15, డిసెంబర్ 2016, గురువారం

చాతుర్వర్ణం

చాతుర్వర్ణం
భగవద్గిత చెప్పిన 'చాతుర్వర్ణం మయా ప్రోక్తం'అన్నది భగవంతుడు . అయన చెప్పాడని వినాలని
చెప్పలేదు . శ్రేయో ,ప్రేయో మార్గాలు చూపించి ,ఎటైనా వెళ్ళవచ్చు అన్నాడు . ఒక తండ్రి మంచి ,
చెడు తెలియజేసి కూడా ,మంచిని గురించి మరోసారి హెచ్చరిక చేస్తాడు ,పిల్లల భవిష్యత్తు బాగుండాలని . అది ఒక తరం వరకు అర్ధంఔతుంది . కానీ కొడుకు దానిలో కొంత భాగాన్ని పట్టించుకోడు . అతను తాను పట్టుకున్నది కొంత చెప్తాడు . అలా అలా పోగా మిగిలింది కొన్ని
తరాల తరువాత ఎంత మిగులుతుంది . మొదటివారు చెప్పిన విషయం ఇప్పటి తరానికి అంతా అయోమయం .  LKG చదివే పిల్లలు పెద్ద చదువు చదువుతున్న వారిని
వారి సబ్జెక్టు గురించి ఎంత చెపితే అర్ధం చేసుకోగలరు . అది వారి పట్ల చిన్నచూపు కాదు , వేళాకోళము కాదు . అర్ధం చేసుకోడానికి తగినంత కృషి ,సమయము కావాలి అని చెప్పినా పిల్లలు
వినరు . ఒక చిన్న విషయానికే మనం చెప్పలేము సమాధానం . ఎంతో గహనమై ,జనన మరణ
చక్రాన్ని తప్పించే మార్గం ధర్మం .ధర్మాచరణ అంటే తరగతుల వారీగా క్లాసులకి వెళ్లి చదువుకోవాలి
అని చెప్పడం స్కూల్ యాజమాన్యం తప్పు అన్నట్లు ఉంది . ఏ తరగతి వారైనా పాస్ కావచ్చు .
పాస్ అవడానికి అన్ని క్లాసులకు అవకాశం ఉంది . స్కూల్ ఫస్ట్ ,ఏ క్లాసుకైనా రావచ్చు . దీనికి
ఫలానా క్లాస్ అనే నిబంధన లేదు . ఆలా ఒకరికి వస్తే స్కూల్లో అందరూ యాజమాన్యాన్ని మాకెందుకు రాలేదు అంటే సమాధానం ?ఇటువంటివే ఈ ప్రశ్నలన్నీ . పెద్దలు చెప్పిన మార్గంలో
ప్రయాణం చేసి గమ్యం సమానమని తెలియాలి . ఢిల్లీకి దేశం నాలుగు మూలల నుంచి ఉన్న మార్గాల్లో ప్రయాణించే వారికి తగిలే స్టేషన్లు వేరు . కానీ గమ్యం ఒకటే . బాగా అధ్యయనం చేస్తే
సమాధానాలు పొందవచ్చు . కానిదంతా కాపీ పేస్ట్ . ఎందుకూ పనికిరాదు .
