దేవ్యాః ప్రియసఖీవర్గో దేవీ లక్షణ లక్షితః
సహితో రుద్రకన్యాభిః శక్తిభిశ్చాప్యనేకశః ; తృతీయావరణే శంభోర్భక్త్యా నిత్యం సమర్చితః
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం;
దివాకరో మహేశస్య మూర్తిర్దీప్త సుమండలః
నిర్గుణో గుణ సంకీర్ణః తథైవ గుణ కేవలః ; అవికారాత్మకశ్చాద్యః తతస్సామాన్య విక్రియః
అసాధారణ కర్మా చ సృష్టి స్థితిలయ క్రమాత్; ఏవం త్రిథా చతుర్థా చ విభక్తః పంచథా పునః
చతుర్థావరణే శంభోః పూజితశ్చానుగైస్సహ ; శివప్రియశ్శివాసక్తశ్శివ పాదార్చనే రతః
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం;
దివాకర షడంగాని ఆదిత్యాద్యాశ్చ మూర్తయః
ఆదిత్యో భాస్కరోభానూరవిశ్చేత్యనుపూర్వశః ; అర్కో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చాదిత్య మూర్తయః
విస్తారా సుతరా బోధిన్యాప్యాయిన్యపరాపునః ; ఊషా ప్రభా తథా ప్రాఙ్ఞా సంధ్యా చేత్యపి శక్తయః
సోమాది కేతు పర్యంతాః గ్రహాశ్చ శివ భావితాః ; శివయోరాఙ్ఞయానున్నాః మంగళం ప్రదిశంతు మే
అథవా ద్వాదశాదిత్యాః తథా ద్వాదశ రాశయః; ఋషయో దేవ గంధర్వాః పన్నగాప్సరసాం గణాః
గ్రామణ్యశ్చ తథా యక్షా రాక్షసశ్చాసురాస్తథా ; సప్త సప్త గణాశ్చైతే సప్తచ్ఛందో మయా హయాః
వాలఖిల్యగణాశ్చైవ సర్వే శివ పదార్చకాః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం మంగళం ప్రదిశంతు మే
బ్రహ్మాథ దేవ దేవస్య మూర్తిర్భూమండలాధిపః; చతుష్షష్టి గుణైశ్వర్యో బుద్ధి తత్త్వే ప్రతిష్ఠితః
నిర్గుణో గుణ సంకీర్ణః తథైవ గుణ కేవలః ; అవికారాత్మకో దేవస్తతః సాధారణః పరః
అసాధారణ కర్మా చ సృష్టి స్థితి లయ క్రమాత్; ఏవం త్రిధా చతుర్ధా చ విభక్తః పంచధా పునః
చతుర్థావరణే శంభోః పూజితశ్చ సహానుగైః ; శివ ప్రియశ్శివాసక్తః శివ పాదార్చనే రతః
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం;
హిరణ్య గర్భో లోకేశః విరాట్కాలశ్చ పూరుషః
సనత్కుమారస్సనకస్సనందశ్చ సనాతనః ; ప్రజానాం పతయశ్చైవ దక్షాద్యాబ్రహ్మ సూనవః
ఏకదశ సపత్నీకా ధర్మస్సంకల్ప ఏవ చ ; శివార్చన రతాశ్చైవ శివభక్తి పరాయణాః
శివాఙ్ఞావశగాస్సర్వే దిశంతు మమ మంగళం
చత్వారశ్చ తథా వేదాస్సేతిహాస పురాణకాః; ధర్మశాస్త్రాది విద్యాభిర్వైదికీభిస్సమన్వితాః
పరస్పరావిరుద్ధార్థాః శివైక ప్రతిపాదకాః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం మంగళం ప్రదిశంత్వి మే
అథ రుద్రో మహాదేవః శంభోర్మూర్తిర్గరీయసీ; వాహ్నేయ మండలాధీశః పౌరుషైశ్వర్యవాన్ ప్రభుః
శివాభిమాన సంపన్నో నిర్గుణస్త్రిగుణాత్మకః ; కేవలస్సాత్వికశ్చాపి రాజసశ్చైవ తామసః
అవికార రతశ్శర్వే తతస్తు సమ విక్రియః ; అసాధారణ కర్మా చ సృష్ట్యాది కరణాత్ పృథక్
బ్రహ్మణోపి శిరశ్ఛేత్తా జనకస్తస్య తత్సుతః ; జనకస్తనయశ్చాపి విష్ణోరపి నియామకః
బోధకశ్చ తయోర్నిత్యమనుగ్రహకరః ప్రభుః ; అండస్యాంతర్బహిర్వర్తీ రుద్రలోకద్వయాధిపః
శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చనే రతః ; శివస్యాఙ్ఞాం పురస్కృత్య స మే దిశతు మంగళం
తస్య బ్రహ్మ షడంగాని విద్యేశానాం తథాష్టకం; చత్వారో మూర్తిభేదాశ్చ శివపూర్వాశ్శివార్చకాః
శివో భవో హరశ్చైవ మృడశ్చైవ తథా పరః ; శివస్యాఙ్ఞాం పురస్కృత్య మంగళం ప్రదిశంతు మే
అథ విష్ణుర్మహేశస్య శివస్యైవాపరాతనుః ; వారితత్త్వాధిపస్సాక్షాదవ్యక్తపద సంస్థితః
