14, డిసెంబర్ 2013, శనివారం

సంస్కృతి -సంప్రదాయం



   ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః. 

సంస్కృతి -సంప్రదాయం
     పరమాత్మ వైభవం అద్వైతం . సమాజం ద్వైతం . రెండు విడివిడిగా ప్రశ్నించబడి సమాధానాలు వెదికి
క్రుతక్రుత్యతనుసాధించాయి . కానీ వీటి అనుసంధానం మాత్రమే మనిషికి అంతరంగ శాంతికి అత్యంత ఆవశ్యకం .ఆత్మ శోధనలో అంచులు చూసినా ,అంతరంగంలో మాత్రమే ధ్యాన స్థితిలో ,లేదా తనలో తాను మునిగినంత వరకు శాంతికి ఏ భంగము కలగదు. కానీ శరీరపరమైన వ్యవహారానికి సమాజంలో కదలిక తప్పదు . 'అహం బ్రహ్మాస్మి 'అని నిర్ద్వందమైన అనుభవం స్వంతమైనా, చరించే దిశలో ద్వైతపరమైన సందేహాలు సహజమే . అలానే ద్వైతపరమైన ఎన్నో ఆటంకాలు దాటేందుకుసంపూర్ణ భక్తి,లేదా శరణాగతి నిర్ద్వందమైన సమాధానమైనా,ఉన్న శరీరంలో ఇప్పుడే ఇక్కడే 'అహం బ్రహ్మాస్మి'   అని శాంతిమంత్రాన్ని చెప్పే సాహసం కొరవడుతుంది .అద్వైతం శివుడైతే ,అమ్మవారిని ద్వైతంగా  ,పెళ్లి కూతురుగా సింగారించికళ్యాణం చేస్తే కదా,అర్ధ నారీ శ్వరుని చేస్తే కదాజీవకళ్యాణం.అంతరంగ వైభవంగా అద్వైతం ,భాసిస్తున్నా,పరమ సంతృప్తిగా జీవితం విరబూసిన పుష్పంగా సాగాలంటేఅన్వయం ,అత్వంత ఆవశ్యకం .నిజానికి ద్వైత బోధగాని ,అద్వైత  బోధగాని, శిష్యుని రూపంగా ఒకవ్యక్తి పొందుతాడు,నిజానికి ఒక నీటి బొట్టుకు ఒక ఆవర్తం ఏర్పడుతుంది .ఏ చుక్కకైనా అదే పరిధి . ప్రతి నీటి బొట్టు తన పరిధికి మించినది,లేదనే అనుకుంటుంది ,తనలో ,కానీ జాగ్రదావస్థలో మాత్రమే సాధ్యం . నిద్రలో  పరిధి జారి పోతుంది.ద్వైతాన్ని మెలకువలోకాపాడుకోవచ్చు ,కానీ నిద్రలో కాదు . అంతా  సమానమేఅనేనిద్రాస్థితిని మెలకువకు  అన్వయించడం ,అసాధ్యం. అందువలన కలను, ఉపమానంగా సృష్టిని అనుసంధానం చేశారు పెద్దలు అందువలన కలను యధాతధంగా స్వీకరించినట్లు కష్ట ,నష్టాలనుస్వీకరించి ,ప్రతి మనిషి సహనంతో వాటిని దాటవచ్చు . అంతవరకూ మాత్రమే ఈ అవగాహనకు అవకాశం ఇవ్వాలి . లేకుంటేప్రయత్నం అనేది కుంటు పడుతుంది . నైరాశ్యం ఎదురవుతుంది .
      దీన్నుండి బయటపడా లనుకుంటే కర్మ యోగం యొక్కఅవగాహన అవసరం . మెలకువకు మాత్రమే కర్మయోగం అనుసంధానం అవుతుంది . మెలకువకున్న ప్రధాన లక్షణం పరిధి .ఇది ద్వైతంలో మాత్రమే ప్రవర్తిస్తుంది .  అందువల్లనే ఎవరి పరిధిని వారు అతిక్రమించక జీవించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించక తప్పదు .ఈ విషయంలో మాత్రమే మతాలు మానవత్వాన్ని శాసిస్తాయి .అందరికీ సమానమైన నీరు ,నిప్పు ,గాలి ,ఆకాశం, నేల ,ఒక్కటే  అలాగే సుఖఃము ,దుఖఃము , నిద్ర ,జనన ,మరణాలు అందరికీ సమానమని అన్ని మతాలు ఒప్పుకుంటాయి . అందరూ ఒప్పుకునేది అద్వైతం . విబేధాలున్నది ద్వైతం . విబేధాలున్న ద్వైతంలో ఎవరి భావాలు వారు ఎవరితోవిబేధించకుండా కాపాడుకుంటే ,అదే సభ్య సమాజం .కానీ ,ఒకరికి ఎంతో గొప్పదైన భావజాలం వేరొకరికి పేలవంగా అనిపించవచ్చు . ఎవరి పరిధి వారిది అని సరిపెట్టు కోవలేకాని వాదన వలన పరిష్కారాలకు బదులు ,ప్రమాదాలే మిగులుతాయి.కర్మ యోగం లోని ప్రధాన ప్రతిబంధకం,పని తాను చేస్తున్నాననే భావం వలన ఏర్పడే,పాప పుణ్య రూపమైన,జన్మ కారణమైన సంచితంగా, మార్పు చెందడమే .దీనినుండి బయట పడాలంటే ,భరతునికి పట్టం కట్టవలసిందే .భరతుని పాదుకా పట్టాభిషేకాన్ని జీవుడు తనంత తానుగా స్వీకరించి , కర్తృత్వ భావం నుండి విముక్తి పొందాలి .
       దీన్ని వేరే కోణం నుండి పరిశీలిస్తే ఉన్నది అద్వైతమే . అర్ధం చేసుకోవడమే పరిష్కారం కానీ ,వాదన కాదు . కన్ను ఎన్నో వస్తువులను చూస్తున్నది . వస్తువులు మారుతున్నాయి . కానీ కన్నులో కానీ , చూడడం అనే క్రియలో కానీ ఏ మార్పు లేదు . దాన్ని గమనిస్తూ వస్తువుల విషయాన్ని పరిగణన లోకి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా జీవిని ఉద్ధరించే , భగవదత్త మైన జీవిత కాలాన్ని వినియోగించుకునే నేర్పే ధర్మం .తల్లి ,తండ్రి ,పిల్లలు ,మనుమలు ,ఇలా తొలి పరిధి కుటుంబం . కంటికి కనిపించక పోయినా ముందు తరాల పెద్దలు వీరికిఆధారం .ద్వైతంలో ధర్మవాదులకు వేద ,శాస్త్ర , గీతాది గ్రంధాలు,ఆధారంగా  అందరికి పరిధులు విధించబడ్డాయి .జన్మ తోనే పరిధి ప్రారంభ మౌతుంది . తల్లి దండ్రుల ఆర్ధిక సామాజిక ,స్థితిగతులే ప్రమాణంగా ,ప్రతివారి పరిధి ,పుట్టుకతోనే నిర్ణయమౌతుంది . ఈపరిధిని గౌరవించి జీవించి
ఎంతటి పురోగతి నైనా సాధించ వచ్చు . ఈ విధమైన జీవిత విధానం ధర్మ పరిరక్షణకు సోపానమౌతుంది .
      అదే ముందు తరాలవారికి మార్గ దర్శకమౌతుంది . ఎవరి కుటుంబ పరిధి వారు కాపాడుకుంటూ ,చాలా తక్కువగా ప్రపంచంతోఅనుబంధాన్ని కొనసాగించారు . అందు వలన పల్లెలు పోషించబడ్డాయి.కుటుంబం తరవాతి పరిధి విద్యకు కేటాయించారు . దీనికి వృత్తి ప్రాధాన్యంగా,వేద  జ్ఞానమే సాధనంగా ,బ్రాహ్మణులు . ఈజ్ఞాన సహాయంతో రాజులు , పరిపాలనాపరమైన విషయాలను ,వైశ్యులు న్యాయ బద్ధమైన వ్యాపారాన్ని ,మిగిలిన వారంతావ్యవసాయ, గోపాలనాది వ్యవహారాలు నిర్వహించి ఎవరి పరిధిలో వారు తృప్తిగా జీవించారనడంలో ఎటువంటి సందేహం లేదు .ఆక్రమణల పేరుతో కానీ ,వ్యాపారం పేరుతోకాని విదేసిపరిచయంతో మాత్రమే మన వ్యవస్థ కుప్పకూలింది .దీని ద్వారా ఏమి పొందగలిగమొఅందరికీ తెలుసు .
      ఈ విపత్కర పరిస్థితులలో, ప్రస్తుతపు మన మొదటి పరిధినైనా కాపాడుకోవలనుకోవడం అత్యాశ మాత్రం కాదు . ఒక్కరిద్దరుపిల్లలైనా, మన  పెద్దలు ఆశించిన రీతిలో దిద్ది ,తల్లి దండ్రుల ఋణం తీర్చుకోవడం ప్రధమ కర్తవ్యం .ఇది ద్వైతంలో విషయం .మరి అద్వైతంలో, ప్రతి మనిషిలో అంతః కరణ చతుష్టయంలో అహంకు జ్ఞాన యోగాన్ని ,చిత్తానికి భక్తి యోగాన్ని,బుద్ధికికర్మ మార్గాన్ని ,ప్రతిపాదించి వీటియొక్క సంపూర్ణ ప్రజ్ఞతో మనస్సును స్వాధీన పరచి, శరీరం సాధనంగా మాత్రమే గుర్తించాలి.కానీ శరీరం కోసం మాత్రమే జీవితాన్ని సమర్పించ కూడదు .
                     శ్రీ రాముని చిత్రంలో ,మనకు శ్రీరాముడు ,సీత ,లక్షణుడు ,హనుమంతుడు సాధారణంగా కనిపిస్తారు . శ్రీరాముడు  జ్ఞానం ,సీత భక్తి ,లక్ష్మణుడు వైరాగ్యం ,హనుమంతుడు బుద్ధి యోగం . సర్వే సర్వత్ర ఉన్నది సీతా రాములే . లక్ష్మణుడనే జీవుడు , వైరాగ్య భావంతో ,నాది అనే భావాన్నిశరీరానికి  [ఊర్మిళలా]నిద్రాణంగాఉంచి , ప్రచోదనం చెందిన హనుమంతునివంటి బుద్ధితో, సర్వే సర్వత్ర సీతారాములే ఉన్నారని ,తానంటూ వేరుగా లేనని పొందే  అనుభవం ఒక  వ్యక్తిదే కానీ ,సాధన స్వరూపాన్నే మనకు 4మూర్తులుగా పరిచయం చేస్తున్నది ,రామాయణం. శరీరమే తను . శరీరానికి సంబంధించినవి తనవి . ఇదే జీవతత్వం . తాను శరీర మాత్రుడు కాదని, సృష్టి, దృష్టిలో ఉన్నా అనుభవానికి రావడం పరతత్వం . దృష్టిలో, సృష్టి కదలుతున్నా , మెలకువలో బుద్ధి పరతత్వంలో మేలుకొని సృష్టిలో కదలు తున్నదంతా పరమాత్ముని శక్తి మాత్రమే, అనే అనుసంధానాన్ని కొనసాగించి ,ప్రతి కదలికను జ్ఞానాగ్ని పునీత సీతగా గ్రహించి అష్ట సిద్ధి రూపంగా కలుగుతున్న భౌతిక ,ఆధ్యాత్మిక సంపదను మాయగా గుర్తెరిగి ,సాక్షాత్తుగా సీతా మహాదేవి ప్రసాదించిన మాల,అయినా,తన అంతరంగంలో శాంతికి ఏ మాత్రం భంగం కలగకుండా సాధనలోని ఏకాగ్రతను సడలనివ్వక ప్రతి క్షణంలో,రామపట్టాభిషేకాన్నిద్రుష్టి నుండి దూరం కానియక[అంతా పరమాత్మదే]అని,నిద్రలోనడిచే వ్యక్తిలా[భరతుడు] అవసరమైనంత వరకే ,సృష్టిలో చరిస్తూ,చేరే ,జీవన్ముక్త స్థితికి నిర్వచనమే,రామాయణం.ప్రతి అవతార గాధ, వివిధ,మానవ స్వభావాలకు,వివిధ మార్గాలను గమ్యాన్ని చేరడానికి నిర్దేసించినవి. ఎన్నో మానవ స్వభావాలకు వేరు,వేరుగా బోధ సాగడానికి అనువుగా పెద్దలు వివిధ దేవతా రూపాలుగా,తత్వాన్ని పరిచయం చేశారు .విద్యుచ్చక్తి అనేక ఉపకరణాలుగా , వినియోగించ బడినంతమాత్రాన,దాని ఏకత్వానికి ఏభంగం లేనట్లే ,అనేకదేవతారాధన అని అందరూ భావించేది,అవగాహనా రాహిత్యమే కానీ,నిజం కాదు .దీన్ని కూడా అవసరం లేని వారిని లోపలికి రానివ్వని కంచెలా , అర్హత లేని వారిని సాధనకు రాకుండా  కాపాడే మాయ మాత్రమే.
       ఆదివారంతో ప్రారంభిస్తాము వారాలని . ఆదిత్యుడు పరిపూర్ణ పరబ్రహ్మ తత్వంగా సంభావించారు పెద్దలు . 
అందువల్లనే ఇష్ట దేవతను సూర్యునిలో భావిస్తారు . సమయ పాలనలో ఆదిత్యుడే అగ్రగణ్యుడు . ఆయనరాకకంటే ముందే  లేచి చేతులు వినమ్రంగా ముడిచి అర్ఘ్య ప్రదానంతో ప్రారంభించే జీవనశైలి భారతతీయులది .గర్వించ దగిన భూమండలంలోని పూజగది మన భారత దేశం . పుజారిలా ఎవరికివారే సంపూర్ణ స్వాతంత్ర్యంతో నమస్కరించి , సూర్య నమస్కారాలతో  అందరూ సేవించే, పరమాత్మ స్వరూపం ఆదిత్యునిదే .నవగ్రహ పరమాత్మాంశలలో 'శ్రీ రాముడు' సూర్యుని పరమాత్మంశ. ఏ కష్టమైనా రాజుతో మొర పెట్టుకునే స్వాతంత్ర్యం ఉంటే ,పట్టాభిషేకంతో, రాముని మహారాజుగా మన శాస్త్రాలు పరిచయం  చేసాయి  . సర్వులూ ధనుర్ధారి అయిన శ్రీరాముని ప్రార్ధించి, తమ వెతలను విన్నవించడానికి వెనుకాడరనడానికి, ప్రతివీధిలో జరిగే సీతారామ కళ్యాణాలే సాక్ష్యం .రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు పెద్దలు . ఏది ధర్మం ? ప్రాధమికంగా సృష్టి అంతా పరమాత్మది .శరీరంతో సహా సకలము పరమాత్మదనే సంపూర్ణ అవగాహనే సంపూర్ణ శరణాగతి .ఈభావంనుండి మనసు   జారిపోనికుండా జీవన యాత్ర సాగించేవారికి శ్రీరాముడు  ధనుర్ధారి అయి వారిని రక్షిస్తాడు .జీవ భావంతో ఏది తనదిగా భావించినా శిక్షిస్తాడు . జ్ఞానేంద్రియాలు ,కర్మేంద్రియాలు మొత్తం పది ,ఇవి కలిగి ఉన్న తాను ప్రకృతిలో కనిపిస్తున్నది తనదిగా భావించినపుడు యుద్ధం ప్రారంభం అవుతుంది . ఒక పువ్వుని చూశాo అనుకుందాం . పరమాత్మ సృష్టికి ఆనందిస్తే కలిగేది ఆనందం .కానీ అది తను పెంచిన మొక్కది కనుక నాది .ఈ అవగాహన తప్పు .సృష్టిలో ఉన్న సూర్య రశ్మిని నీటిని,  బీజాన్ని ఇవన్నీపరమాత్మ ఇవ్వడం వలన, అది పువ్వు పూసింది .దాన్నిపెంచే తీరిక దొరికే జీవితం కూడా భగవంతుని  ప్రసాదమే . ఆత్మను ధర్మంతో ఎక్కుపెట్టిన బాణంలా ,గమ్యం చేరే వరకు ప్రయత్నించాలనే పరమ లక్ష్యంతో మొదటి అడుగు వెయ్యాలని 'ఆదివారం 'మన చెవిలో రహస్యంగా చెప్తోంది. 
           స ఉమా వారం ,సోమవారం .ఉమా శివులిద్దరూ, విడిగా కూడా ధరించి  నెలరాజును ,పొంగు కుంగు జీవితంలో   సహజమే ,అంటూ తమ విశ్వకుటుంబానికి తెలియజేస్తూనే ఉన్నారు . నవగ్రహాలలో చంద్రుని పరమాత్మాంశ 'శ్రీ కృష్ణుడు'. వెన్నదొంగ . యింద్రియాలన్నీ ఎవరూ చూడట్లేదనే ,ధైర్యంతో చేసే ప్రతి పని ,ఆలోచనా గమనించే సర్వసాక్షి . ఎవరికీ  దొరకకుండా ఉండాలంటే మరి రాత్రే కదా రావాలి . కృష్ణ జన్మాష్టమికి ,ఉట్టి కొట్టడానికి ఏ బంధనాలున్నాయి ?అందరివాడే పరమాత్మ.  నావాడే, అనే ధైర్యం ఉంటే కనురెప్ప కాడా కన్నయ్య ?ప్రతి భావం వెనుకా కృష్ణయ్యను పట్టుకునే గోపికగా మారితే,మనలోనే లేరా, పదారువేలమంది కన్యలు ?జీవితానికి అందమైన ఆధారం వేరే లేదని గుస గుస లాడింది సోమవారం
     మంగళుడంటేనే కుజుడు . ప్రహ్లాదుని రక్షించిన నరసింహునిలా, పరమాత్మను పరమ గమ్యంగా చూపే ఉగ్రమూర్తి . కుజునికి పరమాత్మంశ ,'నరసింహుడు' . ఎన్నో బాధలు పీడిస్తున్న ప్రహ్లాదుని వలె, కలిలో ఋణ ,రోగార్తులైన మనుజులకు బాహ్య అభ్యంతర సంధిలో ,మృగమవకుండా కాచి రక్షించి ,హిరణ్య కశిపుని స్థితి నుండి, సర్వే సర్వత్ర పరమాత్మ దర్శనం చేసే ప్రహ్లాదుని ,గమ్యంగా, పయనానికి సంసిద్ధం చేసే మంగళ వారాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే .కుమారస్వామి  మరో రూపం కుజుడు.అందువల్లనే మంగళవారం, సుబ్ర్హహ్మణ్య స్వామి ఆరాధనం శాస్త్ర సమ్మతం . కుమారస్వామి గుడిలో పూజలు ,కళ్యాణాలు అందుకుంటే ,సుబ్రహ్మణ్యుడు ,సర్వే సర్వత్ర ,అందరిచేత పుట్టలో పాలుపోయించుకుని అందరూతన వారనే తల్లి దండ్రుల,వారసత్వాన్ని, యిలకు తెచ్చి అందరివాడై ,భయ భక్తులు రెండూ అవసరమంటూ,అల్లరి పిల్లల ఆట కట్టే పద్ధతిని పరిచయంచేస్తుంది మంగళవారం . భయ పెట్టి మరీ భగవంతుని చేర్చే లక్ష్య సాధనను చెవి మెలి పెట్టి మరీ చెప్తుంది మంగళవారం.
      ధీ యో యో నః ప్రచోదయాత్ .ఒకేఒక ఆకాంక్ష .మానవ జన్మ సార్ధకతకు చిన్న ఆశ .అంకురం .ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే . బుద్ధి ప్రచోదనం వల్లనే భగవంతుని విశ్వరూప సందర్శనం సాధ్యం . అదికూడా ఎప్పుడో కాదు ఇప్పుడే ,ఇక్కడే అంటుంది బుధవారం . విష్ణువు వర్తమానానికి ,ఆకాశ తత్వానికి ప్రతీక,వ్యాపకత్వం .ఈ క్షణం వర్తమానం . ఇదే పరమార్ధం, విష్ణువు అధి దైవతంగా కలిగిన బుధవారం చేసే బోధ .బుద్ధిని ఏకాగ్రంచేసి వర్తమాన క్షణంలో, శరీర పర్యంతం కాని, ఉనికిలో మునకవేయ్యమనే 'బుద్ధుడు',బుధవారపు పరమాత్మంశ .పుట్టుకకు కారణమైన పాప పుణ్యాల చిట్టావిప్పిదిగులు పడకుండా విష్ణువు పాదాలు పట్టమనే ప్రబోధం ,బుద్ధుడుకాక ఎవరివ్వగలరు ?తారా,చంద్రుల కుమారుడుగా బుధుడు పేర్కొన బడ్డాడు.  గురుపత్ని అనగానే పురాణకధను ,పక్కదారి పట్టించకుండా ,అర్ధం చేసుకుంటే ,పత్ని అంటే శక్తి . గురువుగారి శక్తిని ,తార అన్నారు . అంటే ,శిష్యుడికి అర్ధమైన గురు శక్తి , నక్షత్రమంత మాత్రమే .మినుకు ,మినుకుమని ఎంత కాంతి శిష్యుని వరకు చేరుతుందో, అదే సంపూర్ణమనుకుని మధ్యలోనే ,తనంతతానుగాపరిపూర్ణతను ఆపాదించుకునే ,చంద్రుని వంటి  శిష్యులకు కలిగిన భావావేశం ,ఉపదేశాలకు తావిస్తే కలిగే అనర్ధాలకు ఎవరు బాధ్యత వహించే వారు ?ఇటువంటి భావోద్వేగాలే ,చంద్రుని వృద్ధి క్షయాలకు, ఒక కారణం కావచ్చు . కారణం ఏదైనా బుద్ధి వికల్పానికి గురైతే కలిగే విపరీతాలకు సంకేతమే బుధుని జననం .వీరి బారిన పడినవారికి  ఏకైకమార్గంవిష్ణువుకు పరిపూర్ణ శరణాగతులవడమే . తస్మాత్ జాగ్రత అని బోధించి , గురువు దరి చేర్చేదే మంచి బుధవారం .అంతేకాదు వర్తమానానికి గుర్తుగా అటు మూడు రోజులు ఇటుమూడురోజులు కలిగి మధ్యలో ఉంది బుధవారం.గురువును చూపించి,వారి బోధను సంపూర్ణంగా గ్రహించమని,గోల చేసి వినమంది బుధవారం.
       శ్రీ గురుభ్యో నమః . నిస్వార్ధ గురువు ,బృహస్పతి . గురువారం వీరికే ప్రత్యేకం . ఆదిగురువు దక్షిణా మూర్తి ,విష్ణు రూపంగా హయగ్రీవ మూర్తి ,దేవీ రూపంలో సరస్వతిని ,అందరూ ఆరాధిస్తారు .గురువారానికి అధిపతి బృహస్పతి . అందు వల్లనే బృహస్పతివారం కూడా.గురువుకు పరమాత్మంశ 'వామన మూర్తి'.నిస్వార్ధానికి గుర్తుగా, చెయ్యి చాపి అర్ధించే మూర్తి వామన మూర్తి . సకలమూ తానైన విష్ణు రూపునికి ,దయ తప్ప వేరే కారణం లేదు చెయ్యి జాపడానికి . తాను అంతరంలో క్రీడించే క్రీడలో,తానే పాత్రధారిగా వామనావతారాన్ని గ్రహించ వచ్చు.ఉదాహరణకి,అంతర ప్రపంచంలో చూస్తున్న, వింటున్న ప్రతిదానికి,ఏ విధమైన పాంచ భౌతిక వస్తు సముదాయము అంతరంలో లేదు.కానీ ప్రతివారి ప్రపంచము అదే.అంతరప్రపంచానికి ఏ విధంగా తానే ఆధారమో ,అలానే దృశ్య ప్రపంచం పరమాత్మ అంతరంలోనిదే . అతడే ఆధారం . ఈ పరమార్ధాన్ని తెలిపే కౌపీనధారి అయిన పరమాత్మ ,అతని ప్రపంచాన్ని తమదిగా భ్రమిస్తున్న మానవాళికి ,'అహం'అని వారు భావిస్తున్న, అహం తనదని , వారి అహంతను అణగ ద్రొక్కి [బలి ]తీసుకుని ,బాహ్యంతరాలు తానై వెలిగే ,ప్రస్థానానికి గురువు అనుగ్రహంతో కదలమని శాసిస్తున్న, శాసనాన్ని మౌనంగా విందాం .
          గురువు శాసనాన్ని మనసా, వాచా, కర్మణా, అనుసరించే వారికి కలిగే శుభ సూచకమే ,శుక్రవారము .64 కళలు శుక్రుని అనుగ్రహంతో ప్రాప్తిస్తాయని పెద్దల వాక్కు . భగవంతుడు తన స్వరూపాన్ని ,వైభవాన్ని తెలిపే, ఒక నాటకాన్ని ,ఈ విశ్వమనే చిత్రంగా భావిస్తే ,భగవంతుని పురుషునిగాను ,శక్తిని స్త్రీ గాను భావిస్తే,శరీరం ఆధారంగానే శక్తి ప్రకటించ బడుతుంది. అలాగే వాక్కు శరీరం ద్వారా ప్రకటించ బడుతుంది .అందువల్లనే జప ,హోమ,వేద ప్రతిపాదితమైన సకల శాస్త్రాలు,పురుషుడే పఠించాలానే వాదం ప్రకటించబడి ఉండవచ్చు .బహుశా స్త్రీలు చదవరాదనే దానికి ఇది ఆధారమై ఉండవచ్చు .అన్ని కళలను ఈ విధంగా అర్ధం చేసుకుంటే భగవంతుని శక్తి ప్రకటించబడిన రీతిగా ,మానవులు మాత్రమే కళ ద్వారా తమను తాము వ్యక్త పరచు కుంటారు . సృష్టికి వ్యక్తీకరణ మాత్రమే ఆధారం . అవ్యక్తమైనది వ్యక్తమైతే కలిగేదే ఆనందం.ఆనందానికి అలంకారమే సంకేతం .అలంకార ప్రియుడు శ్రీ మహా విష్ణువు . ఆయన పత్ని శ్రీ మహా లక్ష్మి ,శుక్రవారపు అధి దేవత .భ్రుగు పుత్రిక .ఈ వారం . భ్రుగు వారం . ఈ వారానికి పరమాత్మంశ 'పరశు రాముడు' .పైన తెలిపిన విధంగా గురుబోధను గ్రహించి సకలమూ పరమాత్మదని , తాము పాత్ర ధారులమనే కళా కోవిదులకు ,పరశు రాముడు తన శక్తిని కూడా రాముని కిచ్చిన విధంగా ప్రసాదిస్తాడు .సృష్టిలోనిదంతా తమదనే ,అజ్ఞానాన్ని ,తమ రాజసంగా ప్రకటించాలనకుంటే, పరశువుతో,ప్రహారం చేసి,రాజస భావాన్ని వదిలేలా ఎన్ని సార్లైనా [21]ప్రహారం చేస్తాడు.ఏదైనా దానం చెయ్యాలనుకునే బలి వంటివారికి ,రాజసం శుక్రునిలా అడ్డు పడుతూనే ఉంటుంది . అలాంటి శుక్రునికి అజ్ఞానమనే కంటి చూపు పోగొట్టి ,త్రి విక్రముడై ,సకలమూ తానేనని తెలిపిన శ్రీ మహా విష్ణువు ,పరశు రామునిగా అనుగ్రహిస్తాడని శుక్రవారం తన ఆశీర్వాదాన్ని, సున్నితంగా వినిపిస్తోంది .
        సూర్యుని కుమారుడు శనైశ్చరుడు . ఈ పేరుతో ఉన్నదే శనివారం . సూర్య నారాయణ మూర్తి ,తెలిపే ఎన్నో విషయాలు,నెమ్మదిగా జీవితంలో అనుసంధానం చేస్తూ నారాయణుని చేరాలనే ఉత్సాహం కలవారిని ప్రోత్సహిస్తూ,లేనివారికి దండ ధరుడై ,దండిస్తూ,ప్రక్కనే ఉన్న భాను వారం వైపు నడిపిస్తాడు.భానుడు తూర్పు వైపు ఉదయిస్తే,పడమర వైపు చూస్తూ భగవంతుని నియతిని ఎదిరించే [ఎదురుతిరిగే వారిని ]గుర్తించి ,వారి పురాకృత పాపాల ఫలితమైన దుఃఖాన్ని వారికి గుర్తు చేసి ,కర్మ ఫలాలను అందించే కరుణా మూర్తి . పిల్లలను గదమాయించైనా సన్మార్గంలో పెట్టే పెద్దన్నగారిని గుర్తించి ,తండ్రి మాటను అమలు చెయ్యమని గుచ్చి ,గుచ్చి చెబుతోంది శనివారం . శనివారానికి పరమాత్మంశ 'ఆది వరాహ మూర్తి '. యజ్ఞ వరాహ మూర్తి .యజ్నమంటే కర్మ. శ్రద్ధగా కర్మాచరణ చెయ్యమంటుందిశనివారం .[అలసత్వాన్ని క్షమించడు శని] భూ వరాహమూర్తి కదా స్వామి .సముద్ర జలాల్లో మునిగిన భూమిని ధరించి తెచ్చి,యజ్ఞ కల్పనకు అందించిన వరహముర్తి. పురాక్రుతమైన పుణ్య ,పాపాలకు అనువైన శరీరాన్నిచ్చి ,శరీరం వదిలి ,మరో శరీరం కోసం అలమటించే జీవులను ఉద్ధరించి శరీరమనే ,భూమిని ,దారి తెలియక అగమ్యంగా తిరిగే సముద్రం నుండి ఉద్ధరించి ,కర్మాధికారం ప్రసాదించిన గోవిందునికి నమస్కారం . యజ్ఞ ఫలంగా ,పరమాత్మ తాననే సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు ,ప్రతిజన్మలో తోడుండి ,మానవ కర్తవ్యాన్ని సక్రమంగా పూర్తి చెయ్యమని శాసిస్తోంది శనివారం . అన్నగారి మాట చెవిన పెట్టాలి కదా .
భద్రం కర్ణేతి  శృణు యామ దేవాః . అనేది మొదటి శ్రుతి వాక్యం . బాహ్యం కంటే నిజానికి అంతరంగమే ఎక్కువగా
వ్యక్తులు వింటారు.ఎప్పుడూ పరమాత్మ విషయాలు వినడానికి ,బాహ్యానికంటే అంతరంగమే సరిఅయిన వేదిక. బాహ్యమైతే ఉపద్రవాలు కలగవచ్చు . అంతరం మౌనానికైన ,మాటకైనా సిద్ధంగా ఉంటుంది,సంస్కరించబడి ,సాధన చేస్తే . కుమారునికి , గర్భాదష్టమంలో,ఉపనయనంలో,తండ్రి,గురూపదేశమైన గాయత్రీ మంత్రాన్నివినిపిస్తాడు.ఉపదేశం అంటే సమీపంలో కూర్చుని అతనికి మాత్రమే,వినిపించేలా చేసేది,అనికదా అర్ధం. ఇది బాహ్యోపదేశానికే కాదు.ఈ సూచన నిజానికి అంతరానికే ,ఎక్కువ అనుసంధానమౌతుంది .అంతరానికే వేరే ఏమీ వినకుండా ఉపదిష్ట  మంత్రాన్ని వినే శక్తి ఉంది. అందువలన ,భగవత్ సంబంధ విషయాలను వినడం ఈ వయసు నుండి మనసుకు నేర్పించడం వేదవిధి .అందువల్లనే ధృవుడైనా,ప్రహ్లాదుడైనా అతి త్వరలో పరమాత్మ సాక్షాత్కారం పొందినట్లు గమనించవచ్చు .జీవుడు సనాతనుడైతే ,ప్రతిజన్మ ,పరమాత్మ ప్రస్థానంలో ఆరోహణలో భాగమే . దానికి మనో నియంత్రణతో కూడిన నిబద్ధతను అందించడం తల్లి దండ్రుల ప్రాధమిక కర్తవ్యం. మననం చేయడం వలన తరింప జేసేదే మంత్రము.మననంలో వినడమే ప్రాధాన్యం వహిస్తుంది .అనడంకన్నాప్రభావంతో  మనసును అదుపులో ఉంచడానికి వినడమే ప్రధానం .నాదానికి మనసును వశం చేసుకునే శక్తి ఉండడం వలననేసంగీతజ్నులు, మనోనియంత్రణకు నాదాన్ని వినడమే సాధనగా సాగించారు. పాడుతున్న వారు ,తమ పాట తాము వినడంలోనాద మయులౌతారు . అంటే తన్మయులౌతారు.వింటే కలిగే తన్మయం పాడడం మీదకు దృష్టి మళ్ళినపుడు ఏకాగ్రతగా సాధన స్వరూపంగా మారుతుంది . వింటే ఆనందంగా ఇంద్రియాతీత స్థితినిస్తుంది . క్షణాలలో మనసు రెంటినీ మార్చడం వలన కలిగే అనుభూతి ఆనందంగా మాత్రమే అనుభూతమౌతుంది . శ్రవణానికి కూడా ,శ్వాస పై ధ్యాస ఎలా పరమాత్మను చేరుస్తుందో అంతే శక్తి ఉంది . అందువలన రామ నామమైనా హృదయంలో వింటే ,ఈ సాధన సాక్షిత్వాన్నిస్తుంది .అందువలన బాల్యంలో పిల్లలకు వినే నేర్పును పరిచయం చేస్తే వారి భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది . వినడం వలన వివేచనా జ్ఞానం పెరుగు తుంది . సారభూతమైన మంచిని స్వీకరించే శక్తి మెరుగౌతుంది . 
         ఏ తల్లి దండ్రులైనా పిల్లల బాగుకన్నా కోరేదేమి లేదు . కానీ బాగు శరీర పర్యంతమా ,శరీరిక్కూడా అవసరమా ? జీవభావం వదలలేదు కనుకనే శరీరం ప్రాప్తించింది .అది వదిలే లోపే ఉద్ధరణ అవసరం . శతం జీవతి . కానీ ఉద్ధరణ మాత్రం ఎప్పుడు ప్రారంభమో శాస్త్రం నిర్దేసించింది.ఎనిమిది సం/.బాహ్యంతర వివేకం మొదలవుతుందని సూచనగా మననానికి మంత్రాన్నిపరిచయం చేసింది . మంత్ర మిచ్చి చేతులు దులుపుకోమనలేదు . చర్విత చర్వణంగా పరమాత్మ సంబంధిత విషయాలను ధారా పాతంగా వినిపించే బాధ్యత పెద్దలు స్వీకరించి,తాము తమను ఉద్ధరించుకుని ,పిల్లలకు సహకరించడం కర్తవ్యం.గృహస్థాశ్రమం స్వీకరించేదే,తాము తరిస్తూ,తరించడానికై ఎదురుచూస్తున్నజీవులకు శరీర దానమే ప్రధమ లక్షణంగా గ్రహించాలి . అంతేకాని శరీర సుఖం పరిధిగా గృహస్తాశ్రమం విధించ బడలేదు . వధూ వరులకు బాల్యంనుండి భగవత్ ప్రాప్తి లక్ష్యంగా జీవన విధానాన్ని సంస్కరించి ,వారి ఇంద్రియాలు వారు చెప్పినట్లు వినేలా నేర్పి ,వారికి వివాహంతో ,సంతాన సంరక్షణే ధ్యేయంగా జీవించే ప్రాధమిక సూత్రాన్ని అవగాహనకు అందేలా చేసేదే ,వైదిక జీవన విధానం .ఏకాగ్రత అవసరమైన క్షణంలోమనసు,అన్నిఇంద్రియాలను నిగ్రహించి,తనలోతాను లక్ష్యసాధనలో మునిగే,ఈ అచంచల స్థితి,ఆ శ్రీకూర్మనా ధునిదే. ఈ పరిచయం కోసమే ,ఉపదేశం . పిల్లల మనసుకు దగ్గరగా పెద్దల మనసు దిగివచ్చి వారికి చప్పే ప్రతి మాట ఉపదేశమే . దీనిని మరిచే కన్నా ,సంతానానికి చేసే వేరే అపకారమేది లేదు . ఇదే పెద్దలు,పిల్లల కిచ్చే నిజమైన ఆస్థి . అస్థికల కంటేలా ఏకాగ్రత  ఎంత ఆవశ్యకమో ,తెలియజేసి ,భుక్తి పరిధికి ఎంత వరకు అవసరమో అంతే విలువ,విదేశీయులు అంటగట్టిన చదువుకిచ్చి ,పరమ గమ్యాన్ని కూడా నొక్కి వక్కాణించాలి .  'శ్రీ రామాయ  నమః.'. వాక్కు పలికే మానవ శరీరం కలిగి ఉన్న వారెవరైనా పలకవచ్చని ,సాక్షాత్తుగా బోయవానిచేత పలికించిన మంత్రం ,నేర్పే ఓర్పు ,నేర్పు ఉండాలేగాని కులాలు అడ్డు వస్తాయా ?  ధర్మవ్యాధునికన్నా ఎక్కువ ధర్మాన్ని , అధర్మంగా ఎవరినో చూసి చెయ్యనక్కరలేదు . మనసును సరి పెట్టే ,మిషతో అధర్మాన్ని గెలిపించ వద్దని పిల్లలకు , నేర్పే తల్లి దండ్రులు ధన్యులు .            
               సంస్కృతీ, సంప్రదాయా లంటేనే ధర్మ ప్రతిపాదన.సంస్కరించ బడితేనే సాంప్రదాయం ఆవిష్కరింప బడుతుంది. సంస్కారం సంప్రదాయమైతే,సాంప్రదాయం సంస్కృతిగా మారుతుంది.సంస్కరించు కోవడానికి ఆధార బిందువే నేను. ఎలా?నేను తానై ,పరకాయ ప్రవేశం చేస్తే సాధ్యం. ఎదుటివారి స్థానంలో మానసికంగా ప్రవేశించి,తాను,తను మాట్లాడే మాటలువింటే ఎటువంటి సంతోషం,లేదా బాధ,కోపం ఏ భావాన్నిపొందుతారోగమనించి[వాడే ప్రతిమాట,వాక్కుతో,][భావం మనసుతో,][శరీరంతో అవ్యగ్రత]కలిగితేదాన్ని మాత్రమే ప్రపంచంలో కలిగి ఉంటే,ఎదుటివారికి,అలాగే తనకు న్యాయ బద్ధమైన ధర్మానికి సంస్కరణ ప్రారంభంఅవుతుంది.సాక్షిగా ధర్మాన్ని ప్రతిపాదిస్తే అందులో న్యాయం లోపిస్తుంది.అనుభవ శూన్య మైనధర్మబోధకుటుంబానికి,తమవంతుఅన్యాయాన్నిఅందించినట్లౌతుంది.ఒకపాటగురించిఆలోచిద్దాం.ఉదా:పనిలోపాటపాడుతూశ్రమనిమరచిపోడానికి,ఒకరుజానపదంలోని దైవసంబంధితంగాని,వ్యంగంగాని,ఎత్తిపొడుపు కానీ,స్త్రీ,పురుషుల సల్లాపాలు కానీ ఏదోఒకటి పాడుతూ ఉంటారు.దీంట్లో కూడా మనిషి,మనిషికి భావ ప్రాధాన్యం మారిపోతూ ఉంటుంది. నెమ్మదిగా భజనకు తావిచ్చి భగవత్తత్వానికి చేరువై కొద్దిమంది వారి శైలి మార్చుకుంటారు. కానీ ఒక శాతం కూడా కష్టమే. కానీ అవకాశమే లేదు అనలేము. కానీ ఎన్నో తరాలుగా సంగీతంలో రమించి తరించిన కుటుంబాలు పూర్వపు తరాల్లో ఎక్కువే.వారింట పుట్టి ,పెద్దగా పెద్దలమాట వినక, సాధనచేయ్యక,తమోగుణం వలన జానపదులైనా  తరించే సంగీతం తో తరిస్తానని పలకవచ్చు. తమోగుణం తో దేన్నైనా సాధించడం అసాధ్యం. పరమాత్మ ప్రసాదించిన ,జన్మించిన కుటుంబానికి వన్నె తెచ్చేలా బ్రతికితే దాన్ని దైవం పట్ల కృతజ్ఞత అని,ధర్మం అనీ అనుకోవచ్చు. తమ అనుకూలత మాత్రమే ప్రధానం ఐతే ధర్మం పట్ల అన్యాయమే.మానవులు తమకి జరిగే అన్యాయానికి కోర్టులో న్యాయాన్ని ప్రశ్నించవచ్చు. కానీ మానవ హృదయమే న్యాయ స్థానంగా ఉన్న ధర్మం ప్రశ్నించేది ఎక్కడ ? ఎన్నో సందర్భాలు జీవితంలో తారస పడినపుడు, భగవంతుడు ప్రసాదించిన ,దేశ,కాల,కుల,కుటుంబ నేపధ్యానికి తగిన జీవితవిధానం ,గుణ ప్రతిపాదన లేని ధర్మ కర్మాచరణ న్యాయాన్ని ప్రసాదిస్తే 'ధర్మో రక్షతి రక్షితః 'అనేది అందరికీ అనుసంధానమౌతుంది.