ఎవరైనా ఒక ఆఫిసు లో అన్ని స్థాయిల ఉద్యోగులను నియమిస్తారు . దీనిలో యాజమాన్యానికి
తగిన వారు అవసరం . నోటిఫికేషన్ ఇచ్చారు.  కుప్పలు ,తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయి . దీనిలో
క్రీంది స్థాయి ఉద్యోగులు మీ నోటిఫికేషన్ తప్పు ,పై స్థాయి ఉద్యోగులకు అంత జీతం ,మిగిలిన వారికి
తక్కువ ఇస్తే ఉరుకోము అంటే అది న్యాయ పరమైన తప్పా ?సృష్టిలో ఉన్న తారతమ్యాలకు ,కర్మ
కారణం భగవంతుడు కాదు . అహం ,మమ అనేవి విడిచిన క్షణం ,జీవుడు దేవుడే . దీనికి వర్ణ వ్యవస్థ అడ్డురాదు. రాత్రి నిద్రలో ఎవరైనా బాస్ అని కలకనవచ్చు . ఎవరూ అడ్డు పడరు . కానీ ఇలలో కష్ట పడితేనే సాధ్యం .అదికూడా బాల్యం నుంచే . ప్రతి పాఠం ,ప్రతి క్లాస్ ఉపయోగ పడేదే . అప్పుడు
చదవక ,ఎవరో చదవకుండా ,అంబానీ అయ్యాడు అని ,చదువు ఎగ్గొట్టి ,రోడ్లు ఊడిచే ఉద్యోగానికి
కూడా'Q'లో నుంచున్నవారిని గమనించాలి . ఎవరిది తప్పు ?పెద్దలు చెప్పేదానిని వక్రంగా చిత్రించి ,
వాదించడం సులువే . పాటించి చక్కని గమ్యం చేరాలి . ఒకే తెలుపు భ్రమణంలో ,సప్త వర్ణాలైనట్లే ,ఒకే పరతత్వం సృష్టి చక్రంలో వివిధంగా భాసిస్తోంది . 
కులము అని చెప్పగానే భుజాలు తడుముకునే వారు ఎక్కువైపోయారు . కులము అంటే సమూహము . మనం తీసుకునే కులము కాదు భగవంతుడు చెప్పినది . గమ్యాలు వేరుగా జీవించిన జీవులు వారి గమ్యాలను చేరడానికి ,మళ్ళీ ,పునర్జన్మ పొందుతారు . వారి సంస్కారాల
అనుగుణంగా చెప్పబడినవే కులాలు . ఈ జన్మలో నేను వేదాలు చదివితే ,బ్రాహ్మణ్ణి ,వ్యాపారం చేస్తే
వైస్యుణ్ణి ,సైన్యంలో చేరితే ,లేదా రాజకీయాల్లో ఉంటేనే ,క్షత్రియుణ్ణి , శ్రమ చేసినంత మాత్రాన సూద్రుణ్ణి అనికాదు . గుణ ,కర్మ విభాగయో . ఇది సూత్రం . పూర్వ జన్మలో ఏ గుణాన్ని ఆశ్రయించి
కర్మ చేయబడిందో ,దాన్నిబట్టి ,ఇపుడు జన్మ ప్రాప్తమైనది . ఇపుడు ఆ గుణాన్ని గమనించి ,తమో గుణం నుండి రజో గుణానికి ,దానినుండి సత్వానికి ప్రయాణించాలి . ఏ విధమైన కట్టుబాటుకు లొంగని ,మనసు ఎలాచెపితే అలా తనకు నచ్చినట్లు ప్రవర్తించేదే తమోగుణం . ఈగుణాన్ని ఆశ్రయించిన జనులు , సూద్రుల ఇంట జనించి ,తమలోని లోపాన్ని తమజన్మ ద్వారా గ్రహించి ఉత్తమమైన లక్షణాలను గ్రహించినా ,వారి ఆశ్రమ కులవృత్తులను స్వీకరించి ,ఎవరితోను కులాల గురించి తర్కించక ,పరమాత్మను చేరినవారు మనకు తెలుసు . కుండలు చేసినంత మాత్రాన తుకారాం కించ పడలేదు . రాజు వచ్చినా ,గురు తుల్యుడైన బ్రాహ్మణ్ణి చూసినా తల వంచను అనలేదు . అప్పటి సామజిక స్థితి గతులలో ఎలా వారి పెద్దలు నడిచారో అలానే నడిచి పరమాత్మను చేరాడు . ముఖ్యంగా కుల విభాగము పరమాత్మను చేరే సోపానం అని గమనించాలి .
దీన్ని సామాజికాంశం అనుకోవడం తప్పు . పరమాత్మను చేరడానికి తనుఉన్న చోటినుంచి ప్రయాణం మొదలు పెట్టాలి . దీనికి మాత్రమే కులాచారాలు ప్రవర్తిస్తాయి .బేధం చూస్తూ ఉంటే
సమయం వ్యర్థం అవుతుంది . నిజానికి విశ్వామిత్రుని కంటే పెద్ద ఉదాహరణ దీనికి లేదు . వసిష్ఠుని
నుండి పొందిన గాయత్రి మంత్రం ,ఇపుడు విశ్వామిత్రుని ద్వారా అతనినే ఋషిగా చెప్తున్నది .