నిర్గుణస్సత్త్వ బహుళస్తథైవ గుణ కేవలః ; అవికారాభిమానీ చ త్రిసాధారణ విక్రియః
అసాధారణ కర్మా చ సృష్ట్యాది కరణాత్ పృథక్; దషిణాంగభవేనాపి స్పర్థమానస్స్వయంభువా
ఆద్యేన బ్రహ్మణా సాక్షాత్ సృష్టాస్స్రష్టా చ తస్య తు ; అండస్యాంతర్బహిర్వర్తీ విష్ణుర్లోక ద్వయాధిపః
అసురాంతకరశ్చక్రీ శక్రస్యాపి తథానుజః ; ప్రాదుర్భూతశ్చ దశధా భృగుశాపచ్ఛలాదిహ
భూభార నిగ్రహార్థాయ స్వేచ్ఛయావతరత్ క్షితౌ ; అప్రమేయ బలోమాయీ మాయయా మోహయన్ జగత్
మూర్తీకృత్య మహావిష్ణుం సదా విష్ణుమథాపి వా ; వైష్ణవైః పూజితో నిత్యం మూర్తిత్రయ మయాసనే
శివప్రియశ్శివాసక్తశ్శివపాదర్చనే రతః ; శివస్యాఙ్ఞాం పురస్కృత్య స మే దిశతు మంగళం
వాసుదేవః అనిరుద్ధశ్చ ప్రద్యుమ్నశ్చ తతః పరః ; సంకర్షణస్సమాఖ్యాతశ్చతస్రో మూర్తయో హరేః
మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః '; రామత్రయం తథా కృష్ణో విష్ణుస్తురగ వక్త్రకః
చక్రం నారాయణస్యాస్త్రం పాంచజన్యం చ శార్ఙ్ఞకం ; సత్కృత్య శివయోరాఙ్ఞాం మంగళం ప్రదిశంతు మే
ప్రభా సరస్వతీ గౌరీ లక్ష్మీశ్చ శివ భావితా; శివయోశ్శాసనాదే తా మంగళం ప్రదిశంతు మే
ఇంద్రోగ్నిశ్చ యమశ్చైవ నిరృతిర్వరుణస్తథా ; వాయుస్సోమః కుబేరశ్చ తథేశానస్త్రిశూలధృక్
సర్వే శివార్చన రతాశ్శివసద్భావ భావితాః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం మంగళం ప్రదిశంతు మే
త్రిశూలమథ వజ్రం చ తథా పరశు సాయకౌ; ఖడ్గ పాశాంకుశాశ్చైవ పినాకశ్చాయుధోత్తమః
దివ్యాయుధాని దేవస్య దేవ్యాశ్చైతాని నిత్యశః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం రక్షాం కుర్వంతు మే సదా
వృషరూపధరో ధర్మః సౌరభేయో మహా బలః ; బాడబాఖ్యానలస్పర్ధో పంచ గోమాతృభిర్వృతః
వాహనత్వమనుప్రాప్తస్తపసా పరమేశయోః ; తయోరాఙ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు
నందా సుభద్రా సురభిః సుశీలా సుమనాస్తథా ; పంచ గోమాతరస్త్వేతాః శివలోకే వ్యవస్థితాః
శివభక్తి పరా నిత్యం శివార్చన పరాయణాః; శివయోశ్శాసనాదేవ దిశంతు మమ వాంఛితం
క్షేత్రపాలో మహతేజా నీలజీమూత సన్నిభః; దంష్ట్రాకరాళ వదనః స్ఫురద్రక్తాధరోజ్జ్వలః
రక్తోర్ధ్వ మూర్ధజశ్శ్రీమాన్ భ్రుకుటీ కుటిలేక్షణః; రక్తవృత్త త్రినయనశ్శశి పన్నగ భూషణః
నగ్నస్త్రిశూల పాశాసి కపాలోద్యత పాణికః ; భైరవో భైరవైస్సిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః
క్షేత్రే క్షేత్రే సమాసీనః స్థితో యో రక్షకస్సతాం; శివప్రణామ పరమః శివ సద్భావ భావితః
శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ ; సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం
తాలజంఘాదయస్తస్య ప్రథమావరణేర్చితాః ; సత్కృత్య శివయోరాఙ్ఞాం చత్వారస్సమవంతు మాం
భైరవాద్యాశ్చ యే చాన్యే సమంతాత్తస్య వేష్టితాః ; తేపి మామనుగృహ్ణంతు శివశాసనగౌరవాత్
నారదాద్యాశ్చ మునయో దివ్యాదేవైశ్చ పూజితాః ; సాధ్యాశ్చైవ తు యే దేవా జనలోక నివాసినః
వినివృత్తాధికారాశ్చ మహర్లోక నివాసినః ; మహర్షయస్తథాన్యే చ వైమానిక గణైస్సహ
సర్వే శివార్చన రతాః శివాఙ్ఞావక వర్తినః ; శివయోః ఆఙ్ఞయా మహ్యం దిశంతు మమ కాంక్షితం
గంధర్వాద్యాః పిశాచాంతాః చతస్రోదేవ యోనయః ; సిద్ధా విద్యాధరాద్యాశ్చ యేపి చాన్యే నభశ్చరాః
అసురా రాక్షసాశ్చైవ పాతాళ తలవాసినః ; అనంతాద్యాశ్చ నాగేంద్రాః వైనతేయాదయోద్విజాః