     మన సంప్రదాయం వేద ప్రతి పాదనం.  దీనికి ఆధారం మన శాస్త్రాలే. మౌలికంగా వ్యక్తిత్వ ప్రధానంగా చూస్తే
రామాయణాన్ని దీనికి ప్రాతిపదికగా తీసుకోవచ్చును. మనం ధర్మప్రధానంగానే ఎవరికైనా ప్రాధాన్యత నిస్తాము. పొగిడినా,తెగిడినా అదే ఆధారం.వేరే దేన్నైనా ఆధారంగా గ్రహిస్తే ,దానికి గుణమే ప్రాధాన్యం వహిస్తుంది.కానీ గుణం ప్రధాన్యత వహిస్తే ,మనకున్న అరిషడ్వర్గాలు బలపడతాయి,అంతేకాని మనకున్న  షడ్గుణైశ్వర్యాలు బలపడవు.
      నిజానికి గుణాధారంగా భగవంతుడు ఏర్పాటుచేసిన వ్యవస్థ మాత్రమే,కుల వ్యవస్థ. పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ,ఎవరి పుట్టిన తేది ,చోటు ,వీటి ప్రధానంగా అనుసంధానం అవుతాయో,అలానే గుణ ప్రధానంగా మాత్రమే వర్ణవ్యవస్థలో,జన్మ సంభవిస్తుంది.ఇవి భౌతిక సూత్రాలకు అందవు. రసాయన శాస్త్రం,విద్యుత్తూ ఇలాంటి ఎన్నో విషయాల్లో , అవి అలా ఉన్నాయి ,అని తెలుసుకో వలసిందే తప్ప,అవి అలా ఎందుకున్నాయి?అని ప్రశ్నించడం వీలుకాదు. అటువంటి విశ్లేషణకు అందనిదే వర్ణ వ్యవస్థ.
          శ్రీరాముడు సంపూర్ణ పరబ్రహ్మమే అయినా,అవతార ప్రయోజనం,రాక్షస సంహారం కనుక,రజోగుణ ప్రధాన మైనక్షత్రియ వంశంలోజన్మించి గురువుగా వసిష్టుని స్వీకరించి అందరికీ మార్గ దర్శకుడైనాడు.'బ్రాహ్మణుడైనా,పరి- పూర్ణమైన పరబ్రహ్మమైన,నాకంటే వసిస్టుడు ఎలా గొప్పవాడు?'అని ప్రశ్నించ లేదు.అలాగే ఎన్నో అస్త్ర ,శస్త్ర విద్య లిచ్చిన,విశ్వామిత్రుని, నీవు కూడా క్షత్రియ గుణాలు కలిగి ఉన్నావు కనుక,నీవు,నేను సమానమే. అని అతనిని, సమానత్వం ముసుగులో ,కించ పరచలేదు.విశ్వామిత్రునితో యాగ సంరక్షణకు వెళ్ళినా ,మా నాన్న కన్నా మేమే అర్హులము ,అని విర్రవీగ లేదు.
      పరంపర ముసుగులో,మానాన్నకు ముగ్గురు భార్యలైతే ,నాకు ఆరుగురు అనలేదు.తండ్రి ఇచ్చిన మాటకు, తల్లి చేతిలో , తండ్రి కీలు బొమ్మ ,అనలేదు. ప్రధమ సంతానానికే రాజ్యం ,ఇది పూర్వీకుల ఆస్థి, దీనిని నీకు దానం చేసే హక్కు లేదని , న్యాయ వ్యస్థను అడ్డు పెట్టుకోలేదు.అడివికి పోయినా ప్రైవసీ లేదని,లక్ష్మణుని పై గొణగలేదు. ఒక సారి, శబరి పెట్టిన పళ్ళను తిన్న స్వామి, ఎవరు ఏమి పెట్టినా,ఎంగిలి ,సంగిలి లేకుండా, అన్ని వర్గాలవారు, అలానే అన్ని వర్ణాలవారు ,ఏక పంక్తి భోజనాలు ,చేస్తేనే సమానత్వం కాపాడ బడుతుందని ,దండోరా పీకలేదు. అలా చెయ్యని వారంతా ,సంఘ ద్రోహులని ప్రకటించలేదు. అల సముద్రం కన్నా వేరుకాదు కనుక ,అలలకు పెద్దా చిన్నా బేధం లేదుకనుక,అంతా సమానం అని బోధ , చెయ్యక, ఎవరి వ్యవస్థ వారికి నేర్పిన కట్టుబాట్లు వారు, పాటించడం వలన ,రామరాజ్యం సుసంపన్నం అయింది.అంతేకాదు అరణ్యవాస సమయంలో,తండ్రి ఇవ్వక పోయినా,తాను సంపాదించ గలనని,వారిని నిందిస్తూ,వేరే సామ్రాజ్య స్థాపన చెయ్యలేదు. అందుకుగాను,జనకుడు, మీనాన్నకు చేతకాక పోయినా నీకు నేనున్నానని మర్యాద అతిక్రమించ లేదు. సీతాదేవి మీనాన్న చూసారా మనకు ఎంత అన్యాయం చేశారో అని భర్తకు నూరి పోయ్యలేదు. ఎవరి పరిధి వారు అతిక్రమించ లేదు.
    నావికుడైనా,ఈతగాడైనా అలలను పట్టించుకోకుండా గమ్యానికి చేరడానికి ప్రయత్నిస్తాడే కానీ,చిన్న , పెద్ద అని లెక్కలు పెడుతూ ఉండడు కదా.గుహుడి జీవన విధానమే పడవ నడపడంకానీ,ప్రయాణిస్తున్ననావలో ప్రయాణానికి, తన నావను ఎంచుకున్న పరభ్రహ్మాన్ని గుర్తు పట్టినందువలన తరించాడు.మానవుని ప్రయాణ సాధనం శరీరం ,ప్రయాణిస్తున్న పరబ్రహ్మాన్ని గుర్తు పట్టడమే గమ్యం. దీనికి అతని జన్మ,కర్మలతో సంబంధం లేదు . వీటికోసం వాదులాట కన్నా ,లక్ష్యం పట్ల ప్రీతితొ కూడిన అవగాహన ముఖ్యం.
     హనుమంతుడు, రామబ్రహ్మాన్ని చేరే దిశా నిర్దేశంలో,భక్తి రూపమైన సీతమ్మను రామునికి చేర్చడానికి పడిన తాపత్రయం మనకు తెలిసిందే. మనొరూపమైన వాయుపుత్రుడు ,చలించడమే ప్రధానంగా కలవాడు ,దాన్నే సాధనగా మార్చినవైనం ,మనకున్న ఏ జన్మ లక్షణ మైనా,సాధనకు వాడుకోడానికి ప్రేరేపిస్తుంది. అందువల్లనే దశావతారాలు క్రోధ,లోభ స్వరూపమైన విధానాలు కూడా పరమాత్మను చేర్చిన విధానం, అనుసరణీయం కాకున్నా ఆలోచనకు తావిస్తాయి.కానీ సత్వ ప్రధానమైన భక్తి ,జ్ఞాన,వైరాగ్యాల సమ్మేళనం,వలన కలిగే జీవన్ముక్తికి పరమేశ్వ  రానుగ్రహం తోడవుతుంది. పై విధానంలోని ,క్రోధాన్ని ఆయుధంగా వాడితే ,ప్రతిగా స్వామికూడా ఆగ్రహాన్నే చూపినపుడు మనకు కనీసం అర్ధం కూడా కాదు.ప్రతి దానికి శాస్త్రం అడ్డదారి వద్దని,సరళ మైన దారిలోపయనాన్ని, ప్రోత్సహిస్తుంది.పరమ ప్రశాంతమైన జీవన్ముక్త స్థితికి,నిర్మలమైన సత్వమే కదా కారణం. ఆగ్రహాన్ని కూడా అను గ్రహంగా చూసే నేర్పు ,జీవన్ముక్త స్థితి మాత్రమే ఇవ్వగలదు.
         ఏదైనా మన పరిస్థితిని బట్టి ప్రయాణం సాగాలేకాని,మనకు అనుగుణంగా లేని విధానాలను ,ఎవరినో చూసి గ్రహించడం అంత అనువైనది కాదు. వాతావరణానికి అనువుగా వస్త్రాలంకరణ ఉండడం సహజం. అంతేకాదు ఉండే పరిసరాలు,జీవన విధానము,వయసు ఇలా ఎన్నో పరిమితులు మనను శాసిస్తాయి.వేటినీ మనము బంధనాలుగా భావించము. చాలా సహజంగా ప్రవర్తిస్తాము. కానీ తమకు ఏది ధర్మ బద్ధంగా విధించబడిందో దానినివదలి వేరే విధానాలను అనుసరించడం,ఆధ్యాత్మికతకు అంతగా సహకరించదని తెలిసినా,కొందరు 'అన్నప్రాసన రోజే ఆవకాయ'అన్న చందంగా సాధన అనే అంశాన్ని ప్రక్కన పెట్టి సర్వే సర్వత్ర వినిపించే 'అంతా బ్రహ్మ మయం 'అని తమను తాము మభ్య పెట్టుకుని సాధనకు న్యాయం చెయ్యలేక పోతున్నారు. దీనివలన ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించిన వ్యక్తి ,అదే చదువుతో ఎంతో ఉన్నత స్థాయిలోఉన్న పై అధికారికి అంత జీతమెందుకు అని ప్రశ్నిస్తే , సమాధానం,సాధన,దానికి పట్టిన సమయాన్ని గుర్తు పట్టలేదని,వెంటనే గుర్తిస్తాము. దీన్ని గుర్తించడం సులువే. కానీ జీవత్వం నుండి పరతత్వాన్ని చేరే సాధన పూర్తి అయిందని, తనను తాను ,మభ్యపెట్టుకోకుండా పయనించడానికి త్రిపుటిని గమనించడం అనే సాధన ఉపకరిస్తుంది. ఇది బాహ్య పటాటోపం లేని అంతర సాధన. ఏ పనీ ప్రతి బంధకం కాదు. ఈ సాధన గమ్యాన్ని సుస్పష్టంగా,సాక్షి తత్వాన్ని ధృఢ పరచి సహకరిస్తుంది. కొందరికి కొన్ని సాధనా విధానాలు ప్రశస్తం కావచ్చు,కానీ అందరికీ  అన్వయం కాకపోవచ్చు. అవగాహనకు తగిన భగవద్విషయాలను,ఆచారవ్యవహారాలను మాత్రమే  అందించాలి.
       మతమార్పిడులు ఎంత అసహజంగా వ్యాపిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ప్రలోభాలకు గురి చేసి , చేసే మతమార్పిడి తల్లి దండ్రులకు తెలియకుండా వారిని విమర్శించి,పిల్లలను దారి మళ్ళించడం లాంటిదే. సృష్టిలో అన్నిటికీ పరిమితులున్నాయి. వాటిని గౌరవించడం మన కర్తవ్యం. అలాగే ఏ అంతస్థుకు,ఎవరి అవగాహనకు వారిని ప్రేరేపించాలి తప్ప,మన విధానాలే ఎంతో గొప్పవని ,మిగిలినవన్నీ పనికిమాలినవని ,వాటిని పాటించడం వ్యర్ధమని వారిని కించపరచడం , మన అవగాహనా లోపాన్నే తెలియ జేస్తుంది. భగవంతుని చేర్చే ఎన్నో సోపానాలున్నాయి.ఏదీ  ఎక్కువ,మరొకటి తక్కువ అయ్యే అవకాశమే లేదు.మధ్యలో ఆలయం ఉంది అనుకుందాం. నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి. తూర్పు వైపుగా వచ్చే వారికి,పడమరలో వచ్చేవారు కనపడరు. అంతమాత్రాన వారి దారి తప్పని చెప్పే అధికారం మనకు లేదు. అందరూ పరమాత్మను దర్శించ గలరనేది నిర్వివాదాంశం. దీన్ని అవగాహన చేసుకున్న ఏ కులమైనా,ఏ మతమైనా మిగిలినవారిని కించ పరిచే విధానాన్ని అవలంబించదు.
        నిజానికి వేరేవారెవరైనా మన మతాన్నిఅవలింబించాలానే ప్రకృతికి ఆధారం అహం మాత్రమే.దీనిని నిర్జించడమే మత ప్రయోజనం. మౌలిక ప్రాతిపదిక లేనిదే ,మత మార్పిడిగానీ,లేదా యుద్ధంతో మతస్థాపన గానీ ,ఆలోచనా రాహిత్యాన్ని సూచిస్తుంది. ఇది కీచక విధానమే గాని,దీనికి ధర్మం ప్రాతిపదిక అనడానికి ఆధారం లేదు. ఎవరు ఏ విధానంలో సాగినా పరమాత్మను చేరతారనే,ప్రాధమిక సూత్రాన్ని విస్మరిస్తే,ఆయా మతాలు,పరస్పరాధారమైన మానవత్వానికి ఏ విలువ నిచ్చాయో ప్రశ్నార్ధకమే. మన బిడ్డను చాక్లెట్ చూపించి ఎవరైనా రోజూ పిలిచి, చివరకు వారిని తమ కనుకూలంగా మార్చుకుంటే,దానిని మనము,ఏ రకంగా సమర్ధిస్తాము?హిందూ సమాజంలో నిమ్న వర్గాలున్నట్లే,అన్నిమతాలలోను అణచివేయబడ్డారని సూచించే,అదే మతస్తులకు సంబంధించిన వారికి కొరతేమి లేదు. వారి ఉద్ధరణకు ఎంతో కృషి అవసరం. దాన్ని వదలి మత మార్పిడులకు ప్రయత్నించడం,హాస్యాస్పదం.      వర్గ విబేధాలను హిందూ ధర్మానికి లోపంగా చూపించే మతాలలో,విబేధాలే లేవా ?వాటిని వారుకూడా అధిగమించ లేదనేది ,నిర్వివాదాంశం. పేరు బేధమేగాని, వివాదాలు అన్ని మతాలలోను సమానమే. సమానత్వం ఇక్కడ మాత్రం ఎవరూ అధిగమించలేరు. మత మార్పిడికి ,అమాయకత్వం, లేమి,కారణమేగాని వేరే ఆధారమేమి లేదు. వీటిని వాడుకుని చేసే మత ప్రచారం,వారి విధానాలను చెప్పకనే చెబుతుంది.
         హిందూ విధానంలో గుణ,కర్మ విభాగం మాత్రమే వర్ణ వ్యవస్థకు ప్రాతిపదిక. మాథ్స్ బాగా చేసేవారు ,దానికి సంబంధించిన ఉద్యోగాలను ఆశ్రయించి జీవనం నడిపినట్లే,ఎవరి అర్హత ననుసరించి,వారి జీవన విధానం ఉంటుంది. కానీ ఒకే రకమైన విద్య అభ్యసించినంత మాత్రాన వారి జీవితాలు, ఒకేలా ఉన్నాయనుకోవడం, ఏరకంగానూ సరి అయినది కాదు, వివిధమైన చదువులు ,వేరే వేరే గమ్యాలను నిర్దేశిస్తాయి. అన్ని గమ్యాలలోను హెచ్చు,తగ్గులు సామాన్యం.ఇంతే సహజమైనది హిందూవర్ణ వ్యవస్థ.దీనికి వైషమ్యాలను,ఇతర మతాలు జోడించాయే తప్ప,నిజాలు స్వల్పం. ఆర్ధిక పరమైన అంశాలు మానవులను విభాగించినంత మాత్రాన,మానవత్వానికే మాత్రమూ భంగం కలగ నట్లుగానే,ఆచార వ్యవహారాలు కొద్ది మార్పులతో ఉన్నా, గమ్యం హిందూ ధర్మంలో మోక్షం మాత్రమే. ఆహార,ఆచార విధానాలు వేరైనా,అవి సాధనా పరమైనవే. గమ్యం మాత్రం బ్రహ్మమొక్కటే. కృషిలో బేధాలకు,బాధ్యత గమ్యానిది కాదు. కలలలో బేధానికి నిద్ర కారణం. మెలకువలో అందరికి గాడిద ,గాడిదే. గుర్రం,గుర్రమే. నిద్రలోని కలల బేధానికి అజ్ఞానం కారణం.అలానే సాధనా పరమైన అంశాలను,గమ్యమైన ఏకత్వానికి,వైషమ్యాలను జోడించడం,విజ్ఞతకాదు.
          జంతూనాం నర జన్మ దుర్లభం ,అనేది శాస్త్ర వాక్యం. కానీ వాటినుండి వేరుపరిచే మొదటి విషయం బుద్ధి. ధర్మ ప్రతిపాదన అనేదానికి ఇదొక్కటే సాధనం. మిగిలిన పాంచ భౌతిక విషయాలు జంతువులతో సమానత్వాన్ని ప్రతిపాదిస్తాయి. మానవునిగా నిరూపణకు బుద్ధి అవసరం. కుల మతా తీతంగా,నాస్తికులు కాకుండా మిగిలిన వారందరికీ,గమ్యం మోక్షం. ప్రతి మనిషి పుట్టినప్పటినుంచి పడే తాపత్రయం,ఆనందం కోసమే. అది శారీరిక సుఖం కానీ ,మానసిక సంతోషం కానీ,కొంతకాలానికి పరిమితమైన సమాధి కానీ అయితే ,కాల పరిధిని అతిక్రమించ లేవు. జీవితం పట్ల సరిఅయిన అవగాహన ఆనందానికి హేతువు అవుతుంది. ఇది అపరిమిత తత్వాన్ని పరిచయం చేస్తుంది.దీనికి మన మనసును వేధిస్తున్నఏదైనా ప్రశ్నకు,అనుకోకుండా సమాధానం అయాచితంగా లభిస్తే ,మనం ఎలాంటి భావాన్ని పొందుతామో,ఒకసారి ఆలోచిస్తే అర్ధం అవుతుంది.దీనికి భౌతిక ప్రయోజనమేమీ లేదు,అలానే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పేం లేదు. కానీ విచిత్రమైన తృప్తి అనేది సహజంగా కలుగుతుంది. భోజనం కాదు,నిద్రకాదు  కానీ తృప్తి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చాలా స్వల్పంగా కనిపించినా ఆనందానికి ,ఆధారం అవసరం లేదని మాత్రం తప్పక తెలియ జేస్తుంది. ఒక గులాబీ మొక్క కొమ్మను తెచ్చివేసాం అనుకుందాం. సరి అయిన పోషణ లేక నెమ్మదిగా ఒక మొగ్గ వెయ్యడం లాంటిదే,ఈ పరిచయం. మనం పెద్దగా ఏ విషయాలపైనా శ్రద్ధ పెట్టక పోయినా,ఒక ప్రశ్న,దాని సమాధానం మనకు తృప్తి నిచ్చాయి. అదే జ్ఞానంలోని ,సుకుమారంగా, సున్నితంగా,అంతే సునిశితంగా కలిగే ఆనందం. జాగ్రత్తగా జిజ్ఞాసను పోషిస్తే అది మనలోని బుద్ధి అనేదాని ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది.      
            అందువల్లనే పరబ్రహ్మ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి,జిజ్ఞాస మొదటి లక్షణంగా,జగద్గురువులు ఆది శంకరులు ,బ్రహ్మసూత్రాలలో తెలియజేస్తారు.జిజ్ఞాస అంటే అర్ధం పర్ధం లేని ప్రశ్నకాదు. బాహ్యాడంబరం లేని అంతర్మధనం, అదే సాధనగా కూడా అపరిమిత ఆనందాన్నిస్తుంది. అంతరంగంలో ఏ బాహ్యాంతర వస్తు సహకారం లేక నిద్రించకుండా, తనని తాను  గుర్తిస్తే కలిగే స్పందన. ఇది జడం కాదు. జడాన్ని గుర్తించే చైతన్యం. నిజానికి బాల్యంలో, ఊహ తెలిసాక, తరువాత 15సం /వయసులో,మళ్లీ 25సం/కు,ఇలా కొంత,కొంత వ్యవధిలో  స్వస్వరూప స్థితిని గుర్తు చేసుకుంటే,శారీరిక మార్పులు,మానసిక మార్పులు కాకుండా  స్వానుభవంలో ఏ మార్పు జరగ లేదని స్పష్టం అవుతుంది. దీని పరిచయంతో, అనుభూతమైన స్వరూపం గురించి స్పష్టమైన అవగాహనకు జరిగే అంతర్మధనం,గురువు కోసం తపిస్తే కలిగే తపన తపస్సు. దీనినుండి కలిగే ఆర్తి జిజ్ఞాస. ఇది అగ్ని సమానం. పురాకృత కర్మ ప్రభావాన్ని ప్రక్కకు తోసి సాధనకు సహకరిస్తుంది. ఇది ఎవరెవరి తపనకు ఎంత బల ముందో,దానిఫలంగా పరిపక్వతకు సమయం నిర్ధారించ బడుతుంది.
         ఇది అత్యంత బుద్ధి సూక్ష్మతకు పరాకాష్ట. బాల్యం నుండి బుద్ధిని పదును పెట్టినపుడు బాహ్యావసరాలైన అతి సాధారణమైన,ఆహార,గృహ,గృహస్థ అవసరాలకు పరిమితం కాని,జన్మకు మూలమైన అజ్ఞాన నివారణకు అవసరమైన విజ్ఞానం వైపు దృష్టిని సారించే ప్రయత్నం బుద్ధి సాగిస్తుంది. కానీ పరిచయం చెయ్యడం మానవ కర్తవ్యం. సాధారణంగా మానవయత్న లోపం దీనిని పరిచయం చెయ్యక పోవడం వలన,శరీరం తాను భూమిపైకి వచ్చిన అత్యంత ఆవశ్యకమైన పరిపూర్ణతా స్వరూపమైన ముక్తి అనేదాన్ని పొందకుండా,go to pevillion.
         భౌతికమైన ఎన్ని విజయాలైనా,స్టేజి డ్రామాలో షో వరకూ పరిమితమైన వాటితో మాత్రమే సమానం.దీని కోసం  మానవ జీవితం,కోల్పోతున్నగమ్య రూపమైన మోక్షాన్ని,గుర్తు పట్టక పోవడమే,ఆధ్యాత్మిక పరంగా,ప్రమాదంగా మన శాస్త్రాలు,తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అధిగమించి ప్రస్థానం సాగించాలంటే,దానికి బాల్యం నుండి పరిచయం అవసరం. బాల్యానికి డేటింగ్ ఆవశ్యకత లేదు. అన్ని జంతువులు చదవకుండానే ఈ విషయాల్లో నిష్ణాతులు.వీటికోసం సినిమాలు,కంపూటర్లు,వీడియోలు అవసరం లేదు. ప్రకృతికి ఏ సమయానికి ఏమి అందించి వంచించాలో బాగా తెలుసు. దీనికి కృషి ఆవశ్యకత లేదు. ప్రకృతిని అధిగమించి గమ్యాన్ని చేరడానికి,బుద్ధి బలం అవసరం,దీనిపరిచయం ఖచ్చితంగా బాల్యంలోనే జరిగి తీరాలి.అందువల్లనే ఉపనయనం వయసు ఏడవ సం/రమే. అపుడు చేసేది స్త్రీ,పురుష సంయోగం గురించిన ఉపదేశం కాదు. బ్రహ్మమే తానని తెలియడానికి,ప్రాతిపదికగా , గురు స్వరూపంగా ,తండ్రి చేసే ఉపదేశం. దీనికి ప్రత్యక్ష నారాయణుడైన సూర్య నారాయణుని,కిరణాల రూపంలో మనను సమీపిస్తున్న గాయత్రీ మాతగా సంభావించి,బుద్ధి ప్రచోదనాన్నే వరంగా,రోజూ ముమ్మార్లు ప్రార్ధించడాన్ని,  సంధ్యావందనంగా మనకు తెలుసు.ఇందులో మోక్షాన్నిఇమ్మని అడగడం లేదు.తనను తాను తెలుసుకునేరీతిలో బుద్ధి సహకరించేలా,చెయ్యమనే ప్రార్ధన ఉంది. నిజానికి ముక్తి తనకున్న అజ్ఞానాన్ని లేదని తెలుసుకోవడమే తప్ప వేరే కొత్తగా సంపాదించే,సంపాదన కాదు. అజ్ఞానాన్ని విడిచి పెట్టడమే లక్ష్యం కనుక,త్యాగమే జీవనము అని తెలియజేస్తుంది శాస్త్రం. అది వదిలించుకునే వ్యవహారంలో భాగమే సంన్యాసం. కానీ అది సూచించిన అజ్ఞాన నిరాకరణమే దీని గమ్యం. దిని ప్రాతిపదిక బాల్యంలోనే ప్రారంభం.
      తల్లి ఒడి నుండి బడికి,తల్లిని వదిలితేనే సాధ్యం. ఇక్కడ ప్రారంభం అయిన ప్రయాణం పరమాత్మను చేర్చే దిశగా కదిలే బృహత్తర ప్రణాళిక మన వేద విద్యకు మాత్రమే స్వంతం.ఇది కొంతమంది ద్వారా సమాజానికి మేలుకుర్చే విధంగా అందించడమే ఈ యుగంలో ఎన్నో బేధ భావాలకు తావిచ్చింది. కానీ ఎప్పుడూ తండ్రి పిల్లల మేలు కోరినట్లే శాస్త్రం సమాజ శ్రేయస్సుకు కొన్ని నియమాలు ప్రకటించింది. ఎంతో ధర్మ బద్ధంగా కష్టపడి ఒకవ్యక్తి ఎంతో అభివృద్ధిలోకి వచ్చి,ఆనందానికి నోచుకోక తనువు చాలించాడనుకుందాము. న్యాయమేనా?మనకే అన్యాయమనిపిస్తే,సృష్టిలో పరమాత్మ తప్పకుండా న్యాయం చేస్తాడు.మళ్లీ వారసుడిగా వచ్చి తన హక్కును తాను వాడుకుంటాడు. అందువల్లనే పునర్జన్మ అనేది భగవంతుడిచ్చిన, మొదటి న్యాయ వ్యవస్థ. న్యాయ మంటేనే,తప్పు, ఒప్పుల మధ్యన జరిగే పోరాటంలో ఒప్పు గెలవడమే. ఇటువంటి ఎన్నో విశ్లేషణలతో కూడిన పునర్జన్మ సిద్దాంతంలో,భగవంతునే గమ్యంగా సాధన సాగిన జీవులకు కూడా న్యాయం చేస్తే,వారికి దొరికినది బ్రాహ్మణ జన్మ. వీరి కోరిక మేరకు భగవంతుడు,తనసేవకు గాను వేద విజ్ఞాన సముపార్జన జీవికగా ఏర్పాటు చేశాడు. పురాకృత పుణ్య,పాప ఫలంగా,ఎన్నో బేధాలతో ఉన్న సృష్టిలో చెట్లు ,జంతువులు ,మానవులు ఇలా ఉన్నా, మళ్లీ అన్నింటిలోను విభిన్నత్వం ఉంది. వీటిని ఎవరూ తప్పు పట్టరు. మామిడిపండ్లలోనే ఎన్నో రకాలు. మళ్లీ పక్వాన్ని బట్టి రుచిలో బేధాలు. ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారు. కంటికి కనిపించని ఎన్నో బేధాలుగల మానవులను వర్ణ , వర్గాలుగా విభజించినపుడు,దీన్ని అత్యంత సహజమే అని ఈ సమాజం ఒప్పుకోకపోడమే పెద్ద ఆశ్చర్యం.        ఉపనయనం  కులాచార ప్రాతిపదిక మాత్రమే.
             ఎందరో B SC డిగ్రీ చేశారనుకుందాం,అందరూ బి ఇ డి చెయ్యరు,అంత మాత్రాన,డిగ్రీకి ఏ విలువా లేదా ? ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ట్రైనింగ్ అవసరం.దీనివల్ల వారి గౌరవం పెరిగి పోలేదు. మిగిలిన వారికి తగ్గి పోలేదు. ఎవరి కులవృత్తి వారిది.అటువంటి విధానమే ఉపనయనం.ఒక కుమ్మరి,ఒక కమ్మరి,ఒక రైతు,ఒక మంగలి అందరూ సమానంగా,మాములుగా చదువుకునే డిగ్రీ అందరికీ సమానమే. కానీ విడిగా, వారు,వారి వారి కుల వృత్తిని అభ్యసించ కూడదనే శాసనం ఏమీ లేదు. అలాంటి ఒక ఆచార వ్యవహారమే ఉపనయనం. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను అన్వయించుకోడానికి,చదవాలి,తెలుసుకోవాలనే తాపత్రయం అవసరం కానీ వేరే ఏ అవసరమూలేదు. పరమాత్మను చేరాలనే తపన తపస్సుగామారుతుంది.అంటే అడవులు పట్టి పోవడం ఎంతమాత్రమూ కాదు.తన బాహ్యావసర జీవనానికి అవసరమైన విద్యతో బాటు,బుద్ధిని సూక్ష్మతరం చేసే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం. ఇది  భౌతికంగా చర్చకు అందనిది.
     దీనికి మన శాస్త్రాలను,ఎలిమెంటరి విద్యనుండి పరిచయం చెయ్యడం ఎంతోఅవసరం.సమయం పరమాత్మ స్వరూపం. నిరాకారమైనా జీవితాన్ని శాసించి,లక్ష్యపెట్టకపొతే,చివరకు నిరర్ధకమైన జీవితాన్ని కళ్ళముందు ప్రకటించి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది.సమయాన్ని గుర్తు పట్టడమే నిజానికి అన్నిటికన్నా గొప్ప సాధన. ఇది అవకాశం అనేదాన్ని అందించ గలుగుతుంది. అనవసర విషయాల వైపు మనసు పోకుండా,అవసరమైనంత వరకు సమయాన్నివినియోగించగల నేర్పు పిల్లలకు నర్సరీ నుంచి తెలిసేలా చేసి వారి భవిష్యత్తుకు,నిర్దిష్టమైన విధానాన్ని తప్పక పరిచయం చేయాలి.నిజానికి చాలామంది సమయం సరిపోవడం లేదుఅని, అంటూ ఉంటారు. కానీ భౌతిక పరమైన అంశాలకు ఎంత మేరకు తప్పనిసరి అవసరమో,అంతవరకు ఆలోచిస్తే,చాలా భాగం,మనసు అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన,ఎంతో సమయం వృధా అవుతుంది.       నిజానికి ఇపుడు కలియుగమైనా మన సాధన మాత్రం కలి నుండి ద్వాపరానికి,ద్వాపరంనుండి త్రేతాయుగానికి, త్రేతాయుగం నుండిసత్యయుగానికి ప్రయాణం సాగిస్తున్నామని భావించవచ్చు. ప్రశ్న పుట్టకుండా మన సమయా న్నంతా మింగేసేదే కలియుగం. ఐతే,మనసులో,ఆలోచన లేదాప్రశ్నకు 100శాతం అధర్మం వైపు మనసు ప్రయాణం చేస్తున్నా ,5శాతం మనసును   ధర్మం అడ్డుకున్నామనప్రయాణం ప్రారంభం అయినట్లే. 100మంది అధర్మ పరులైన కౌరవులు,5గురుధర్మపరులైన పాండవులు గానుపరిచయం చేసింది భారతం . దైవం పై అచంచలమైన విశ్వాసంతో, పట్టుదలతోమనలొఉన్న దుష్టస్వభావం,పై విజయం సాధించిన కొద్దీ భగవద్గీత మనకు అనుసంధానం అవుతుంది. తన ప్రవృత్తితో అంతరంగాన్నిశ్రీ రామరాజ్యంగా మార్చిన సమయం త్రేతాయుగమే.సత్యం తన స్వరూపంగా భాసించే వారికి సత్యమే,పునరావృత్తి రహిత సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
         వస్తువు యొక్క పరిపూర్ణ జ్ఞానం వల్లనే వైరాగ్యం సంభవం. పరబ్రహ్మం పొందవలసినదనే ధృఢ నమ్మకంతో సాధన ప్రారంభం అవాలంటే తత్వజ్ఞానానికి సంపూర్ణమైన మద్దతును మనసుకు అందించాలి. అన్నివిధాలుగా ఎన్ని ప్రశ్నలు మనసు వేసినా,అన్ని ప్రశ్నలకు శాస్త్ర అవగాహన పెంచుకుని,చిన్న పిల్లలకు,తల్లిదండ్రులు ఎలా సమాధాన పరుస్తారో అలా ఓపిగ్గా negative వైపు ఆలోచన పోకుండా శాస్త్ర జ్ఞానాన్ని ఆలంబనగా ప్రయత్నం సాగించాలి.
         అదే సమయంలోఎంతో బలమైన పూర్వ జన్మ సంస్కారాలు,శరీర పరమైన అవసరాలు,సుఖ,దుఃఖాలు,కామ క్రోధ,లోభ,మద,మాత్సర్యాలు,వీటిలోని ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చిమనసు ,భగవత్స్వరూపమైన కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది.నిజానికి దేశ కాలతీతమైన స్వరూపం,స్వంతమైనా,చకోర పక్షి,స్వాతి చినుకు కోసం తపించి నట్లు,సాధనకు అవసరం లేని negative attitudeవల్లనే ఏర్పడిందంటే అతిశయోక్తి లేదు. 
    తనకు తాను బలవంతంగా నిగ్రహించిన మితిలేని భౌతిక వస్తు,సుఖాపేక్ష,కారణంగా,నిద్రాణంగాపేరుకు పోయిన అజ్ఞానమేజన్మకారణం.దీనికి జవాబుగా,సకల జగత్తూ పాంచ భౌతికమనే అవగాహన,మనకు మోక్షద్వారం.తన స్వ స్వరూపం భౌతిక జగత్తుకు సాక్షి.శరీరాన్నితానుగా భ్రమించి,భౌతిక వస్తువులే గమ్యంగా సాగిన జీవితం,మనను అహంభ్రహ్మాస్మి అననివ్వకుండా అడ్డుకుంటోంది.
           ఎప్పుడూ ఉన్న చైతన్య స్వరూపంగా ,మనం ముందు యుగాల్లో బహుశా ఏమి చూసి ఉంటా మంటే,సత్య యుగంలో హరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడి నప్పుడు,బాధ మాత్రం తప్పకపడి ఉంటాడు.కానీ శారీరిక, మానసిక బాధ మాత్రమే అని తలచి తన స్వ స్వరూపంలో ఒదిగి,వడ దెబ్బ తాపం నుండి,తనకు తాను,తన ఇంట్లో సేద తీరినట్లు, తప్పించు కున్నట్లు,బహుశా మనం చూసి ఉండవచ్చు.    
          బహుశా త్రేతా యుగంలో రాముడు ఎంత కష్టపడినా లెక్కచేయకసీతను దూరంచేసిన చాకలి రూపంలో అప్పుడు,ఎవరు సత్య,ధర్మాలను వారికి వీలైన పరిధిలో, ఇప్పుడు అనుష్టించినా,విసుగూ,విరామం లేకుండా వారిని విమర్శించేవారు,ఇప్పటికీ వారి స్వగుణాలను చాటుకుంటూ ఉండడంమనం చూస్తూనే ఉంటాము.తరిమి తరిమి అవస్థల పాలైన సాధకులను విసిగించే విధానం హరిశ్చంద్రుని కాలంనుండి వస్తూనే ఉంది. [1]ఇది సత్య యుగం నుండి ఇప్పటి వరకూ కొనసాగుతున్న అరాచకం.
            త్రేతా యుగం నుండి బహుశా,పర స్త్రీ కాంక్ష,కలి యుగం,సంపాదించుకుని ఉండవచ్చు.[2] ద్వాపరం నుండి  అన్నదమ్ముల,దాయాది పోరు సంక్రమించి ఉండవచ్చు. [3]ఇలా ఈ మూడు పువ్వులు,ఆరు కాయలై,అన్ని యుగాల్లోని వ్యతిరేక ఆలోచనా విధానాలు కలి యుగానికి కలికితురాయిగా భాసిస్తున్నాయి.మళ్లీ మనం తిరుగు ప్రయాణం చెయ్యాలంటే ఇప్పటి విధానాలకు వ్యతిరేక దిశా ప్రయాణం చేసే నావ ఎక్కక తప్పదు.
             వైవిధ్యం సృష్టి. ఏకత్వం దృష్టి. సృష్టిలోని మనీషులకు అంతరంగ మధనంలో సాధించుకున్నది,శివుని మూడోకన్ను,జ్ఞానమే నేత్రము. చర్మ చక్షువు కాదు.ఎప్పుడూ విడదీయలేని అంతర్ముఖత్వం. యిదే శివత్వం. శివుడు వేరుగా తత్వం వేరైన శివ తత్వం కాదు. తత్వమే తానైన శివత్వం. ఇది అనుభవం మాత్రమే. ఏకత్వం.
          ప్రవర్తన కాదు. ప్రవర్తించాలంటే సృష్టిలో మాత్రమే సాధ్యం. సృష్టి వివిధం. ఏకత్వ ప్రతిపాదన అసాధ్యం. అందు వల్లనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం.మౌనమో అంతర్ముఖత్వం.అందువల్లనే, చెప్పి,చెప్పి అలసిపో యిన శ్రుతి మూగ బోయింది,పరమాత్మ విషయంలో.
       మౌనంగాశ్రుతి,శివత్వమే తానై,శివంగాఅరాధించ బడుతోంది,సృష్టి చేత.శివం ప్రవహిస్తే,శ్రుతి. శబ్ద గంగ.ప్రశ్నించే వారికోసం ఘనీభవించి గురువుగా ప్రకటించబడుతోంది.శిలా సదృశంగా అర్చా మూర్తిగా పూజింప బడుతున్నది. రూప రహితంగా లింగరూపంగా,నిరాకర తత్వాన్ని,అనేక స్వరూపాలతో సాకార సృష్టి రూపంగా,అన్ని రూపాలలోని ఏకత్వాన్ని ప్రస్ఫుటంగా తెలియ జెయ్యడానికి అనేక ఆలయాల్లో అనేక శిలా దేవతా మూర్తులుగా కేవల శివత్వమే ప్రకాశిస్తున్నది. ప్రపంచరూపంగా అరాధించ గలిగేవారికి 'విశ్వం'విశ్వరూప దర్శనమే.
             సృష్టి  వివిధం.దాన్ని అలానే ఒప్పుకోవాలి. తప్పదు. సృష్టికి మూల రూపం ఏకత్వమైనా,పాంచ భౌతికంగా మాత్రం వివిధత్వం మాత్రమే సృష్టికి ఆధారం. పోలిక ఉండవచ్చు,కానీ ఏ రెండూ ఒక్కటే అనిమాత్రం చెప్పలేము. కాపీ అనేది యాంత్రికం. వివిధత్వం మాత్రం సజీవం. కనీసం కవల పిల్లలుకూడా ఒకేలా ఉండరు. ప్రతి అణువు తన వైభవాన్ని చాటుతుంది. తనను తాను సంస్కరించు కోవాలనుకునేవారి ప్రధమ లక్షణం తను తక్కువ. అప్పుడు మాత్రమే సాధన అనే పదానికి అర్ధం ఉంది. అన్ని విషయాలలో పూర్ణత్వం అసాధ్యం. ఏవిషయంలో తన తెలియక పోవడం ఉందో దాని జ్ఞానాన్ని పొందడానికి సవినయం అవసరం. అంతమాత్రాన అతని మిగిలిన విషయాల్లో జ్ఞాన వైభవం కుంచించ బడదు. వినయం వలన అన్నీ మరింతగా ప్రకాశిస్తాయి.