క్షత్రియునిగా ,రాముడైనా ,గొల్లవాడైనా కృష్ణుణ్ణి ,పూజించని బ్రాహ్మడు మనకు కనిపించడు . కానీ
అవతార మూర్తులైనా ,వారి కాలంలోని బ్రాహ్మణులను ,గురువులను ,రామ ,కృష్ణులు కూడా గౌరవించి ,దీవెనలు పొందారు . సారాంశంగా వాదనలకు దిగక సాధన సాగించి ,గమ్యం చేరాలి . వారి గమ్యానికి తుకారాం ,నామదేవుడు ,సక్కుబాయి ,మీరా నామాన్ని జపించారు . కానీ అలాగే
సంధ్యావందనాది నిత్యకర్మలు విడిచి ,బ్రాహ్మణ సమాజం నామం చేస్తే చాలు అని పరమాత్మ వాణి
కాదు . ఎవరికి శాస్త్రం ఏ విహిత కర్మను నిర్దేశించిందో అదే వారు చేయాలి . సకాల సంధ్యావందనాది
క్రియలు మాని ,ఏ బ్రాహ్మడు తరించడు . ఎంత వేదాంతం విన్నా, తన నిత్యకర్మ తప్పదు .అది
మానాలంటే సన్యసించక తప్పదు . గృహస్థాశ్రమంలో ఉండి కర్మను త్యజించినవారు ,మరల జన్మకు
ఉపాసన కోల్పోయి ,మళ్ళీ ఉపనయన సంస్కారార్హత లేనియింట జన్మిస్తారు . కానీ ఇప్పుడు ఉపనయనార్హత లేనివారు ,వేదాలు వల్లించాలనే తపనతో వారి ధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించిన వారవుతారు . కనుక శాస్త్రవిహిత కర్మను గౌరవించడం కర్తవ్యం .

2, డిసెంబర్ 2016, శుక్రవారం

అహం-ఇదం

అహం-ఇదం .
ఈరెండే ప్రతి బంధకాలు జీవుడు ,ఈశ్వరుడు అయ్యేందుకు . ఇదే ఇరుముడి , అయ్యప్పకైనా . తలనీలాలు ,ముడుపు వెంకటేశ్వరునికైనా . శరీర పర్యంత స్వాభిమానం అహం . దాని పరిధి అంతా ఇదం . బాహ్యంలో కనిపిస్తున్న ,వ్యావహారిక నామరూపాలన్నీ శరీరం వెలుపలివి . బాహ్యాన్ని విడిచి ,తనలో వాటి స్థానం ఆలోచిస్తే ,అవి ఒట్టి ఊహ మాత్రమే . ఏవి లోపలికి ప్రవేశించ లేవు . కానీ అవే మన భగవదత్తమైన సమయాన్ని ,సాధనకు పనికిరాకుండా చేసి మానవ జన్మను వృధా చేస్తున్నాయి . ఒకక్షణమైనా ఏమిటి అనే ప్రశ్న రాకుండా మూసుకుపోయిన అజ్ఞానమే ,ఆవరణ . ఆవరణ వరకు వెళ్లకుండా అడ్డుపడేది ,విక్షేపం . విక్షేపం విడిచి పెట్టాలంటే 'ఇదం' అనే నామరూపాలు ,తనలో ఉన్న తన దగ్గరికే వెళ్లనీయని ,ముళ్లకంచె . దీన్ని దాటాలి . కానీ ఎక్కడా గాయం కాకూడదు మనసుకు . చిన్న కుండీలోని గులాబీ తుంచినంత సులువు కాదు ,బలిష్టంగా మారిన గులాబీ చెట్టు మధ్యలో ఉన్న గులాబీ కోయడం లాంటిదే ఇది . ముందు చుట్టూ కొమ్మల్ని ,తలో వైపుకు లాగి కట్టాలి . కానీ అవి కట్టుబడక విడిపోతూనే ఉంటాయి . అత్యంత సావధానం