కూష్మాండాః ప్రేతభేతాళాః గ్రహాభూతగణాః పరే; డాకిన్యశ్చాపి యోగిన్యః శాకిన్యశ్చాపి తాదృశాః
క్షేత్రారామ గృహాదీని తీర్థాన్యాయతనాని చ ; ద్వీపాస్సముద్రానద్యశ్చ నదాశ్చాన్యే సరాంసి చ
గిరయశ్చ సుమేర్వాద్యాః కాననాని సమంతతః; పశవః పక్షిణో వృక్షాః కృమికీటాదయో మృగాః
భువనాన్యపి సర్వాణి భువనానామధీశ్వరాః; అండాద్యావరణైస్సార్థమాశాశ్చదశ దిగ్గజాః
వర్ణాః పదాని మంత్రాశ్చ తంత్రాన్యపి సహాధిపైః; బ్రహ్మాండధారకా రుద్రా రుద్రాశ్చాన్యే సశక్తికాః
యచ్చకించిజ్జగత్యస్మిన్ ఇష్టం చానుమితం శ్రుతం ; సర్వే కామం ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్
అథ విద్యా పరాశైవీ పశుపాశ విమోచనీ : పంచార్థ సంఙ్ఞితా దివ్యా పశువిద్యా బహిష్కృతా
శాస్త్రం చ శివధర్మాఖ్యం ధర్మాఖ్యం చ తదుత్తరం ; శైవాఖ్యం శివధర్మాఖ్యం పురాణం శ్రుతి సమ్మితం
శైవాగమాశ్చ యే చాన్యే కామికాద్యాశ్చతుర్విధాః ; శివాభ్యామవిశేషేణ సత్కృత్యేహ సమర్చితాః
తాభ్యామేవ సమాఙ్ఞాతాః మమాభి ప్రేత సిద్ధయే ; కర్మైదమనుమన్యంతాం సఫలం సాధ్వనుష్ఠితం
శైవా మాహేశ్వరాశ్చైవ ఙ్ఞాన కర్మ పరాయణాః ; కర్మేదమనుమన్యంతాం సపలం సాధ్వనుష్ఠితం
లౌకికా బ్రాహ్మణాస్సర్వే క్షత్రియాశ్చ విశాః క్రమాత్ ; వేదవేదాంగ తత్త్వఙ్ఞాః సర్వశాస్త్ర విశారదాః
సాంఖ్యా వైశేషికాశ్చైవ యౌగానైయాయికా నరాః ; సౌరా బ్రాహ్మాస్తథా రౌద్రా వైష్ణవాశ్చాపరే నరాః
శిష్టాస్సర్వే విశిష్టాశ్చ శివశాసన యంత్రితాః ; కర్మేదమనుమన్యంతాం మమాభి ప్రేత సాధకం
శైవాస్సిద్ధాంత మార్గస్థాః శైవాః పాశుపతాస్తదా ; శైవా మహావ్రత ధరాః శైవాః కాపాలికాః పరే
శివాఙ్ఞాపాలకాః పూజ్యా మమాపి శివశాసనాత్ : సర్వే మామనుగృహ్ణంతు శం సంతు సఫల క్రియాం
దక్షిణ ఙ్ఞాన నిష్ఠాశ్చ దక్షిణోత్తర మార్గగాః ; అవిరోధేన వర్తంతాం మంత్రశ్రేయోర్థినో మమ
నాస్తికాశ్చ శఠాశ్చైవ కృతఘ్నాశ్చైవ తామసాః ; పాషండాశ్చాతి పాపాశ్చ వర్తంతాం దూరతో మమ
బహుభిః కింస్తుతైరత్ర యేపి కేపి చిదాస్తికాః ; సర్వే మామనుగృహ్ణంతు శం సంతు మమ మంగళం
నమశ్శివాయ సాంబాయ ససుతాయాది హేతవే ; పంచావరణ రూపేణ ప్రపంచేనావృతాయ తే
ఇత్యుక్త్వా దండవద్భూమౌ ప్రణిపత్య శివం శివాం; జపేత్పంచాక్షరీం విద్యాం అష్టోత్తర శతావరాం
తథైవ శక్తి విద్యాం చ జపిత్వా తత్సమర్పణం ; కృత్వా క్షమాపయిత్వేశం పూజాశేషం సమాపయేత్
ఏతత్పుణ్యతమం స్తోత్రం శివయోర్హృదయంగమం ; సర్వాభీష్టప్రదం సాక్షాత్ భుక్తి ముక్త్యేక సాధకం
య ఇదం శ్రుణుయాన్నిత్యం కీర్తయేద్వా సమాహితః ; స విధూయాశు పాపాని శివ సాయుజ్యమాప్నుయాత్
గోఘ్నశ్చైవ కృతఘ్నశ్చ వీరహా భ్రూణహాపివా ; శరణాగతఘాతీ చ మిత్రవిశ్రంభఘాతుకః
దుష్టః పాప సమాచారో మాతృహా పితృహాపి వా ; స్తవేనాయుత జప్తేన తత్తత్పాపాత్ప్రముచ్యతే
దుఃస్వప్నాది మహానర్థ సూచకేషు భయేషు చ ; యది సంకీర్తయేదేతన్నతోనర్థ భాగ్భవేత్
ఆయురారోగ్యమైశ్వర్యం యచ్చాన్యదపి వాంఛితం; స్తోత్రస్యాస్య జపే నిష్ఠస్తత్ సర్వం లభతే నరః
అసంపూజ్య శివం స్తోత్ర జపాత్ ఫలముదాహృతం ; సంపూజ్య చ జపేత్తస్య ఫలం వక్తుం న శక్యతే
ఆస్తామియం ఫలావాప్తిరేతస్మిన్ కీర్తితే సతి ; సార్థమంబికయా దేవః శ్రుత్వేదం దివి తిష్ఠతి
తస్మాన్నభసి సంపూజ్య దేవదేవం సహోమయా ; కృతాంజలి పుటస్తిష్ఠన్ స్తోత్రమేతదుదీరయేత్
ఇత్యార్షే శ్రీ శైవే మహాపురాణే వాయవీయ సంహితాయాం ఉత్తరభాగే చతుర్వింశోధ్యాయః
శ్రీ సాంబశివార్పణమస్తు