            తెల్లని వస్త్రం బ్రహ్మాన్ని సూచిస్తుంది,కానీ ఉపయోగానికి రావాలంటే,దానికి అంచు ఉండి తీరాలన్నది,శాస్త్రం. అంతేకాదు దేవాలయాల్లో ప్రవేశానికి,పంచె,ఉత్తరీయం ధరించి రావాలనే శాస్త్ర వాక్యంలో,ఎంతో అర్ధం ఉంది. ఎక్కడా చింపడం కానీ అతుకు వెయ్యడంకానీ లేకుండా ధరించే విధంగా ఈవస్త్రధారణ ఉంటుంది.పరబ్రహ్మం వస్త్రంగాభావిస్తే, అందులో తగ్గించ వలసినది[కత్తిరించడం]కానీ,అలాగే కలప వలసింది[కుట్టడం]కానీ,అవసరంలేకుండా ధరించడం సాంప్రదాయం.అంటే తత్వానికి కలప వలసినదీ లేదు,తీసి వేసేదీ లేదు.ఉన్నతత్వాన్నిఉన్నట్లుగా ధారణ చేస్తు న్నాను,అని సవినయంగా భక్తితో,భగవంతుని ముందు నమస్కరించడమే,ఈఆచారం వెనుక అంతరార్ధం.అంతేకాదు సృష్టిలోని భిన్నత్వాన్ని అంతే సవినయంగా ఒప్పుకుంటున్నట్లు తెలియ జేసేదే ఉత్తరీయం. శుద్ధ సత్వమైన బ్రహ్మ తత్వానికి ప్రతీకగా రెండు వస్త్రాలు తెల్లనివి మాత్రమే ఉంటాయి. అంచు లాగా రంగు వాడినట్లే,సృష్టిలో చరించడానికి తగినంత మాత్రంగానే,మిగిలిన సత్వ ,రజో ,తమో గుణాలను ఉపయోగిస్తాననే సూత్రం దాగి ఉంది.భారతీయ స్త్రీ ధరించే చీర కూడా ఏక వస్త్రమై ఎక్కడా అతుకు,కుట్టు లేకుండానే,అంచు కలిగి ఉంటుంది. అంచు అనేది సృష్టిలోని కట్టుబాట్లపట్ల గౌరవాన్ని సూచిస్తుంది. పరిధిని పరిచయం చేస్తుంది. పూర్వపు స్త్రీ పై వస్త్రాన్ని కట్టుకున్నట్లు  చిత్రీకరిస్తారు కానీ,చీరను బుజాల నిండుగా కప్పుకోవడాన్ని మాత్రం చిత్రీకరించడం మరవడం వలన మన సాంప్రదాయాన్ని ప్రకటించ లేక పోయింది. ఈ పై వస్త్రం కూడా ఆ రోజుల్లో అతుకు లేకుండా ఉండేది. వీటి వెనుక,పైన అనుకున్న అంతరార్ధం ఉంది.
        బ్రహ్మచారి ఒక వస్త్రాన్ని ధరించవచ్చు. గృహస్తు ఉత్తరీయాన్ని తప్పక ధరించాలి. అంటే శక్తి సహిత శివ రూపం. భార్యకిచ్చిన గౌరవం,తనుకట్టుకున్నవస్త్రం కన్నాపై స్థానంలో ఉంచి,అంటే ఉత్తరంగాఉత్తరీయంఉంచి స్త్రీని గౌరవించిన ఆచారం మనది.అందుకే పెళ్ళిలో ఉత్తర జంధ్యాన్ని మామగారు తమ కూతురుతోపాటు సమర్పిస్తారు.నిజానికి మగ వారికి జీవితం అంటే కుటుంబమే కానీ,అవసరాలన్నీ కుటుంబానివే. వారి కష్టమంతా కుటుంబానికే. స్వప్రయోజనం శూన్యం.కుటుంబ అవసరాలు తమ అవసరాలుగా భావించి,భరిస్తారు కనుక భర్త.కానీ కనీసం కని పెంచిన తల్లి,తండ్రి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు,తాత,బామ్మ,వీరిగురించి మాట్లాడే స్వాతంత్ర్యం ఎంత మంది కలిగి ఉన్నారో మనకు తెలియందేం లేదు.కోడళ్ళపట్ల అత్త మామల ఆరళ్ళువినిపిస్తున్నాయి కానీ,నిజానికి మగవారి పట్ల  90%వినిపించని నిజాలెక్కువ.కంటి నీరు కార్చే యోగం కూడా లేదు.ఎంతసేపు ఆడవారిపై చేయి చేసుకున్న చరిత్రలో మగవారి దురహంకరమే  గాని ఎంత చెప్పినా వినని అర్ధాంగి మొండితనం బయటకు రాదు.మగవారిని రెచ్చగొట్టే చూపు తమ ఆడపిల్లలకు  ఉందని గుర్తించే తల్లిదండ్రు లెందరు? సమాజంలోజరుగుతున్నఅరాచకాలలో సూర్పనఖలకు కొదవ లేదు.  సమాజంలో  మగ వారినే అన్నిటికీ బాధ్యులుగా వ్యవహరిచడం,అవగాహనా లోపమే.ఎవరైనా మగవారు దొంగతనం చేస్తే,అందరు మగవాళ్ళు దొంగలే అన్నట్టు వ్యవహరిస్తోంది సమాజం.
            బ్రహ్మమొక్కటే అనే అంతరంగ అనుభవాన్ని,శ్రుతి మౌనంగా తెలియజేసినా,అలాగే మౌన వ్యాఖ్యతో దక్షిణా మూర్తి తెలియజేసినా అంతరంగంలోనే,తందనాన అని స్వానుభావాన్నిఆస్వాదించ వచ్చు.కానీ అందరికి బాహ్యంలో అందిస్తే అది సాధనకు వేసిన తెల్లని ముసుగు మాత్రమే.దీనివల్ల సంపూర్ణంగా వర్ణవ్యవస్థ తనవైభావాన్ని కోల్పోయింది.వేలితో మనకన్నుమనమే పొడుచుకున్నట్లయింది.
    సృష్టిలోఎక్కడైనా ఎక్కువతక్కువలే ఉన్నాయి. సమానత్వంఎండమావి.అంతరంగంలో ఆస్వాదించ వలసిన మౌనానికి మాటలిస్తే,అర్హత లేనివారు దుర్వినియోగం చేస్తారనే శ్రుతి,తత్వాన్ని రహస్యం అని సూచించింది. గురు కృపతో,సాగిన సాధనలో కలిగే తృప్తి,పాట విని పాడినంత సులువు కాదు,సాధన చెయ్యడం.అభినయించిన వారందరికీ అనుభవం అందితే అందరూఅభినయిస్తే సరిపోతుంది. కానీనటనలో త్రిపుటి ఉంది.అసలు సాధన త్రిపుటిని జయిం చడానికే.అది గెలిస్తే కలిగేది మౌనం.బాహ్యంలోఅసాధ్యం అంతరంగంలోమన శరీరానికున్న బాంధవ్యాలను నటనగా ప్రతిపాదించి సాధనలో పరిపక్వతకు సోపానంగా మలచు  కున్నవారు,ప్రయోజనాన్ని పొంద వచ్చు. ఏది ఏమైనా సృష్టికి ఏకత్వ ప్రతిపాదన అర్ధ రహితం.
          ఒక మనిషికి,ఒక మనిషికి పోలిక లేదు. యూనిఫాం వెయ్యవచ్చు కానీ ఎవరి జీవితం వారిదే. వేరేలా ఎవరిలానైనా ఉండాలనుకుంటే కాపీ అవుతుందే కానీ సహజత్వం ఉండదు.తను ఎదగాలి అనే తపన తనను విశిష్టంగా  చూపుతుంది. అందువల్లనే మనకు శాస్త్రం వినయ సంపన్నుడే విద్యావంతుడన్నది.కానీ దానికి కూడా పరిధి ఉన్నది. 
       ఒక తత్వవేత్త వినయమని,పామరునికి నమస్కరిస్తే ,అది అతని విజ్ఞతకు గుర్తు. కానీ పామరుడు అది తన జ్ఞానానికి గుర్తుగా భావిస్తే కలిగే అనర్ధం అతణ్ణి సాధనకు దూరం చేస్తుంది . అతి వినయం కూడా అగౌరవమే.తన తల్లిదండ్రులు సభలోకూడా గౌరవించ దగిన వారు .నిరక్షురు లైనా  దైవ సమానులు. ఇలా ప్రతివిషయంలోనూ ఎన్నో బేధాలు,అన్నీ ధర్మాన్ని రక్షించేవిగాఉండాలి. అల్లుడు శ్రీ మహా విష్ణువని,శాస్త్రాన్ని నమ్మి,లక్ష్మిగా కన్యను సమర్పించి పాద తీర్ధం తలమీద జల్లుకుని, వారితో మీరు మేము సమానమే అని నొక్కి వక్కాణించే కన్యాదాత,వియ్యాలవారికి కప్పేది ఇలాంటి అంచు లేని తెల్లని వస్త్రమే .కానీ అదేమాట వరుని తండ్రి పలికితే, శాలువాతో సత్కరించినట్లుంటుంది.ఇద్దరు చెప్పింది ఒక్కటే అయినా అర్ధం మాత్రం ,అన్వయం కాదు. ధర్మ సూక్ష్మాన్ని గుర్తించిన వారిని కీర్తి వరిస్తుంది. ఎవరికీ తెలియదులే అని,అన్నీసమానం అనే ముసుగు,ఎంతోకాలం వారిరంగును దాచి ఉంచలేదు. అందరూ సమానమైతే శిష్యుడు గురువు వద్ద ,ఎప్పటికీ ఏమీ నేర్చుకోనివ్వని పొగరు మాత్రమే యివ్వగలుగుతుంది.
     భగవంతునికి వస్తు రూపంగా ఏమిచ్చినా,అది ఆయన సృష్టి లోనిదే.అందువల్లనే ఆచార్యులందరు స్తుతినే,భగ
వంతునికి కానుకగా సమర్పించారు.వాక్కు పరమేస్వరానుగ్రహమైనా దానిని అందరూ,వారి స్వప్రయోజనం కోసం
అనవసరము,అధర్మము అయిన వాక్చాతుర్యానికి వాడే అవకాశం ఎక్కువ. దీనిని అధిగమించి భక్తినే సాధనగా
వాక్కును ప్రవహింప చేసే సంస్కారానికి,సంయమనం చాలా అవసరం.మనకిష్టమైన విధంగా వాడుకోమని దైవం
అనుగ్రహించిన శారీరిక,మానసికి,బుద్ధి శక్తులను,పరమాత్మను చేర్చే సోపానాలుగా వాడితే అది ధర్మం. పంచ
ప్రయోజనాలే[ఇంద్రియ సుఖాలే] గమ్యం అయితే అది అధర్మం. అధర్మానికి వాడే వాక్కులు,భగవంతునికి వ్యతిరేక
దిశా,ప్రయాణం చేయించి జన్మ పరంపరలకు కారణ మౌతాయి.స్వతంత్రం మనకు ప్రసాదించినా, వివేకంతోవాడితే
పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది. మనను మనమే పరమేశ్వరునికి సవినయంగా సమర్పించు కోవడాన్నే మనం
ధర్మం, అని భావిస్తే,అది ఇలలో కుమార్తెను మన మనసుగా భావించి లక్ష్మిగా,విష్ణువుకు సమర్పించడం ప్రధాన
ధర్మం.సవినయం లోపిస్తే అధర్మం.
         సంసారానికి పునాది గృహస్థాశ్రమమే. దీనికి వివాహ వ్యవస్థ సుసంపన్నమై,సరిగా తన పరిధిని కాపాడు
  కోలేకపోవడమే,ప్రస్తుత సమాజపు తీరుకు చాలావరకు కారణం. ఎన్నో జీవితాలు వీటికి ప్రతి బింబాలుగా సమాజంలో  కనిపించడం వలన,ఈ బ్లాగ్లో అనేకసార్లు,వివాహ సంబంధిత విషయాలు చర్చించడాన్ని విజ్ఞులు అర్ధం చేసుకోగలరు.సంస్కృతి ,సాంప్రదాయం కాపాడ గలిగేది సంసారం . అలా కాపాడిన సంసారి సత్యవ్రతుడు. దీనర్ధం మనకు పరిచయమే .ధర్మం కాలగతిలో మార్పుకు లోనైనా,ఆధారమైన సత్యం ఏమార్పు చెందదు. స్థిరంగా ఉన్న సత్యాన్ని దృష్టి నుండి జారి పోనీక దానికి ప్రదక్షిణంగాజీవితాన్నినడిపితే,కల్పాంతంలో మత్స్య రూపంలో బీజాలతో సహా ప్రళయంనుండి కాపాడి,సృష్టి నిపరమాత్మ కాపాడిన విషయం మనం పురాణాల్లో చూస్తాం . అంటే'అమ్మో కలికాలం,అన్నీ అలా జరుగు తున్నాయంతే 'మాకేం సంబంధంలేదు,అనేవాళ్ళు,సత్యవ్రతులెలాఅవుతారు?సత్యమే వ్రతంగా చాకచక్యంగా జీవించి భావితరాలకు మూలాలను పరిచయం చేసి ,వాటిని కాపాడే బాధ్యత అందించడమే మానవ కర్తవ్యం .దీనికి ధర్మాగ్రహం కూడా అవసరమే. అందువల్లనే దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ పరమావధిగా నారాయణుడు ,నారాయణి ఆయుధాలు ధరించి మనకు మార్గ దర్శనం చేశారు.దీనికి ఆయుధాలు ధరించి తిరగాలనేది ఉద్దేశం కాదు . ఆలోచనలో మంచి,చెడుల విశ్లేషణ చాలా అవసరం. అలా ప్రతి క్షణం జాగ్రత్తగా వేసే అడుగులు చూసి మాత్రమే ,పిల్లలు అప్రమత్తంగా ఉంటారు. లేకుంటే మోడరేషన్ పేరుతో వంచించ బడతారు .దీనికి తమను,తాము సవరించుకోని పెద్దలదే తప్పు. నిజానికి భగవంతుడు యుద్ధ ప్రాతిపదికకు మాత్రమే వాహనము , ఆయుధాలు ధరించినట్లు కనిపిస్తుంది . అలానే మానవ  శరీరంవాహనమైతే ఆలోచన ,ప్రవర్తన ,కార్యాచరణ ఇవే ఆయుధాలు.గెలవవలసిన శత్రువు అజ్ఞానమే .రూపం లేదు. అసలు ఉనికే లేదు . పోరాడవలసిన శత్రువుకు ఉన్న ఒకేఒక ఆయుధం ,కనిపించకుండా  పారిపోవడమే .స్వరూప జ్ఞానం జాగ్రత్తుగా అందితే మాత్రమే గెలుపు సాధ్యం . భగవంతుని స్మరణకు రానివ్వని  శత్రు లక్షణాలు,మానవ నైజాలుగా భావిస్తే ,వాటితో తల పడక తప్పదు . దీనిని అధిగమించి ,పాంచ భౌతిక విషయాలకు ఎంత వరకు అవసరమో అంతే విలువనిచ్చి గమ్యం వైపు ప్రయాణించే నేర్పు అందించే తల్లి దండ్రులకు పాదాభి వందనం.
          పంగల కర్ర అనే దానితో పిల్లలు ఆడుతుంటారు . y ఆకారంలోని కర్రకు రబ్బరు మ్ముక్క కట్టి ,ఒకరాయి తీసుకుని రబ్బరుతో వెనక్కి లాగి ,ఒక కాయనో లేదా మరో గమ్యాన్నో ,గురిచూసి కొడుతూ ఆడతారు. అలానే అర్జునునిలా అందరూ విలువిద్య నేర్వకున్నా ,సృష్టిలోని ప్రతివారు అన్ని విషయాలకు ,కొంత గురి నుపయోగించి తమ సమస్త వ్యవహారాలను సాగిస్తారు . కొన్నిగమ్యాలు  దగ్గరగా,కొన్ని దూరంగా భ్రమ  పెడుతున్నాయి . దగ్గర దానికి పట్టు బిగించినా ఓటమే . దూరానికి పట్టు తగ్గినా ఓటమే . ఈరెంటికీ ఆధారమైన గురి అనే దానిమీద దృష్టిని శాస్త్రం ఏకాగ్రత అంటుంది . కానీ ఏకాగ్రత  అంటే బాహ్య వస్తు ,విషయ ప్రతిపాదనం కాదు . గురి మీది అవగాహన ,ఆధ్యాత్మిక చైతన్యమే . గురిచూస్తున్న విషయాన్నిగమనిస్తున్న  సాక్షిని ,శరీర పర్యంతంగా చూస్తే జీవుడు .తన శరీరం కూడా అందులోనే లయిస్తే పరమాత్మ .      
          తల్లి,తండ్రుల సౌభాగ్యం పిల్లలు ,వీరి పట్ల అపారమైన ప్రీతి తల్లి ,తండ్రులకు . ప్రీతి అనే పేరుకూడా పరిచయం లేని పిల్లలకు ,తల్లి ,తండ్రులే ప్రపంచం .పిల్లలు ఈ దశలో ఉన్నంత వరకు పిల్లలకు  ,తల్లి,దండ్రుల సాన్నిధ్యం , అపారంగా అందుతుంది.ఇదే భక్తుడికి ,భగవంతుడికి ఉన్నఅనుబంధం.భగవంతుడికి సృష్టి అంతా సమానమైనా,మాయచేత  ఆవరింపబడిన జీవులకు, ఈ విషయం ,బుద్ధిలో ప్రకాసించదు . తనువూ మనసూ ఏకం చేసి , సృష్టి వైపు ద్రుష్టి పోనివ్వక సర్వమూ పరమాత్మ  అనే అచంచల విశ్వాసం వలన ,కష్ట నష్టాలను కనీసం దృష్టిలోనికి రానీయక ,సదా స్వామి పద కమల ప్రీతి రూపమైన భక్తితో రమించే భక్తులకు ,ప్రతి కదలికలోను పరమాత్ముని సామీప్యం అందుతూ ,మనసు అదే పనిగా పరమాత్మలో ,లీనమోవుతుంది. ఈ దశ నెమ్మదిగా మారి ,సాకార రూప ధ్యానం నుండి నిరాకార పరతత్వం వైపు , ప్రయాణమే,నిజానికి దీని వలన కలిగే లాభంఅంటుంది,త్రిపురా రహస్యం అనే గ్రంధం . ఇది దత్తాత్రేయులు , పరశురామునికి చేసిన ఉపదేశ రూపమైన గ్రంధం .
          ఇది ఒక జన్మలో జరిగే మార్పు అని చెప్పలేము . అందువల్లనే సాధకులందరికి ఒకే రకమైన అనుభవాలు , ఆచరణలుఉండవు . అందువలన సాకారం ,కొందరికి తృప్తి కలిగించినా ,వీరికి బుద్ధి నిరాకారం వైపు పారదు . అంత మాత్రాన లోటు ఏమిలేదు . వీరికి ఈ దశలో కలిగే తృప్తి అపారం . ఈమజిలీ నుండి బయట పడాలంటే ,తల్లిని విడిచి స్కూలుకు వెళ్ళే పిల్లల , మానసిక పరిస్థితే వీరిది . కానీ సృష్టి లోనికి వచ్చిన ప్రతి జీవి ప్రయాణం ,మోక్షమే . జీవాత్మ , పరమాత్మగా ప్రకాసించే వరకూ ప్రయాణం తప్పదు . పురాకృత పాపము  పుణ్యము ,సమానమైనపుడు ,ఏర్పడేదే మానవ జన్మ . అంటే ప్రారబ్ధ రూపానికిరానిది ఎంతో ఉంటుంది . దీనితో సంబంధం లేదు అనడం కుదరదు . భక్తిలో సంత్రుప్తులు కావచ్చు . కానీ మళ్లీ జ్ఞానం కోసంతిరిగి రారని అనలేము . భక్తిలో  సంచితాలన్నీ నశిస్తాయని ఎక్కడా చెప్పలేదు . జ్ఞానాగ్ని దగ్ధ కర్మణాం అన్నారు . అందువల్లనే సృష్టి మూలమైన పంచ భూతాలే తప్ప ,ఏమీ లేదనే నామరూప నిరాకరణ రూపమైన దృష్టినే జ్ఞానం అని ప్రతిపాదించారు పెద్దలు.
               పాంచ భౌతిక విషయాలు మనసును ఆకర్షించ లేని ఈ స్థితిని ,వైరాగ్యం అని భావించ వచ్చు . అంతేకానీ ఇంటిని సంసారాన్ని విడిచి పెట్టడమే ,వైరాగ్యం కాదు . ఈ భావాన్ని బలపరిచిన కొద్దీ ,తామరాకు మీది నీతి బొట్టులా మనసు , సాధనకు సహకరిస్తుంది . ఈ స్థితిలో జరిగే పూజ అత్యంత శక్తి వంతమైనది . బాహ్య ప్రపంచంలో విరమిస్తున్న మనసుకు ,పూజ  లోని ప్రతి పదార్ధము,శబ్దం,అంతరార్ధాన్ని పరిచయం చేస్తాయి .కదిలే ప్రతి భావము ఒక పువ్వై భగవంతుని కోసం విరబూస్తుంది .  ఇదే నిజానికి భగవదార్చన . ఇలా ఏర్చి కూర్చిన ,కదంబ మాల ,ఈ చిన్న blog .  ఉనికిని తన ఆత్మగాను ,పరమాత్మగాను  అనుభవానికి తెచ్చుకోవడమే మోక్షం. తను ఆత్మగా  సంభావించినది ,పర మాత్మ అని ,ఉప్పు బొమ్మ సముద్రంలో మిగలనట్లు   అంతా పరబ్రహ్మమే . ఇదే రమణ మార్గం .
                    'ఓం నమో భగవతే శ్రీ రమణాయ'           
      ఉగాది 'జయ'నామంతో వచ్చింది.ఉగాదిని సృష్టి ప్రారంభంగా భావిస్తాం . నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు మధు ,కైటభులనే రాక్షసులు ,స్వామి కర్ణం నుండి ఆవిర్భవించి లోకాలను అల్ల కల్లోలం చేస్తున్నారు .దేవతల ప్రార్ధన మేరకు  జగదంబ నారాయణుని ,కనులనుండి ,వైదొలగి నందు వలన ,నారాయణుడు ,మధు కైటభులను నశింప జేశాడని , దేవి సప్తశతి  తెలియ జేస్తుంది . పరమాత్మ కన్న జగత్తు వేరనే ,నిద్రా స్థితిలో మాత్రమే ,తమోగుణ సంబంధ మైన ,జగత్తుపట్ల ఆసక్తి ,దాన్ని ఆస్వాదించాలనే తపన ,మనిషికి కలుగుతాయి . ఇవే మధు ,కైటభులు .మధువు ఒక్కటే ,అదే అహం . కైటభాలు ఎన్నో ,అదే నాది . వెరసి నేను , నాది . మహా కాళీ స్వరూపం ,తమో గుణ లక్షణాలను  తొలగించి ,రజో గుణ రూపమైన సాధనకు ,దారి సుగమం చేస్తుంది . అంటే రాత్రి ముగిసి ,ఉషోదయ మైందని గుర్తుగా ఉగాది నిర్వహించ బడుతున్నది .కాళి నాలిక చూపడం ,సరస్వతి రూపానికి గుర్తు . తమోగుణం విడిచి ,కృషితో , జ్ఞానాన్ని కలిగి ,ఆ వెలుగులో సకల కార్యాలు నిర్వహిస్తూ పరమాత్మను చేరమని ,దారి చూపే వెలుగే ఉగాది .
     అందువలన మనకు ఉగాదికి ,దుర్గా స్వరూపిణిగా ,ప్రతి ఊరిలోను పొలిమేర కాచే తల్లిగా ,భావించి ,ఉత్సవాలు
చెయ్యడం జరుగుతూ ఉంటుంది . అంతరార్ధం గ్రహిస్తే ,అన్ని వేళలా తల్లి ,ఎవరి దృష్టి పడకుండా పిల్లలను కాపాడినట్లు
పాడి ,పంటలను కాపాడుతుందని ,ఉత్సవాలను ,పెద్దలు ,శాసించారు .వ్యక్తిగా చూసినా ,గ్రామ దేవత అనుగ్రహంతో, సమాజపు క్రూర దృష్టి నుండి ,ప్రతివారిని రక్షించేది అమ్మ ,అనుగ్రహమే .
   ఉగాది మర్నాటి నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి . అమ్మను దుర్గగా శరన్నవరాత్రులలో పూజిస్తే ,వసంత నవరాత్రులు ,శ్రీరామ నవమి ఉత్సవాలుగా జరుపుకోవడం మనకు తెలిసిందే . దుష్ట శిక్షణకు దుర్గా దేవి ఉగ్రత్వం అవసరమైనట్లే ,శిష్టరక్షణకు సంయమనంతో కూడిన ధర్మ రక్షణ అంతే అవసరం.దుష్టత్వాన్ని భంజనం చెయ్యడానికి,రాత్రి   రూపమైన దక్షిణాయణంలో దుర్గ ఆరాధనం చెయ్యడం ఆచారంలో కనిపిస్తున్నది . అలానే ధర్మానికి పట్టం కట్టే వసంత నవరాత్రులు ,శ్రీరామ జన్మదిన ,సీతా వివాహాలను జరపడం పరంపరగా వస్తున్నది . బయటి ప్రపంచంతో వ్యవహారానికి దుష్ట నియంత్రణకు కొంత కోపము ,ఉగ్రత్వము తప్పనిసరి . తమ పిల్లలే అయినా సవరించ వలసినప్పుడు దండన తప్పదు.అంతరంగ ఉన్నతికి ,ధర్మం యొక్క జననం తప్పదు .అదే రామ జననం . అదే ఉత్తరాయణం .తనలోని పది ఇంద్రియాలనే రావణాసురుడు ,మనసనే సీతమ్మను అనుక్షణం ఎత్తుకుపోతూనే ఉంటాడు.దీనిపై విజయమే రామరాజ్య స్థాపన.పదివేల సంవత్సరాలు రాముడు రాజ్యం పరిపాలించాడని అంటారు . అంటే రావణాసురుడి వ్యవహారమంతా చాలా చిన్నది .అలానే ఇంద్రియజయం ,చిత్తశుద్ధితో చాలా చిన్నది . కానీ ఎప్పుడూ జాగ్రత్త అవసరం .
         అందుకు శ్రీ ఆచార్య శంకరులు తప్పక రావలసిందే వైశాఖ పంచమికి . సాధన కూడా గ్రీష్మంలా సాగాలి .  భగవంతునితో సామీప్యాన్నిచ్చే ,తొలి ఏకాదశిగా తనలోతాను మనన మనే యోగ నిద్రలో ములగాలి .వ్యాసుని దయతో అధ్యయనం సాగి ,శ్రవణం దిశగా పరమాత్మ ఉపదేశాన్ని అంతరంగంలో వినాలి . సృష్టికి ముందు అంటే తనకు ప్రపంచం పరిచయానికి ముందు అర్ధనారీశ్వరం . భూతకాలం ,భవిష్యత్తు వీటిలో తనను ,తన శక్తిని వేరుగా చూపడం వీలుకాదు .అది ఏకం .వర్తమానం మాత్రమే తన శక్తి ప్రకటించ గలదు .అదే వర్తమాన స్వరూపమైన లక్షీ నారాయణ రూపం . స్వరూప   నిష్టలో ,యోగనిద్రా స్థితిలో ఆత్మాను సంధానం చేస్తూ ,తన వ్యవహారాలను సక్రమంగా నడిపేదే నిజమైన లక్ష్మీ కృప .
         జాగ్రత్తగా సాధన సాగితే ,హయగ్రీవ తత్వమైన గురు రూపం ,హృదయంలో ఆవిష్కృతమై ,యజ్ఞోపవీత రూపమైన బ్రహ్మ స్వరూపం అవగాహనకు అందడానికి ,సంధ్యా వందనమనే నిగూఢ తత్వం పరిచయ మౌతుంది . రెండు సంకల్పాల నడుమ సంధ్య,ధర్మాధర్మాలు ,సత్యాసత్యాలు ,ఇలా అన్ని ద్వందాలకు  ఆధారంగా ఉన్న పరతత్వం ,తన పాదాలను చూపుతూ ,ఆధారం పరబ్రహ్మ తత్వంగా వరద హస్తంతో పరిచయం చేస్తూ, శంఖ , చక్రాలు అవసరం లేదంటూ[జనన మరణ చక్రభ్రమణం లేదంటూ ,అంతరంగ శత్రువులపై శంఖాన్ని పూరించ వలసిన అవసరం లేదంటూ ]ఈ ప్రాపంచిక విషయాలు ఎప్పటికీ నిన్ను మభ్య  పెట్టలేవంటూ కటి హస్తాన్నిమనసుకు బాసటగా చూపి , 'వేంకటేశుడిగా 'సహస్రార కమలంలో వేంచేస్తాడు ,శ్రావణ పౌర్ణమికి శ్రవణా నక్షత్రంలో .తన సంపూర్ణ శక్తితో సాధనే,తిరుపతిలో [మూలాధారం ]అలివేలు మంగకు ,నిత్యమూ  తిరుమలలో స్వామి వారితో కళ్యాణం .వర్తమానం అనేది నిజానికి కాలాతీత స్థితి . భూత ,భవిష్యత్తు అనే రెంటినీ అధిగమించినపుడు ఉన్న స్వస్థితి ,మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం .
          కానీ ఇది జీవాత్మ ,పరమాత్మను ఏకం చేసిన క్షణం . సంసారం సముద్రంలా భయపెట్టకుండా వెంకటేశ్వరుని కృపతో కటి లోతు ఉన్న,చిన్న వాగులా కనిపిస్తున్నా ,ఏమరుపాటు తగదు .సృష్టిలో శరీరం కదులుతున్నంత వరకు ప్రమాదం ,ఇంద్రియాల రూపంలో మనసును కైవసం చేసుకోవచ్చు.ఇప్పుడు వసుదేవుని కాళ్ళు పట్టుకుని మనలో అప్పుడే ఉదయించిన మనలోని చిన్న కృష్ణుని ,మళ్లీ కంసుని బారిన పడకుండా ,నంద ,యశోదల వద్దకు చేర్చమని,దేవకిలాఅర్ధించకతప్పదు.లోపలి అనుభవం వల్ల ఎంతో ఆనందం,నందుడు ,పరమాత్మకున్న యశస్సును మరువక ఉండేది యశోద.వీరి నుండి ఏమాత్రం పక్కకు కదిలినా ,కంసుడు [అహం ]పంపిన పూతన ,సృష్టిని ఆస్వాదించే దిశగా ప్రోత్సహించ వచ్చు . సృష్టి అంతా పరమాత్మ లీలగా గుర్తించి ,పూతన నుండి రక్షించుకోవాలి . పరమాత్మ కృష్ణావతారం గ్రహించినపుడు వీరిని వధించి ఒక లీలగా దీన్ని మనకు ఉపదేశిస్తున్నారు. మనసులోని వృత్తులు ,వ్రుతాసురునిలా ,గమ్యం నుండి ఎత్తుకు పోవచ్చు .
     అనుక్షణం ,అప్రమత్తంగా లేకుంటే ,జ్ఞానం పేరుతో తమో గుణ లక్షణమైన నిష్క్రియత్వం వైపు మనసును వెళ్ళనీకుండా , గమనించమనే హెచ్చరిక ,శకటాసుర వధ . ఎప్పుడైనా న్యాయాన్యాయాలు ,ధర్మాధర్మాలు అంటూ మనసును [కొంగ]బకాసురుడు పట్టుకు పోవచ్చు . తస్మాత్ జాగ్రత . ఇలా కృష్ణావతారం ఎన్నో విషయాలకు అన్వయం అవుతుంది . ఇదే శ్రీ కృష్ణ జన్మాష్టమి .
          అందువల్ల పొలిమేరను ధర్మం అనే , కంచె వేసి కాపాడుకోక తప్పదు .అదే కదులుతున్న కాలంలో పోలేరమ్మ పూజ .భద్రంగా కాపాడుకున్న పదం ,ఓంకార రూపమైన విఘ్నాధిపతిగా కాపాడి ,అనంత పద్మనాభునితో  అనంతమైన పరతత్వంలో జాగరూకత నిస్తుంది.శరన్నవరాత్రులలో అమ్మ యొక్క అనుగ్రహం అన్ని లౌకిక శక్తులు ఏకమైనా,సాధకుని రక్షిస్తుంది.భూమి నుండి వచ్చిన శరీరం తననే నరకాసుర వధతో ,మోక్ష లక్ష్మి అనుగ్రహిస్తుంది . కర్తృత్వం విడిచి ,కార్తీకం పరమాత్మను సేవించమని ఆదేశిస్తుంది .
           ఇది చాలా జాగ్రత్తగా గమనించ వలసిన విషయం . సాధారణంగా ఇప్పటి కాలంలో అన్ని చోట్ల వినిపించే పదం అంతటా పరమాత్మ ఉన్నాడు,తనలోనుఉన్నాడు ,కనుక దేవాలయంతో పని లేదు .అజ్ఞానం వలన ,కుండలో ప్రతి బింబాన్నే సూర్యుడనుకునే తీరు స్పష్టంగా తెలుస్తున్నది . ఇది బాల్యావస్థ . జ్ఞాని అలా కనిపిస్తున్నా నిజం తెలిసినవాడు . అనుభవ జ్ఞానం లేనివారు బాల్యావస్థను,జ్ఞానవస్థకు అన్వయించడం బాధాకరం .అందుకే జీవాత్మ పరిధిలో ఉన్న సాధకుడు , గురువును ,ఆశ్రయించవలసిందే .మధురలో కరాగారంలోని చిన్ని కృష్ణుడు వసుదేవుడు చేరిస్తేనే ,నంద వ్రజం చేరాడు .
      పరమాత్మ ఆదేశిస్తున్న విధంగా లీలగా చెప్తున్న విషయాలను జాగ్రత్తగా అన్వయించి ,గమనించాలి . జీవాత్మ అనే పరిధిలోని వ్యక్తి ,కారాగారంలో బంధింప బడిన వానితో సమానం . మోహమనే తాళ్ళతో అన్ని సంబంధాలను పెనవేసి కట్టుకుని,దేన్నీ విడిచి పెట్టలేని దీనుడు.ప్రపంచాన్ని,పంచ భుతాత్మకంగా ఎరుగక ,ఎప్పుడూ అంతరంగంలోనికి ప్రవేశించక ,  అన్ని వైపులా వినిపిస్తున్న ,బ్రహ్మ మొక్కటే అనేదాన్ని తనకు తాను అన్వయించు కొని ,శాస్త్రాన్ని ,అది ఆదేశించిన జీవన విధానాన్ని విడిచి ,ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంగా ,దేవాలయం అనేది ,పనిలేని వాళ్ళు వెళ్ళే కేంద్రంగా భావించే వారికి కొదవలేదు .తాము జ్ఞానులు కనుక వీటి అవసరం లేదు అనుకునేవారి సంఖ్య పెరిగింది .
       నిజానికి శాస్త్ర ప్రకారం నిర్మించిన ఆలయాల్లో ,స్వయం వ్యక్త ఆలయాల్లో ఉన్న శక్తి ,సాధారణ ఇంద్రియాలు తెలుసుకో లేవు . తపస్సుతో పునీతమైన మనస్సుకు అందే శాంతి మాత్రమే ,ఇందుకు నిదర్శనం . ఎన్నో అద్భుతాలు కూడా ఎన్నోసార్లు కనువిప్పు కలిగిస్తాయి .చిన్నదైన జీవత్వం ,దైవత్వాన్ని గుర్తించి తన మోహ శృంఖల విముక్తం చెయ్యమని ప్రార్ధించే గుడులు ,భగవత్ కృపకు తార్కాణాలు . ఇంటిలోని పూజా మందిరం ,శాస్త్ర సమ్మతంగా ,ప్రాణ ప్రతిష్ఠ జరిపిన ఆలయం వలె,పురాకృత కర్మను కూడా ధిక్కరించి ,భగవత్ శక్తిని ప్రసరించ లేదు . కానీ ఆ శక్తి ,ఆలయంలోని విగ్రహ రూపుడైన పరమాత్మకు ఉంది .దీనికి  పూర్వ కర్మల పాప ఫలం ఇపుడు పరమాత్మను పొందే సాధనకు అవరోధం కలిగించ కుండా ,చెరువులోని నాచును పక్కకితోసి వస్తు దర్శనం చేసే వీలు కల్పిస్తుంది . సద్వస్తువు పరమాత్మ మాత్రమే . దీన్ని సాధనా సంపత్తిలో చేర్చుకోవాలి .
    శరీర పర్యంతం,జ్ఞాని కూడా ,శాస్త్రోక్త కర్మను విడిచి , తెలియని వారిని వంచింపరాదని ,గీతాచార్యుని శాసనం .కానీ
అనుభవ జ్ఞానం లేకున్నా వంచించే వారిని ఏమనగలం ?కనుక శరీరం సహకరించినంతకాలం ,దేవాలయ సాంప్రదాయాలను గౌరవించడం కర్తవ్యం . ఇదే కార్తికేయుని కర్మ సిద్దాంతం ,కార్తికంలో .ఇలా చూస్తే సంవత్సర కాలం ,విష్ణువుకు ఒక రోజు అనిచూస్తే ఉత్తరాయణం ,పగలు . దక్షిణాయణం రాత్రి . రాత్రి లోని బ్రహ్మ ముహూర్త కాలమే కార్తీకం . ఈ సమయంలో చేసే భక్తి ,కర్మ ,జ్ఞాన మార్గాలు , బ్రాహ్మీ ముహూర్త ఫలాలను అందిస్తాయి .
      అందుకున్న ఫలాలు ,మార్గశీర్ష లోని , శ్రేయో మార్గాన్ని పరిచయం చేస్తాయి . సుబ్రహ్మణ్య షష్టి ,సృష్టి రహస్యాన్ని మనముందుంచి ,మార్గ దర్శనం చేస్తుంది . అందువల్లనే స్వామి దేవసేనాద్యక్షుడు . సంవత్సరంలోని ఆరు ఋతువులు ఆరు ముఖాలు . పన్నెండు చేతులే నెలలు .ఉత్తర ,దక్షిణా యణాలే పాదాలు . కదిలే కాల[ళ]రూపుడే స్వామి . ఇలా కాలం , స్వామి రూపంగా ఆరాధించే వారికి దేవసేన ఆయన శక్తిగా అనుగ్రహించి ,నిరంతరం ప్రాపంచిక జీవనంలో కొట్టుకు పోతున్న వారికి ,దైవీ గుణాలను అందించి ,శ్రేయో మార్గాన్ని వారు అనుసరించేలా అనుగ్రహిస్తుంది . కాలం చైతన్య రూపంగా చూసే వారికి సుబ్రహ్మణ్యుని అంతరంగ శక్తి శ్రీ వల్లిగా ఆశీర్వదిస్తుంది .
       అరుణోదయ సమయమే ధనుర్మాసం . సంధ్యా సమయపాలనగా ,గోమయంతో చేసే గొబ్బెమ్మలతో లక్ష్మీ ఆవాహనం . గృహంలో, లక్ష్మీ నారాయణులకు ,బాల భోగం . అంటే ,కట్టు పొంగలి ,చెక్కరపొంగలి ,దద్ద్యోజనా లను
నివేదించడం . అంటే ఉదయ సంధ్యా సమయంలో చేసే ఈ పూజ సూర్యనారాయణ పూజ .అందువల్లనే మార్గశిర లక్ష్మివారలు గురువు ధనస్సులో ప్రవేశించే మాసంలో వస్తాయి . గురు అనుగ్రహమే నిజానికి లక్ష్మీ కృప . గోదాదేవి , శ్రీరంగ శాయిని పూజించి స్వామిని చేరినది ,ధనుర్మాసంలోనే.  మందంగా ఉన్న కాలం ,కొత్త స్ఫూర్తితో మకరసంక్రమణ పుణ్య కాలంలో,సూర్యుని పూజించి,ప్రత్యక్ష లక్ష్మీ నారాయణ కృపకు పాత్రులను చేస్తుంది . ఇది మెలకువలో అంటే జాగ్రదావస్థలో స్వస్వరూప చైతన్య[సూర్యుడు] దర్శనానికి సూచనగా గ్రహించవచ్చు .
     ధనుస్సు గురువుకు సంబంధించిన రాశి . అంటే ధను సంక్రమణం గురూపదేశం పొందడం గాను ,మకరం శని యొక్క   రాశి . మకరం తనలోని తమస్సును దూరంచేసుకునే సాధనా సమయంగాను భావించి ,భోగి మంటలలో తన తమో గుణాన్ని అలానే అసంపూర్ణ మిధ్యా జ్ఞానాన్ని విడిచి ,సాధనకు ఉదయ సంధ్యను వినియోగించు కోవాలి . ఇదే పౌష్య లక్ష్మి అనుగ్రహం . ఇదే కృషితో ధాన్యలక్ష్మితో బాటు ,అంతరంగ జ్ఞాన లక్ష్మి కృపకు సాధనం .
 