అవసరం . అలానే అసలు బయటి ప్రపంచంలోని వస్తువులు ,వ్యక్తులు ,అంతరంగంలోకి ఎలా ప్రవేశించగలరు అని మధన చేయాలి , కానీ కొద్ది నిమిషాలుకూడా మనసు నిలబడదు . దీన్ని దాటలేని నిరాశను జయించలేని స్థితిలో భగవంతుడే దిక్కు అనుకోని వారుండరు . వారే ముందు ఆర్తులు ,తరువాతి జిజ్ఞాసువులు . వీరికి ప్రపంచ విషయాల పట్ల లేని ఆర్తి పరమాత్ముని చేరే విషయంలో ఉంటుంది . వీరిది స్వచ్ఛమైన భక్తి . ఇది రానంతవరకు భక్తుడు అని చెప్పడం అసమంజసం .ఇలా భక్తులైన వారి స్థితిలో,గృహస్థాశ్రమ నియమాలను ఉల్లంఘించలేని బేలతనం , కానీ పరమాత్మను చేరాలనే తాపత్రయం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఇక్కడ సహకరించేదే ముడుపు .
అంటే తనది అనుకుంటున్న దానినుంచి ఎలా మనసుకు బయటకు రావాలో సహకరించమనే అభ్యర్ధన ,ముడుపులో ఉంది . ఇది అన్ని కొమ్మలు బాగా అన్ని పక్కలకు కట్టేయడం . ఇది విక్షేపానికి పడే తాపత్రయం . గులాబీని కొయ్యడం ,ఆవరణను తొలగించడమే . గులాబీ క్రింది ముళ్ళు ఉండనే ఉన్నాయి .పువ్వు కనిపిస్తుంటే గుర్తు పట్టడం సులువే. కానీ అహం అనే ఆవరణ , తెల్లవారక ముందు కోసే గులాబీ .దీనికి వెలుగు చూపే దీపం గురు స్వరూపం . ఇది భగవంతుని కరుణ వల్లనే లభ్యం. దీనికి సహకరించే అంగం మానసిక సన్యాసం . ఇదే తలనీలాల ప్రయోజనం . మనం బాహ్యంగా చెయ్యలేని సన్యాసాన్ని సూచిస్తుందిది. ఈస్థితిలో మాత్రమే గురువు సహకరించ గలరు . వస్తువును చూపడానికి . కానీ ప్రయత్నం ఎవరికి వారిదే . దీపం పువ్వును మాత్రమే చూపగలదు . దీక్షగా దగ్గరికి వెళ్లి చూడాలి . దూరంగా ఉండగా సాధ్యపడదు . ఇప్పుడు గులాబీ స్థానంలో అమ్మను చూద్దాం . ఎందుకంటే పువ్వు లాంటి జడం కాదు పరమాత్మ . ఎంత పనిలో ఉన్నా ఏడుస్తూ ,నిస్సహాయంగా చూస్తున్న పిల్లవాడిని లాలించే తల్లి పరమాత్మ .ఇప్పుడు ఉదాహరణ మార్చడానికి కారణం చూద్దాం.
కర్మ పరిధిలోని జన్మ కారణం ,కర్తృత్వం . ఈ అభిమానం వలన ఏర్పడిన నేను ,నాది అనే భావాల నుండి తనను తాను ఉద్ధరించుకోవలసిన బాధ్యత కూడా తనదే.దీనికి ప్రధమంగా శాస్త్ర సహాయంతో పెద్దల సహాయంతో ,తన విధి ,నిషేధాలను తెలిసి దేనికీ వ్యగ్రత పొందక ,అతిని పొందక ,భగవత్ప్రీతిగా కర్మ ఆచరిస్తూ,అర్ధార్ధి ,ఆర్తుడు , జిజ్ఞాసువుగా ప్రయత్నం చేయాలి. ఏమిచేయలేని నిస్సత్తువ,గమ్యం చేరే మొదటితీరం . ఇక్కడ గురువు ,దైవము సహకరిస్తారు . శివోహం .