12, ఏప్రిల్ 2018, గురువారం

ఆనందం

ఆనందం.
       సత్,చిత్ అనేవి అనుభవంలో అందుతాయి.కానీ ఆనందం యొక్క లక్షణం సృష్టి పరంగా భ్రమింపజేస్తుంది.ఆనందం అనేదే మనకి ఇష్టంగా వ్యక్తమవుతోంది.అంతరంలోని ఆనందం,సృష్టిలోని జీవులకర్మ ఫలంగా లభించిన జీవితాల్లో మాయరూపంగా మూడు రూపాలుగా
విడిపోతున్నది.అవే ఇచ్చా,జ్ఞాన,క్రియ శక్తులు. మొదటి ఇచ్చా శక్తికి సంబంధీచినవే,కామ,క్రోధాలు, జ్ఞానాశక్తికి సంబంధిచినవి లోభ, మోహమూ,అలానే క్రియకు మద, మాత్సర్యాలు.వీటి మూలరూపం తెలిసి అర్ధం చేసుకుంటే ,ఇవి బాధించవు.
       ఇచ్చా,లేదా కామ ,కోరిక.ఎదో ఒకదానిమీద దృష్టి లగ్నమై,అది కావలనిపించడం కోరిక.చివరకు దాన్ని సాధించి పొందే తృప్తి యొక్కరూపం ఆనందం.తిరకపోతే క్రోధం.కోరిక తీర్చుకునే క్రమంలో,ప్లాన్ చేస్తున్నపుడు అది తనకి మాత్రమే ఉండాలనే మోహమూ,
చాలా ఎక్కువగా దాచుకోవలనే లోభము. క్రియలో సాధించిన దానిపట్ల మదము అంటే అహంకారము,వేరేవారికి దొరకకూడదన్న
మాత్సర్యము, ఇవి సహజం.కామ,లోభాలు ,మదము వ్యక్తిగతం. వేరేవారు అవే సాధించినపుడు,లేదా తాను ఓడిపోయినప్పుడు కలిగేవి ,
క్రోధ,మోహ,మాత్సర్యాలు.నిజానికి ప్రకృతిలోని ప్రతిదీ పరమాత్మది.అది ఏదైనా ధర్మ బధ్ధంగా, ప్రసాదం గానే భావించాలి.లేదా అదే
మోహాన్ని కలిగిస్తుంది.వేరేవారి వస్తువు ఆశించడం మోహం.వారికి ఉంటే క్రోధం.తాను పొందలేకపోతే మాత్సర్యము.
ఇలా అన్నీ ఆనందం యొక్క సగుణ రూపలే. అంతా పరమాత్మదనే జ్ఞానం,అనుభవంలో కలిగితే అది ఆనందం,తృప్తి.అదే ప్రసాద 
మనస్తత్వం.ఇది మోక్షకరణం.మోక్షం.ఇదే రాధ.


     

30, మార్చి 2018, శుక్రవారం

మన శాంతి

    సర్వం బ్రహ్మ మయం జగత్.అనేది పారమర్దిక సత్యం.పార్షిక సత్యం కాదు.ఈ జగత్తు పార్షిక సత్యం.ఈ జగత్తులో వివాహానికి తరతమ బేధాలు తప్పనిసరి.నిజానికి ఆధ్యాత్మిక సాధనా స్థాయిని తెలిపేది జన్మతో వచ్చిన వర్ణం యొక్క స్వభావం.నాలుగు కాళ్ల జంతువులు,అడ్డంగా వెన్నుపాము కలిగినవి ,అన్ని ఓకేరకం కాదు.కొన్ని గడ్డి,ఇతరమొక్కలు వీటిపై ఆధారపడి జీవిస్తాయి.
కొన్ని మాంసహారులుగా జీవిస్తాయి.వీటిలో ఎక్కువ ,తక్కువ అని ఏమీలేదు.వేటి జీవన విధానం వాటిది. భగవంతునికి అన్నీ
సమానమే.కర్మ గతిలో వేటి స్థానాన్ని అవి పొందాయి.అలానే. మనుషులు ఒకేలా కనిపిస్తున్నా, ఎన్నో బేధాలతో జీవిస్తారు.
వేరు వేరు విభాగాల జంతువులు వాటికి అవే సమానత్వం ఉన్నవాటితోనే జతకడతాయి. ఇది ప్రకృతి సహజం.బేధాలు జంతువుల
వలె ,మనుషులకు తెలియవు.అంత మాత్రాన లేవని కాదు.అందువల్లనే పరమాత్మ వర్ణ విభాగం చేసాడు.ఒకే రకమైన ఆచార,
వ్యవహారాలు,ఆలోచనా ధోరణి కలిగిన వారు ,పైకి విబేధాలు ఉన్నట్లు కనిపించినా, పెద్దగా సమస్య ఉండదు.
        కానీ,వర్ణాంతర వివహాలలో,ముందుగా శరీర పరంగా ఆలోచించి అంతా బావుంది అనుకున్నా, పరమాత్మ సృష్టిలో నియమాన్ని తప్పినట్లే అవుతుంది.నియమాల ప్రకారం కాలం నడుస్తున్నది.ప్రకృతి అంతా స్వభావ సిద్ధంగా నడుస్తున్నది.
కానీ పరమాత్మను చేరడానికి ఇచ్చిన వివేక జ్ఞానం ,తప్పుతోవపట్టి శరీరానికి సంబంధిచిన విషయాలకు,అనవసర ప్రాధాన్యం ఇచ్చి మానవాళి ఇక్కట్ల పాలవుతున్నది.ఇలా పెద్దలు కాదన్న వివాహాలు,ఎంతో గొప్పగా ఉన్నాయి అని నిరూపించాలనుకునే వారు
ఎక్కువే.కానీ మనసును మభ్యపెట్టి తమలో తమ అంతరంగములో వాదించుకుని సరిపెట్టుకుంటారు.కానీ నిజాన్ని ఒప్పుకోరు.
ఎందుకంటే అహంకారం అడ్డు వస్తుంది.పెద్దలను కూడా బలవంతంగా ఒప్పించినా, అంతరంగం మాత్రం అందరికీ కల్లోలమే.
ఎప్పుడూ మన శాంతి ఉండదు.దీనికి బదులు ముందుగా పిల్లలు తమ మనసునే లొంగదీసుకుంటే ఏ సమస్యలు ఉండవు.
అందుకే పిల్లలకు చిన్నప్పుడు ఇటువంటి సంఘటనలు,ఎలా తెలిసినా, పెద్దలు తప్పక ఖండించాలి.వారి మనసులో అటువంటి
విషబీజాలు పడకుండా కాపాడుకోవాలి.ఇటువంటి వాటికి సహజంగా చిన్నప్పుడే బీజాలు పడతాయి.స్నేహాలు ఆడపిల్లలకు,
అడపిల్లలతో ఉండేలా జాగ్రత్త పడాలి. వారి మధ్యన కూడా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో గమనించాలి.మన పెద్దలు చూపిన బాటలో నిలకడగా సాగాలి.మన శాంతితో, జీవించి,పరమఅర్ధం వైపు సాగాలి.లేకుంటే ఇలాంటి తప్పులు పిల్లలు చేసినా పెద్దలకు
పర మార్ధం అందదు.మనో చాంచల్యం వదలదు.తస్మాత్ జాగ్రత.ప్రాప్యవరాన్నిబోధత.