      


  

13, డిసెంబర్ 2013, శుక్రవారం

గోమాత

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః
గోమాత 

            శరీరాలు మూడు ,స్థూల ,సూక్ష్మ,కారణ అని చెప్పబడుతున్నాయి . అమ్మ స్థూల రూపం కన్న తల్లి.సూక్ష్మ
రూపం గోమాత. మనకు దేవతా రూపాలన్నీ,మనసుతో అనుబంధం కలిగినవే. అందరి దేవతా రూపాలను ,తనలో
కలిగి ఉన్నది గోమాత. ఒకప్పుడు రాక్షసుల బారినుండి తప్పించుకునే నేపధ్యంలో అందరు దేవతలు కామ ధేనువు
శరీరాన్ని ఆశ్ర యించారట. అలా గోవు సకల దేవతా రూపమై అనుగ్రహిస్తున్నది. ప్రత్యక్ష రూపంగా మనకు చర్మ
చక్షువుకు కనిపించే సాకార దేవతా రూపం గోమాత.

        ఆలయాలలోను,ఇంటిలోనూ,భగదారాధనకు ఎన్నో నియమాలున్నాయి.కానీ భగవంతుడు గుడిలోనికి వచ్చి
దర్శనం చేసుకోలేని వారికోసం రధంలో ఊరేగింపుకు వచ్చినట్లు,నియమ నిబంధనలతో సంబంధంలేకుండా
అందరిని తరింప చేయాలనే తపనతో భూమి మీద నడయాడే అందరి ఇలవేల్పు గోమాత. కుల వ్యవస్థతో సంబంధం
లేకుండా ఎవరైనా సేవచేసి తరించగల ఒకేఒక రూపం గోవుది. కానీగుడిలోగాని,యజ్ఞాలలోగాని,ఇంటిలోగాని,
ఎక్కడైనా,ఎవరు గానీ,శాస్త్రోక్తంగా ,పూజించాలంటే దానికి గోవే ఆధారం. పంచ గవ్యాలు లేకుండా ఏ విధమైన శుభ
సందర్భమూ సుసంపన్నం కాదు. పూర్వం ఇంటి ముందు ఆవుపేడ కళ్ళాపి[కలిపిన నీళ్ళు]జల్లితే కానీ ఇంటిలో
ఏ పనులు ,ప్రారంభం అయ్యేవికావు. వాకలి తుడిచి ,కళ్ళాపి[కళ్లము =కొంత ప్రదేశము,అప్ =నీరు]అని అర్ధం.

         అంతేకాని అర్ధం పర్ధం లేని ఒక మాట కాదు కళ్ళాపి అంటే. ముగ్గు వేసి ,తరువాత శరీర శౌచం పూర్తి చేసి,
దీపారాధన చేసిగానీ,ఇంట్లో పొయ్యి వెలిగించే వారు కాదు. అలా వెలిగించడం ఇంటికి ఎంతో శుభం. ఇంటి ముందు
ముగ్గు వెయ్యకుండా ,నిప్పు రగిలించడం అంటే అరిష్ట హేతువు. అలా వెలిగిస్తే ఆ ఇంట అశుభం జరిగి నట్లు లెక్క.

           గోమయం అంటే లక్ష్మీ రూపం. ఎలా అంటే, లక్ష్మి గోవు పృష్ట భాగాన్ని ఆశ్రయించింది. ఆవు ముఖ భాగం
పూజార్హమైనది కాదని ,ముందుగా ప్రుష్టాన్నే పూజించాలనే ఐతిహ్యం మనకు తెలిసిందే. అలానే శివుని కూడా
గృహస్తు వెనుక భాగాన నిలబడి పూజిస్తాడు,అభిషేకిస్తాడు. గోవు,శివుని  పరీక్షించి వచ్చిన బ్రహ్మకు, అబద్ధపు
సాక్ష్యానికి గుర్తుగా తల ఆడించిందని,కానీ సత్యాన్ని ప్రతిపాదించేందుకు,పృష్ట భాగాన్ని తోకను కదిపి,తన తప్పును
సవరించుకుందని ఐతిహ్యం. సత్యాన్వేషికి లక్ష్మి ప్రసన్న మౌతుందని గోవు ,చెప్పకనే చెప్పింది.

          గోవు ముఖ భాగంలో శివుడు అధిస్టించి ఉన్నాడు. అందువల్ల ప్రుష్టాన్ని పూజించి నపుడు ,శివుని వెనుక
భాగం పూజించి నట్లౌతుంది. ఇది ఒక అర్ధం. మనం గురువును ,వారి వెనుకగా అనుసరించి వెళతాము. శివుడు
ఆదిగురువు.ఇదొక కారణం. అంతే కాదు ,భూత ,భవిష్యత్ ,వర్తమాన కాలాల్లో ,శివుని భూత కాలానికి ప్రతినిధిగా
మనం భావిస్తాము. అంటే జరిగి పోయిన కాలానికి కూడా ,మనం వెనకే కదా ఉంటాం. ఇదో కారణం. శివుడు భూత
గణాలకే కాదు,మన భూత[జరిగిపోయిన]కాలానికి కూడా అధిపతి. అందువల్లనే పురాకృత పాప పరిహారం కోసం
శివాభిషేకం చేయిస్తారు.

            శ్రీ కృష్ణావతారం లోను స్వామి గోసంరక్షణం చేసి మనకు మార్గ దర్శనం చేశాడు. వెంకటాధిపతి అయి,తనే
గోవును రక్షించి ,దాని బదులు తాను ప్రహారానికి గురి అయ్యాడు. రాధా అంటేనే గోవులను ఎంతో గొప్పగా సంరక్షించ
గలిగేదని ఒక అర్ధమట . అందు వల్ల స్వామికి ప్రాణ సఖి అయిందని ఒక భావం. అంతరార్ధం చూస్తే ,ఇంద్రియాలను
గోవులుగా కూడా ప్రతిపాదించారు. ఎవరు ఇంద్రియాలను నిగ్రహించి స్వామికి మనసు సమర్పిస్తారో వారు పరోక్షంగా
రాధా స్వరూపులే. రాధా కళ్యాణం బాహ్య మైనది కాదు. ఎవరి మనసు ఇంద్రియాతీత మైన పరబ్రహ్మ స్వరూపమైన

అహం స్వరూపంతో అవిభక్తమైఉన్నదో,వారికీ,రాధాకృష్ణ తత్వానికి భేదం ఏమీ లేదు.మానవునికి తనస్వస్వరూపం
పై ఉండే మక్కువ రాధామాధవ అవినాభావ సంబంధమే. కానీ శరీరానికి దీనితో ఎలాంటి సంబంధమూ లేదు.
అందువల్లనే మనిషి తనను తాను ప్రేమించినంత లోతుగా ఎవరినీ ప్రేమించలేడు. కానీ అవగాహనా లోపం వలన
శరీరాన్ని,సంబంధీకుల్ని,తనకు పరిచయమైన,ప్రపంచానికీ అన్వయించుకుంటాడు. ఇదే జగత్తులోని ప్రతి ప్రాణిపై
మాయ కుండే ప్రభావం. దీనిని గ్రహిస్తే చాలు ,నిగ్రహించ బడుతుంది. తెలియకుంటే శరీరంతో పోయి,మళ్లీ శరీరంతో
వస్తుంది.గోవిందుని బాట నడిస్తే ముందుగా ఆవులను రక్షించు కోవడానికి మన ప్రాణాలను పణంగా పెట్టగల
ఆవేదన మనకు ఎంత అవసరమో మనం గుర్తు పట్టాలి.రాను,రాను,గోవులు వృద్ధితో బాటే ఎద్దులు సంఖ్య పెరగడం
సహజం . వాటి పోషణ కష్టమే అనడంలో ,ఏ సందేహం లేదు . దీనికి ,ముసలి ఆవుల నిర్వహణ ,సామాన్య రైతు
భరించలేడు ,అనేది నిజం . వీటిని ,బంజరు భూముల్లో విడిచి ,తగిన రక్షణ కల్పిస్తే ,వాటి బ్రతుకు ,అవి ,బ్రతుకుతాయి .
 కొంత కాలానికి సహజంగానే ,అడవి తయారవుతుంది ,బీడు ఫలవంత మౌతుంది .

              శ్రీ శైలం అడవుల వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి . ఇటువంటి చోట గిరిజనుల సహాయ
సహకారాలతో దీనిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు . ముందుగా గోవుల వృద్ధి దేశ క్షేమానికి , అత్యావశ్యకం అని ,
గుర్తించి ,వీటిని ఆరోగ్య కరంగా పెంచి ,నెయ్యి తయారు చేసినా కలిగే లాభం రైతులకు ఉపాధి రూపంగా అందుతుంది .
పాలుగా వినియోగించడం కంటే ,ఈ పాలను ప్రత్యేకించి నేతికి వాడి ప్రయోజనం సాధించ వచ్చు . ముందుగా దేశవాళి
ఆవులకున్న ప్రత్యేకతను గమనించి ,వీటికి గల సువర్ణ నాడి వలన ,సూర్యుని నుండి పాలలో సువర్ణం చేరడం వలన ,వీటి
పాల పదార్ధాలు ,అత్యంత సూక్ష్క్ష్మంగా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ,ఎన్నో వ్యాధుల నుండి రక్షిస్తాయి . పాలు పలచగా
ఉండడం వలన అమ్మకం అవడం లేదనే వాదాన్ని పక్కకు పెడితే ,నెయ్యి ,ఎరువు రూపంగా, వీటితో సరిపోల్చ గలిగేవి
లేవు .రైతు కనీసం ,5,6,ఈతల తరువాత కూడా ,ఎంతో కొంత ప్రయోజనం ఆశించి ,వీటిని కబేళాలకు అమ్మడం అన్యాయం . పొందిన దానికి సంతృప్తి పొంది ,వీటిని దాన రూపంగా అడవులలో వదిలెయ్యడం ఇప్పటి వ్యవస్థకు న్యాయం . పాలక వ్యవస్థ శ్రద్ధ వహించి ,వీటికి రక్షణ కలిగించడం న్యాయం .

          అలాగే అమ్మను సంతృప్తి పరచడానికి,శ్రీనివాసుడు,కృష్ణావతారం ముగించి,తానై భూమి మీదకు దిగివచ్చి,
అమ్మకోరిక తీర్చిన వైనం మనకు తెలిసిందే. కానీ ఒక్క క్షణం కూడా దానిని కధగా ,కాకుండా మన జీవితానికి ఎలా అన్వయించాలో మనం మరిచాము. అమ్మను సంతృప్తి పరిచే దిశను ఎవరికి వారే నిర్ణయిం చు కోవాలి. కానీ జీవితకాలం మీకోసం శ్రమించారు. ఎలా అంటారా ?పెళ్లి తరువాతి కోరిక,పిల్లలు ఇది మీకు తెలుసు. కానీ పెద్ద వాళ్ళ అభిప్రాయం పిల్లల కోసం పెళ్లి. అందువల్లనే వాళ్ళు కులాచార వ్యవస్థకు పట్టం కడతారు. ఇరువైపులా ఒకే విధమైన ఆచార వ్యవహారాలవల్ల పిల్లలకు,వారిబాట చాలా సుస్పష్టంగా అవగాహన అవుతుంది.పిల్లలకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు. దీనికోసం వారి తపన మీ విషయంలో, మీ స్వాతంత్ర్యం హరించి నట్లుగా మీకు అనిపించ వచ్చు. కానీ నిజానికి ఆ పట్టుదల వెనుక ముందు తరాల బాధ్యత దాగి ఉంది. అది మీరు అంగీకరించినా,లేకున్నా ఇది నిజం. పిల్లలను, కాకులు పెంచినట్లు ఆహారంతో పెంచి వదిలెయ్యడానికి మానవ జన్మ అవసరం లేదు. ఆచంద్రతారార్కం గౌరవ మర్యాదలను కాపాడే బాధ్యతతో కుటుంబపు భావి తరాలను దిద్దే దిశగా సాగేదే పెద్దల ఆలోచనా ధోరణి.

      దీనికి బాధ్యత,పిల్లల పెళ్లి ముందు ప్రారంభం కాదు. బాల్యం నుండి మన కట్టుబాట్లు,జీవన శైలి వారికి,పునాది
కావాలి. ముందుగా అమ్మ మాట వింటే తరువాత దిశా నిర్దేశం దానంతటదే జరుగుతుంది.కానీ నేర్పేందుకు పునాది
ఎవరు వెయ్యాలి ?తప్పక ప్రూనింగ్ చేస్తూ పెంచే మొక్కలా ,అమ్మాయికి ఇష్టం లేకున్నా ,చాలా విషయాలు నేర్పే
బాధ్యత అమ్మాయి తల్లిదే. కానీ అదే సమయంలో ,బోన్సాయ్ మొక్కలా,అమ్మాయి మనసు పెళుసు బారక ముందే
అత్తవారింటికి చేర్చే, నర్సరీ లోని తోటమాలి వంటిదే ,అమ్మాయి తల్లి పాత్ర.

12, డిసెంబర్ 2013, గురువారం

ధరణి


ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః
భూమాత 

            అమ్మ లందరికి అమ్మ.ముగ్గురమ్మల సాకార రూపం ధరణి . చర్మ చక్షువుకు కనిపించే తల్లిదండ్రులు,సూర్య
నారాయణ మూర్తి,భూమాత.శరీరానికి శారీరిక తల్లి,దండ్రులలాగే,జగత్తుకు కనిపించే[కనిపెంచే]తల్లి,దండ్రులు.అందు
 వల్లనే,మనం, నిద్రనుండి లేచిన వెంటనే,భూమిమీద కాలు మోపేముందు,అమ్మను'పాద స్పర్శంక్షమస్వమే'అని
ప్రార్ధిస్తాము.సూర్యోదయానికి ముందు లేచి ,సూర్యునికి కృతజ్ఞతతో ,నమస్కరిస్తాము. మనకు ప్రాణాధారమైన
ఆక్సిజన్ ,శ్రీమన్నారాయణుడైన సూర్యుని నుండి మాత్రమే మనకు లభిస్తుంది. అంటే పోషణ కర్త తండ్రి. కన్నతల్లి
పది మాసాలు మోస్తే ,పుడమి తల్లి పది ,పదులు ,వంద సంవత్సరాలు మోస్తుంది . ఒక్క జన్మకే కాదు ,ఎన్ని జన్మ
లైనా ,అన్ని యుగాల్లోను జగత్తుకు ,వీరే తల్లి దండ్రులు.పుడమి మీది, చరాచర జీవులన్నీ సూర్యుని ఆధారంగానే
జీవిస్తున్నాయి . మళ్లీ వీరియందే లయ మౌతున్నాయి.అందు వల్లనే, పితృ కర్మలో మొదటి తరం భూమికి 'వసు'
రూపం గాను ,దాని పై తరం ఆదిత్యుని యందు ,దాని పై తరం,బ్రహ్మ యందు లయమైనట్లు మనకు మంత్రాల
ద్వారా తెలుస్తుంది.

             శరీరానికున్న మూడు ఉపాధులలో, మనం భూమిని కారణ శరీరంతో పోల్చవచ్చు. జీవికి జన్మకు,కర్మాను
సారం లభించే ఏ శరీరం అయినా కారణ శరీరం మీద ఆధార పడుతుంది.శరీరం ఏదైనా అజ్ఞానమే కారణం. అందువల్ల
నిద్రలోజీవులన్నీ ఉండేది కారణ శరీరంలో మాత్రమే. కానీ తిరిగి జాగ్రదవస్థకు కావలసిన శక్తి మాత్రం,గుణాతీతమైన ,
మాయా స్వరూపమే అయిన,అమ్మ స్వరూపమైన నిద్రనుండి[chargeఅయినట్లు] శక్తిని పొంది ,తిరిగి దానిని తన
గమ్యానికి చేరడానికి మనకు పరమేశ్వరుడు అనుగ్రహించినా,దారి తెలియని పాంధుని వలె మనం,సంసారారణ్యంలో
తిరుగాడు తున్నాము.దారి చూపే దైవరూపం గురు స్వరూపం. వారి చేతిలోని దీపమే జ్ఞానం. వెలుగుకు ఉపాధి
బేధం లేదు. అన్నినెయ్యి,నూనె ,కిరోసిన్,ఇలా ఏ దీపమైనా వెలుగు సమానం. మనం దీపానికున్న బాహ్య ఉపాధి,
బేధాలను,అలాగే దానిని మనకు చూపే గురు స్వరూప ఉపాధి బేధాలను ,చూస్తున్నాము గానీ,నిజానికి వారు
చూపే వెలుగుకు ,ఈ కారణాలను తెరలాగా కళ్ళకడ్డుగా పెట్టుకుని,ఏమీ కనిపించడం లేదని,గురువుపై నింద మోపు
తాము. కానీ ఈ తెరను మాత్రం గురువు గానీ,దైవంగానీ అంత సులభంగా తొలగించరు. వారికి దయలేక కాదు.
ఎన్నోజన్మలలో వారు ఈ విషయంలో సహాయం చేస్తూనే వస్తున్నారు.కానీ మనం దాన్ని గుర్తు పట్టకుండావారిని
కించపరిచే విధానాలను అవలింబిస్తూనే ఉన్నాము. వారి చేతిలో ఉన్న దీపానికి ఆధారం శాస్త్రం. దాని సూచన
మేరకు ఇలా ఉండండి, అని వారు చెప్పినా,వేరేవారేవరికో వారి గురువు అలా చెప్పలేదని,పైకి చెప్పక పోయినా
సందేహం ఎప్పుడు ఏర్పడిందో,అప్పుడే మళ్లీ మీరు ,మీకే తెర వేసుకుంటున్నారు. అందువలన సాధనలో పురో-
భివృద్ధి కుంటుతూ ఉంటుంది. ఎవరెవరి కర్మల ద్వారా వారికి తగిన ఉపాధి పొందినట్లే,వేరైన సాధనా మార్గాలకు
అంతే అవసరం ఉంటుంది. దీనిని గుర్తించి, మారుమాట లేకుండా ,గురు ఉపదేసానుసారం జీవించ వలసిందే.
అమ్మ ఒడి నుండి ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపంగా వెలిగే మార్గం ఇదొక్కటే.

           కారణ శరీరం, స్వరూపమైన నిద్రనుండి శక్తి పొందినట్లు ,జీవులన్నీ భూమాత నుండి ఆహారం పొంది ,శక్తిని
పొందుతున్నాయి. ఓంకార స్వరూపం లోని 'అ ఉ మ'లో మ అనేది కారణ శరీరాన్ని సూచిస్తుంది. ఉ అనేది సూక్ష్మ
శరీరాన్ని సూచిస్తుంది. అ అనేది స్థూల శరీరాన్ని సూచిస్తుంది. అర్ధ మాత్ర పరిపూర్ణ గురు స్వరూపమే. దీని
సహాయం లేకుంటే అసంపూర్ణమే. విలువ తెలిసిన క్షణం ,తెర తొలగుతుంది.

        కృతజ్ఞత. దీనిని పాటించడమే గొప్ప సాధన. దీని మరో రూపమే భక్తి. ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని మీరక
చరించడమే,శ్రద్ధ. ఎన్నో వికల్పాలు మనసును కుదిపినా,మాతృ దేవోభవ,పితృదేవోభవ,ఆచార్య దేవోభవ,అనే
సూత్రాలు, ఇంకా హిందు సమాజంలో మిగిలి ఉన్నందు వల్లనే ,తనపై పడే ఎన్నో దురాచారాలను,దుర్మార్గాలను
ఈసమాజం తట్టుకుని నిలబడుతున్నది. ఇపుడున్న ఈ విపరీత ధోరణులను ,అధిగమిం చాలంటే ఒక్కటే సాధన
అవసరం. అదే కృతజ్ఞతా ఆవిష్కారం. పెద్దలు వారి ప్రతి అనుభవాన్ని,పిల్లలకు కృతజ్ఞత తెలిసేలా,చెయ్యగలిగితే,
అది మనం ఈ సమాజానికి తెలిపే గొప్పకృతజ్ఞతా సూచక మౌతుంది.

         శ్రీ రాముడు ధర్మావతారమై నడయాడినందున,భూమిపై నరునిగా ,మాతృ గర్భం నుండి ఆవిర్భవించి,నరుని
వలెనే కష్ట,నష్టాలను,ధర్మానికి వికల్పం కలగకుండా అధిగమించి,మానవ జీవిత విధానాన్ని ఆవిష్కరించి,ఆదర్శ
మూర్తిగా నిలచిన వైనం మనకు తెలిసిందే.సీతమ్మ తల్లి మాత్రం అయోనిజయై,ఆధ్యాత్మిక పరమైన ఎన్నోఅంశాలను
తన ఆవిర్భావంతోమనకు అందించింది.జీవి కర్మానుసారం,భూమిపై నరునిగావచ్చినాజీవులనుఆవరించే మాయకు
కర్మ బంధం లేకపోవడాన్ని,అమ్మ అయోనిజయై తెలియ చేస్తున్నది. ధర్మాన్ని ఆలంబనగా జీవించేవారికి ఎంతో
సహకారాన్నిస్తుంది. అహంకార వశవర్తి అయిన దశాననునికి [దశేమ్ ద్రియాలు ,బుద్ధి ప్రచోదనంతో కాక,అహము,
మనసును అనుసరించి చరించే వానికి]మృత్యువై ,దైవ శాసనాన్ని నిరూపిస్తుంది. బుద్ధి ప్రచోదనంతో పరమాత్మను
తమ హృదయంలో,ఆవిష్కరించే బుద్ధిశాలికి,మార్గ దర్శనం చేస్తుంది.మాయగా దశాననుకి,మార్గదర్శిగా ఆంజ
నేయునికి,తానే పరబ్రహ్మగా తెలిసినా ,తనలో తాను రమించినా,బాహ్యాచరణలో,కించిత్తు కూడా ధర్మ విరుద్ధంకాని
 జీవనశైలి కలిగిన ,మానవునికి మోక్ష లక్ష్మిగా అనుగ్రహిస్తుంది.

        ఈమె భూ పుత్రిగా తనను తాను ఆవిష్కరించు కున్నది. కారణ శరీరమే మాయకు,పుట్టినిల్లు. కానీ జానకిగా
జనకుని తండ్రిగా స్వీకరించిందేకాని వారికేమి కాదు.ఒక శరీర పర్యంతంగా ఇలా నిరూపించినా,సాధారణ ప్రపంచంలో
మనకంటికి ,కనిపించే దిశగా ఆలోచిస్తే,ఆడపిల్లలు పృధ్వీ రూపమైన తల్లి నుండి ఉద్భవించినా,కన్యదానంతో మెట్టినింటికి
పరిమితమై,తల్లిదండ్రుల గౌరవానికి భంగం వాటిల్లకుండా,ఈ అమ్మాయిని ఎంతబాగా పెంచారనే కీర్తిని ఇవ్వగలరు. మెట్టినింట్లో భర్తను,దశాననునిగా గాని,దశరధ రామునిగా కానీ,నిరూపించడం మనకు తెలిసిందే. సగ భాగమిచ్చిన భర్తకు,మాయగా పరిభ్రమింపజేసినా,తనపై తాను పట్టు సాధించి,ధర్మార్ధ కామ,మోక్షాలకు కారణమైన,సహ ధర్మచారిణిగా,తాను తరిస్తూ,అత్త ,మామ,భర్తలకు సహకారాన్నిచ్చి,కోతుల్లా ఉన్న పిల్లల మనసులకు,మార్గదర్శనం చేసి తరించేలా, ఆడపిల్లలు పుట్టినింట్లో,దిద్దబడతారని ఆశిద్దాం.