23, మార్చి 2018, శుక్రవారం

స్వభావం

స్వభావం.
  ప్రతి మనిషిలోను స్పష్టంగా అందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇవి సహజమైన నిత్య సత్యమైన పరమాత్మ లక్షణాలు. అవి  ఎప్పుడూ తాను ఉంటాననే నమ్మకం. అంతా తెలుసనే లక్షణం. ప్రకటితం కాకున్నా తనలో తనపట్ల సంతృప్తి.ఇవి సతిచ్చిదానంద లక్షణాలు.ఎప్పుడూ ఉండడం సత్ లక్షణం.తెలుసు అనేది చిత్, ఆనందం సంతృప్తి.ఇవి లేని మనిషి ఉండరు.కానీ వీటిని శరీర పర్యంతంగా భావించడమే
అవిద్య.అలానే పరబ్రహ్మ తత్వంలో, అహం ప్రజ్ఞ తెలిస్తే సృష్టి.ఇదే అద్వైతంలో ద్వైతం.స్పందించిన అహం తిరిగి స్వస్థితిని పొందాలనే సహజమైన కోరిక మోక్షం.ఇది శరీర పర్యంతమైనపుడు,బాహ్యంలో జంట కోసం వెతుకుతుంది. కానీ అంతరార్ధంగా గమనిస్తే,ఇది నిజానికి తనలోనే ఉన్న తనను చేరడమే.బాహ్యంలో స్త్రీ,పురుష బేధం తెలిసే 8సం. వయసు నుండి పరమాత్మ జ్ఞానాన్ని అందించ గలిగితే ,తమలో
కలిగే భావాలకు మూలం తెలియడం వలన పిల్లలు, తమను తాము అనవసర భావజాలం నుండి కాపాడుకో గలుగుతారు.శ్రీరాముని యోగ వశిష్ఠ అనుభవం ,ఈవిషయాన్ని తెలియ జేస్తున్నది.అనవసర సమయంలో,అక్కరలేని విషయాలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.విజ్ఞానం అవసరం లేని పశు జనాలకు మాత్రమే తినడం తెలిశాక, తరువాత ప్రత్యుత్పత్తి మాత్రమే గమ్యం.కానీ మానవ జన్మ పరమార్ధం
గ్రహించాలి.                                                       

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సనాతనం

సనాతనం. 
       శ్రీ గురుభ్యో నమః. 
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. కలియుగంలో తరింపచేసే మంత్రం.
ఇందులో మనకు కనిపించేవి మూడు నామాలు .మూడు ముక్తిమార్గాలు. తాపత్రయాల నుండి తప్పుకోడానికి ఈ మంత్రం. సంసారమనే కాసారంలోని సుఖపడాలనే తపనే గజేంద్రుడు ఈదులాడిన సరస్సు. కాలమనే మొసలి సమీపిస్తే ,తన ఆత్మబంధువులైనా ఏమీ చెయ్యలేరు. చాలామంది ఇక్కడ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేని దురవస్థ. అంతేకానీ ఇందులో బంధుజనుల అలసత ఏమిఉండదు. పూర్వపుణ్య విశేషం ,అలానే 
తనశక్తి ఏమీ పనిచెయ్యడం లేదని తెలిసిన క్షణం పరమాత్మను అంతర్యామిగా గుర్తించడం వలన అతనిని శ్రీహరి 
రక్షించాడు. దీనికి సంసారంలోఉన్నా పరమాత్మపట్ల అవగాహన కలిగి ఉండడం వలన ,వీలైనంత శాస్త్ర అవగాహన , భక్తి ,అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ,గజేంద్రునికి సహకరించాయి. అవి ఈజన్మకు సంబంధించినవి కాకపోయినా జంతుశరీరంలో రక్షించాయి. కానీ మానవుడైకూడా ప్రయత్నశీలుడు కాకుంటే పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . ఎన్నో జన్మల తపః ఫలంగా లభించిన మానవదేహం తన గమ్యాన్ని చేర్చే నావ . మిగిలిన ఉపాధులకు 
ఈఅవకాశం లేదు. మానవజన్మలో గమ్యం చేరాలంటే అడ్డుగా ఉన్నవి ,అహం,మమ. నిజానికి ఈరెండూ కలిగి ఉన్నది  పరమాత్మ.కానీ శరీరంలో పరమాత్మ తేజస్సు  శరీరికి అర్ధం కానివ్వదు . శరీర పర్యంతంగా తెలుస్తున్న 
చైతన్యాన్ని అహంగా భావిస్తాడు. కుమ్మరి కుండ తయారైన మాత్రాన ,అందులో ఆకాశం నింపబడలేదు. అలానే 
బయటి ఆకాశంకన్నా వేరుకాదు. కుండ తన ఆకాశం అంటే ఎలాటిదో ,శరీర పర్యంత అహం తాను అనుకోవడం 
అలాంటిదే. అలానే పంచేద్రియాలు గ్రహించే సకలము తనది అయిన ప్రపంచం అవుతుంది. ఇవన్నీ పరమాత్మ 
సృజనలో పంచభూత వికారాలే . కనుక తను అనేది ,తనది అనేది మిధ్య. అంటే [పుట్టుకతో] మధ్యలో వచ్చాయి. 
మధ్యలోనే పోతాయి. ఆకాశంలా తానెప్పుడూ ఉండేదే. కుండ రాకపోకలతో ఆకాశం దుఃఖిస్తే ఎలా?
        కానీ ఇదే అజ్ఞానం ఎన్నో జన్మలుగా ధృఢపడి కుండే నిజమై కూచున్నది. జంతు జన్మలలో జ్ఞానార్జన అవకాశం లేదు కనుక ,ఈ జన్మకు ఎంతో ప్రాధాన్యత నిచ్చింది శాస్త్రం. మానవ మస్తిష్కమే ముక్తి సాధనం . సాధన వరకే దీని 
ఉపయోగం. సాధ్యం అంతటా నిండియున్న ఆకాశమే తాను అని గ్రహించడమే సారాంశం. అందుకే ఆకాశమే విష్ణువు అంటుంది శాస్త్రం . ఆకాశం అంటే జడంకాదు . మనలో చైతన్యం మనకు తెలుస్తున్నది కదా ?అదే అంతటా నిండి ఉన్నది. జీవితంలో భుక్తికి అవసరమైనంతగా మాత్రమే ,కుటుంబ అవసరాలవరకు ధర్మబద్ధంగా సంపాదించి , ధార్మిక జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత సమయాన్ని ,తత్వ ,భక్తి శాస్త్ర అధ్యయనంలోనూ,సజ్జన సహవాసం తోను, పరమాత్మ కృపకు పాత్రులైతే హృదయంలో గురుసాన్నిధ్యం కలుగుతుంది . శివాయ గురవే నమః. బాహ్యంలో గురువు ,మీ శాస్త్ర విహిత కర్మాచరణతో మీముందుకు వస్తారు. మన పెద్దల బాటను విడువక ఆరాధన,కొనసాగిస్తేనే 
తగిన గురువు మార్గదర్శనం చేస్తారు . పెద్దల బాటకు బద్ధకం ,కుతర్కం తోడైతే ,సాధనను మోసపుచ్చే గురువే 
లభ్యం అవుతారు. దీనికి పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . కనుక తన ఆచార వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. 
          జ్ఞానం తనను ఉద్దరించుకోడానికే ,జంఝాటానికి కాదు . ఈసాధనకు గమ్యాన్ని ప్రసాదించే మహామంత్రమే 
హరే రామ ,హరే కృష్ణ . అహం మన సాధనకు అడ్డుపడుతున్నపుడు రామనామము,ప్రపంచం నాదిగా తిప్పలు 
పెడుతున్నప్పుడు కృష్ణ మంత్రము,అన్నివేళలా హరి మంత్రము ,ముముక్షువుకు సహాయపడతాయి. ఏకాగ్రతతో, బుద్ధి సహాయంతో అహం రూపమైన రావణ సంహారాన్ని, చిన్ననాటినుండి ఆశ్రయించిన యోగ వశిష్ఠ గీత యొక్క అనుభవ సారంతో జీవన విధానాన్ని,కలిగిన శ్రీరాముని కధనుండి ప్రేరణ పొంది,శ్రీరామనామంతో అహంను జయించాలి.అన్ని తావులయందు తన వైభవాన్ని చాటి ప్రతి వారితోను ప్రతి సంఘటనతోను,మమేకం అయినట్లుఉన్నా, క్రీడగా తన పాత్రను ప్రపంచంలో ప్రకటించిిిన కృష్ణానామాన్ని ,ఇదం అని తెలియబడుతున్న      ప్రపంచాన్ని,బాహ్యం లోను,అంతరంగంలోను ,విశ్వం అంతా పరమాత్మ భావాన్ని పొందడానికి కృష్ణానమాన్ని గ్రహించి చరించాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే . 

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

శ్రీ వల్లభేశాయ నమః.శివాయ గురవే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ విష్ణు రూపాయ నమశివాయ.శ్రీ గురుగుహాయ షణ్ముఖాయ నమః.
గురువు పరసువేది లాంటి వారు.జీవి తన పాప కర్మలను పరమాత్మ సేవతో తొలగించుకున్నపుడు ,కర్తృత్వ భావం
తొలగి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే తపన ఏర్పడుతుంది. పాప ప్రభావం తగ్గితే, ఇనుముకు తుప్పు
లేకుండా చేసినపుడు అయస్కాతం చేత ఆకర్షించ బడినట్లు ,గురువు పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. అంతవరకూ గురువు
పక్కనే ఉన్నాఆయన కృపకు పాత్రుడు కాలేడు . ఎపుడు చిత్తశుద్ధి కలుగుతుందో , అపుడు తప్పక గురువు , పరమాత్మ యొక్క రూపమైన ,జీవ బ్రహ్మైక్యాన్ని తెలియజేసినపుడు ,జీవి అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని కలిగి , క్రమంగా ఆత్మనిష్ఠను పొందుతాడు. పరశువేది ఇనుమును బంగారం చేసినట్లే ,గురువు స్వానుభవమైన అహం బ్రహస్మి అనే అనుభవాన్ని ,శిష్యునికి తత్వమసి మహావాక్యంగా అందిస్తారు. దీనితో జీవత్వ బ్రాంతి నశించి శిష్యుడు
ఈశావాస్యం ఇదం సర్వమ్ అని తనలోనే మునిగిపోతాడు. 