11, డిసెంబర్ 2013, బుధవారం

మాతృదేవోభవ

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః
 అమ్మ
మాతృదేవోభవ
            వేదం చెప్పిన ప్రారంభ నమస్కారం అమ్మకి. ఈ మాటకి మొదటి నమస్కారం. ఎందువలన ? తాను సమర్పించబడిన పరమాత్మ తత్వానికి [భర్తకు]రూపమిచ్చి బిడ్డగా అందించేది,గౌరి కనుక. సర్వ శక్తిని సంపూర్ణంగా అందించి ,బిడ్డను తండ్రి వంశానికి వారసునిగా వారి వంశాంకురంగా దిద్ది ,అత్తవారింటి అలవాట్లు కట్టుబాట్లు ఆదరంతో అర్ధం చేసుకుని ,పిల్లలకు అవగాహన కలిగేలా చేయడం,ఎంతో విజ్ఞతకు సంబంధించిన విషయం.ఇది ఎంతో గౌరవం కలిగినపుడే సాధ్యం.అందువల్లనే అన్ని విధాలా తమకన్నా పై స్థాయిలో అమ్మాయి నిచ్చి,వారిని గౌరవించి,అమ్మాయి మనసులో గౌరవాన్ని నింపి అత్తవారింటికి పంపడం తల్లి దండ్రుల బాధ్యత. ఈ విషయంలో ఏ మాత్రం విఘాతం కలిగినా దాని బాధ్యత కన్యాదాతలు తమ కర్తవ్యాన్ని సరిగా పూర్తి చేయ లేకపోయరనడానికి తార్కాణమే. కఠినంగా అనిపించినా పిల్లలకు మనం ఎన్నో విషయాలు నేర్పిస్తాము. అలానే ఎన్నో విషయాలు మనసునును నొప్పించినా నిజాలను వ్రాయాలనే వ్రాస్తున్నాను.
              అమ్మాయిగా అబలగా పుట్టింట్లో ఉన్నా,సబలగా పిల్లలకు తల్లిగా పాత్ర పోషించే అమ్మకు అవగాహన ఎంతో అవసరం.అది తప్పక తనను దిద్దిన తల్లివద్దనే పొందవలసిందే.కానీ ఎప్పుడు సాధ్యం?తల్లి ,అత్తమామలను భర్తను,అనుసరిస్తేనే సాధ్యం.అప్పుడే అమ్మాయి తన జీవితంలో తల్లిగా ఎంతో ఉన్నత స్థానంలో గౌరవించ బడుతుంది. ఎంతగా అత్తవారి విషయాలు అర్ధం అయితే , అంతగా వారి వంశ గౌరవం , పిల్లలకు పరిచయం చెయ్యగలరు. ఇదంతా ట్రాష్,అనిపిస్తోందా?గౌరవం గురించి ఆలోచిస్తే మాత్రం,గౌరవమనేది ప్రాముఖ్యం లేనిది అని ఎవరైనా అనగలరా ? బడికి వెళ్ళిన రోజు నుండి గౌరవమే ప్రమాణంగా ప్రతి వ్యక్తీ పెరుగుతారు. అటువంటిదే కుటుంబ గౌరవం. అలా ఉండదు, అనే అవకాశమే లేదు. అలా కాకపోతే నైతిక విలువలే లేవు. అవి లేనప్పుడు మానవులే కాదు. కుటుంబ వ్యవస్థకు అవసరమూ అర్ధమూ లేదు. ప్రతి వ్యక్తీ,వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం తన బాధ్యతగా అనుకుంటే,ఆ స్థానంలో వ్యక్తిని, నిలిపే కుటుంబపు విలువను అహర్నిశం కాపాడేలా చేసే తల్లికే కదా తొలి నమస్కారం .
               అమ్మ పూర్వ రూపం అమ్మాయి (.అమ్మ+ఐ )ఐ  అనేది  జ్ఞా న బీజం  .అమ్మ అవడానికి అర్హత
కలిగించేది .దానికివేదిక పెళ్లి . ఈ వేదిక వరకు నడిపించే బాధ్యత ఆ అమ్మాయి తల్లిది .దీనికి ఎంతో ఓ ర్పు ,నేర్పు ఉండాలి .అ  ,ఆ ,లు నేర్చిన  వారు ,రాసేతప్పులైనా  ,వాడే భాషలో  తప్పులున్నా,దానికి అక్షరాల తప్పు లేదు .అలాగే  అమ్మాయి తల్లికి ,తన అత్తగారితోఉన్నవిభేదాలతో, ఏమాత్రంఈబాధ్యతతో సంబంధం లేదు .దీనికి ఏంతో విజ్ఞత కావాలి .తన భావాలపట్ల తనకు గట్టినమ్మకం ఉండాలి .
          దీనికి కొంత ఆధ్యాత్మికత తోడు కావాలి.కొద్దిగా పరిశీలి ద్దాం .తన గోత్రం ఇంటి పేరు మార్చుకుని వచ్చిన తనకు ఏదిన్యాయం ?అనే ఆలోచన తప్ప ,తను వచ్చిన ఇంటికి ఏది న్యాయం అని ఆలోచించే శక్తి తన చిన్నవయసుకు , మనసుకు అందదు .కానీ తన భర్త తనకే స్వంతం అనేది ఏ పరిమితులకు లోబడి ఉంటుందో,పరిచయం చేసేవారు ఎవరైతే ఆమె నమ్ముతుంది?ఇద్దరే చెప్పగలవారు.అత్తగారు లేదా తల్లి .అత్తగారైతే స్వార్ధం అనిపిస్తుంది .అమ్మకి మమకారం అడ్డు వస్తుంది.
         కానీ అత్తారిల్లు  అంటే అర్ధం నిజంగా ఏది ?భార్యకు శాస్త్రం అర్ధ భాగం ఇచ్చింది .స్వంతదారు ఎవరు ?అర్ధశరీరం
 కలిగిన తాను భర్తతో కలసి  కుమారుడి రూపంతో పూర్తి రూపం పొందుతుంది .అందుకే మాతృత్వం పూర్ణత్వానికి గుర్తు .
కాబట్టి అత్తారిల్లు అంటే భర్త స్వరూపం .యజమానురాలు అత్తగారు .యజమాని మామగారు .ఇది నివసించే ఇంటి గురించి కాదు .దీన్ని అర్ధం చేసుకోవడం కష్టతరం .
             దీని మూలాన్ని మరిచినందువల్లనే ,కుటుంబవ్యవస్థ ఇబ్బందులపాలయింది .అర్ధమైనా దానికి అనుగుణంగా
 జీవించాలంటే స్వార్ధం సంపూర్ణంగా అడ్డు వస్తుంది .గృహస్థాశ్రమంలో మొదటిగా జయించవలసిన మాయ ఇదే .
ఇందుకు మొదటిగా సహాయ పడవలసిన వ్యక్తి భర్త .సహకరించ వలసినది భార్య .ఎందువల్లనంటే సహకరించాలంటే
 ఓర్పు చాలా అవసరం .పెళ్లి కానంతవరకు తన కుటుంబ వ్యక్తుల సహకారం ఎంత ఉన్నా తాను స్వయం ప్రతిపత్తికల
అమ్మాయిగా తనను ఊహించుకుంటుంది .పెళ్ళైనా అత్తారింటి విషయాలను భర్త చెప్పినప్పుడు ,వినడానిక ఇష్టం వ్యక్తం చెయ్యదు .తన విషయాలను ఎప్పుడూ చెప్పాలనే అమ్మాయి ప్రయత్నంలో ఇద్దరూ ,అసలైన విషయాన్ని విస్మరిస్తారు .
         అదే ఇంటిపేరు ,గోత్రం .అత్తగారు ,మామగారు , ఇవన్నీ కలిపిన దేవాలయం అత్తారిల్లు .అక్కడి ధ్వజస్తంభం 
 కొడుకు ,ఎగిరే కీర్తి పతాక ,కోడలు .ఇదే సర్వోత్తమ భారతీయ కుటుంబం.  దీనికి సహకరించే దిశగా పెద్దలు కొన్ని నియమాలు  ఏర్పరిచారు . దీన్ని ఇప్పుడు చర్చిద్దాం.
          'ఆడపిల్ల' మొదటిపేరు .అర్థం మన దగ్గర ఉండదని .ఉదాహరణకి ఎవరైనా గురుకులవాసం చేస్తే విద్య ప్రధాన  లక్ష్యం అవుతుంది .కానీ జీవిత విధానం వారి కుటుంబ వ్యవహారమే , దానిలో ఏ మార్పు ఉండదు .అలాగే అడపిల్లకి  పుట్టినచోటు గురుకులమే .ఏ ఇంటికి వెళుతుందో అదే తన ఇల్లు .ఏ గురువు తన వారితో,విభేదించే చదువు ఇవ్వరు . 'మాతృదేవోభవ' అని మొదటి నమస్కారం చేసే అమ్మ మీద ఈ బాధ్యత చాలా పెద్దది .కానీ మమకారం ఈవిషయాన్ని కనీసం గుర్తు కూడా రానివ్వదు .దీనివల్ల 80 సం /సంతోషంగా జీవించే ,అత్తారిల్లు తనదని అనిపించదు .దీన్నిగుర్తించిన     మన పెద్దలు ఆడపిల్లల్ని పెంచే విధానంలో ఎంతో వైవిధ్యం చూపించారు .ఎలిమెంటరి స్కూల్ వరకు భాషా పరిచయం చేస్తాం . పై చదువుల్లో భాషను వాడతాం కానీ ,అవే పదాలు కాదు .అలాగే పుట్టింటి విధానాలు బట్టీ పట్టినట్టు ఉంచకుండా అర్థం చేసుకోవాలి .దీంట్లో ఆచార వ్యవహారాలే కాదు ,అంతరంగం ప్రధానం .ఆడపిల్లలకు భావావేశం ఎక్కువ .తన పుట్టింటి వారితో అనుబంధంతో పాటు అత్మభిమానాన్ని ,ఆత్మ గౌరవాన్ని ఆపాదించు కుంటారు  .ఇక్కడే తల్లి సహాయం చాలా అవసరం. తల్లి తనను తాను ఎంతగా దిద్దుకుంటుందో అంతగా తన బిడ్డకు ,మనశాంతిగా జీవించే ఆశ తీర్చగలుగుతుంది . ఇంతకన్నా వేరే ఉపకారం ఏం ఉంటుంది .ఈ సహాయం చేయగలిగిన తల్లికి శతకోటి వందనాలు .
      దీనికి తల్లి చేయవలసిన సాధన పరిశీలిద్దాం .ముందు చూసినట్లు భావావేశాల్ని అదుపులో ఉంచి ,తన ఇల్లు (అత్తారిల్లు ) అందులో సభ్యులందరూ తన ఆత్మ గాను ,వారందరికీ తనే ఆత్మ గాను బ్రతికేనేర్పు పొందాలి .విధివశాత్తు తన పుట్టింటివారు తనకు సారెగా ఈ విషయాలను ఇవ్వలేకున్నా ,తనే తపనతో సాధించాలి .ఇదే తన ఆధ్యాత్మిక జీవితానికి మొదటి సోపానం అవుతుందని ,వెంటనే అర్థం కాదు .కానీ ముమ్మాటికీ ఇది నిజం .ఎలా అంటే బ్రాహ్మణునికి  ఉపనయనం ద్విజన్మ .అలాగే స్త్రీకి వివాహం,ద్విజన్మ.ఎలాయితే సంధ్యా వందనంవారికి నిత్యక్రుత్యమో,అలాగే స్త్రీకి మనసును అత్తారింట్లో లయం చెయ్యడం అంతే అవసరం .ఇదే శాస్త్ర సమ్మతం .అందుకే స్థాళీపాకం (పెళ్లి )లో అమ్మాయి తమ్ముడు పేలాలు వేసే సమయంలో చెప్పేమంత్రాలలో  సోదరి తన  పుట్టింటిని మరుస్తానని చెప్పే మంత్రాలుంటాయని గురు స్థానంలో ఉన్న వారు చెప్తారు .ఇది శాస్త్రంవిధించిన ఆజ్ఞ . దీని ఉల్లంఘనే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పెద్ద ప్రమాదం .ఇందు వల్లనే కుటుంబం విచ్ఛితికి గురవుతోంది .
        ఇంతకు ముందు ప్రస్తావించిన విషయాన్ని చూద్దాం. (అమ్మాయి తన భర్త తనకు మాత్రమే సొంతం ) ఎంత నిజం ?  అత్తగారు  తన కొడుకును పుట్టినప్పటి నుంచి ,తన ప్రాణంగా పెంచారు . ఇలా 26సం /ఊపిరి బిగపట్టి తనను తాను మరచి కొడుకు అభివృద్ధి ధ్యేయం గా జీవితాన్ని ఒక తపస్సుగా,లక్ష్య సాధనలో జీవించారంటే ఆశ్చర్యం ఏం లేదు . అంత వరకూఎందుకు , ఒక లక్ష [లేదా మీ దృష్టి లో మీరు కష్టపడి దాచిన ]మొత్తం ఒక చోట దాచారనుకుందాము . అది కూడా కనీసం ఒక పాతిక సం/ కూడ పెట్టిందని అనుకుందాము , ఎవరివద్దనో .వారు మోసం చేస్తే ,  బాధని ఒకసారి ఊహించండి . గుండె పగలుతుంది .దాన్ని భరిస్తూ జీవించడం కన్నామరణమే మేలనిపిస్తుంది . ఊహకే అందని విషయం .
               అత్తగారి విషయాన్ని ఎవరు అర్ధం చేసుకో గలరు ? అత్తగారి జీవితమంతా కస్టపడి దాచుకున్న నిధి . అంటే వారు వారసత్వంగా, అందుకున్న ఆస్తులకే కాదు ,అనుబంధాలు ,ఆచారాలు , తపనలు ,సంతోషాలు ,సాంప్రదాయాలు ,వీటిని ముందుతరాలకు అందించాలనే తాపత్రయం ,అన్నీ కలిపితే  వరుడు . ఈ లెక్క కట్టలేరు అత్తగారైతే తప్ప . అందుకే శాస్త్రం మగపిల్లవాడు లేని ఇంటి నుంచి కోడలిని తెచ్చుకోడానికి  కొంత సందేహాన్నివెలి బుచ్చింది . కష్టాన్ని అర్ధం చేసుకోగల వారికి చెప్పడంలో అర్ధం ఉంది గాని ,లేకపోతె చెవిటివాని ముందు  శంఖం ఊదినట్లు ఉంటుందని ,వారు ఊహించి ఉండవచ్చు.             
      అందుకే మామగారి  గోత్రం ,ఇంటి పేరు ఉంచే ప్రయత్నం చేసారు . అంతేకాదు లోకమంటే శివ శక్తులే . శక్తి అని అనుకున్నప్పుడు ,ఎవరిదీ ?శక్తి, ఆధారం లేకుండా ఎలా ప్రకటించబడుతుంది ?ఉదాహరణకు గొప్పవిద్వాంసుడు ,వారి ప్రతిభకు వారే కారణం . వారు లేనప్పుడు ప్రతిభ అనేది లేనే లేదు . దీన్ని పరిపూర్ణంగా తెలిసి సహకరించడాన్నే పాతివ్రత్యం అని శాస్త్రం అంటుంది . అందుకే అమ్మవారు మహా పతివ్రత .దీంట్లోసూక్ష్మాన్నిబాగా పరిసీలించిన కొద్దీ మన సంప్రదాయం, మనకీ నిబంధనలన్నీ ఎందుకు విధించిందో అర్ధం అవుతుంది . పైన చూసినట్లు శివుడు శరీరమైతే [అదే] ఇల్లయితే, ఇల్లాలు శివాని . వీరిద్దరి సంపూర్ణ రూపం కొడుకు. అలాగే కూతురు . తమ వంశం నిలుపుకోడానికి కొడుకు .  అమ్మాయిని దానం చేసి తమ కృతజ్ఞతను పరమాత్మకు తెలియ జెయ్యడానికి కూతురు .
         ఎంతో కష్టపడి ఎంతో శోధన చేసి  తన నిధికి  వారసులను తీసుకు రావాలనే ఆకాంక్షతో ,కోడలికి స్వాగతం చెప్పే అత్తగారి కలలకు సాకార రూపం కోడలు . ఎన్నో ఆశలు ఎంతో ఆలోచన ఎంత సతమతమో ?తనకొడుకును పుట్టినప్పటి నుంచి తమకు కావలసినట్లు పెంచడంలో గొప్పేముంది ?భర్తకు అనుకూలంగా కోడలిని మలచడంలోనే నిజమైన కళ ఉంది . ఇందుకు సహకరించి ,తనను తాను, అత్తవారింటి కీర్తికి ఎటువంటి లోపము కలగకుండా ప్రవర్తించే నేర్పును, ఇచ్చి పంపే వియ్యాలవారి అణకువకు కాదా జోహార్లు ?దీని విషయమై కోడలి సర్దుబాటు  వ్యవహారానికి సహకరిస్తూఉన్న, అత్తగారికి దొరికే ప్రశంస [అత్తగారు సాధిం చింది]అంటే కోడలిని తమ కుటుంబానికి కావలిసినట్లు మలిచిందని . కానీ తెలియక పోవడం వలన ఈ పదానికి అర్ధం మారిపోయింది .
               ఒకసారి ఈ ఉదాహరణ చూద్దాం .పెళ్ళికూతురు తన కంటే పెద్దఅన్నయ్య ఉంటే , తన తల్లికి , తండ్రికి,తనతోను , సంబంధం ఉండకూడదని వదిన అన్నప్పుడు తెలిసిన బాధ ,గుర్తు రావాలి .   20/సం మీకుటుంబం   ఒకే ఆత్మ ,శరీరాలు వేరు. ఇది అమ్మాయి అనుభవం .కానీ కొడుకు పెళ్లి ఐతే ఒక వింత మార్పు.ఒక తాళి తో అబ్బాయికి ఇంటితో సంబంధం తీరిపోతే ఇంక అమ్మాయికి,అబ్బాయికి తేడాఏముంది?అమ్మాయిని దానం చేస్తారు .కానీ అజమాయిషి వాళ్ళదే ఉండాలంటే ఇంక కన్యదానానికి అర్ధం ఉందా ?తమ గోత్రం ,పేరు నిలబెట్టాలని 25/సం .ప్రాణాలన్నీ ఏకం చేసిన ప్రాణాలకు ,ఊరడించాల్సింన బాధ్యత కొడుక్కి లేదా ? దానికి సహకరించాల్సిన అవసరం కోడలికి  100%ఉందని భావించడం తప్పా? పెళ్ళికి ముందు ఇవన్నీ మాట్లాడాలని ఇరు వర్గాలవారు అనుకోరు .ఎందువల్లనంటే ఇది హిందూ సాంప్రదాయంలో సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే,కానీపెళ్లి కాగానే అంతా వాళ్ళఅమ్మాయి అజమాయిషీలో ఉండాలనే డిమాండ్ సర్వసాధారణం.  ఎంతవరకు సమంజసం?ఇందుకే వేరు కాపరం .అక్కడ అంతా అమ్మాయి తల్లి, తండ్రులదే.ఎందువల్లనంటే అమ్మయికి వాళ్ళ కుటుంబంతో మాత్రమే అనుబంధం ఉంది .అత్తగారంటే  కొత్త గౌరవం,భయం ఇదే మహామంత్రం .ఇప్పుడే అబ్బాయి బాధ్యత మొదలైంది .
    తన ఊహల జీవితానికి ఎక్కడ హాని జరుగుతుందోనని,భయంతో నెమ్మదిగా తన కుటుంబం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు దీన్ని తన ధోరణిలో తాను ఉన్న అమ్మాయి పెద్దగా పట్టించుకోదు .ఎంతసేపు తను ,తన కుటుంబం , తన స్నేహితులు ఇదే ధోరణి .అమ్మాయి చెప్పేదాన్ని వింటూ వింటూ నెమ్మదిగా అదే తన కుటుంబంగా, అతని మనస్సు, మారిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏంఉంది ?ఆరు నెలలు సహవాసంతో వారు వీరౌతారు, అన్నసామెతగా ఇందులో విశేషం ఏం లేదు .ఇది పూర్తిగా అమ్మాయి ,వాళ్ళ కుటుంబంవారు ,మా అల్లుడంత గొప్ప వ్యక్తి ఎవరూ లేరనేసరికి అబ్బాయి  పొంగి పోతాడు.కానీ తన తల్లి ,తండ్రి వీళ్ళ మాటేమిటి? అందుకే నీ అంతటి వాళ్ళుండరు అని వధువు తరఫు వారు ఎవరన్నా ,అంతటి స్థానాన్ని, తన కిచ్చిన,తల్లి ,తండ్రి ,తాత ,బామ్మ ,పెదతండ్రి ,పిన తండ్రి ఇలా వారి కుటుంబ సభ్యుల తోడ్పాటును వారికితెలియజేస్తూ , తన అహం అనేదాన్ని,కుటుంబ గౌరవం కన్నా మిన్నగా చూపే ప్రయత్నానికి అడ్డుకట్ట వేసి ,దాని తరువాతే తను, అని ఎంతో గర్వంగా అబ్బాయి తనవిషయం చెప్పినపుడు కదా,తల్లి,తండ్రులఋణం తీరేది.ఇది అతని ధృఢ అభిప్రాయంగాఉంటేనే ,భార్య ఆమె,కుటుంబం దాన్నిపట్టించు కుంటుంది .అతన్నిపొగిడితే ఆనందంగాఆస్వాదిస్తే ,అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
                  సృష్టిలో ద్వైతం సహజం.అంతే సహజం ఒకటి చిన్నది,పెద్దది ,అనే బేధం . వ్యక్తి కంటే అతని కుటుంబం యొక్క ఉనికి చాలా పెద్దది .స్వార్ధంతో తన కన్నా కుటుంబం చిన్నది,అనే దాన్ని ఒప్పుకుంటే ,పూర్వికులను, గోత్రాన్ని, కించపరచడమే.
                ఇక్కడ మరో చిన్న విషయాన్ని గుర్తించాలి .ఇదే సమయంలో, తల్లి తరఫు బంధువులను వరుడు,వీలైనంత వరకు ప్రస్తావించకపోవడమే మంచిది.అమ్మకు కూడాగోత్రాన్ని,ప్రసాదించిన తన కుటుంబపు విలువలను కాపాడడంలో,ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పుట్టినప్పటినుంచి కుమారుడినే,తమప్రతిష్టగాప్రతిష్టించుకున్న,అతనికుటుంబానికి ,నిస్సందేహంగా ఇదే న్యాయం .
               మన శాస్త్ర ప్రకారం కుటుంబ యజమాని గోత్రం భార్యకు ,పిల్లలకు,కోడలికి ,కొడుకు పిల్లలకు చెందుతుంది. అందులో ఆడపిల్లలకు మామగారి గోత్రం పెళ్ళిలో సంక్రమిస్తుంది.అలా అందరికి గోత్రం వర్తిస్తుంది. అందువల్ల మగపిల్లలు భార్య ,పిల్లలతో ఒక గోత్రానికి వారసులౌతున్నారు. ఇలా స్త్రీ తన భర్త ద్వారా ఒక గోత్రాన్ని పొందిన క్షణం నుండి,దాని వారసత్వం పొందడం వలన తనకుటుంబంగా, వారికి పెద్ద గీతను గీసే మొదటి బాధ్యతను చేపడుతుంది.దీనికి అమ్మాయి ఎంతగా అంకితమౌతుందో, దాని వలన కుల మంతా,ఆమెకు బ్రహ్మరధం పడుతుంది. 20సం/వయసులో సహజంగా గౌరవం అనేదానికి అమ్మాయి చాలా ప్రాముఖ్యత నిస్తుంది .నిజానికి తమకు దగ్గరగా కోడలిని కలుపుకునే దిశలో వాళ్ళ కుటుంబ విషయాలు ఇంట్లో అందరూ మాట్లాడుతూ,తమకు చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అది అమ్మాయి యింట్లో కలసిపోవడానికే, పరిమిత మవాలని సూచన చేసేవారులేక, కోడలికి అయోమయావస్థలో,అవసరం లేకున్నా పుట్టింటి విషయాలు గర్వంగా చెప్పడంలో ఎవరినైనా నొప్పిస్తున్నానా, అనేదాన్నిగమనించకపోవడంవలన, ఇంట్లోఅసంతృప్తిప్రారంభ మౌతుంది. ఈ సమయంలో భర్త తన కర్తవ్యాన్ని పాటించి, తమ కుటుంబానికి గౌరవాన్నిపెంచే దిశగా భార్యను ప్రోత్సహిస్తూ, 'కోడలు'అనే పదవికి,ఎంతోప్రాధాన్యత ఉందని తెలియజేస్తూ ,క్రమంగా అమ్మాయి తమ కుటుంబానికి, పెద్ద గీత స్వయంగా గీసేలా తప్పక,సహాయంచెయ్యాలి.ఇక్కడే భర్త కీలకమైన,తన కుటుంబ పరువు,ప్రతిష్టలను కాపాడుకోవలసిన బాధ్యతను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు.ఈ విషయంలో వరుని తల్లిదండ్రులు నిస్సహాయులు.తమంత తాముగా తమ గౌరవాన్ని కాపాడుకోలేరు.జన్మనిచ్చి,సంఘంలోఒకవ్యక్తిగా నిలబడే సామర్ధ్యాన్నిచ్చితల్లితండ్రులుతనను,నిలబెట్టినట్లే,కోడలి దృష్టిలోవారికి వారికి సముచితస్థానాన్నియివ్వడం అనేదాన్ని భర్త తప్పక,అర్ధంఅయ్యేలా చెయ్యాలి.భార్యతన కుటుంబ విషయాలు చెప్పేసమయంలో తప్పక,పుట్టింటికన్నాఅత్తవారింటిని మిన్నగామాట్లాడే అలవాటు పెంచుకోవడంలోనే,ఆకుటుంబపు అనందం దాగి ఉంది.నిజానికి ఆలోచనావిధానాన్ని, వ్యక్తిత్వాన్ని సంరక్షిచుకునిఅమ్మాయి తన విషయాలను చెప్పేబదులు ,అదే సమయంలో పూర్తిగా భర్తకు నచ్చేవిధంగా ,చాలా సంతోషంగా అతని కుటుంబ విషయాలను ఆకళింపు  చేసుకోవచ్చు.
           ఇందుకు ఆమె పుట్టింటివారి సహాయం చాలా అవసరం .అందుకు మొదటినుండి చాలా జాగ్రత్తగా మన సాంప్రదాయాన్ని గమనించి , దాని సూచనలను పాటించిన పెద్దల సలహా ,సంప్రదింపులతో అవగాహన పెంచుకోవాలి .ముందు ప్రస్తావించిన  విధంగా తాము,తమ అమ్మాయికి,చిన్నప్పటినుంచే ఎదుటివారు చెప్పేదాన్నివినే నేర్పు పెంచాలి .చెప్పిన విషయాలను బాగా అర్ధం చేసుకుని,ఎదుటివారినిప్రోత్సహించి మాట్లాడేలా అలవాటు చెయ్యాలి.అలవాటైతే ఇందులోఉన్నసంతృప్తి ఎందులోనూ ఉండదని తెలుస్తుంది.ఇదిచిన్నప్పటినుంచి అమ్మాయికి అలవాటైతే,చేసే కన్యదానానికి అర్ధం ,పరమార్థం ఉంటుంది దీనికి తోడుగా పెళ్ళయ్యాక వీలున్నంతవరకు వారిలోని  నచ్చిన, వియ్యాలవారి విషయాలను అమ్మాయికి గుర్తించి  చెప్తుండాలి .కానీ ఎక్కువగా విమర్శించే వారి వల్లనే ఎక్కువ అనర్ధాలు జరుగుతున్నాయి .మనం  కుటుంబంలో , సమాజంలో, ఎంతో మందితో ఎన్నో విషయాల్లో సర్డుకుపోతుంటాము  .కానీ వియ్యాలవారి గురించి నాలుగు మంచి మాటలు అమ్మయికి చెప్పడంలో పెద్ద ఇష్టం చూపించము  .దీనికి చాలా నేర్పు కావాలి .దీనికే  పెద్దలు కూడా సహకరించాలి .ముందు తరంలోఎంతో విలువను,వరుని కుటుంబానికి ఇచ్చిన విషయం ,అందరికీ తెలిసిందే .అక్కడక్కడ ఇబ్బందులు పడినవారున్నా ఇంచుమించు చాలా శాతం వివాహాలు నిలబడ్డాయి .మనందరం అ కోవకి చెందినవారమే.దీనికి వెరచి చిన్న చిన్నవిషయాలను విషయాలను పెద్దవి కాకుండా ,చూసుకోవాలి .ఇంతకీ కారణం చిన్న అహంకారం.
        నిజానికి అబ్బాయికి మామగారు కాళ్ళు కడిగినపుడే తెలుసుకోవలసిన విషయం ఇదే .అందువల్లనే మన పెద్దవాళ్ళు అమ్మాయిని తమ కన్నా ఉన్నతమైన చోట ఇవ్వాలంటారు .ఆర్దికంగానే కాక సామ్ప్రదాయల్లోకూడా వారికి పెద్ద పీట వేసి అమ్మాయికి అర్ధం అయ్యేలా చెయ్యాలి.సంపూర్ణంగా అమ్మాయి వారిని గౌరవించాలంటే పెద్దల  సహకారం చాలా అవసరం.
        అత్తగారు  గౌరవంకన్నా మిన్నగా దేన్నీ లక్ష్యపెట్టరు .దాన్ని సంపూర్ణంగా అందించగలిగితే  మిగిలినవన్నీ పెద్దవిషయాలు కావు.సాంప్రదాయం తెలిసినవారికి .మనకన్నా వారు పైవారన్న విషయం దీంట్లో ఋజువౌతుంది. కానీ వారిని గౌరవించే  విషయంలో మన వెనకడుగు ,మనకీ  ,మన అమ్మాయికి  వారింట్లో సరిఅయిన స్థానాన్ని యివ్వలేదు .అలానే అమ్మాయి తన అత్తవారింటి గౌరవాన్ని ,తన గౌరవంగా భావించాలే కానీ తన ఆత్మాభిమానం ఆత్మ గౌరవంఅంటూ తనని తాను తన పరిధిలో బంధించుకోకూడదు .నిజంగా ఇది మహాయజ్ఞం .దీనికి భంగం కలగడమే,దక్షయజ్ఞం. వియ్యాలవారి కన్నా తాము గొప్ప వారమన్న భావనను, ఏ అబ్బాయి కుటుంబం స్వీకరించలేదు .చాలాభాగం విభేదాలకు ఇటువంటివే కారణాలు .ఇప్పటి వరకు చర్చించినట్లు ఆడపిల్లను మనం పెంచాం, కానీ మనపిల్లకాదు ..ఇది అమ్మాయి పుట్టినప్పటినుంచి  పూర్తిగా మన స్ఫురణలో ఉండవలసిన విషయం   ఎందుకంటే మన గోత్రం పేరు ఎటూ ఇవ్వలేము . వీటిగౌరవం  శాస్త్రం ప్రకారం వాటిదే .
                     మనం హిందువులుగా గౌరవించబడుతున్నామంటే దానికి మన శాస్త్రాలే కారణం . మనకి పూర్తిగా వేదాలే మూలం .శాస్త్రాల అవగాహన లేక అంతా చెత్త అని అజ్ఞుడనవచ్చు .కానీ విజ్ఞుడన వచ్చా ? తెలియని విషయాన్ని తెలుసుకోవలే తప్ప వివాదాస్పదంగా మాట్లాడడం విజ్ఞుల లక్షణం కాదు . 5 చాక్లెట్లు చూపించి 5అనే అంకెను నేర్పించినoత మాత్రాన ,5అంటే చాక్లేట్లేనా ?ఇది ఎంత హాస్యాస్పదమో శాస్త్రం తెలియకుండా మాట్లాడ్డం కూడా అంతే .మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఇతరుల ఇంట్లో మన పిల్లను ఇచ్చేటప్పుడైనా సరిఐన విధానం ఉండాలి కదా .100రూ /లాటరీ టికెట్టు కొంటే వచ్చే డబ్బు కాదు, కదా అత్తారిల్లoటే.ఆడపిల్లను పరాయి పిల్లగా పెంచమన్న శాస్త్రం ,మగ పిల్లవాణ్ణి తమ గోత్రానికి ,ఇంటి పేరుకి వారసుణ్ణి చెయ్యమంది .దాన్ని కూడా తు .చ .తప్పకుండా పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉంది .
            వేరే ఇంటికి పంపేబాధ్యతతో,మనం ప్రవర్తించినట్లే తమఇంటికి ఆహ్వానించే వారికీ దానికి రెట్టింపు బాధ్యతలు    ఉంటాయి.  వధువు 80సం /తమతో ఉండాలని తమ వంశం తారా చంద్రు లున్నంత కాలం నిలబడాలనే వారి తాపత్రయాన్నిగమనించి ,వారికీ తోడ్పడాలనే సదుద్దేశం వారికీ సహాయపడాలంటే,  విధానాలు ఎలా ఉండాలో ఒకసారి అందరం అలోచించాలి .
       దక్షయజ్ఞ్యం, అనగానే సతీ దేవి విషయాలను మనకు కావలసిన పరిధికి మించి ఆలోచిస్తాము .కానీ మనకోసమైతేఅంతలోతు వరకూ తీసుకోకుండా ఆలోచిస్తే సరిపోతుంది .అమ్మాయి పూర్తిగా అత్తగారింట్లో మమైకమయ్యేలాచూసే బాధ్యత పుట్టింటివారిదే .పూర్వం అప్పుడప్పుడూ చూసివస్తూ ,తీసుకువస్తూ అమ్మాయి బెంగ పడకుండాచూసేవారు .అందరితో కలసి ఉండడం వల్ల అందరికీ చేరువయ్యేవారు .ఇప్పుడు అబ్బాయి వేరే ఉంటేనే పిల్లనిస్తారు .ఈవిషయం పెద్దగా బయట పెట్టరు .ఇప్పుడు 12గం /సెల్ ఫోన్లో భర్తగానీ ,అమ్మాయి కుటుంబం గాని కాలక్షేపం చేస్తూ ఉంటారు .అందువల్ల అమ్మాయికి అత్తవారింటి పరిచయమే లేదు .ఇంక వారి తరుఫున మాట్లాడాల్సినఅవసరమే లేదు .మనం నిజంగా మనమ్మాయి నిచ్చామా ?ఇచ్చినా న్యాయం చేస్తున్నామా ? నిజానికి అబ్బాయి కుటుంబం తో మనకేమీ పనిలేదు .వాళ్ళ ఆస్తులు ,అబ్బాయి కావాలి .కుటుంబపు కట్టుబాట్ల వల్ల మంచి వాతావరణంలో పెరిగిన మంచి వరుడు కావాలి .మళ్ళి ఇవేమీ లేని అనాధ కాకూడదు .మళ్లీ ఆ ఇంటి కట్టుబాట్లు అమ్మాయికి ఉండకూడదు .ఇదేం న్యాయం ?నిజానికి వాటిని ఆచరించడం వల్లనే మీకు మంచి వరుడు లభించాడు ఈ గౌరవం తోనే మనం అమ్మాయిని వారికి చేరువయ్యేలా పూర్తిగా సహకరించాలి .అమ్మాయిని పలకరించండి,అంతేగాని వారికి దూరం చెయ్యకండి.12గం,ఫోన్లో మాట్లాడినా,అమ్మాయికి,అసంతృప్తిగా అనిపిస్తున్న విషయాలను ,తెలుసుకుని ,వాటిని సాదరంగా అర్ధం చేసుకునే నేర్పును ఆమెకు యివ్వ గలగాలి .అత్తవారింట్లో,కోడలిని తమతో కలుపుకోవాలనే ,తాపత్రయంలో వారి కట్టుబాట్లు ,తెలియజెయ్యడంలో,కొత్త కావడంలో,అమ్మాయికి చాదస్తంగా అనిపించవచ్చు. దీనిఆధారంగా, అమ్మాయితల్లిదంద్రులుకుడా,ఖంగారుపడిపోయి, ఇంకోనాలుగు మాటలు అనేస్తుంటే అన్నీ సమస్యలుగానే అనిపించడం సహజం .కానీ చిక్కుపడిన దారాన్ని విప్పినట్లు ,నెమ్మదిగా అత్తవారి ఆరాటాన్ని జాగ్రత్తగా అర్ధం అయ్యేలా చేసే బాధ్యత అమ్మాయి తల్లి దండ్రులదే .ఎందువలన అంటే దత్తత తీసుకున్న బిడ్డను ,తమ బిడ్డగా స్వంతం చేసుకోవాలనే తాపత్రయం వంటిదే,అత్తగారు తమ కోడలిని తమతో కలుపుకోవాలను కోవడం.ఎంతో ఖంగారు సహజం మనస్ఫూర్తిగా ఆఇంటికిఅమ్మాయి అతుక్కునేలా చేసే ,నేర్పున్నతల్లి తండ్రులు ధన్యులు .అత్తవారి తరఫు వకాల్తా తీసుకుని, వారి విషయాలను ఆమెకు అర్ధం అయ్యేలా చెయ్య గలిగితే ,ఇరు వంశాలు తరిస్తాయి .ఇంతవరకు వస్తే కాళ్ళు కడిగిన వారికి ,అల్లుడితో విభేదం ఏం లేదుగా అహంకరించడానికి .కానీ మనకు ఇది చూచాయగా దక్ష యజ్ఞం గుర్తు చేస్తుంది .కానీ కష్టం కూడా యజ్ఞం అంతఉంది .
                  నిజానికి ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి అమ్మాయి తల్లి తన అత్తగారితో వ్యవహరించే తీరు పిల్లలమీద చాలా ప్రభావం చూపుతుంది .  అత్తగారంటే కోడలికి పసుపు ,కుంకుమ ఇచ్చిన గౌరి కాదా ? ఒక ముత్తయిదువను గౌరీదేవిగా ఆరాధించే మనం ఈ విషయాన్ని విస్మరిస్తున్నాం . బొట్టు పెట్టి పిలిస్తే మన ఇంటికి వచ్చిన ఇల్లాలికి ఇచ్చే మర్యాద అయినా పాటిస్తున్నమా ?వారికి మనం ప్రీతితో అన్నీ ఇస్తాం . కానీ అత్తగారికి తప్పనిసరి కాబట్టి ఇస్తాం . మనింటికి పిలిచినవారికే ఇంత మర్యాద అయితే ,కొడుకును ప్రాణంగా పెంచిన అత్తగారికి ఏమిస్తే ఋణం తీరుతుంది ?భార్యకు  బ్రతుకే తానైన భర్తను ఎంతో ముచ్చటగా పెంచి వధువుకు భాగస్వామిగా చేసిన వారికి ఇచ్చే ప్రాధాన్యం ఇంతేనా ?ఆలోచించండి .
               పెళ్లికి ముందు   గౌరీ పూజలో అంతరార్ధం ఇదే . పెళ్ళికి ముందుగా అత్తగారిని గౌరవించడం నేర్పాము అనిఅర్ధం . బొట్టు మాత్రం పెట్టి పంపే ముత్తైదువగా కాకుండాఎంతో ఇష్టం గా భావన పెంచుకోవాలని సూచన . పైన అనుకుంటూ వచ్చినట్లు దీన్ని ఎంతగా సాధన చేస్తే అంత గొప్ప తపస్సుగా భావించవచ్చు . 
                అత్తగారికి కావలసింది గౌరవమేగాని ఆవిడ పట్ల బాధ్యత కాదు . కానీ దీనికి వ్యతిరేకంగా,కోడలు ఆవిడ బాధ్యత తనదని, ఆవిడతనను గౌరవించాలని అనుకుంటారు . నిర్ద్వందంగా వీరు ఈ విషయాన్నిస్వంత ఆలోచనతో, పుట్టింటిలో  వారికున్న పరిజ్ఞానంతో భావిస్తారేగాని నిజాన్ని కాదు .  ఎలాగంటే అమ్మాయి  నాన్నమ్మ, తాతగారి వృద్ధాప్యంలో,తల్లి,తండ్రివారిబాధ్యత వహించడంఅమ్మాయికి తెలుసు.అదే సమయంలో తాము కన్నవారి కోసంవారి  తల్లిదండ్రుల తపన ఎంతోవారికి  తెలుసు .  అదే తపన వారి తల్లిదండ్రులకు కావాలి . అంతే కానీ బిక్ష కాదు . నిజానికి బాధ్యతంటే,తమ పిల్లల పట్ల ఏ విధమైన ప్రీతి ఉందో, అదే విధమైన తాపత్రయం తమపట్ల కలిగి ఉండాలని తల్లి దండ్రులు ఆశిస్తారు. ఏది ఇచ్చారో దాన్నే పొందాలను కుంటే అది ,విచిత్రమేమి కాదు.  పెద్దల పట్ల,ఇష్టం మైనస్  అయింది .  ఏతరం దీన్ని గుర్తు పడుతుందో తరువాత తరానికి అందించగలుగుతుంది .
             మన కొక సంప్రదాయం ఉంది . అమ్మాయిని కాపురానికి పంపేటపుడు ,కొంగుకు పసుపు ముడి వేసి పంపుతారు . ఒడి కట్టులో బియ్యము ,పెసర పప్పు ,కంద పిలక ,వేసి కట్టి దాన్ని నడుముకు కట్టి ,అత్తవారింట ప్రవేశ పెడతారు . దీని అంతరార్ధం ఇలా అనుకోవచ్చు .అమ్మాయి అహాన్ని ,అది ఏదైనా, అందమైన దాన్నని కానీ ,చదువుకున్న దాన్నని గాని , బాగా సంస్కారమున్న ఇంటికి చెందిన దాన్నని కానీ ,బాగా సంపద కల ఇంటి నుండి వచ్చానని కానీ,చాలా పెద్ద కుటుంబానికి చెందిన దాన్ననికానీ,ఇలా ఏ అహమైనా,అత్తవారింట్లోవారు తనకు ప్రసాదించిన ,గోత్రము ,కుటుంబము,భర్త , 'మాతృదేవో భవ 'అని కీర్తింప బడే వ్యవస్థ,ప్రసాదించే అమూల్యమైనఅవకాశాన్ని,అహంతో పోగొట్టుకోవద్దనే సూచన,ఆమె తెచ్చిన కొంగున కట్టిన పసుపు మూట [అహం]విప్పి,[గుమ్మం బయటే వదిలి]ముఖ ద్వారానికి రాసి ,తరువాత సత్య నారాయణ వ్రతం ,మిగిలిన కార్యక్రమాలుజరిపిస్తారు,లేదా కాపురానికి పంపినపుడైనా,ఇలా చేస్తారు .అహాన్ని కాపాడుకోవాలనే తాపత్రయాన్నివిడిస్తేనే,అంతరంగం అందరినీ తనవారిగా స్వీకరిస్తుంది.బియ్యం ఇవి చంద్రుడికి గుర్తు.చంద్రుడు మనసుకు గుర్తు .పెసర పప్పు భుధ గ్రహానికి ,బుద్ధికి గుర్తు . అంటే బుద్ధిని,మనసుని అత్తవారింటికి కావలసినట్లు మలచుకోవడ మనేదే ,ఈ రెంటిని కలిపి కట్టే మూటకు ఆధారం.అంతేకాదు అమ్మగా,అన్నపూర్ణ కూడా . కంద దుంప . పైకి కనిపించే కుటుంబ వ్యక్తులు కాదు ,ఆధారమైన వ్యవస్థకు ఇచ్చేగౌరవం దీనికి ఆధారం .పై,పై మొక్కలు రాలి పోయినా ,ఆధారమైన దుంప నుండి మళ్లీ చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. బలమైన కుటుంబ వ్యవస్థను కాపాడు కోవలనేదే దీనిలోని తపన . ఇలా ఏ ఆచారామైనా అంతరార్ధం ,అసాధారణమైంది .
            పెళ్లికి ముందు   గౌరీ పూజలో అంతరార్ధం ఇదే . పెళ్ళికి ముందుగా అత్తగారిని గౌరవించడం నేర్పాము అనిఅర్ధం . బొట్టు మాత్రం పెట్టి పంపే ముత్తైదువగా కాకుండాఎంతో ఇష్టం గా భావన పెంచుకోవాలని సూచన . పైన అనుకుంటూ వచ్చినట్లు దీన్ని ఎంతగా సాధన చేస్తే అంత గొప్ప తపస్సుగా భావించవచ్చు .
               ఇది పెద్దలు చెప్పగా నేను విన్నాను . ఏమిటంటే ఒక ముని వచ్చి బిక్ష కోరినప్పుడు ,తన భర్త భోజనం అయిన తరువాత ఆమె తీసుకు రావడం వలన ఆ మునికి కోపం వస్తుంది . అప్పుడా మునితో నీవు కోపంగాచూస్తే పడిపోయే కొంగను కాదు అని యిల్లాలు అంటుoది.ముని ప్రాధేయపడగా తనకు ఆ శక్తి,కళ్ళు లేని తనఅత్తగారిని సంతృప్తి పరచే తపన వల్ల ,ఆమె సంతోషంగా ఉండడానికి చేసిన ప్రయత్నంలో తనకు ఆ శక్తి వచ్చిందని చెప్తుంది. ఎంతో ఎడ్వాన్సు అయిపోయిన మన లాజిక్ కు ఇది అందదు . కానీ దృష్టి సూక్షమైన కొలదీ ఎన్నో  అధ్బుతాలు జరుగుతాయి . సిద్దు లన్నీ ఇటువంటివే .కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాం అంటే కష్టమే . కరెంటు వంటివెన్నో ఉదాహరణలు . మనవరకు రావాలంటే చాలా వ్యవస్థ కావాలి . ఈ విషయం చూస్తే,, అదే అందరినీ అర్ధం చేసుకొనే నేర్పు ,ఓర్పు ఆడవారికి తప్పనిసరి .   ఇందాకటి కధలో ముని కౌశికుడు . ఆ ఇల్లాలు అతడిని ధర్మవ్యాధుడనే మాంస వర్తకుని ఇంటికి ధర్మం తెలుసుకోమని  పంపుతుంది .
              మన విషయానికొస్తే మనమ్మాయి పెళ్లి నాటికీ అత్తగారికి కనీసం 45సం /ఉంటాయి . ఆమె ఎంతో మంది  అత్తా -కోడళ్ళను చూసి ఉంటారు . వారందరి చేదు అనుభవాల నీడ తమజోలికి రాకుడదని చాలా ప్రయత్నంలో ఉంటారు . ఎన్నో భయాలు కూడా సహజం . కానీ ఈ సమాజం దాన్ని గుర్తించదు . కానీ ఈభయాన్ని అత్తగారు బయట పెట్టలేరు . దీన్ని వదిలించగల శక్తి వియ్యాలవారికి మాత్రమే ఉంది .అమ్మాయి కి అమ్మనే అత్తగారిలో చూపించగలగాలి . అమ్మలో ఉన్న అనేక కోణాలు నచ్చినా నచ్చకపోయినా కూతురికి అమ్మ ,అమ్మే . అలాగే పూర్తిగా అమ్మలా అత్తగారిని అర్ధం చేసుకొనేలా చెయ్యాలి .కానీ అత్తగారంటే పెద్దపులిలా భయపెట్టడం ఈసమాజనికి అలవాటైపోయింది . వారి వయసుని బట్టి అత్తగారు మరీ క్రిందికి దిగిరాలేరు . అమ్మాయి తండ్రి తన సోదరికి ఆమె కుమారుడి పెళ్లి విషయంలో ఆమెకి ఉండే భయాలను  ఎంత సాధికారంగా అర్ధం చేసుకొంటారో అలాగేవియ్యాలవారి విషయాన్ని అర్ధం చేసుకోవాలే కానీ బయట పడకూడదు . ఎంత తెలిసినా ఆడపడుచు విషయంలోఎంత జాగ్రత్తగా ఉంటామో మనకి తెలుసు .  తోడపుట్టినందుకే అంత గౌరవిస్తే ,మనపిల్లకు , సర్వ సంపదాస్వరూపం అయిన వాళ్ళఅబ్బాయికి సగ భాగం కమ్మని ఆహ్వానిస్తున్న వారిని ఎంత గౌరవించినా తక్కువే అంటుందిశాస్త్రం .అందుకే ఎలా చెప్పాలో తెలియక ,అల్లుడి కాళ్ళు కడిగించి ఎన్నో చెప్పకనే చెప్పింది .
                పై విషయానికొస్తే అల్లుడిని నారాయణ స్వరూపంగా మనముందుంచి వారి గురు స్వరూపంగా అత్తగార్ని ,మామగార్ని శాస్త్రం నిర్దేసిస్తుంది . రాముడైనా  తన స్వతంత్రాన్ని తాను పాటించ లేదు . అందువల్ల అత్తగారికి  ,మామగారికి అల్లుడికన్నా ఉన్నతాసనాన్ని హృదయ పూర్వకంగా ఇవ్వాల్సిందే . ఎంతో చదువుకుని మంచి సంపాదనా పరుడైన అల్లుడు కంటికి కనిపించినంతగా మిగిలిన కుటుంబం కనిపించదు . మనం అనుకున్నట్లుగాఎంతో మానసిక  పరిణతి ఉన్న వారికే ఇది సాధ్యం . అంతేకాకుండా వరుని యొక్క నిర్దిష్టమైన ఆలోచనా విధానం  అందరికీ తెలిసే క్షణం ప్రారంభం అయింది . తండ్రి కాబోయే ముందు తన తల్లి ,తండ్రులకు సమాజంలో ఏ స్థానాన్ని ఇప్పుడు, వరుడు నిర్దేసిస్తాడో ఆకుటుంబపు మర్యాద పూర్తిగా దాని మీద ఆధార పడుతుంది . వరుడి ప్రవర్తనని బట్టి ప్రపంచమంతా అతని విధానాన్ని ప్రశంసిస్తుంది . అందుకు వారి తల్లిదండ్రులు  చేసిన సాధన ఎంత అనేది మన ఊహకు అందదు . ఇప్పటి మన సమాజంలో ఎంతో  అసాధ్యమైనదాన్ని  సాధ్యం చేసిన వారి కృషి భగీరధ ప్రయత్నమే . దీన్ని గుర్తించిన శాస్త్రం మగపెళ్ళివారు అని వారికి అధిక ప్రాధ్యాన్యం ఇచ్చింది. దాన్ని వియ్యలవారు కాపాడినప్పుడే అమ్మాయికి సరైన దిశా నిర్దేశం చేసిన వారౌతారు .
        ఇలా నిర్దిష్టంగా అబ్బాయి ప్రవర్తించాలంటే పెంపకమే ప్రధానం .ఇది ఆడపిల్ల పెంపకానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది . ఒకే సమయంలో ఆడపిల్లను ,మగపిల్లవాడిని పెంచేవిధానంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. పెద్దల దారిని చిన్నబుచ్చామే తప్ప ,వారి దారిలో నడిచి ఉంటే,సమాజంలో ఆడవాళ్ళు స్వాతంత్రం పేరుతోఏం నష్టపోయారో , ఆ అనర్ధం జరిగి ఉండేది కాదు . కుటుంబంలో మహారాణి . అందరినీ సమర్ధించి ,వచ్చిన వంశానికి ,కీర్తి ,ప్రతిష్టలు ,ధ్యేయంగా జీవించి ఫలానా వారింటి కోడలు,అని సగర్వంగా అందరూ అంటే కలిగే ఆనందం,ధర్మబద్ధమై,కర్మశృంఖల విముక్తి ఇచ్చింది. కానీ అంతే స్వతంత్రం ,నావాళ్ళనే మమకారం పుట్టింటికి పట్ల మాత్రమే ఉంటే ,కలగే అనర్ధాల ,వికటాట్టహాసం ,అందరూ చవి చూస్తున్నారు . వేర్వేరుజీవిత విధానాలను ఇద్దరికీ నేర్పే బృహత్తర ప్రణాళిక మన శాస్త్రం మనకిచ్చింది . దాన్ని పూర్తి మూఢ ఆచారంగాభావించి విమర్శించే వారే తప్ప నిజానిజాలు విశ్లేషించేవారే లేరు.అమ్మాయికి అణుకువ నేర్పాలంటే పెద్దగీత ముందు తన అహం,అనే గీతను చిన్నగా చేసుకునే నేర్పు ఇవ్వడం తప్పనిసరి.దీనికి బాల్యమే సరి అయిన అవస్థ.అవ్యవస్థితం కాకుండా జీవితాన్ని కాపాడే పునాది . అందుకే మొక్కై వంగనిది ,మానై వంగుతుందా అనే నానుడి ఉంది .ఇదే బాల్యావస్థలో మగపిల్లలకు తన తల్లి తండ్రులు ,పెద్దలు ,వంశగౌరవం గోత్రానికి ఉన్న వైభవం తెలియజేస్తూ ,వాళ్ళని ఉత్తేజ పరచడానికి ,వాళ్ళ అహం బలపడడం చాలా ,అవసరం . దీని దిశగా పెద్దలు వేసిన అడుగులే ,మగపిల్లలను పొగుడుతూ ,ఆడపిల్లలకు నిరహంకారాన్ని తలకెక్కించడం . మన కుటుంబ వ్యవస్థ ,ప్రపంచంలో ,కీర్తించ బడడానికి ,ఇదే బలమైన పునాది ,అనడానికి సందేహం లేదు .
               ఆడపిల్లను పాదుగాను (గుమ్మడి)మగపిల్లవాడిని చెట్టు (కొబ్బరి )లాగాను పెంచే ప్రయత్నం చెయ్యాలనిపెద్దలవాక్కు . అందుకే కన్యాదాన సమయంలో ఈ రెండిoటిని ఇప్పిస్తారు . తమ అల్లుని వంశం ఆడపిల్లలు ,మగపిల్లలతో వృద్ధి కావాలనే ఆకాంక్ష అందులో ఉంది . అల్లుకుపోయే తత్త్వం అమ్మాయికి ,స్థిరంగా తన వ్యక్తిత్వాన్నినిర్ద్వందంగా చెప్పే విధానాన్ని కుమారుడికి నేర్పగల సామర్ధ్యం తల్లి దండ్రులకు ఉండాలి .  మేము అలా ఎందుకుఉండకూడదు ,ఇలా ఎందుకుండ కూడదు అని అమ్మాయి ప్రశ్నించినప్పుడు ,అర్ధం అయ్యేలా చెప్పగలగాలి .అంతేగాని ,చిన్నపిల్ల అదే తెలుసుకుంటుంది అంటూ,చెప్పడాన్ని తర్వాత చూద్దాంలే అని వదిలేయ్యకూడదు.          ప్రశ్నించినపుడే దానికి విలువ ఉంటుంది గానీ ,తరువాత చెప్తేపెద్దగా పట్టించుకోరు . ఇక్కడే జరగవలసిన అనర్ధం జరిగిపోతుంది . మగపిల్లవానికి ఉండవలసిన స్థిరత్వాన్ని అమ్మాయి అలవాటు చేసుకుంటుంది . అందువల్లనే  ఆడపిల్ల పట్ల కొంచెం కాఠిన్యాన్ని ప్రదర్శించాలని శాస్త్రం సూచిస్తుంది . మనకు ఎంత అభిమానమున్నా వారికి తెలియనివ్వకపోవడమే వారికీ శ్రీ రామ రక్ష . అందుకే పిల్లల పెంపకానికి పరిణితి చాలా అవసరం . దీనికి తన పుట్టింట్లో తన అనుభవాలు తనకు ఎంతో ఉపయోగపడతాయి. దానం ఇచ్చే గొప్ప వస్తువు పట్లనే దానివైపు మన మనసు పోకుండా జాగ్రత్త తీసుకుంటాము . మరి సంపూర్ణంగా మనసును మరో ఇంట్లో అర్పించవలసిన అమ్మాయి పట్ల ఏతీరు మంచిది ?   
         భర్తకు ,అత్త మామలకు అనుగుణంగా జీవించడానికి అవసరమైన విధానాన్ని ఆడపిల్లకు అందించడమే గాని ,అమ్మాయిని కించపరిచే ఏ ఉద్దేశము లేదు . దీనికన్నా మిన్నగా ఆమె తన సంతానానికి పెద్దలు చూపిన విధంగా ,పరంపరను పాటించ గలిగే నేర్పును ఇవ్వగలుగుతుంది . ప్రతి అమ్మాయి అమ్మై,"  మాతృదేవోభవ " అని కీర్తించ బడాలంటే ఎన్నో మంచి సంస్కారాలను ఇవ్వగలగాలి . సమాజానికి మనవంతు మంచి పౌరుల్ని అందిoచగలగాలి . మనల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి అమ్మగా అరాధించబడే గొప్ప స్థానాన్నిచ్చిన అత్తగారిల్లు దేవాలయం కాదా ?దీనికి నిజానికి ఏమిచ్చినా వారి ఋణం తీరదు .
               ఒక విత్తనాన్ని చూస్తే, భూమిలో పెట్టాక మొలక రావడానికి కొంత సమయం తీసుకుంటుంది . ఆ సమయంలో ఆ గింజలో చాలా వేడి ఉంటుంది . అదే ఆడపిల్లకు పుట్టిల్లు . కొచెం పెరిగాక వేరే చోట పెరిగే మొక్క, మార్చాక అక్కడి నీటిని ,వేడిని తీసుకుని కుటుంబాన్ని వృద్ధి చేసే దిశగా మనం వేసే పందిరి వుండాలి . అంటే అమ్మాయి కి చోటు మారడం అంటే ,విత్తనానికున్న రెండు (గింజ )భాగాల నుండి కాక తన స్వయం శక్తి తో తాను వచ్చిన ఇంటి వాతావరణాన్ని అర్ధం చేసుకుని ,వారి సహాయంతో సంపూర్ణంగా తన మనసును లయం చేస్తుంది.  కొడుకులను సగౌరవంగా అందిస్తుంది అమ్మాయి . పెరిగే మొక్క చోటుమారాక అక్కడి వాతావరణానికి అలవాటయ్యే వరకు ఎంతో కొంత సహకారం తల్లి తండ్రు లివ్వాలి . కానీ ఆ ఇంటికి చేరువయ్యే దిశగా ఆ ప్రయత్నం ఉండాలి కదా ?కానీ దురదృష్టం ఏమిటంటే మమకారం ఆ పని సక్రమంగా చెయ్యనివ్వడం లేదు . ఎన్నో ఇబ్బందులను  అల్లుడి కుటుంబం ఎదుర్కొనవలసి వస్తున్నది . పైన అనుకొన్న విధంగా పుట్టింటి పెంపకంలో కొంత పరిణతి అవసరం . దానం చెయ్యవలసిన విషయం లో ,పూర్తిగా అన్ని విషయాలు వదలగలగాలి . లోభం పనికిరాదు . అమ్మాయి వారికి తోడు నీడగా ఉండాలే తప్ప, పుట్టింటి గురించి చెప్తూ ,వారిగురించి వినకపోతే బాధ్యత ఎవరిది ?తనది అనేది లేని నిస్వార్ధ ప్రవృత్తికి పరకాష్ట మన కుటుంబ వ్యవస్థ . సంన్యాసము అనేది మగవారికి మాత్రమే విధించారు పెద్దలు . అమ్మ అని ఇపుడు తీసుకున్న ఈవిషయంలో పుట్టింటికి స్వస్తి పలికి పూర్తిగా అత్తవారిల్లే తన కుటుంబంగా అతి చిన్న వయసులోనే మనస్సును ఎలా లయం చెయ్యాలో నేర్పిన మన వ్యవస్థకు ఎంతో ముందుచూపు ఉంది .ఇది వనితకు ద్వితీయ జన్మ. తండ్రి ధార పోసిన నీటితో తన అహంను,భర్త అహంతో పెనవేసి ఉంచితే భర్త ఎక్కడ తల వంచాడో, అక్కడ తన తల వంచితే జీవితంలో ఎదురుండదు.
               అతని తల దించకుండా ఉండేలా తన ప్రవర్తన మార్చుకునే గుణం వనితకు వన్నె తెస్తుంది.                 ఉదయాన్నేముందుగా చేసే సంకల్పంలో ధర్మ,అర్ధ,కామ,మోక్ష ,చతుర్విధ పురుషార్ధాలు మనం రోజూ చెప్పుకోనేవే . ధర్మం  అనేది విడిగా ప్రతిపాదించేది కాదు . జీవించే విధానం ధర్మం . ప్రతి కదలిక ధర్మానికి ప్రతీక . మనకు తెలిసినా తెలియకపోయినా మనుష్యులందరికి ఇది వర్తిస్తుంది.చూసి తగిలినా,చూడకుండా తగిలినా నిప్పు కాల్చినట్లు ఇది వర్తిస్తుంది. కర్తృత్వం ఉన్నంతవరకు ఈపరిధిలొ వారే అందరూ . పశు , పక్ష్యాడులకు అహం ప్రకటించ బడకపోవడం వలన ఈపరిధిలోకి రావు . వీటికి క్రమగతి ఉంటుంది . నేను చేశాననే కర్తృత్వం వల్ల మంచి అయితే పుణ్యం , చెడ్డ అయితే పాపం ఖాతాలో జమ అవుతాయి . కర్తృత్వం మైనస్ అయితే కలిగేదే మోక్షం . దీనికి అనుగుణంగా జీవించడమే ధర్మం . చెప్పినంత సులువు కాదనే భగవద్గీత చెప్తుంది .
                ముందు చూసిన ధర్మానికి ,నాలుగో పురుషార్ధమైన మోక్షానికి ద్వైతం తో పెద్ద సమస్యేమీ ఉండదు . పోట్లాడి నిగ్రహించాల్సిన అవసరమూ ఉండదు .మధ్యలొఉన్న అర్ధ ,కామలతోనే తంటా అంతా . వీటిని మనకు అనుగుణంగా మార్చుకోవాలంటే తప్పకుండా మనం ఈ రెండింటికీ ధర్మాన్ని జోడించాలి . ఇలా కలిపే జీవన విధానమే మన ధర్మం . దీనికి ప్రారంభమే కుటుంబం .
                  చెట్టు ముందా ,విత్తు ముందా అన్నట్లు వివాహం ముందా లేక వధూవరులిద్దరికి ఆహార్య మైన , వారి వారి కుటుంబపు నేపధ్యం ముఖ్యమా అంటే ,కుటుంబ కట్టుబాట్లే ముఖ్యమంటుంది శాస్త్రం . ఇది మూఢత్వం కాదు. గమ్యం మోక్ష మైతే దానికి రాచబాట . మేము చాలా ఎడ్వాన్స్ అనుకునే వారికి దీంతో ఏ అవసరములేదు . బాధ తమవరకు వస్తే కట్టుబాట్లు చాలా అవసరమనిపిస్తుంది . ఎదుటివారు తమవల్ల బాధ పడితే ,వాళ్ళది మూర్ఖత్వం అనిపిస్తుంది . ఎవరికివారే స్వయంగా స్వీకరిస్తే తప్ప ఈ దీక్షకు అర్ధం లేదు .
              కట్టుబాట్లు అంటేనే ,ఆచార వ్యవహారాలు . వీటి ప్రాతిపదికపైనే కుటుంబ వ్యవస్థ ఆధారపడింది . పాకే చిన్న పిల్లల్ని నిప్పుకు దూరం ఉంచడం లాంటిదే ఇది . వయసు పెరిగినా చాలా మందికి ఇవి అవగాహనకు రావు . వారికి తెలియదంటే ఒప్పుకోరు . ఇప్పడే మనకు వారి కుటుంబ నేపధ్యం అర్ధం అవుతుంది . ఎన్నో విషయాలు తెలిసినా తెలియనట్లు పిల్లలవిషయంలోదాటేస్తారు .ఇది ముదిరి ఆడపిల్లలు,మగపిల్లలు కూడాఇబ్బందుల పాలౌతున్నారు. అష్ట వర్షాత్ భవేత్ కన్యా ,ఆలోచన ప్రారంభం అయింది అమ్మాయి  . ఎక్కడ నిలపాలో చూపే ప్రయత్నంలో  వివాహాన్ని సూచించింది. ముదుసలికి ఇవ్వమనలేదు .ఇది  స్వార్ధానికి పరాకాష్ట . శాస్త్రం ఎక్కడా ఇలా సూచించ లేదే . తగిన వరుడ్ని వెదికే లోగా మనస్సు పరిబ్రమించకుండా  ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని పెంచే కళ మనకే స్వంతం . రెండు ,మూడు తరాల క్రితం తల్లి తండ్రుల  వైవాహిక జీవిత విధానం లో ఏకాంతం గురించి పిల్లలకి పరిచయం లేదు కానీ ఏమీ నష్టపోలేదు మనం.  ఎంతో భద్రంగా ఉంది జీవితo . వారికీ సంసారం లేదా ? తమకు స్వంతం అయిన ఏకాంతాన్ని ,పిల్లలకు వేరే గది చూపి బట్టబయలు చెయ్యాలా ?ఇవన్నీ పరాయి పాలనలో ప్రవే శించాయి .  సినిమాలతో మూడు పువ్వులు ఆరుకాయ లైనాయి .           ట్రాఫిక్ రూల్స్ పాటించక పొతే నష్టపోయేది వ్యవస్థ కాదు .వ్యక్తి . ఇంతే సహజం కుటుంబ వ్యవస్థ క్కూడా . ఎవరికోసమొ బ్రతకడం మనకి ఇష్టం ఉండదు . పెద్దలు చెప్తే చాదస్తం . ముందే అనుకున్నట్లు జీవితనికో గమ్యం ఉండాలనుకునే వారికోసమే ఈ చిన్న ప్రయత్నం . జీవితాన్ని  ప్రారంభం నుండి ధర్మబద్ధం చేసుకుంటేనే పురో గతి సాధ్యం . ధర్మపత్నితో ప్రారంభం అనుకొంటే పతికి ముందు నడిచే తల్లిదండ్రులే చుక్కాని . కృతజ్ఞత.  దీన్ని ఆధారంగా సాగితేతికమకలుండవు.ఇంచుమించు జీవిత ప్రారంభంనుండి,అబ్బాయితల్లిదండ్రులకు,కొడుకే గమ్యం. వారి మోక్షం కూడా బిడ్డ తరువాతే . పిత్రార్జితం కానీ స్వార్జితం కానీ అన్ని ఆశలు అతని  పైనే .అమ్మాయి అయితే చక్కగా పెంచి తమకన్నా పై స్థాయి వారింటికి పంపాలి అన్న ధోరణి తప్ప వేరే ఆలోచన ఉండదు .
     కానీ అబ్బాయి విషయం అలాకాదు . కంటికి కనిపించే రెండు ,మూడు తరాలేకాదు . ఏడు తరాలవారిని సంతృప్తి పరచగల చక్కని ఒరవడి కుమారుని కుంటేనే ,వారి  బిడ్డలకు ఇవ్వగలరు . మన పెద్దల కివ్వని గౌరవం మనకి ఎండమావి . దీనికి సహకారం  ధర్మపత్ని కన్నాఎవరివ్వగలరు?వరుని కంటే వయసులో చిన్నది . ఇంట్లో వారందరూ మెచ్చిన అమ్మాయి అంటే 24క్యారట్ బంగారం కదా?ఇంటికే ఆభరణం అవ్వాలంటే చాలా  ఓర్పు కావాలి. దీనికి సహకారం భర్తకన్నాఎవరివ్వగలరు?తనని తాను దిద్దుకున్న వారే ఎవరికైనా మార్గ నిర్దేశం చెయ్యగలరు . అబ్బాయి తల్లిదండ్రుల కలలు నిజం కావాలంటే, వారిని బాగా అర్ధం చేసుకోవాలి. వారిని గౌరవించడంముందు ప్రారంభించాలి .పెళ్ళికి ముందు తల్లి తండ్రులతో,అబ్బాయికి ఉన్నది చనువు.పూర్తిగా దీనిమీద ఆధార పడితే మాట తూలే అవకాశం ఎక్కువ . ఇది కొత్త కోడలికి,సరిఐన మార్గ నిర్దేశం చెయ్యలేదు .
             పద పదానికి వేరే అర్ధం తియ్యకుండా ఆలోచించండి . బంగారం ఆభరణం అవ్వాలి . ఒక గ్రాము అయినా రాగికలపాలి.అబ్బాయికితన,తల్లిదండ్రుల పట్ల ఏ మాత్రం తొణకని ఆరాధనా భావాన్నిఎట్టి పరిస్థితులలో చేజారకుండాఉంచాలి . ఇదే 24 క్యారట్ల బంగారం .అబ్బాయిదీన్ని,తన భార్యకు అర్ధం అయ్యేలా చెయ్యగల నేర్పే,కలపవలసిన రాగి.పైన చేసిన చర్చ అంతా ఇప్పుడు చేదోడు కావాలి '. మీకు మీవాళ్ళెం తో నాకూ అంతే' .ఇది  పత్ని మాటైతే,పతి  బాట అత్తగారింటికే. దీన్ని పెళ్ళికి ముందు ,అమ్మాయి తల్లి దండ్రులు ,అమ్మాయి మనసుని ,బంగారం 24క్యారట్లలా ఉంచి ,అబ్బాయి ఇంటిలోని వారి గౌరవమే తన గౌరవంగా ,భావించే అహంను[రాగిని] తోడిచ్చి ,అత్తవారింటికి పంపడమే ,మన కుటుంబ వ్యవస్థకు పునాది .  ఒకవేళ మామగారికి మగపిల్లలు లేరు అనుకుందాం . అందుకని పెళ్ళైన రోజు నుంచి అదే పాట వింటే,అతని తల్లి దండ్రులు కొడుకు అనుకోవడమెందుకు ?పెళ్లి చేశాం అనకుండా ,దత్తతఇచ్చాం అనాలి .శాస్త్రం పట్ల కృతజ్ఞత  అనేది ,వంశం పట్ల గోత్రంపట్ల ఉన్నా,పెళ్ళికి ముందే సరి అయిన అవగాహన పెంచుకోవాలి.
             తన జీవితo లోకి భార్యను ఆహ్వానించలే గాని ,తానే దత్తతకువెళ్ళినట్లు ప్రవర్తిస్తే ఎలా ?పెళ్ళికి ముందే తల్లి దండ్రుల పట్ల,తన భావాలను వివరించి ,ఆమ్మాయి సహకారాన్నికోరాలి .  జీవితంలో అబ్బాయి  కుటుంబానికి అతనిచ్చే, ప్రాధాన్యతను బట్టి ,ఆ అమ్మాయి సునిశ్చితమైనఅభిప్రాయాలను ఏర్పరుచుకుంటుంది . తన వారిని మరచి,అత్త వారిని తన కుటుంబంగా భావించాలoటే వరుని కృషి చాలా అవసరం .
         అబ్బాయి పుట్టినప్పటి నుంచి ,తాత, బామ్మ (నాన్నమ్మ )అమ్మ,నాన్నవీరందరూ పడే తపన ఎంతో మాటల, కందదు.వారికున్నసకలమూవంశాంకురమే.ఇంటిగౌరవం అంతా వారందరినీ కలుపుకుని అబ్బాయి మాట్లాడే తీరు  పైన ఆధారపడుతుంది . పరిచయస్తులు ,బంధువులు, వీరివద్దనే అబ్బాయి  ఈవిష యంలో ఎంతో స్పష్టంగా వ్యవహరిస్తారు . మరి భాగస్వామిగా,సహచరిగా ఇంటికి వచ్చే అమ్మాయికి ఇంకెంత స్పష్టంగా ఉండాలోవీరికన్నా ఎవరికి బాగా తెలుస్తుంది ?
       చిన్నప్పటి నుంచిఅబ్బాయి కుటుంబానికి ఏఏ విషయాల్లో ఎలాంటి అవగాహన ఉందోఅతనికి బాగాతెలుసు . ప్రతి వారి పట్ల స్నేహ భావంతో వ్యవహరించే తీరు ఎప్పుడూ వీరు సూచిస్తూ ఉండాలి.ఈజా గ్రత్త తప్పనిసరి .ఇప్పటి  కాలంలోఎవరున్నారు,అనేసాగదీయడాన్నిప్రోత్సహించకూడదు ఎవరికీ అవకాశం ఇవ్వకండి .ముఖ్యంగాఅమ్మాయి తల్లిదండ్రులకు. అన్నీ మారిపోయాయి అనేది శుద్ధ అబద్ధం . సూర్యోదయం మాములే ,గాలి పీల్చుకోవడం , నీరు త్రాగడం అన్నీ మాములే . ఏదిమారింది ?మనిషిలో స్వార్ధం పెరిగింది .వేరే మార్పేo లేదు .అబ్బాయి తన కోసం గిరి గీసుకుంటేవారి కన్నవారికి ఆసరా ఎవరు?వాళ్ళకి అవసరమైనప్పుడు చూద్దాం .అనేది వీరి  సంకుచితత్వానికి ప్రతీక . ఈఆలొచన వారి భార్యకువారిచ్చే వెసులుబాటు . మొదటినుంచి తమ తల్లిదండ్రుల ,కుటుంబ విషయాల్లో  భార్యకు స్పష్టమైన అవగాహన కలిగించే ప్రయత్నం చెయ్యక తప్పదు  .
            అమ్మగా ఎంతో అలసిన ప్రాణానికి, చిన్న ఊరట ,కోడలి రాక . ఎలా తనని తాను సమర్ధించు కోవలో తెలియని గందరగోళం . కానీ నిలదొక్కుకుని గాభరా పడకుండా చూడాల్సిన బాధ్యత కుమారుడిది . తండ్రిది . ఇంకా చెప్పాలంటే ఆవిడ అత్తగారిది . అంటే పెళ్ళికొడుకు బామ్మది . ఈపరిస్థితుల పూర్తి స్వరూపం ఆవిడకే తెలుసు . సమర్ధించగల సకలము ఆవిడచేతుల్లో ఉంది . ఆడపెళ్ళి వారికి కూడా నచ్చ చెప్పగల శక్తి ఆవిడది .
         తన కోడలు కాపరానికి వచ్చినప్పటినుంచి కష్ట సుఖాల్లో భాగస్తులై తమ ఇంటికి పచ్చ తోరణంలా ఇరు ప్రక్కలా కాచి ఉన్నారు ,ముందుతరం అత్తా కోడళ్ళు . ఎంతో సర్దుబాటు ,మరెంతో దిద్దుబాటు అలవాటు చేసుకొన్న వారి ఓపికకి జోహార్లు . పంచ భుతాలనే నలుగు పిండితో భర్తనే ధ్యానిస్తున్న, ధ్యానమనే పసుపు కలిపి తయారైన బుజ్జి తండ్రిని ,తల్లి మురిపెంతో ,బామ్మ కనుసన్నలలో పెరిగే భాగ్యం పిల్లలందరికీ కలగాలనీ ,పసుపు ,పారాణితో మనింట  మహాలక్ష్మి ప్రవేశించే వేళ కోరి అమ్మను ప్రార్ధిద్దాం .
           తండ్రి ,తాత క్రమశిక్షణ ప్రత్యేకించి మగపిల్లల విషయంలో తప్పదు . పిల్లల్ని చిన్నప్పుడు పడిపోకుండా ఎంతో జాగ్రత్తగా నడక నేర్పిస్తాము . అవి మనింట్లో వేసే అడుగులు . అత్తవారింట్లో వేసే ప్రతి అడుగుకు అమ్మాయికి, మీరు తోడు ఉండాలని అమ్మాయి అత్తగారికి చెప్తే ఆమె పొందే ఆనందానికి హద్దు ఉంటుo దా ?మన ప్రతి మాటకి పొంగిపోయే అవకాశాన్ని ఆవిడకు ఎందుకివ్వకూడదు . అదే మనం అమ్మాయికి చెయ్యగల గొప్ప సాయం .        
      ఇక్కడో విషయం చెప్పనా ?గొప్ప సామ్రాట్టు ఉన్నాడట . ఎంతో పరిశీలించి తన సామంత రాజు కిచ్చి తన కూతురి పెళ్లి చేశాడట . అత్తగారింటికి వెళ్లి వచ్చిన కూతురి ప్రవర్తన రాజుకి నచ్చక ,అల్లుడి పాదరక్షలు తెప్పించి సభా ప్రాంగణంలో ఎవరికీ తెలియకుండా ఉంచాడు . తెర వెనుకనుండి తన కూతురు చూస్తూ ఉండగా , అందరిముందు సింహాసనం దిగి అతని పాదరక్షలు అతని కిచ్చాడు .సిగ్గు పడిన అతనికూతురు తనతప్పు సవరించుకుంది . ఆడపిల్ల వినయానికి తల్లిదండ్రుల పాత్ర ఎంతోఉంది .
       అలాగే కోడలు రాగానే ఆమెతో ఎంతో మాట్లాడాలనే తపన అత్తగారికి ఎంతో సహజం . కానీకొంత జాగ్రత్త అవసరం అత్తగారు తనపెళ్ళైనప్పటి నుంచి ఎంతో ఓర్పుతో ఎన్నో విషయాలు తన అత్తగారి నుంచి నేర్చుకుంటారు .  తల్లీ పిల్లల మధ్యఉండే చిన్న చిన్న విభేదల్లంటివి కూడా వారిమధ్య సహజం .  కొత్త కోడలు రాగానే అత్తగారు చేసే పెద్ద తప్పు,ఇలాటివి హైలైట్ చెయ్యడమే .దీని వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉంది . అబ్బాయి వద్ద, కోడలు' అత్తయ్యగారుమాట్లాడితే తప్పులేదు కానీ ,నేను మాట్లాడితే తప్పేమిటి 'అనే సమస్యకు  అబ్బాయికి సమాధానం దొరకడంకష్టం . కనుక అత్తగారితొ ,తమ  కున్న మంచిజ్ఞాపకాలను షేర్ చేసుకోండి . ఇది కుటుంబానికి శ్రీ రామ రక్ష .ఇంకో 30సం /తరువాతి తరం కోడలిది,ఇదే పరిస్థితి .
              ఇంత విస్పష్టంగా జీవించే విధానాన్ని మన సంప్రదాయo మనకిచ్చింది . అత్తగార్కి  అంత ఖంగారు , బామ్మ అయేసరికి మాయం అవుతుంది . కొత్త అనుబంధం అత్తా కోడళ్ళని మరీ చేరువ చేస్తుంది . భార్యా భర్తల మధ్య అవగాహన సృష్టి సహజం . మిగిలిన కుటుంబ అనుబంధాలు వారి అన్యోనతని భంగపరచకుండా ,లోకంలో భారతీయ కుటుంబ వైసి ష్ట్యాన్ని తెలిపేలా జీవించడానికి ,కొంత పరిణతి అవసరం . అదే, ప్రారంభం నుండి జీవితమంటే ఆధ్యాత్మిక యాత్ర అని బాల్యం నుంచి, ఇంటి వాతావరణం లో దైవ చింతననుచాలా బలంగా నాటుకునేలా చెయ్యగలిగిన బామ్మ పాత్రత. దా న్ని అందించే పాత్ర ,ఈ విశ్వమనే రంగస్థలంలోబామ్మ పాత్ర .  బామ్మ బాల్యం చూస్తే ఇంటి వాతావరణంలో అందరూ, వారి వారి పాత్రోచితంగా వీలైనoతగా దైవారాధనకు సమయాన్ని కేటాయిoచేవారు . మగవారు సంధ్యావందనాదులు ముగించి వారి పనుల్లో వారు ప్రవేశిస్తే ,ఎంతో పెద్ద కుటుంబమైనా ,రోళ్ళు రోకళ్లు  ,కట్టెల పొయ్యి అయినా ,ఉదయం 11గం /లకి వంట పూర్తి చేసి ,భోజనాల హడావిడి రొజూ మాములైనా ,ఏ ఇల్లాలు వ్రతాలు ,నోములు ప్రక్కన పెట్టలేదు .
              ఇదిసర్వసాధారణమైనా ,మన ఆచార వ్యవహారాలకు ,ఆధ్యాత్మికతకు ఉన్న విదదీయలేని అనుబంధాన్ని వారు గుర్తించి పిల్లలకు పరిచయం చేసేవారు .ఉదాహరణకి మనం ఒక భావాన్ని చెప్పాలనుకున్నప్పుడు , ముఖంలో భావ వ్యక్తీకరణ ,చేతులు కదలడం ఏక కాలంలో జరుగుతాయి .ముఖంలో భావవ్యక్తీకరణ అమ్మవారైతే , ఆంగికం శివ స్వరూపం . ఈరెండుఏక కాలంలో జరగడం మన అనుభవం .అలాగే మన ఆచారవ్యవహారాలకు,ఆధ్యాత్మికతకు అంతే అనుబంధం ఉంద.
            వాకిలి తుడిచి (మనస్సులోని అనవసర భావజాలాన్ని ,ఇంట్లో వారితోగాని ,ఇరుగు ,పొరుగుతో గాని జరిపే వాగ్రూప కార్య కలాపాలు మళ్లీ మళ్లీ మనసులో రిపీట్ అవకుండా )ఆవుపేడ కలిపిన కళ్ళాపి జల్లి (ఆర్ద్రాం ,తడుపుట.  ఆవు పేడ ,  లక్ష్మీ స్వరూపం )తనకు తెలిసిన ,విన్న అనేక విషయాలను పరమాత్మకు అనుసంధానం చేస్తూఅని, లక్ష్మి  ఎపుడూ స్వామి పాద సంసేవనంలో ఉంటుoదని మనకు తెలుసు . అంటే,పాదము అనేది మనం దేనిమీద ఆధారపడి ఉన్నామో ,ఆ పరబ్రహ్మ స్వరూపానికి గుర్తు . అర్ధం పరబ్రహ్మ ధ్యానంలో ఉందని . కాళ్ళు పడుతూ ఉండడం అనేది సూచనగా చెప్పబడిందేగాని ,భర్త కాళ్ళు పట్టినమాత్రాన తరించిపోయారని కాదు . ఇది అంతా నిరాకార తత్వానికి మనను చేరువ చెయ్యడానికి తీసుకున్న దయ తప్ప సాకారానికి వేరే ఉద్దేశం లేదు .
            తెల్లని ముగ్గు వేసి (సఘం తో అంటే కుటుంబం తోసహా అలాగే తనకు దృశ్య విషయమైన తన శరీరం తో సహా )అంటే అన్నింటినీ శుద్ధ సత్వంగా తప్ప వేరే అన్య భావం లేకుండా అలంకరించి,అప్పుడు మిగిలిన ఇంటి పనులలో ప్రవేశించడం మన భారతీయులకే స్వంతమైన తీరు . ఇంత చిన్న విషయంలో అంత మాత్రం చెప్పగల మన వైదిక సాంప్రదాయాలకు నమస్సులు .తరువాత మాత్రమే బాహ్య శరీర శుద్ధి మొదలైనవన్నీ . దీనర్ధo  బాహ్యాంతర శుద్ధిలో దేని ప్రాధాన్యం ఎంతో మనకి అర్ధం అవుతుంది . ఇది తెలిసినంత సులువు కాదు సాధన చెయ్యడం . మనలో ఆచారాల పట్ల అవగాహన పెరగాలే తప్ప ,ప్రతీది ఆచరించ వలసినదే . ఎంత కాలం అంటే ఊపిరి ఉన్నంత కాలం . అదే పెద్దలు మనకి చూపిన మార్గం . మీరు ఎప్పుడు వదిలేసినా ,ఏమీ చెయ్యకుండానే , పిల్లలు వదిలేస్తారు . ఈబాధ్యత మీదికాదా ?పట్టుకున్న కొమ్మను వదిలేసిన తీరుగా ఉంది ఇప్పటి వ్యవస్థ . దీనికి పెద్దల బాధ్యతే ఎక్కువంటే అతిశయోక్తి కాదు . రెండు తరాల ముందు వరకు ఉన్న వ్యవస్థ ,ఇప్పుడు లేదంటే , అనవసరమైనవి ,ఎంతగా ఎడాప్ట్ చేసుకున్నామో అర్ధం చేసుకోవచ్చు . దీనికి వచ్చిన మార్పుల కన్నా ,మన సనాతన ధర్మం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న తపనే ఎక్కువ .