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

                                                                        సనాతనం.
                                                                       [కన్యాదానం.]
   భారతీయ సంప్రదాయంలో కన్యాదానానికి పెద్దపీట వేయబడింది. ఇదే నాలుగు ఆశ్రమాలకు పట్టుకొమ్మ అయిన
గృహస్థాశ్రమానికి ప్రారంభం. దీన్ని స్త్రీ ,పురుష పరంగా కాక ,అద్వితీయమైన అర్ధనారీశ్వర తత్వంలో అర్ధంచేసుకునే
శాస్త్ర మననంలో భాగంగా స్వీకరించాను. జీవి పుట్టిన పిదప ఆహారంతో క్రమంగా మనసు తయారవుతుంది. ఇదే కన్య. నిజానికి మనసు దేన్ని మనం కోరుకుంటే దానిలో లగ్నం అవుతుంది. ఇది అందరి అనుభవంలోని విషయం.
ఇందువల్లనే శాస్త్రం ,ధ్రువుణ్ణి ,ప్రహ్లాదుని,శ్రీరాముని సంకేతంగా చూపి బాల్యంలోనే పిల్లలకు అపరోక్షానుభూతిని
పరిచయం చేయమంటుంది. ఏ కోరిక అయినా ధ్రువుణ్ణి,ఏ ప్రశ్న అయినా ప్రహ్లాదుని,ఏ వైరాగ్యమైన శ్రీరాముని వలె,గురువును ఆశ్రయించి వారికి అనువైన విధానంలో పిల్లలకు తత్వాన్ని పరిచయం చేయడం కనీస ధర్మం.
పై వారిలో ఎవరూ సన్యాసులు కాదు,గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించారు. జ్ఞానం అంటే సన్యాసం అనేది అపోహ. తన నిజానిజాలు తను తెలుసుకోవడం భగవత్ జ్ఞానం.
     మనసు కలిగిన జీవి , దానికి తండ్రితో సమానం. అష్టవర్షాత్ భవేత్ కన్య. ఆ వయసు నుండి మనసు తండ్రి ఏది చూపిస్తే అందులో లయమవడం ప్రారంభిస్తుంది.ఇలా అన్నంతో అంటే భూమినుండి అయోనిజగా జన్మించినది,కన్య.
అందు వల్లనే జనకుని ,విష్ణుచిత్తుని ఇలా ఎంతోమందిని, అమ్మాయి తండ్రిగా పరిచయం చేసింది శాస్త్రం. ఒక సంక్లిష్ట
విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్యక్తులతో నిర్మితి చేసేది నాటకం.యదార్ధమైన పరతత్వాన్ని భూమిపై , ప్రకటించి  చూపినవి ఇతిహాసాలు. కన్యకు పరమాత్మను పరిచయం చేసి అతనితో ఎప్పుడూ,నిరంతరాయంగా లగ్నమై పోయేలా చెయ్యడం తండ్రి కర్తవ్యం. అలా చేసేదే కన్యాదానం. అపుడు సీతకు అరణ్యం కూడా ఆహ్లాదం గానే ఉంది. అరణ్యం అంటే జీవితం. ఒడిదుడుకులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.ఇది బాహ్యచరణ.
    అంతరంలో తన స్వస్థితిలో కదలక,నిమిత్త మాత్రంగా కర్మాచరణ పాతివ్రత్యం.కానీ మనసు ఇంద్రియ విషయాలతో
ప్రాపంచిక విషయాలతో నిండి ఉండడం,భార్యా లోలత్వం.అంటే మనసు తాను పరిభ్రమించడానికి ,పరమాత్మయొక్క
దివ్య విభూతి అయిన కాలాన్ని నష్ట పరుస్తున్నది. దీనివలన జీవి కర్మల ఫలితంగా జన్మ పరంపరలు పొందుతాడు.
బాహ్యంలో చరించడం అంటే జీవికి కర్త్రుత్వాన్ని ఇవ్వడం,బాహ్యంలో మాత్రమే శరీరంతో కలిసిన అహం ప్రజ్ఞ ప్రవర్తిస్తుంది.అందువలన ముక్తి అసాధ్యం.అందువల్లనే బాహ్యంలో కన్యాదానం వలన ఏడు తరాలు తరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తాయి.మనసు లయిస్తేనే కానీ పైన అనుకున్నట్లు ముక్తి అసాధ్యం.దశరథుడైన వానికి రాముడు
లభించాడు యజ్ఞంతో. సీత జనకునికి మనో రూపంగా లభించింది. వీరిద్దరి కళ్యాణం ముక్తి. అంటే పురాకృత కర్మ
అనే యజ్ఞ కుండంనుండి ఆవిర్భవించినది శరీరం,అన్నగతంగా ఏర్పడింది మనసు. ఈరెండూ కలిస్తేనే జీవన్ముక్తి.

17, ఫిబ్రవరి 2018, శనివారం

సనాతనం

                                                                    సనాతనం .
  ప్రాణి పుట్టిననాటి నుంచి నేర్చుకోవాలనే తాపత్రయాన్ని కలిగి ఉంటుది. నేర్చుకునే సందర్భంలోకానీ ,నిష్ణాతులైన తరువాతకానీ ఎదో ఒక గమ్యాన్ని తనంతట తానే కలిగి అది పూర్తి అయిన తరువాత కృతక్రుత్యతను ఆస్వాదిస్తోంది.
నిజానికి ఈదశలో తనలోతాను మునిగి స్వస్థితిని పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఇది ప్రతివారి అనుభవం లోనిది. పుట్టుక తన స్వస్థితినుండి బయటకు రావడమే. మళ్ళీ తిరిగి చేరాలనే తపనే ఇందులోని తాత్పర్యం. నిజానికి నిద్రలోకూడా జరుగుతున్నది ఇదే. అందువల్లనే లేచాక ఎంతో హాయిగా ఉంటుంది. తన స్వస్థితి
చేరుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
శరీరంతో తాదాత్మ్యం చెంది ఎదో చేస్తున్నాననే భావనా బలం వలన ,కర్మల ఫలితంగా జన్మలను పొందుతున్నాము.
ఎప్పుడు మెలకువ వస్తే అపుడే ప్రపంచం అనుభవానికి అందుతుంది. అలానే ఈప్రపంచంలో ఇపుడు కర్మలను
చేస్తున్నా,ఆధ్యాత్మిక మార్గం ,నిద్రకు ,ముందు తరువాత కూడా నీవే ఉన్నట్లు ,జన్మకు ముందు తరువాతకూడా
ఉనికి సమానమని తెలియజేస్తుంది. ముందు ,వెనుక ఉన్న ఉనికి ఇప్పుడూ ఉన్నది నిజం . దీన్ని నిద్రలో కాక
మెలకువలో పొందడం ఆధ్యాత్మిక సాధన. కానీ తెలియకుండా కూడా ,గమ్యాన్ని చేరిన ప్రతిసారి పొందే అనుభవం కూడా ఇదే. తెలియకుండా జరుగుతున్న ఈప్రయత్నంలో శరీరభావన వలన పునరావృత్తి కలుగుతున్నది.
అదే పరమాత్మ జ్ఞానంతో చేస్తే మోక్షం అవుతుంది.  