          కనిపించిన ప్రతీ దాంట్లో కొట్టుకు పోవడమే తప్ప నిలబడి ఆలోచించామా ?అంటే జవాబు చెప్పడానికి కొంచెం కష్టమే . కొండ ఎక్కాలంటే కష్టమే . కానీ నీరు పల్లంలోకి ప్రవహించడం తేలిక . పల్లం లోకి వెళ్ళడం అన్నీ తెలిసిన మిమ్మల్నే ప్రలోభ పెడితే , పిల్లలేం కావాలి ?ఇప్పుడు చూస్తున్నది ఆ సమాజాన్నే .చిన్నప్పటినుంచి మనకి ఎంతో విజ్ఞానాన్నిచ్చి ముందు తరాల బాధ్యత మనకి అప్పజేప్పినప్ప్డుడు మనం దాన్ని నిలబెట్టుకున్నామా అనేది చాలా పెద్ద ప్రశ్నే. ఇలాచేయ్యలంటే ముఖ్యంగా ఆడవారిదే ప్రముఖ పాత్ర . ఈవిషయం చూస్తూ ఉండగానే చేజారి పోవచ్చనే భావం పెద్దలకు తెలిసిందే . కనుకనే ఆడపిల్లల చదువు పట్ల ఎక్కువగా స్పందించారు . నిజానికి చక్కని సమాజ నిర్మాణంలో స్త్రీ గడప దాటకుండా సహకరిస్తే తప్పేమైనా ఉందా ?
            ఉన్నతమైన ఆశయాలతో బిడ్డలను తీర్చి దిద్దడం కన్నా సమాజ సేవ వేరే ఏమైనా ఉందా ?ఈ బాధ్యత కన్నా మిoచినది లేదని నమ్మిన ఎన్నో కుటుంబాల వల్లనే అక్కడక్కడ ఇంకా సహజమైన ధోరణి ఉంది .ఆడపిల్లల చదువులవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు కొంతమేరకు సమాజం చూస్తూనే ఉంది .ముఖ్యంగా మగ పిల్లలకు కుటుంబ పోషణ భారాన్ని ,అమ్మాయిలకు ఇంటి నిర్వహణా భారాన్ని మన శాస్త్రం శాసించిoది . చేతులు ఎలాగా కాలాయి . ఊదుకు0టూ ఎందుకు కాలాయో ఆలోచిస్తే తప్పేoలేదుగా .ఉన్నంతలో కష్ట సుఖాలు అర్ధం అయ్యేలా పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ . దీనివల్ల అధికమైన హెచ్చు తగ్గులు వల్ల సమాజం నష్టపోయేది కాదు . హెచ్చు తగ్గుల వల్లనే పోటీ పెరిగి పోయింది .భార్య చేత ఉద్వోగం చేయించి పోటీలో పాల్గొనేవారు పెరిగి పోయారు . దీనివల్ల కుటుంబ పోషణా భారాన్ని వహించ వలసిన మగ పిల్లలు ,చిన్నా చితకా ఉద్వొగాలతొ కాలం గడుపుతున్న వారు సమాజంలో 70%ఉన్నారంటే ఆశ్చర్య పోనక్కర లేదు . దీని బాధ్యత మనందరిదీ కాదా ? కనీసం 15వేలు ఆదాయం ఉన్న వాళ్ళు ,భార్య చేత ఉద్వోగం చేయిస్తే తప్పని పరిస్థితి అనుకోవచ్చు . కానీ ఎంత వచ్చినా తీరని దాహానికి అర్ధం ఉందా ?కొంతమేరకు ఆడపిల్లల ఉన్నత చదువులు కారణమని ఒప్పుకోక తప్పదు . ఆడపిల్ల పూర్వపు రోజులు కాదు చదువు కోవాలి .కానీ లిమిట్ లో అయితే వచ్చే నష్ట మేముంది . ఎక్కడో ఎక్సాట్రార్డినరి . తల్లి దండ్రులు తగినంత చదువు చెప్పించ వచ్చు .కానీ అందరికీ అవసరమా ?చక్కగా డిగ్రీ చదివించి మంచి ఉద్వోగస్తుడి కిచ్చి అమ్మాయి వివాహం చెయ్యడానికి ముందు తరాలవారికైనా సూచిస్తూ ,కోడలి ఉద్వోగానికి స్వస్తి పలికితే చాలా భాగం సమస్యలకు సమాధానం సాధించిన వారమోతాము .'సర్వే జనాః సుఖినో భవంతు 'అని పలుకుతున్న మన మందరం .కార్య సాధకులం కూడా కావాలి కదా ?
           దీనికి ప్రాతిపదికగా ఎన్నో ప్రలోభాలకు పిల్లలను లోనుచేసే కంబైండ్ స్టడీస్ కు బదులు గర్ల్స్ స్కూల్స్ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఇబ్బందులు పడుతున్న ఎందరో ఆడపిల్లలకు చేయూత నిచ్చే ఆదర్శానికి మనం నాంది పలకవచ్చు .ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల చొరవతో ఇది సాధ్యం .ఇవన్నీ సమాజాన్ని తొలచి వేసే సమస్యలు . టి. టి. డి లాంటి మహోన్నతమైన సంస్థలు చొరవ చెయ్యాలి . సర్వే సర్వత్ర పరమాత్మనే ధ్యానించే ఎందరో వేత్తల దీవెనలతొ ఈ కల నిజమౌతుందని ఆశిద్దాం .
               తమ దగ్గర ఒక విలువైన వజ్రం ఉంటే దాన్ని ఎలా కాపాడు కుంటామో,ఆడపిల్లను అలా జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యతను శాస్త్రం మనకు విధించింది . దాన్ని నారాయణ స్వరూపుడైన వరునికి ధార పోసే వరకు జాగ్రత్తగా కాపాడాలి కదా .ఆమెను  ఎగ్జిబిట్ చేసే అధికారం మనకు లేదు . చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని బయటకు పంపే విషయాన్ని ఎప్పుడూ మన సమాజం ప్రోత్సహించ లేదు . ఇంట్లో అన్నీ నేర్చుకోనేలా చూసేవారు . చాలా  పాత  బడిన విషయాలు వ్రాస్తున్నా కదూ . కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ,ఒకసారి వెనక్కి తిరిగి చూడమని పిలుస్తున్నాయి .ఎవరినో చూసి కట్టు బొట్టు అనుకరించే మనస్తత్వాన్ని ఇచ్చింది కుటుంబం కాదా ?
          ప్రారంభంనుండి ఇంట్లో కఠినమైన వాతావరణాన్ని మనం ఇవ్వలేమా ?అదే సమయంలో మన సాంప్రదాయాన్ని ఎంతో అధ్బుతంగా చెప్పే ఓపిక, తీరికా మనకి లేవా ?ఎందుకింత దీన స్థితిలో ఉన్నాం మనం ? మన కుటుంబ వాతావరణాన్ని పోగొట్టుకున్నాం . ఎంత సేపు భార్య భర్త లిద్దరూ సంపాదించేయ్యాలి . ఒకటే మోటివ్ మిగిలినవన్నీ ఎలా మంట కలిసినా నో మేటర్ .దేన్ని సాధించాం మనం ?మనకన్నా బురఖా లో ఉన్న స్త్రీ కూడా రక్షించ బడిందంటే అతిశయోక్తి లేదు .నిజంగా మనకే కట్టుబాట్లు లేవా ?ఉన్నా పట్టించుకోమా ?ఇంకా భారతీయ స్త్రీ ప్రపంచంలో గౌరవించ బడుతోందంటే ఆశ్చర్యంగా లేదూ ?
      ' సంపాదన' దీన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం . ఏది నిజమైన సంపాదన? ఒక పనిమీద మనమొక ఊరికి వచ్చామనుకుందాము . వచ్చిన పని మరచి ,కాలవ గట్టున ఆడుతున్న పసి పిల్లల్లా ,గులక రాళ్లు ఏరుకుంటున్న రీతిగా ఉంది మన వ్యవహారం . ఎలాగో చూద్దాం . పశు ,పక్ష్యాదులు వంటి ఎన్నో జన్మలు దాటించి ,పరమాత్మ మానవ జన్మ అనుగ్రహించాడు . ఇప్పడు మాత్రమే మనకు పరమాత్మ సారూప్యతను అర్ధం చేసుకునే బుద్ధి ప్రసాదించ బడింది . కానీ ఈబుద్ధి సూక్ష్మతను  మనం ఎలా ఉపయోగిస్తున్నాము ?ముఖ్యమైన కార్యం భంగo కలగకుండా జీవనం సాగించడానికి తగినంతగా సంపాదన ఉండాలే తప్ప ,వచ్చిన పని మరిస్తే పసిపిల్లలకు మనకూ పెద్ద తేడా ఏముంది ?వారిలాగే పోటీ పడుతున్నాం ,కొట్లాడుకుంకుంటున్నాం .పెద్దగా తేడా ఏం లేదు . వారైతే పెద్దలు చెబితే వింటారు .కానీ మన దృష్టిలో మనమే పెద్దలం .కౌమారం దశలో పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు . కానీ వారి విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త పడతారు పెద్దలు . కౌమారాన్ని 'మర్కట 'దశగా శాస్త్రం అంటుంది .
         ఈ దశలో ప్రస్తుత సమాజపు రీతి ఉంది .  నా ఉద్దేశం సమాజంలోని ఎక్కువ శాతం అనే గాని వేరేకాదు . మన్నించాలి .ఈ దశలో హనుమద్వైభావమే మనకు దిక్సూచి .ఎప్పుడూ రామ నామాంకిత ధ్యాని అయిన స్వామి మనకు అనుసరణీయుడు . ధ్యేయమైన నామం ఏది అయినా ధ్యానం యొక్క విశిష్టత వరకు తీసుకుoదాము .
         మరి బామ్మ ఈ విషయంలో తన కర్తవ్యాన్ని పాటించాలి కదా ?మరి తన కున్న అనుభవాల్లోoచి  ఏది పరిమితమైన తన కుటుంబానికి ,విశ్వ కుటుంబానికి ,హితమో అందించే ప్రయత్నం చెయ్యక తప్పదు . అది పిల్లలకి నచ్చుతుందా? అనేదానికన్నావారి భవిష్యత్తుకు ,సమాజ హితానికి ఏమాత్రం సహకరిస్తుందో  ఆలోచిoచాలి.  అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే పిల్లలకి ఇష్టం కన్నా హితమే ముఖ్యం . మనుమలంటే వారిలో ఆడపిల్లలు ,మగపిల్లలు అందరూ ఉంటారు . బాల్యం నుంచి ఎన్నో మంచి విషయాలను వారికి పరిచయం చెయ్యాలి (అనారోగ్యమంటే) సమాజం ఇప్పుడు భయపెట్టే స్థితి లో ఉంది . దీన్నుంచి మనం మన పిల్లల్ని కాపాడు కోవాలి . తగినంత సమయాన్ని కుటుంబానికి కేటాయించేలా ,మనకొడుకు ,కోడళ్ళని ఆదేశించాలి . సంపాదన కన్నా భద్రత ముఖ్యమని హితవు పలకాలి . మీరు ఎన్నో కారణాల వల్ల మీ మనుమలతొ దూరంగా ఉండి ఉండ వచ్చు . కానీ ఎన్నో విషయాలు పంచుకొనే అవకాశం మునుపటి కన్నా ఇప్పుడే ఎక్కువ . ఫోన్లు ,స్కైప్,చాట్ ఎన్నో సాధనాలు . మనకు ఎంతో అలవాటులో ఉన్న ఉత్తరాలు ఎలాగూ ఉన్నాయి . కానీ వారికి, వారి వయసును బట్టి ఏ మేరకు మనం అర్ధం అయ్యేలా చెయ్యగలమో ,అన్నీ వారికి నేర్పిద్దాం . దీనికి అవసరమైతే మనం మళ్లీ చదువుకుందాం . ఎవరు విసుక్కున్నా మన ఓర్పు ఎంత ఉందో నిరూపిద్దాo .
          ఇంతకు ముందు రామ నామాంకిత ధ్యానిని తలుచు కున్నాం కదూ . ఒక్క క్షణమైనా అయన మ్రోల నిలబడే ప్రయత్నం చేద్దాం . మనసుకు మర్కట రూపాన్నిచ్చింది శాస్త్రం . ఎప్పుడూ ఒకచోట నిలబడదు . ఏపని సఫలం అవ్వాలన్నా దీన్ని నిలపక తప్పదు . ఎన్ని విద్యలున్నా రాముని పరిచయమే హనుమంతునికి ప్రధానం . సుగ్రీవుడిని వాయుపుత్రునికి స్నేహితునిగా మనకు తెలుసు . నిరాకార పరతత్వానికి రూపమే శ్రీ రాముడు . (సుగ్రీవము )ధ్యాన స్థితి . సహాయంతో ఉపనిషత్ సారాన్ని ఉపాసిస్తూ , అంటే పెద్దలద్వారా సాకార ,నిరాకార జ్ఞానాన్ని బాగా తెలుసుకుని ,అనుసంధానం చేస్తూ ,అసారాన్ని మీకిష్టమైన నామంతో ఎల్లప్పుడూ స్మరిస్తే తప్పక  మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకానికి  అర్హులమౌతాము . హనుమంతుడు తనను స్థూల శరీరంతో దాసునిగాను , మనసుతో భక్తునిగాను ,ఆత్మానుసంధానంతో రామునిగానే సంభావించు కునట్లు ఆధ్యాత్మ రామాయణంలోఉంది .
          పిల్లలకు బాల్యం నుండి ఇంట్లో పరంపరగా వచ్చే ఆచార వ్యవహారాలను ,భగవద్విషయాలను పరిచయం చెయ్యండి . బయటి ప్రపంచం వారిని విపరీతoగా ఆకర్షిస్తుంది . దీన్నుంచి వారిని బయటకు తీసుకు రావడం చాలా కష్టమైన విషయమే . కానీ ఇక్కడ మనమొక విషయాన్ని పరిశీ లిద్దాం .వీలైనoనంత వరకు సాధారణమైన మధ్యతరగతి పిల్లల స్కూల్స్ ఎంచు కోవడం వలన పిల్లలో చక్కని సాంఘిక దృక్పధం ఏర్పడే అవకాశం ఎక్కువ . మన గౌరవ మర్యాదల హోరులో పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరమైన ఎన్నో కోణాలు హైఫై స్కూల్స్ లో దెబ్బతింటాయoటే ఆశ్చర్యం ఏం లేదు . పిల్లల్ని గొప్పగా పెంచడం కన్నా ,సరి అయిన విధానంలో పెంచడం ముఖ్యం . ముందు అనుకున్నట్లుగా డబ్బే ప్రపంచం అయినవారికి చెప్పే విషయాలు కావివి .
              ముఖ్యంగా పిల్లలకు ఏదో ఒక ఆర్ట్ పరిచయం చెయ్యడం చాలా అవసరం . ఇతరత్రా టైం పాస్ చెయ్యకుండా ఇవి కాపాడతాయి . స్కూల్స్ ,సంగీతం ఇవన్నీ ఆడపిల్లలకు వేరుగా ఉంటే ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారమోతా యి . ఉదాహరణకు సంగీతాన్ని తీసుకుంటే,దాంట్లో ఎంతో మాథ్స్ నాలెడ్జి ఉంది . మనస్సు చాలా స్థిరంగా ,సున్నితంగా,చాలా షార్ప్ గా ,అదే సమయంలో స్పీడ్ గా తాయారు చేసే చాలా గొప్ప శక్తి దానికి ఉంది . కానీ ఆశక్తిని చాలా మొగ్గ దశలో ఎక్కువ ప్రచారంలో వినియోగిస్తే ,ఉపయోగం కన్నా దురుపయోగమే అవుతుంది . పిల్లల ఎదుగుదల కుంటు పడుతుంది .
          అనవసర సమయంలో మొదలయ్యే ఆలోచనలు కౌమారాన్ని గందరగోళానికి పిల్లల్ని గురి చేస్తాయి . దీనికి ఇప్పుడున్న ప్రచార మాధ్యమాలు వారికి మరింత అనవసర సమాచారాన్ని అందిస్తున్నాయి . వారికి ఎంతో సాధన అవసరమున్న గొప్ప సమయాన్ని వ్యర్ధ మైన ఆలోచనలు మింగేస్తున్నాయి . దానికి ఈ సమాజం ఎంత వరకు బాధ్యత వహిస్తుంది ?ఈ సమయాన్ని పిల్లలు వారి సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలంటే కుటుంబం ఎన్నో విషయాలను వారికి అర్ధం అయ్యేలా చెయ్యగలగాలి .
        పూర్వం మగపిల్లలకు  వడుగు చేసి గురుకులానికి పంపే సమయం ఇదే . శ్రీరామ చంద్రుడు గురువైన వసిష్ట మహాముని వద్ద యోగవాసిష్టo  నేర్చుకున్న సమయం ఇదే .భగవద్గీతలో సమాధానం సాంఖ్యంతో ప్రారంభమైనట్లే,రామాయణంలో ఆత్మ తత్వాన్ని యోగ వాసిస్టం చెప్తుంది . కానీ చెప్పినప్పటి వయో భేదాన్ని చూస్తే శ్రీరాముని కౌమారదశను ఈ విషయాన్ని బోధించడానికి సరి అయినదిగా భావించారు .ఎంతో నిగూఢ విషయాలను శోధించే మానసిక స్థితి ఈ వయసులో ఉంటుంది . సరి అయిన సూచన చేసే శక్తి మనకుంటే ఏ రంగంలోనైనా వాళ్ళు రాణిస్తారు . సరి అయిన మార్గ నిర్దేశం లేక ,సృష్టిలో సర్వ సాధారణమైన ,స్త్రీ పురుష పరస్పరాకర్షణ వైపు మొగ్గు చూపుతున్న పిల్లలు ఎక్కువౌతున్నారు . ఇందువల్లనే ఈ సందర్భంలో గర్ల్స్ హై స్కూల్స్ వైపు మనం ద్రుష్టి సారించ వలసిన అవసరం ఉంది .అత్యంత సర్వ సాధారణ విషయము ,కానీ ఈ వయసులో అసలు అవసరం లేని విషయము ,అనవసర సమయంలో పిల్లల జీవితాలను ప్రలోభ పరిచే విదేశీ సంస్కృతిలో వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న సమాజంలో మనo  భాగస్వాములం కాదా ?మనకు ఏ బాధ్యత లేదా ?
         పశు పక్ష్యాదులకు కూడా సహజమైన ఈ విషయానికి  ,వాటికి అవసర సమయాన్ని ప్రకృతి నిర్దేసించింది . వాటిని ,మనుషులను వేరుచేయ్యడానికి మనకి బుద్ధిని ప్రసాదించింది . బుద్ధిని వాడుకుని నరుడు ,నారాయణుని స్థాయికి చేర్చే ఈజన్మలొ ,దేని సమయం దానికుంది .కాదు విదేశాల్లో లాగే ఎవరైనా ప్రయత్నించాలనుకుంటే,మన పెద్దవారు చూపిన రాచబాట బాల్య వివాహాలు ఉండనే ఉన్నాయి . నిర్ణయం మనదే . అలా జరగకుండా చేసిన చట్టాలు మనం చేసుకున్నవే . పిల్లల్ని యదేచ్ఛగా (ఆంబోతుల్లా) మన సంస్కృతి పెంచ మనలేదు . పది మంది తో మనసు చరించాక పెళ్ళికి అర్ధం ఏమిటి ?ఎవరూ బాధ్యత వహించరా ?ఇలా ఎమీ తెలియని స్థితిలో పిల్లల్ని వదిలేసి మన సమాజం చాలా ఎడ్వా న్స్ అయిందని ఎలా అనుకుందాం ?రొజూ వార్తలు చదివి ,విని బావురు మంటే సమస్య తీరుతుందా ?మగవారు చాలా బిజీ కదా !రిటైరయిన పెద్దలు ,మళ్లీ పెద్ద ఉద్యోగాలే చెయ్యాలి గాని, ఇటువంటి సామజిక సమస్యలకోసం అన్ని కోర్టుల్లో  కేసులు వేస్తే ఎందుకు సమస్యలు పరిష్కారం కావు ?పూర్తిగా ఆడపిల్లలు తమకు వేరే స్కూల్స్ కావాలని, లేకపోతె చదువు మానేస్తామని ,చాలా గట్టి పోరాటం చెయ్యాలి . దీనికి ఇప్పటి వరకు ఉన్న బాధిత కుటుంబాలు ఏకమై కృషి చెయ్యవలసిన సమయం ఆసన్నమైనది .   దయచేసి ఈ విషయాలను పట్టించు కోండి .    
         శ్రీరామునికి 14సం /వయసులో జ్ఞాన బోధ జరిగినంత మాత్రాన ఆయనేమీ సన్యాసులలో కలవలేదే , రామపట్టాభిషేకం అనంతరం సుభిక్షంగా రాజ్యపరిపాలన  చేసి అవతార పరిసమాప్తి చేసాడు . పిల్లలకి తాత్విక విషయాలు చెప్పడమే అనవసరం అన్నట్టు తయారైంది సమాజం . అలాని ప్రత్యేక బోధ కాకున్నా , ఎన్నో  విషయాలు చదువుతూ,ఇంట్లో చర్చించే అలవాటువలన పిల్లలలో ఎన్నో మంచి విధానాలు ఏర్పడతాయి . మరి మనకున్న ఋషి రుణం ఇలా కదా తీరేది . సమయం లేదనే మన వాదన తప్పించుకోవడమే . నిజం మనకి రెండు ,మూడు తరాలుగా అలవాటు తప్పింది .సమయంలో ఏ మార్పు లేదు . పేపర్ ,T V,సినిమా స్నేహితులు,ఏదో ఒక దానికి ప్రతివారి మనసు అంకితం.దీనికన్నాఉన్న ఆయువులోకుటుంబం ,సమాజం ముఖ్యం కాదా?ఎంతో వాగ్మయం ఉంది ,చదివే ఓపికుంటే ,అనేక సాధనాలున్నాయి విజ్ఞుల ఉపన్యాసాలు ,ఎంతో సాహిత్యం వినడానికి . కానీ తెలుసుకుని ఇంట్లో చర్చించే బాధ్యత పెద్దలది . పిల్లల భవిష్యత్తుకు చాలా చిన్నప్పటినుంచి వీటిని ఇంట్లో ప్రవేశపెట్టడం వలన వారికీ ఇది అత్యంత సహజంగా అనిపిస్తుంది .
              దీనివలన ప్రతిపని శ్రద్ధతో ,లక్ష్యంతో చేస్తారు .  పూర్తిగా కమిట్ అయ్యారో లేదో , పెద్దలకన్నా పిల్లలకే బాగాతెలుసు . నిజానికి మన శాస్త్రాలు పని ఎలా ,ఎందుకు చెయ్యాలో చెప్పాయి గాని . చేసి తీరాలని శాసించ లేదు .పరంపరలో గురువులు ,తల్లి ,తండ్రి వీరి ద్వారా శాసించ బడాలనే సత్యాన్ని మనకు సూచించాయి . కానీ కౌమర దశ నుంచి వీరిని మన సమాజం పట్టిoచుకోవడం మానేసింది . బాహ్యావసరాల కోసమేగాని  నిజానికి పూర్తిగా వీరి కనుసన్నల నుండి తప్పిoచుకొనే ప్రయత్నమే గాని ,చెప్పేదాన్ని మననం చేసుకునే అలవాటు మానుకున్నాము . ముందు మనవి చేసినట్లు ఇవి ఎంత మాత్రమూ విజ్ఞులకు చెందవు .అలాగే వయసు పెరిగినా నిజాలు ఒప్పుకోలేని వారి కోసము కాదు . సంపూర్ణంగా తెలుసుకోవాలని , వీలైనoత కుటుంబానికి ,సమాజానికి తమ సమయాన్ని కేటాయించాలనే స్పృహ ఉన్న వారికోసమే, వారి  పాదాలకు సవినయంగా సమర్పిస్తున్నాను .      
             మనమోక్ష సామ్రాజ్యానికి ఇవన్నీ మెట్లే . మీరు నమ్ముతారా ?ఎలాగో ఒకసారి చూద్దాం . ముందుగా రాసినట్టుగా ,శివుడు ,శివాని.  యజమాని ,యజమానురాలు . వీరు విశ్వకర్మతో ఒక భవనాన్ని కట్టించి దానికి గృహ ప్రవేశ నిమిత్తమై పురోహితునిగా బ్రహ్మకు మనుమడైన, రావణ  బ్రహ్మను పౌరోహిత్యానికి ,పిలిచారట . చాలా ప్రశస్తం గా కార్యక్రమం పూర్తి చేసిన రావణ బ్రహ్మ ,దక్షిణగా ఆ ఇంటినే కోరాడట . దాన్ని చివరికి వాడికే ఇచ్చేసారు ఆది దంపతులు . పురాణ గాధ అయినా ,ఇది నిజంగా జరుగుతున్నదే . వధూవరులు తాము ఏకమయ్యా మని అనుకున్నా  జరుగుతున్నది ,శివా శివుల సంగమమే . అందుకే జగత్తంతా శివాత్మకం . వధూవరుల ఐక్యం తో కలిగే శిశువు వారిద్దరి గృహ మైతే ,అందులో ప్రవేసించే జీవాత్మ రావణ బ్రహ్మ . అందుకే వారికి ఊహతెలిసి, అహం భావన తెలిసేవరకూ పసిపిల్లలను పరమాత్మ స్వరూపంగా చూస్తారు .
               నెమ్మదిగా అహం ప్రతిపత్తి పెరిగాక పూర్వజన్మ కర్మానుసారం శరీరాన్ని తనదేనని భావించి ,పంచ భూతత్మకమైన శరీరం తానుగా తలచి ,అసత్యాన్ని, సత్యంగా నమ్మడం అనే మూర్ఖత్వం వల్ల మాత్రమే  మృత్యువును పొందు తున్నాడు . తనదికాని వస్తువును తనదనుకొంటే కలిగే దుష్పరిణామ మిదే . దీన్నిం చి బయటపడే సాధన ఎలాచేయ్యాలో చెప్పేదే రామాయణం .
                         ఈ రకంగా చూస్తే సంపూర్ణంగా మనదనే భావన లేకుండా సర్వమూ పరమాత్మ స్వరూపంగా భావిస్తూ జీవించ డానికి మాత్రమే మనకు హక్కు ఉంది . ఇక్కడ ఏదీ మనదికాదు . ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడు అంతా తనదైనా, ఏమికానట్టు విచిత్రంగా ఉంటుంది . వదలి వెళ్ళాలన్నా పెద్ద బాధ ఏం ఉండదు . ఇదే జీవ స్థితిగా అర్ధం చేసుకొంటే ఈ జగత్తు చాలా ప్రశాంతంగా ఉంటుంది . ఇది అర్ధం అయితే కన్యా దానానికి అర్ధం ఉంది .
                ప్రతిదాన్ని తనకు ఆపాదించుకుని  నిజాన్ని గ్రహించడం కూడా ఒక విధానమే . అందుకే ఎవరైనా బాధను అర్ధం చేసుకోకపోతే ,ఈ బాధ నీకొస్తే తెలుస్తుంది ,అంటూ ఉంటాం . రావణాసురుడెవరో చూశాం కదూ . కొంచెం పరిశీలిస్తే బ్రాహ్మణుడు ,గొప్ప వేదవిద్యానిధి . అపురూప తపో సంపన్నుడు . ఎన్ని ఉన్నా, ఎక్కడ పొరబాటు  పడ్డాడో తెలుసుకోనివ్వని అజ్ఞానం అతన్ని కమ్మేసింది . దీన్నే మన శాస్త్రం కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలు ,అనే ఆరుగురు దొంగలని వర్ణించింది . ఇవి జీవ లక్షణాలు . మనలోనే ఉన్న దైవ లక్షణాలు కావు . దేముడు ,జీవుడు, ఇద్దరూ,ఒకే చెట్టును [శరీరం]ఆశ్ర యించి ఉన్నారని, ముండకోపనిషత్ తెలియజేస్తుంది .
           నిజానికి మనం నిద్ర పోతున్నాం . కలలో ఎక్కడో చిక్కుకున్నాము . ఇది మనకే నిజం కానప్పుడు , అంతరాత్మ ,సర్వే సర్వత్రా నిండి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని ,మనకు దగ్గరగా చూపించాలన్న తపన తప్ప , అంతటి మహోపనిషత్తుకు వేరే కారణమేం లేదు . పైనచూసిన దుర్గుణాలు జీవ లక్షణాలు కనుక అహం పరిచయ మైనప్పటినుంచి తొంగి చూస్తూనే ఉంటాయి. ఇవి నరుని లక్షణాలు, వాటంతటవే వస్తాయి . ఇప్పటి స్థితి నీరు పల్లమెరుగు . నారాయణుడి స్థితికి చేరాలంటే తిరుమల మెట్లెక్కవలసిందే .
            ఇప్పుడు తల్లి ,తండ్రి ,గరువు,వీరి మార్గ దర్శనంతో ,పసిపిల్లవానిగా [పిల్లగా]అహం ప్రారంభమైనప్పటి నుంచి ,ఊతమిచ్చి పిల్లలను మెట్లెక్కడం నేర్పినట్లు ,వారికి చాలాచిన్నప్పటి నుంచి శాస్త్ర జ్ఞానాన్ని రంగరించి వారికందేంత క్రిందికి తెచ్చి నెమ్మదిగా  ఆ ఊతంతో ఒక్కో మెట్టు ఎక్కేలా చూడాలి . మీ కంటిదృష్టి ఒక్క క్షణం కూడా వారినుంచి మరల కూడదు . శ్రీ కూర్మం[తాబేలు] తన గుడ్లను స్మరించడం వలన పిల్లలౌతాయట  . అలాగే మన దృష్టి ఎప్పుడూ పిల్లల నుండి మరలించ కూడదు . అంత ఏకాగ్రత పెద్దలకుంటే పిల్లలు శ్రీ రాముడవడంలో ఆశ్చర్యమేం లేదు . ఇక్కడో విషయం గమనిద్దాం . తాబేలు తనలో తాను ముడుచుకుని ఉంటుంది . దీన్ని చూస్తే తత్వ చింతనకి తమని తాము సమర్పించు కున్న వారికే ఇది సాధ్యం . రాముడంటే నారాయణుడే కదా ? నరుడు నారాయణుడయ్యే ప్రస్థానం .      
     శ్రీ కూర్మావతారుని తన విశ్వరూప దర్శనం చేయించమని ప్రార్ధిద్దాం.కూర్మం స్థిరత్వానికి గుర్తు.దేవ,దానవులు, పాలకడలి మధించేందుకు ఆధారంగా ఉన్నట్లే,మనలోచెలరేగే సంఘర్షణకు,ఎల్లప్పుడూ తోడుండి,జీవుని  గమ్యానికి  చెర్చే మన ప్రయాణం స్థిరంగా సూటిగా జరిగేటట్లు ఆశీర్వదించమని ప్రార్ధిద్దాం.ఈ ప్రయత్నoలో దేవతలకు  అమృతము ,నారాయణునికి లక్ష్మి ,సముద్రగతమైన సంపదలు ,దేవలోకానికి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము,లోకాలకు చంద్రుడు ,ఎలాలభించాయో ,అలాగే అందరికీ అన్నీ లభించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు .
         కూర్మావతారం రాకముందు ఒకసారి ఈ ప్రయత్నం జరిగినప్పుడు ,మేరువు ఆధారం లేక సముద్రం లోకి  పడిపోతున్నపుడు దేవతల ప్రార్ధనపై  నారాయణుడు కరుణామూర్తి అయి కూర్మవతారుడైనాడు . మన సాధనలోను జరుగుతున్నదిదే . నిజానికి మన సాధనలో నిర్దిష్టమైన అంతర్ముఖత్వం  లేక పోవడమే మనకున్న పెద్ద అడ్డు .  మేరువంతటి మహా మనిషికైనా ,మేరువంతటి మనస్సు జగత్తనే సముద్రంలో మునిగి పోతూనే ఉంటుంది .నారాయణుని కృపతో అంటే ,నారాయణు డంటే వర్తమానం,అలాగే వ్యాపకత్వం . మన  ఇంద్రియాలను మన లోనికి తీసుకుని ఇంతకు ముందు క్షణం కానీ [భూత]అలాగే రాబోయే క్షణం [వర్తమానం]గానీ మనసులోకి రాకుండా మన వునికిని గుర్తు పట్టడానికి ఊపిరి బిగిస్తే అదే ప్రాణాయామం . ప్రాణాయామం అంటే ఉరికే గాలిని క్రమబద్ధంగా పీల్చి వదలడం కాదు . ఈస్థితిలొ మన  ఉనికి మన  శరీర మాత్రమని మన కనిపించదు . మన శరీరం, వ్యాపకమైన ఉనికిలో అదికూడా ఉందని తెలుస్తుంది .
                 నిజానికి ఇది గమనిస్తే ఈ స్థితి కూర్మావతారనిదే . దీంట్లో ఎంత స్థితిని సాధిస్తే . మిగిలిన వాటి విలువ అంతా మనకు తెలుస్తుంది . అమృతత్వమంటే శరీరం మాత్రమే మన ఉనికి కాదని ,ఉనికిలో శరీరం కూడా భాగమని అందువల్ల మరణం ఉనికికి లేదు . కనుక అమృతం లభించినట్లే . ఉనికి ,వ్యాపకత్వము అనుభవానికి అందినపుడు నారాయణ స్వరూపునికి మోక్షలక్ష్మి జత కూడినట్లే కదా . సంపదలు అంటే ఇంకా పొందవలసిన దేదో ఉందనే భ్రాంతి . ఇది తొలగి పోతుంది . సకల సంపదలూ పొందినట్లే . కామధేనువు అంటే కోరినవన్నీ ఇచ్చేదని ,కోరికే లేకుండా చెయ్యడంవల్ల ,కామధేనువు దొరికినట్లే కదా . సంకల్ప మాత్రంచేత కోరిక తిర్చేదే కల్ప వృక్షం . సంకల్పమే లేని స్థితిలో ఎన్ని కల్ప వృక్షాలున్నా వాటి అవసరమే లేదు .చరించే మనస్సే ఇంద్రుడు .కదలక పొతే ఐరావతం ఎందుకు ?నిజానికి కదలని మానసిక స్థితి ఐరావతం . మనస్సును చంద్రునితోను పోలుస్తారు . భూమి చుట్టూ తిరుగుతాడు . ఈ స్థితిలో మనస్సుతో బాటు మీరుండరు . పృధివి తత్వమైన మీకు మీ ఉనికిలో మనస్సు ఏమీ ఇబ్బంది పెట్టకుండా మీకు దర్సనమిస్తుంది . అంటే ఎప్పుడూ జగత్తులో పరిభ్రమిస్తున్న మనస్సు మీ సాధనకు సహకరిస్తుంది . అంటే జగత్తులో మునిగిన చంద్రుడు పైకి రావడమన్నమాట . వీటిని సిద్ధులలాగ భ్రమిస్తూ మన మనసును భ్రమ పెడుతున్నంత కాలం ,సీత చూసిన మాయ లేడిలా మన మనస్సు జనారణ్యమంతా తిప్పుతూనే ఉంటుంది . మనం దసేంద్రియ రూపుడైన దశకంఠు నికి చిక్కినట్లే . కనుకనే శ్రీకూర్మనాధుని సూచన పాటిస్తే నారాయణుడే అవుతాము . 
                 నిరాకారానికి చేరువ చేసే సాకార స్వరూపం ముఖ్యంగా నారాయణ రూపం . స్వామి రూపాన్ని ఒకసారి దర్శిద్దాం . స్వామిని పాదాల వద్దనుండి తలవరకూ చూడాలని పెద్దలంటారు . ఇందుకు మనం చూసిన కూర్మావతారం, కదిలే జగత్తుకు కదలడానికి ఆధారం అయింది . అలాగే మనం నిలబడాలంటే పాదాలే ఆధారం .  అలాగే కనిపిస్తున్న ప్రపంచానికి కనపడని పరమాత్మేఆధారo .కానీపాలల్లోప్రతీ అణువులోవెన్నఉన్నట్లే , జగత్తులోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నది పరమాత్మే . చూడాలంటే గోపికగా మారాలి . జగత్తులో పరమాత్మను పాలలో  వెన్నలా సాధించుకోవాలి .             పాదాలు చూడడం అంటే కూర్మావతారంలో మనం దర్శించిన ఉనికిని స్మరించాలి . నిజానికి పాదాలకు అంటే ఎవరి పాదాలైనా ఇదే అర్ధం . నారాయణుని పాదాలు దర్శించాం కదూ . నాలుగు చేతులు . అమ్మ శ్రీవత్స రూపంలో అమరి ఉంది కదూ . తనవి ,అమ్మవి రెండు +రెండు ,నాల్గు చేతులు . శంఖం ,చక్రం, గద, పద్మం ఆయుధాలు ఆభరణాలైనయి . శంఖం ,నిజానికి మనవద్ద కూడా ఉంది . ఎలాగంటే మనకున్న కంఠస్వరమే . పాంచజన్యమా నీకు నమస్కారం .త్యాగరాజ స్వామి, స్వరం మనేది ,నాభి ,హృత్ ,కంఠ,రస ,నాసా అని ఐదు  స్థానాల  నుండి  జనిస్తుందని సవివరంగా తెలిపారు.శోభిల్లు సప్త స్వర అనే కీర్తనలో . 5చోట్ల పుట్టింది ,పాంచజన్యం. శబ్దమే దీనికి అర్ధం . ఇది భగవదత్తమైన ఆభరణం మనిషికి . శరీరం నుండి బయటకు వచ్చే గొప్ప విషయమేదైనా ఉందంటే అది మాట ఒకటే . దీన్ని మనం కూడా ధరించాo . ఎంత గొప్పగా వాడితే అంత గొప్ప విజయం . పిల్లలకు ఈ విషయం బాగా అర్ధం అయ్యేలా చూడాలి . దీన్ని అవసరమైనప్పుడు చాలా గొప్ప ఆయుధంగా వాడగలగాలి .
                  చక్రరాజం . తండ్రీ సుదర్శనా నీకు నమస్కారం .సు _దర్శనం . బాహ్యమైన కంటికి ఏది కనిపించిందన్న దానికన్నా ,దాంతో మనం ఏం చూస్తున్నామో దానికిచ్చే ప్రాధాన్యం . అదే సుదర్శనం. నిజానికి చూసేవాడిని చూసే నేర్పే సుదర్శనం. చూస్తున్నది మనమనేదాన్ని మనమెంత కాలంగానో నమ్ముతున్నాం. నిజమేమిటో పరిశీ లిద్దాం. అన్ని అవయవాలూ ఉన్నా శవం చూడలేదు. అందులో ఉండవలసిన తత్వమేదో అది లోపించిoది . నిజానికి చూడడం,వినడం,ఇలాంటి పాంచ భౌతిక విషయాలన్నీఆ లోపించిన తత్వం వల్లనే సాధ్యం. జీవించి ఉన్నప్పుడు కూడా ఆ వ్యవహారాలన్నీ శరీరం ద్వారా జరుగుతున్నాయి కానీ శరీరమే చెయ్యడం లేదు. మనం పట్టకారుతో పని చెయ్యవచ్చుగానీ,పట్టకారుకు స్వయంగాపనిచేసేశక్తి లేనట్లే,శరీరానికి లేదు. శరీరాన్నిపట్టుకుని పని చేఇంచేదాన్ని తెలుసుకొనే నేర్పే సుదర్శనం. అంటే మన ఉనికితో తాదాత్మ్యం చెంది ,పంచేoద్రియాలు వాటి పనులు చేస్తుండగా చూసే నేర్పు సుదర్శనం. అంటే సాక్షి భావం శరీరం పట్ల కలిగిఉంటే ,స్వామిత్వం సిద్ధించి నట్లే. ఇది ఎవరో ఇచ్చే పట్టా కాదు. తను నీరు త్రాగితే తన దాహం తీరినట్లు,తన కోసం తనే చేసే సాధన. ఎందరు గురువు లైనామార్గ నిర్దేశం చెయ్యగలరు కానీ,ఎవరి బదులూ వారు మంచి నీరు త్రాగాలేరు. ఈ అనుభవానికి కావలసిన సూక్ష్మత సుదర్శనం . నీ కిదే నమః  శతాoజలి .అంతేగాక సమయాన్ని పరమాత్మ స్వరూపంగా తెలిసి క్షణమైనాకాలచక్రంలో వృధా కాకుండా చరించే వారిని సుదర్శనుడు రక్షిస్తాడు. అనంతమైన కాలము పునరావృతమౌతుంది . అందువల్ల కాలం కూడా సుదర్శనమే .        