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సనాతనం

                                        సనాతనం.
అన్ని శాస్త్రాల సారం ,నామరూపాలు భ్రాంతి అని ,స్వరూపమైన అహం ,జీవాత్మకాదని ,శరీరాన్ని తానుగా భావించడాన్ని,మనసుకి ఆలంబనగా ఇవ్వకూడదనేదే సారాంశం. మనసుకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పే విధానాలను ఎందరో సాధనాపరులు తెలియజేస్తూనే ఉన్నారు . అలాంటివి మనన రూపంగా స్మరిస్తున్నాను. వ్యక్తి ఒక్కడే అయినా అతడు తండ్రికి కుమారుడు,సోదరికి అన్న అలానే భర్త ,తన పిల్లలకు తండ్రి కూడా . కానీ ఇవన్నీ అనుబంధాలు తప్ప వేరు కాదు . వీటిని వార్డరోబ్లో హాంగార్లకు తగిలించే దుస్తులుగా ఊహిస్తే ,జ్ఞానం,వైరాగ్యం సిద్ధించేందుకు అవకాశం కలుగుతుంది. నిజానికి వీటిని తిరస్కరిస్తే ,ఎప్పటికీ మనసు లొంగదు . కానీ వ్యవహారం అవసరమైనపుడు తన పాత్రకు న్యాయం చేస్తూ ,అది అవగానే తన మూలమైన స్వరూప అహంలో విశ్రాంతి పొందాలి. ఇది నిజానికి రోజూ నిద్రలో జరుగుతున్నదే . సంబంధాలు అపుడు లేవు . దానివల్ల నిజజీవితంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దీనిని జాగ్రత్తులో సాధనగా మార్చినపుడు మనసు స్వరూపంలో నిలకడ పొందగలదు .

15, ఫిబ్రవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం. 
     స్త్రీ,పురుష సంబంధం లేని ,భార్యా లోలత్వం,పాతివ్రత్యం. జీవుడు సనాతనుడు. శరీరం లేనపుడు కూడా ,సూక్ష్మ 
శరీరంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దీన్ని మనశాస్త్రం అంగీకరిస్తున్నది. పాప,పుణ్యాలు సమమైనపుడు ,
మానవదేహం కలుగుతుంది. సూక్ష్మదేహం శరీరమనే ఉపాధితో కలిసింది. అంటే సూక్ష్మశరీరం పురుషుడు,శరీరం స్త్రీ, 
అనిభావిస్తే,భార్యని పువ్వులా చూస్తూ అన్నీ అమరుస్తూ,దానికోసమే జీవితాన్ని సమర్పించడం,భార్యా లోలత్వం. 
  తన శరీరము ,ప్రాణము ,మనసు కూడా ,జన్మ పరంపరలు దాటించడానికే అనే ఎరుకతో జీవి ప్రయత్నించడం అనేది ,పరమేశ్వరుని పతిగా గ్రహించి ,ధర్మ విరుద్ధం కాని కర్మాచరణతో జీవన్ముక్త స్థితికి ప్రయత్నించడం పాతివ్రత్యం. 

25, జనవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం . 
        విశ్వం విరాట్పురుషుని ,విశ్వరూపం. బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే పిండాండంలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఏదైతే శాస్త్రం ,బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శుద్ర అనే వర్ణ విభాగాలు 
తెలియజేస్తున్నదో, అది ఒకే శరీరంలో ప్రతీకాత్మకంగా తెలియబడుతున్నది. ధర్మార్ధకామమోక్షాలు ఒకే సాధనను 
తెలియజేసినట్లే ,సోపాన క్రమంగా వర్ణ విభాగాలు కూడా ఇదే అంతరార్ధాన్ని తెలియజేస్తున్నాయి. 
అహం , శరీరాన్ని ఉపకరణంగా వాడుకుని ఈ నాలుగు వర్ణాలను తనలోనే కలిగి ఉన్నది. తననే సర్వస్వం అనుకుని 
సకలము తానే సాధిస్తున్నాననే అహంకారం క్షత్రియ ప్రవృత్తి . చూసినవన్నీ తనకే కావాలి ,అనే  భావంతో వైశ్యత్వము ,శరీర సుఖం తప్ప అన్యమేది అక్కరలేని తత్వం శుద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని 
సాధనాలుగా తెలిసి ,మనోబుద్ధిచిత్తాహంకారాలు, పరమాత్మ సేవకు ఉపయోగపడేలా ,బుద్ధి ప్రయత్నం చేస్తే క్రమంగా శుద్ధ సత్వగుణాన్ని పొంది ఆత్మ ,పరమాత్మగా అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి ప్రయత్నం ,పరమాత్మ కన్నా అన్యం లేదని తెలిసి సాధన  చేస్తున్న దశలో శరీరాన్ని త్యజిస్తే బ్రాహ్మణ జన్మను ,దేన్నో శరీరహంతో సాధించే దిశలో
శరీర ప్రయాణం క్షత్రియత్వాన్ని,ఐశ్వర్యమే జీవిత పరమార్ధమైతే జీవి వైశ్యత్వాన్ని,శరీర సుఖమే జీవన సూత్రమైతే
శుద్రుని ఇంట జన్మ సాకార మోవుతుంది. 

21, జనవరి 2018, ఆదివారం

సనాతననం

సనాతనం. 
         ధర్మార్ధ కామమోక్షాలు ,జీవ బ్రహ్మైక్య, సోపానాలుగా గ్రహించి చరించే విధానాన్ని,ఆచార సంప్రదాయాల 
రూపంలో అందించింది మన శాస్త్రం. దీన్ని అనుసంధానం వలన ,సాధన పటిష్ట మోతుంది. మనస్సు ,హృదయంలో 
అణిగి ఉండడం మోక్షం. మనసు ,చేతనతో కూడి ఉన్నప్పుడే విషయ జ్ఞానం కలుగుతుంది. ఇది లేకపోతె పరధ్యానం 
అంటాము . అంటే బాహ్యంలో గాని ,అంతరంలో గాని మనసు చరించాలంటే చేతన సహకరించాలి. కాబట్టి ఈ జంట 
కలిసి మాత్రమే చరించ గలదు. మనసు చరించక హృదయంలో అణిగి ఉండడమే మోక్షం. దీనికి సాపేక్షంగా గృహిణి 
ఇంట్లో ఉండాలి అని ఆచారంగా చూపి ,సాధనా క్రమాన్ని సూచించారు పెద్దలు.