     కౌమోదకి -అమ్మా నీకు నమస్కారం.మానవుడు-పుణ్య,పాపాలు రెండూ సమమైనప్పుడు కలిగేదే మానవ జన్మ. మానవుని అమ్ములపొదిలో పుణ్య పాపా లనేవి ,కష్ట ,సుఖాలుగా మారి ఒకదాని తరువాత ఒకటిగా కాలం అనే ధనస్సుకు సంధింపబడి మన అనుభవంలోకి వస్తాయి. ఇది పురాకృతం. ఇంతేకాదు ఈ జన్మలో మనకు ఏదైనా సాధించే పురుష [జీవ అనేగానీ ,ఆడ ,మగ అనే అర్ధం కాదు.]ప్రయత్నం,కూడా మన సొంతం . విద్య వస్తుంది మన పురాకృతం సూచిస్తుంది . చదివితే వస్తుంది . పురాకృతం కదాని చదవకుండా రాదు . ఇలాగే ఏదైనా సరే ఉండడం పురాకృతమైతే   ,దాన్ని వందరెట్లు చేసే విధానం పురుషప్రయత్నం. ఈ సమయంలో ఈ ప్రయత్నాన్ని శాస్త్రానుసారం ఎవరినీ నొప్పించక చెయ్యగలిగితే అది ఉత్తమ విధానం. ఇందులో మనం  ఎంత ఓర్పు వహించినా దానికి గుర్తింపేమీ ఉండదు . మన పనులు మనం చేసుకుంటున్నాం, కనుక ఓర్పు మనపని నేర్పుగా చేసుకోడానికి సహకరిస్తుంది . కానీ ఇంత వరకూ సజావుగా మంచి మాటలు చెబుతూ [శంఖం]కాల స్వరూపాన్ని గుర్తెరిగి అంటే ఏ సమయానికి ఏ పని ఎంత వరకు అవసరమో తెలుసుకుని [కాలచక్రం]చేసినంతవరకు పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడౌతాడు . అమ్మా కౌమోదకీ నీకు నమస్కారం .        
                    ఇంత వరకూ పుణ్య స్వరూపాన్ని చూశాం. పాప మంటే నిజానికి కాలం కలిసి రాక పోవడమే . పాప ఫలం, దుఖః స్వరూపంగాముందు నిలుస్తుంది. ముందు చెప్పుకున్న రీతిగా జీవ స్వభావమైన ,6దుర్గుణాలు తమ ,తమ స్వభావాన్ని మనమీద ప్రయోగించడం ప్రారంభిస్తాయి. ఈ వేగంలో తనమీద తన పట్టు కోల్పోయి ,గుణ ప్రభావానికి లొంగిపోతాడు.  జరగవలసిన అనర్ధం జరిగి పోతుంది.పాపాన్ని శమ దమాదులతొ జయిం చలేనప్పుడు దండోపాయం తప్పదు. స్వామి ఆయుధాలేవి మనకంటికి అదే రూపంతో కనిపించవు. అలాగే దండన రూపంతో గదను గుర్తు పట్టవలసిందే . దండించిన ఆ స్వరూపo మనకు పాప నివృత్తిని ప్రసాదించిన విషయాన్ని, దుఃఖం లో మునిగి ఉన్న మనస్సుఎంత మాత్రమూ గుర్తు పట్టనివ్వదు. అందుకే కష్టకాలాన్ని ఎంతో ఓర్పుతో దాటే ప్రయత్నం మన ఇతిహసాలన్నిటిలో సహజం. ఈ సమయంలో జీవ స్వభావమైన దుర్గుణాలను గుర్తుపట్టి వాటి నీడ కూడా పడకుండా జాగ్రత్త పడితే ,జగన్నాధుడే మళ్లీ మనచక్రం తిప్పుతాడు . కౌమోదకీ నీకు నమస్కారం .
               పద్మం ,శ్రీమన్నారాయణుడు ధరించిన పద్మానికున్న ప్రాశస్త్యాన్ని ప్రకటించడాని కేమో అమ్మ రెండు చేతులలోను పద్మాన్ని ధరించి మనలను అనుగ్రహిస్తున్నది. పద్మం=జ్ఞానం,ఇది తెలియని వారుండరు.ఏజ్ఞానం? ఆత్మజ్ఞానం. అన్ని పరిమిత జ్ఞానాలను తనలో కలిగి జీవన్ముక్త స్థితినిచ్చే పారమార్ధిక జ్ఞానమే నిజమైన జ్ఞానం. మిగిలిన ఏ జ్ఞానమైన ఆ పూట చేసిన భోజనం తో మరొపూట ఆకలిని తీర్చలేనట్లే ,అనంతమైన అజ్ఞానాలకు అనంతమైన జ్ఞానాలు. లౌకిక విషయాలకు ,మళ్లీ,మళ్లీ జనన మరణ చక్రంలో ,భ్రమింప జేసేస్వర్గాదివ్యామోహాలు వీటిని కూడా సూచించ వచ్చు. కానీ తానే పరమాత్మగా తనను తాను గుర్తించగలిగే ఆత్మబోధ కలిగించే జ్ఞానమేకదా జ్ఞానం.ఇప్పడు మనమనుకునే పాంచభౌతిక జగత్తే పద్మం ఉండే బురదగా భావిస్తే,దుంప కుటుంబమే.కుటుంబానికి ఆధారం జగత్తే. కానీ తన స్వయం ప్రతిపత్తితో తనలోనుండే నీటిబొట్టును అంటకుండా ఉండే ఆకులను,సూర్య సంపర్కంతో పూసే పద్మాలను కలిగిన కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవేమిటో చూద్దాం . సమాజంలో ఉంటూనే అందరికీ సహకరిస్తూ ,అందరి సహకారంతో జీవిస్తున్నా తమకుటుంబ నేపధ్యాన్ని,పరంపరను పాటిస్తూ మన ముందు తరాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. పాంచ భౌతిక విషయాలకు ,ఎంత ప్రాధాన్యత నివ్వాలో అంతే ఇచ్చి,మిగిలిన సమయమూ,శారీరక శక్తి, తత్వ విచారణే ధ్యేయంగా దేన్నీఅంటకుండా ఉండడమే, తామరాకు మీద నీటి బొట్టు స్థితి.ఈసాధన ఇచ్చేపరమపావనస్థితి జ్ఞానం. అనంత కాలంలో ఎన్నో శరీరాలు . ఇప్పుడు పూర్వపు శరీరాలతో  ఏ సంబంధం లేదు . కానీ ఇప్పుడున్న వాటితో ఎప్పుడూ విడిపోమన్న డాంబికం . ఎందుకిలా అనిపిస్తోంది . ఇందులో నిజమెంత ?ఇంతకు ముందు మనం చూసినట్లు జీవ స్థితి వల్ల ఈ జగత్తులో తనకు సంబంధం ఉన్నవన్నీ తనతో ఉంటాయనిపిస్తుంది . కానీ తను ఉండడం ,ఎందరో వెళ్ళినా అసలు మనం వెళ్ళడం నిజమనిపించదు.మనదేహంలో పరమాత్మ ఉనికి దీనికి కారణం.ఉనికికి ,రాక ,పోక,లేనందువల్ల ఈ భావం సహజ స్వభావం గానే భాసిస్తుంది. ఇది నిత్య నూతనం,అంతే సహజం.దీనిని శరీరంతో సహా మిగిలిన జగత్తుకు అన్వయిం- చడం వలన మాత్రమే జీవి అజ్ఞాని అని పిలవబడుతున్నాడు. ఈ కారణం చేతనే మోక్షగామి కావలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. తన పరిచయంలో ఉన్న శాశ్వతత్వం ఒక్కటే సత్యం. మిగిలినదంతావేదాంత పరంగా మిధ్య.
                   ముండకోపనిషత్, జీవుడు ,దేవుడు ఇద్దరూ ఈ శరీరంలోఉన్నారని చెప్పింది కదూ కొంచెంఓపిగ్గా పరిశీలించి,నిద్రలోవచ్చేకలలోకనిపించే,అన్నిదేహలలోను మనఉనికేతప్పవేరే ఏమీలేదని ఎవరూ  చెప్పకుండానే తెలుస్తుంది . కానీ శాస్త్రాలు ఇదే విషయానికి అన్వయిస్తే ఒప్పుకోము,కలలో అక్కడి ప్రపంచమే నిజం. మెలకువలో యిలలో ఉన్నదే నిజం . కానీ ఒక కల ఒక జీవితమనుకుంటే ,నిద్రిస్తున్న మీఉనికి అన్నికలలూ చూస్తున్న సత్తా అనుకుందాం . కలలు ఎన్నివచ్చినా , ఆవస్తు సంభారాలు మారిపోతున్నా మీరేమి ఇబ్బంది పడరు .
          కానీ ఇప్పుడు మన పరిచయంలో ఉన్న వస్తువులకు ,మనుషులకు వాటి నిజ స్వభావాన్ని, తెలియక బాధ పడుతున్నమేగానీ వేరే కారణం లేదు .ఒక ఇంటిని చూశాo . బావుంది అనుకుందాం . ఇప్పుడెలా ఉన్నామో అలాగే గడపవచ్చు . పెద్ద అవసరం ఏం లేదు . దాన్ని మరచి పోవడం కన్నా దాని మూలాన్ని పరిశీలించడం అవసర మంటుంది శాస్త్రం . ఇటుక ,సిమెంట్ ,కొద్ది ప్రదేశం . వేరే ఏం లేదు మనం మర్చిపోలేనంత . అలాగే పాంచ భౌతిక విషయాలన్నిటి పట్ల సరి అయిన అవగాహన పెరిగితే అలాగే కుటుంబంలో కూడా పెంచితే ఎన్నో అనర్ధాలు తప్పుతాయి . దీనర్ధం ఎదగడమే తప్పని నా ఉద్దేశం కాదు . అదే సమయంలో వాటిపట్ల తగినంత వైరగ్యమూ అవసరమే . పద్మాన్ని స్వామి చేతిలో ధరించాలంటే మూలాన్నించి వేరుచేయక తప్పదు కదా . జ్ఞానం వైరాగ్య సంపన్నమైనప్పుడే నారాయణ స్వరూపమైన పరబ్రహ్మ చైతన్యమై మన సత్తా స్వరూపంగా భాసిస్తుంది
          పద్మ స్వరూపమైన పరబ్రహ్మ జ్ఞానానికి నమ స్సుమాంజలి .      ఇలా ఎన్ని దేవతా రూపాలైనా సంపూర్ణంగా ఆత్మ తత్వాన్ని మాత్రమే ప్రతిపాదిస్తాయి . కూర్మావతారం   చూశాo కదా,ఇప్పుడు యజ్ఞ వరాహ మూర్తిని దర్శిద్దాం. భూ వరాహమూర్తి గోవిందా గోవింద . భూమి రక్షించ బడాలంటే యజ్నమే ఆధారం . యజ్నమంటే కామ్య కర్మ కాదు . ఈ సృష్టి అంత యజ్నవేది . దానికి ఆధారం భూమి . తాను ఆహారం భుజించడం దగ్గరనుండి ,తను చేసే ప్రతి పని యజ్ఞ భావంతో చెయ్యడమే నిజమైన యజ్ఞం . అది లోపిం -  చడం అనే విషయాన్నీ,మనకు హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకు పోయి నట్లుగా చెప్పడం జరిగింది . అవతరాలన్నీ  నారాయణుని ఉనికిలోని వివిధ రూపాలు . మన సాధనకు మనకే అన్వఇంచు కోవడం సాధనలో సహాయం అవుతుంది అనేది నిర్వివాదాంశం . మన సాధనకు తప్పక ఉపకారo అయ్యేలా ఇవన్నీ కధల రూపంలో మన ముందుంచారు . నిజానికి ఎప్పుడూ సంపద, ఇంక వేరే ధ్యాస లేకపోవడమే ,హిరణ్యాక్షుని స్థితి . ఆ లోభం అనే సముద్రంలో మునిగిన యజ్ఞ ఆధారమైన భూమి అంటే తన అస్తిత్వాన్ని కూడా మరవడమే ,దీన్నుంచి మనను బయటకు తీసుకు రాగాలిగేదే యజ్నభావన.
             పైన తీసుకున్న విధంగా , కర్తృత్వం లేని కర్మాచరణే యజ్ఞము. చిన్న పిల్లలు ఆడే గుజ్జన గూళ్ళు. అంటే ఏదైనా తినే పదార్ధం తెచ్చి వండుకునేవి,ఆడుకునేవి బొమ్మలన్నీ తెచ్చి , అమ్మ,నాన్న,పిల్లలు,యిరుగు,పొరుగు వారు, ఇలా గంటలు,గంటలు అడతారు. కానీ ఇది వారిలో ప్రతిబంధకమయ్యే ఎలాంటి కర్తృత్వ భావనను ఇవ్వదు. అలాగే మనకు నిత్యకృత్య జీవనాన్నిబొమ్మలాటంత,సర్వసాధారణ విషయంగా తీసుకుని,తత్వసాధనను తన నిజ జీవితంగా,గడప గలగాలంటే,పిల్లల బాల్యావస్థను,పెద్దలు ఎంతగా శ్రద్ధగా,తపస్సుగా,స్వీకరిస్తేతప్ప,ఇదిసాధ్యం కాదు పిల్లలు ఎంత ఆడుకున్నా,చదువు అనేదాన్ని విస్మరించ వలసినదిగా భావించరు. ఎందువలనoటే,మనం వాళ్ళ ఆటలను పట్టించుకోము,కానీ చదువుపట్ల చాలా శ్రద్ధ చూపిస్తాము. అందువల్ల వారు దేనిపట్ల ఎంత అనే స్పష్టతను పొందుతారు. కానీ ఈ విషయాల కంటే పరమై,మనను మళ్లీ ఈ జనన మరణ చక్రంలో పడనివ్వని ఏ జ్ఞానం నిజమో దాని పరిచయమైనా కలిగించడం మన ధర్మం. దీనికి యవ్వనమే సరి అయిన సమయం. చదువును ఎంతో శ్రద్ధగా చదవడం పరిచయం చేసిన వారికి ,తగిన సమయంలో జీవితపు ముఖ్య విలువలను తెలియజెయ్యడం పెద్ద కష్టమేం కాదు. ఆడుతూ,చదువుతున్నపుడు,చదువు వైపు ఎలా డైరెక్ట్ చెయ్యాలో తెలిసిన వారికి ఇది అసాధ్యమేమీ కాదు.
              కానీ విస్పష్టమైన విజ్ఞానం సొంతమై ఉండాలంటే,పిల్లలు వారి చదువు హైస్కూలుకు చేరిందంటే,పెద్దలు వీరిని యవ్వనంలో దిద్దడానికి అవసరమైన తత్వజ్ఞానాన్ని అందించడానికి తగిన శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నంలో ఉండక తప్పదు. ఇలా చెయ్యాలంటే ఒకరు సంపాదన పట్ల శ్రద్ధ వహిస్తే,రెండవవారు,కుటుంబానికి అంకితం కాక తప్పదు.ఉన్న సమయాన్నీ,శక్తిని,పట్టుదలని కలిపి, భవిష్యత్తయిన పిల్లలకు సరి  అయిన సమయంలోసహాయపడే,మన ధర్మాన్ని మనకు సాధించి పెట్టే శాస్త్ర జ్ఞానాన్ని,సాధన చేస్తుపోగా కలిగే అనుభవ జ్ఞానాన్ని అందుకుని కృతకృత్యులయే అవకాశాన్ని ఒదులుకోకూడదు. ఇది వారి జీవిత విధానాన్ని శాసించగలుగుతుంది. జీవితపు ఎన్నో మలుపుల్లో ధైర్యాన్నిస్తుంది. కర్తృత్వం లేని కర్మాచరణను, యజ్ఞ స్వరూపంగా అందిస్తుంది. మన అస్తిత్వాన్ని మన కళ్ళముందుంచి,భూమిని నీటిపైకి తెచ్చిన యజ్ఞవరాహ మూర్తికి నమ స్సుమాంజలి .ఇందులో హిరణ్యాక్షుడి లోభాన్ని చూశాము .
               ఓం నమో లక్ష్మీ నరసింహా నమో నమః . ఈ విషయంలో మనం క్రోధ స్వరూపుడైన హిరణ్య కశిపుడి రూపాన్ని పరిశీలిద్దాం. లోభి అయిన వాడికి తన వస్తువు ఎవరు తాకినా క్రోధం వస్తుంది . అందువల్లనే హిరణ్యాక్ష, హిరణ్యకసిపులను అన్న దమ్ములుగా పరిచయం చేసింది శాస్త్రం. మనిషి తనకున్న లోభాన్ని ఎవరు గుర్తు పట్టినా వారిపట్ల క్రోధాన్ని పొందడం సహజం. సంపద పట్ల తనకున్న వ్యామోహాన్ని గుర్తు పట్టిన విష్ణువుతో పోరాడిన ,తన అన్నను సంహరించిన విష్ణువుతో విరోధాన్ని కోరితెచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. కక్షతో తపించాడు. కక్ష ఎంత ఉన్నా,సకల స్వరూపమైన విష్ణు స్వరూపం,తపస్సులోని గొప్పదైన శక్తిని ప్రహ్లాద రూపంగా ప్రసాదించాడు పరమాత్మ. తపో ఫలం ముందుగానే ప్రకాశించింది . క్రోధం వలన ఆ విషయం తెలుసుకునే సామర్ధ్యం తగ్గింది . క్రోధం వలన తనను తాను పరిశీలించుకునే శక్తిని కోల్పోతాడు మనిషి. అందువల్లనే లోభాన్ని ,క్రోధాన్ని రాక్షస స్వభావంగా పరిచయం చేస్తుంది శాస్త్రం. సర్వే సర్వత్ర ప్రకాసించే పరమాత్మ ఎక్కడ అనే ప్రశ్న మనందరి తరుఫున వేసాడు ,హిరణ్యకశిపుడు ,స్తంభంలో అంటే ఈ శరీరమనే స్తంభంలో ప్రకాసించే పరమాత్మ తానుగా తెలుసుకున్న తాను,ఇప్పటివరకూ తాననుకున్న అహం తను కాదని తెలుసుకుంటాడు .మనిషిలో లోభ ,క్రోధాలు త్రుంచ బడాలనేదే శాస్త్ర అవగాహనం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహా నమో నమః .
          ఓంనమోవామన రూప పరబ్రహ్మణే నమోనమః .మదమనేది ఎంత ప్రమాద కరమో చెప్పేదే వామనావతారం . ప్రహ్లాదుడంతటి భాగావతోత్తముని మనుమడైనా ,బలి తన పూర్వపు రాక్షస గురువు వలన హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు ఎంత మంది నశించారో గుర్తు పట్టలేదు . అతని సూచన పాటించని ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు . ఇందు వల్లనేమో,గురువు రూపంలో వటువై ప్రకాశించాడు పరమాత్మ . అంతేకాదు ఎన్ని యజ్ఞాలు చేయించినా శుక్రాచార్యుని ద్రుష్టి మార్చుకోమని, కన్నుపొడిచి మరీ శాసించాడు. గురువైన వారు వారి దృష్టి కోణాన్ని కాపాడుకోవడంతో పాటు,శిష్యులను గమనించి వారిలోని అతిశయాన్నించి వారిని కాపాడవలసిన బాధ్యతను వహించ వలసి ఉంటుంది. ఇంద్రుని పదవిని పోగొట్టి ,అతని తల్లి ఆగ్రహానికి గురి కావడం వలన కదా బలి  పాతాళానికి పంప బడ్డాడు . నిజానికి మనిషి ఎంత మేరకు తన అవసరాలను కుదించుకుని జీవనాన్ని గడపవచ్చునో ,అదే సమయంలో శాస్త్రానికి గౌరవమిచ్చి చక్కని సాధనతో అతను పొందేది మూడడుగుల రూపంతో తనకు తెలిసిన పరిమిత అహాన్ని పాతాళానికి త్రొక్కి సర్వే సర్వత్రా ప్రకాశించే పరమాత్మా స్వరూపాన్ని తన స్వ స్వరూపంగా గ్రహించిన వానికి మదమెక్కడిది? మదముంటే అణచి వెయ్యక తప్పదు . ఎన్ని సుగుణాలున్నా అన్నిటినీ హరించి వేసే స్వభావం అహంకారాని[మదం]కుంది . ఇది అణిగితే విష్ణువు వామనుడై పాతాళంలో బలి ముంగిట కాపలా ఉన్నట్లు ,మీకిచ్చే సహకారం మీకు తెలియదు . శ్రీ మహాలక్ష్మి మీ ముంగిటికి కాంతి నిస్తుంది .
ఓం నమో వామనరూప పరబ్రహ్మనే నమః .      
 ఓంనమోభార్గవరామాయ నమః .
           క్రోధమే అయినా అది ధర్మరక్షనార్ధం లోకోపకారం ఎలా అవుతుందో తెలిపే అవతారమే పరశురామావతారం . తండ్రి ఆదేశంతో, తల్లి చిత్త చాంచల్యానికి ,శిరచ్చేదానికి కూడా వెరవని ధర్మదీక్షా పరుడు,అదే సమయంలో తండ్రి యొక్క అపారమైన తపస్సంపన్నతపై అచంచల విశ్వాసాన్ని లోకానికి చాటి , తల్లిని ,తన తండ్రి తపోబలంతో పునరుజ్జీవింప చేసేందుకు తండ్రిని ప్రార్ధించిన కర్తవ్య దీక్షా దక్షుడు పరశురాముడు. ఒక క్షణ కాలమైనా చలించిన చిత్తానికి ఏపాటి సంస్కరణ అవసరమో,వనితలకు తెలిసేలా చేసిన ధర్మావతారం పరశురామావతారం.ఎంతటి పరాక్రమ వంతుడైనా కార్తవిర్యార్జునుని ,నందిని ధేనువు పట్ల,బ్రాహ్మణులపట్ల  కలిగిన కుదృష్టికి దండించి 21సార్లు క్షత్రియ సంహారం చేసి , గో ,బ్రాహ్మణ సంరక్షణం చేసే శ్రీ రామావతారం వచ్చేవరకు , వేచి ఉండి, గో,బ్రాహ్మణ రక్షణ యొక్క పరమావస్యకతను లోకానికి ,ఉగ్రతతో చూపడం అంటే, ఎంత శ్రద్ధ ఈ విషయాల పట్ల అవసరమో,తెలియజేసిన పరమ పావన మూర్తి భార్గవ మూర్తి . మాములుగా విషయాలు వినకపోతే ,మనం కూడా పిల్లలకు కోపగించి చెప్పడం మన అనుభవంలోనిదే. కానీ అది వారి మంచికే.        
      భగవద్గీత ,వసిష్టగీత ,వంటిదే త్రిపురా రహస్యం అనే తాత్విక గ్రంధం. దీనిని పరశురామ,దత్తాత్రేయ సంవాద రూపంగా మనకందించారు.విష్ణు ధనువును శ్రీ రామునికిచ్చి,తన తపోబలం క్షీణించగా,విరాగి అయిన భార్గవ రామునికి ,కదులుతున్న మేఘంలా వచ్చి,దత్త దర్శ నం  చేసి అత్మజ్ఞానివి కమ్మని ఆదేశిస్తాడు స్కందుడు . ఎన్నో పరీక్షల  అనంతరం పరశురామునికి ,శ్రీ విద్య ఉపదేశం చేసి ,తగిన పరిణతి ననుసరించి ,తత్వజ్ఞానాన్ని ఉపదేసించాడు శ్రీ గురుమూర్తి . ఎంతటి తపోబల సంపన్నుడైనా,శారీరక బల సంపన్నుడైనా ,ధర్మమూర్తి అయినా , తత్వజ్ఞాన పరిణతి మాత్రమే గమ్యంగా మనకు రామావతారం ,కృష్ణావతారం ,పరశురామావతారం నిర్ద్వందంగా తెలియ జేస్తున్నాయి . ఓంనమో భగవతే పరశురామయ నమో నమః .
          ఆధ్యాత్మిక  గురుదేవులు శ్రీ రమణులు త్రిపురా రహస్యం గురించి ఎన్నో పర్యాయాలు ఉటంకించారు . సామాన్య సంసారులకు తత్వసాధన పరంగా కలిగే సందేహాలకు ఈ గ్రధం చేసే ఉపకారం మహోన్నతం . ఇది శ్రీ రమణాశ్రమం తెలుగులో అందుబాటులో ఉంచింది . అంతేకాక శ్రీ అనుభవానందసరస్వతి ఉపన్యాసాలు  [చిన్మయానంద]  శిష్యులు హిందిలో ప్రవచనాల రూపంలో ఎంతో విశిష్టంగా ఉన్నాయి . smiling swami'channel .  వంటివి  ఎన్నో మన ఊహకు అందని స్థితిని ప్రసాదిస్తాయి . ఓంనమో భగవతే శ్రీ రమణాయ .
                శ్రీ సీతా రామ, లక్ష్మణ , భరత, శత్రుఘ్న, హనుమత్, స్వరూప పంచాయతన పరబ్రహ్మణే  నమః .     శ్రీరామ . హనుమత్సేవిత శ్రీరామనామం . శబ్ద పరబ్రహ్మo .శ్రీ  రామోపనిషత్తు 'శ్రీ' సీతగాను, 'రా'రాముని గాను , 'మ' జీవునిగాను ప్రస్తావించింది . అరణ్యానికి వెళ్ళే రామ లక్ష్మణులకు మధ్య సీతమ్మ నడిచింది . కానీ అయోధ్య చేరే వేళ , హనుమంతుడు సేవించే వేళ రామునికిరువైపుల సీతా ,లక్ష్మను లున్నారు .తాత్పర్యంగా ఉపనిషత్తులో,  తపించిన జీవుని ఉద్ధరించి, మాయ గా తను రాముని ,లక్ష్మణునికి మధ్య నుండి తొలగి ,పరబ్రహ్మ శక్తియై సీతమ్మ రాముని ప్రక్కన జీవుని చేర్చి తరింప జేసినది . శ్రీరామ నామం,దృశ్యంగా, వ్యతస్తంగా చెప్పడం శాస్త్ర రహస్యం .
          పరబ్రహ్మమే రాముడైనా,ఇలలో ధర్మావతారమై,ధర్మ సంస్థాపనకు ,మానవుడైనందున తత్వ జ్ఞానాన్ని ఆలంబనగా స్వీకరించి తన కర్తవ్యాచరణకు , మానవుడు ఎలాసంస్కరించబడాలో నిరూపించిన పరమ కారుణ్యా - వతారం శ్రీరామావతారం . 6దుర్గుణాల్లో కామాన్ని రావణాసుర రూపంలో పరిచయం చేసింది . రామాయణం . దాన్ని నిర్జించే విధానం శ్రీరామాయణం .నిజానికి పంచ భూతాత్మక ప్రపంచానికి చెందిన సకలము పరమాత్మదే. ముందు చూసినట్లు, పరమాత్మ స్వంతమైన ప్రకృతిని [సీతను]తాను ఆశించడం ,అనేది,కామం అనుకున్నప్పుడు ,ప్రతిజీవి జగత్తులోనికి ప్రవేశించి ,పూర్తి అజ్ఞానంతో ,తన శరీరంతో సహా తనదేమీ లేకున్నా ,అన్నితనవనే భావంతో ఎప్పుడూ తాదాత్మ్యం చెంది నిజాన్ని పూర్తిగా మరిచాడు . తనవైతే తను పుట్టినప్పుడు వెంట రాలేదు . వెళ్ళేటప్పుడు వెంట రావు .ఇది మాములుగా వినేమాటయినా ఒక్క క్షణం కూడా నిజమనిపించదు . ఈ భావనకు పునాది శరీరంలో పరమాత్మ తత్వము ,పాంచ భౌతికమైన శరీరము కలసి ఉన్నందువలన ,ఇది శివ ,శివాని తత్వమే . తాను శరీర పర్యంతంగాభావిస్తున్నఅహం,తాను కానేకాదు . ఇది నీటిలో చూసే సూర్య ప్రతిబింబం వంటిదే .పూర్తిగా అలానే కనిపించినా ఇందులో ఏ నిజములేనట్లే ,శివా ,శివుల క్రీడలో ఏర్పడిన నీడను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జీవునిగా భావించి ,కర్తృత్వాన్ని ఆపాదించుకుని ఎన్నో జన్మలను పొందుతున్న జీవ భ్రాంతిని విడిచి ,రాముని వలె ఆత్మ తత్వాన్ని అనుసంధానం చేసినప్పుడే దశేoద్రియ రూపుడైన రావణాసుర సంహారం సాధ్యం . ఇంద్రియాలకు లొంగి నపుడు దశాననుడైతే ,తనస్వాధీనం లో ఉంచినవాడు దశరధుడు ,ఇతనిని గుణాలు సేవిస్తాయి . వారే భార్యలు . సాధకుడు గుర్వాజ్ఞను శిరసావహించి తన  జీవితాన్ని యజ్ఞంగా భావిస్తే హృదయంలోకలిగే సత్యము ,ధర్మం , న్యాయము ,భక్తి అనే నాలుగు సద్గుణాలే ,రామ,లక్ష్మణ ,భరత, శత్రుఘ్నులు ఇవికలిగిన తర్వాత మాత్రమే , తత్వానుసంధానంసాధ్యం . గురుకృపతో[విశ్వామిత్రుడు]  దీనివలనతాటకి,ఖర,దూషనాదుల వంటి అంతః శత్రువులను  గెలిచి ,శివ ధనస్సనే[దేహ భ్రాంతిని]తుంచి ,అయోనిజ[స్వ స్వరూపమైన] అయిన స్థితిని , [సీతను ] పొంది ఉన్నా,పురాకృతం వలన ఏర్పడిన ప్రారబ్ధం, జీవితారణ్యంలోకి రజోగుణం[కైకేయి]ద్వారాతప్పక తీసుకు పోతుంది.
     స్వ స్వరూప,స్థితి మాటిమాటికి జారిపోతూనేఉంటుంది.వాయుపుత్రుని సహాయంతో[ప్రాణాయామంతో] గొప్పదైన బుద్ధి బలంతో ,శరీరాన్ని తన స్వరూపంగా భావించే అహం రూప అజ్ఞానాన్ని[రావణాసురుని ] ఆలోచనలు వారధిగా వేసి ,వాటిని అంటక , సాక్షిగాఉన్న పరబ్రహ్మ చైతన్యమే తన ఉనికిగా మోక్ష సామ్రాజ్య సిద్ధి కి శ్రీరామ నామ సహాయంతో కదులుదాం. సర్వే సర్వత్రా ప్రపంచంలో, శ్రీ రాముని దర్శించే వారికి, వాయు పుత్రుడు సీతమ్మను,తప్పక, హృదయ సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చెయ్యడానికి అంజలి బద్ధుడై సహకరిస్తాడు.ప్రపంచ మంతా తనది కావాలనే రావణ విధానాలకు తిలోదకాలిస్తే,తనదనేదేమిలేని అవగాహనా స్థితిలో,సర్వం రామ మయమైతే,అమ్మ సీతమ్మ,మనోరూపమైన ఆంజనేయుని సహకారంతో, పట్టాభిషేకానికి రామునితోబాటు వచ్చి చేరుతుంది.దీనికి ,సకలమూ రామునిదని తాను నిమిత్త మాత్రుడనని,శ్రీరామ పాదుకలను సింహాసనంపై ఉంచి నంది గ్రామం నుంచి పాలించిన,బుద్ధి రూపుడైన భరతుని లక్షణం బుద్ధికి కలగాలని,అందరూ చేసే ప్రార్దనే,అన్ని దేవతా స్తోత్రాలలో ,ఆయా దేవతా గాయత్రీ మంత్రం రూపంలో 'ధియోయోనః ప్రచోదయాత్'అనే గొప్ప ప్రయోజనం కలగాలనే తపనతో పూర్తి అవుతుంది. బుద్ధి ప్రచోదితమైతే,తాను నిద్రిస్తున్నా సకలమూ యధాతధంగా ఉన్నట్లే మెలకువగా ఉన్నా అంతా పరమాత్మ దని,తాను కర ,చరణాలు కదపడానికి కూడా పరమాత్మే కారణమనే శాశ్వత అవగాహనేభరతుడై,ఈపుడమిపై రామరాజ్యప్రతిష్ట,ప్రతి వ్యక్తి హృదయంలో జరగాలని ఆశిద్దా.
                       శ్రీ సీతారామాభ్యాం నమః.       
              తనలో తాను సాధించుకొనే ఆత్మజ్ఞానాన్ని శ్రీరామావతారంగా భావిస్తే ,జీవిత రణరంగంలో ఎలా నెగ్గుకు  రావాలో సంపూర్ణంగా తెలయజేసేదే కృష్ణావతారం . ఓంనమో భగవతే వాసుదేవాయ . మోహ గ్రస్తులైన కౌరవులతోను,కంస,శిశుపాల,దంతవక్రులను అణచి,ధర్మాన్ని నిలిపే పరమ పావన కృష్ణావతారం . నవనీతంలా ఈ జీవితమనే ,పూర్తిగా నీళ్ళు కలసిన బక్కచిక్కిన ఆవు పాలల్లో ,ఏ కొంచెమైనా దొరుకుతుందేమో చూద్దాం . జననమంటే శరీరం అనే కారగారంలోకి ప్రవేసించడమే. అర్ధరాత్రి ,అజ్ఞానమనే దట్టమైన చీకటి.
               వసుదేవుడు,దేవకి . పురాకృత కర్మ స్వరూపం. శరీరాన్ని విడిచి కర్మఫలాన్ని మూట కట్టుకుని వెళ్ళిన  జీవిలోకూడా,ప్రకృతి పురుష తత్వాలు ఇమిడి ఉంటాయి. అవి మళ్లీ శరీరంగా వ్యక్త మౌతాయి. ఈకారణంగానే ఎన్ని జన్మలైనా విడదీయలేని బంధంగా చెప్పబడుతున్నది ఈ ప్రకృతి ,పురుష బంధాన్నే కానీ,బాహ్యమైన స్త్రీ ,పురుష సంబంధాన్ని కాదు. ఒకే శరీరంలోని శివా శివుల కున్నంత బంధాన్ని కలిగి ఉండాలన్న తపన భార్యా,భర్త కలిగి ఉండాలన్న అబేధ దృష్టిని మన శాస్త్రం మనకిచ్చింది.
          పురాకృతమైన కర్మ స్వరూపమైన దేవకీ,వసుదేవుల నుండి, నంద,యశోదల గృహమైన వర్తమాన శరీరానికి తీసుకురాబడిన వాడు ,శ్రీకృష్ణుడు .  కర్మ ఫలాలతో ఎలాంటి సంబంధం లేకున్నా,అలాగే జనన మరణాలకు అతీతమైన తత్వమైన,నిరాకర పరబ్రహ్మతత్వంశ్రీ కృష్ణుడు.జీవులకు ఈ తత్వం తెలిసి,తాము,నిరాకర పరబ్రహ్మమే అనే స్వ స్వరూప జ్ఞానాన్నిపొందేవరకు,జీవులకుసాక్షిరూపమై,వారితో ఉండి,చివరగా మోక్ష సామ్రాజ్యానికి పట్టా- భిషిక్తుడ్ని  చేస్తాడు.శ్రీ కృష్ణుని చౌర్యం గురించి చూస్తే,సృష్టి రహస్యం,లీలగా తోస్తుంది.పరమాత్మ,పాలలో వెన్నలా సృష్టిలోదాగిన వైనం తెలియజేస్తుందీ చోర లీల.అలా పరమాత్మతత్వాన్నిసృష్టి అంతటిలో పరికించే వారికి,పరమాత్మ యశోదకు ఎలా దొరకి దొరకనట్లు ఉంటాడో,చివరకు కృపతో, యశోదకు అందినట్లు 'అత్యతిష్ట దశాంగుళం'అని వేదాలు వర్ణించిన స్వామి,మనకు అవగాహనను, బుద్ధి యోగంగా ప్రసాదిస్తాడు.  పురాకృత కర్మ భంజనమే, దేవకీవసుదేవుల కారాగార విమోచనం.బంధానికి కారణమైన అహంరూపమైన కంసవధ అనివార్యం.
                  దీనిని మనం తత్వ పరంగా రాముడు యోగ వాసిస్టంలో తెలుసుకున్నట్లు చూశాం. కృష్ణావతారంలో లీలగా మనం గ్రహించ వచ్చు. ఈ సమయం రెండు అవతారాలలోను కిశోరావస్థగా మనం చూశాం. నిజానికి తత్వ పరమైన ఊహా చిత్రాన్ని మనం పిల్లలకు పరిచయం చెయ్యవలసిన సమయం ఇదే .
          తత్వ పరంగా అహం నిర్మూలనం జరిగినంత మాత్రాన ,శరీరం పడిపోదు. అలాగే ఏ శక్తులు కొత్తగా రావు . ఏ భౌతిక విజ్ఞానం వలన, తాను,ఎటువంటి భౌతిక మార్పులు పొందనట్లే,ఆత్మ జ్ఞానం వలన కొత్తగా ఏదో జరుగు - తుందనుకోవడం అజ్ఞానం. ఎక్కుపెట్టిన బాణం తన గమ్యాన్ని చేరినట్లే శరీరం ,తను వెంట తెచ్చుకొన్న ప్రారబ్ధాన్ని, పూర్తిచేసి పడిపోతుంది . కానీ అహం లేని కర్మాచరణ కారణంగా,తిరిగి జనన మరణ ,చక్రంలో చిక్కుకోదు  . ఇదేకదా మోక్షం . శరీరమున్నంత వరకు జీవన్ముక్తుడు.శరీరం పడిపోతే విదేహ ముక్తుడు.
        తత్వపరమైన అవగాహనతో జీవించే వారికి భూత,భవిష్యత్,ఆగామి కర్మలతో బంధం ఉండదు. ఎలా అంటే దశరధుడు పోయినప్పుడు అతని ముగ్గురు భార్యలకు వైధవ్యం ప్రాప్తించి నట్లే,సాధకునకు కర్మబంధంవిడిపోతుంది. అహం లేనప్పుడు దానిని ఆశ్రయించిన కర్మలు ఎలా మనగలవు ?అహం నిర్మూలనతొ పురాకృతం నశించి నప్పటికీ ,ప్రారబ్ధ రూపంగా కనిపిస్తున్నది, కాలిన కాగితపు ముక్క వంటిదే. ఇది శరీరం పడినప్పుడు లుప్తమై పోతుంది .తెలియక పొతే బ్రహ్మ విద్య ,తెలిస్తే కూసు విద్య అని సామెత.తత్వం శ్రవణం చేస్తూ ఉండగానే తాదాత్మ్యం చెంద గలగడం,ఉత్తమ శిష్య లక్షణం. నిజానికి సూర్యునికి మనకు మధ్య మబ్బులు ఉన్నాయనుకుందాము. కానీ మన శరీరంలో మనం భావిస్తున్న,ఆత్మకు,పరమాత్మకు దూరం ఏమాత్రం మనకు తెలియదు. మనం సూర్యునికి వేరైనప్పుడు మధ్యన మబ్బు చిరాకు పరచవచ్చు. సూర్యుడే మీరైతే మబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయనడం ఎంతవరకు సబబు?ఒకనిమిషం ఊపిరి బిగించి చేసే ప్రాణాయామంలో మనం ఉన్నది పరమాత్మలోనే. దాన్ని పరిచయం చెయ్యడానికే,మనం ప్రతి పూజా సంకల్పానికి ,ప్రాణాయామం చేయిస్తారు . కానీ ఊపిరి బిగించి దీన్ని పొందడం వలన,మనలోని అహం ప్రజ్ఞ తాను పరమాత్మ కన్న వేరన్న ప్రతిపాదనను వదలిపెట్టదు. ఇది తెలియడం సులువే.కానీ అనుభవానికి రావడం కష్టం. ఎందువల్లనంటే ఎన్నోజన్మలలో పరమాత్మ క్రీడా వస్తువులైన శరీరాలను అహమని భావించి,భావించి తానుగా తాదాత్మ్యంచెందిన అనుభవం విడిచి పెట్టదు. జ్ఞానం ప్రతిష్టితమైతే మీరనుకునే అహం, పరమాత్మదని, మీకు దాంతో ఏ సంబంధం లేదని, అనుభవానికొస్తుంది. ఇంతవరకు చేసిన ప్రతిపాదన జ్ఞానభ్యాసానికి  పరిమితం కాకుండా అనుభవ ప్రాధాన్యాన్ని కలిగి ఉండాలి .
              కంస వధ అనంతరం, కృష్ణ ప్రస్థానం వరకు,లోకంలోతన ధర్మానికి ఏమాత్రం హాని జరగకుండా జీవించే విధానాన్ని భారతంలో పరమాత్మ మనకు అనుగ్రహించాడు .ఇప్పటివరకు మనం పరిసీలిస్తూ వస్తున్నది సాంఖ్యం అయితే ,యజ్ఞ వరాహమూర్తి పరిచయంలో ఉన్నది ,కర్మయోగం . వీటిపట్ల నిష్ట, భక్తి . ఆత్మానుసంధానం భక్తి అని నారద భక్తి సూత్రాలలో,సూత్రప్రాయంగా ఉంది. ఇది మానవులు ఎవరి పరిధిలోవారుసుఖమయ జీవితాన్ని జీవించే విధానమే గాని ,సర్వం తానే అయిన పరమాత్మకు ,ఎవరి పట్ల నైనా,బేధం కలిగే అవకాశమే లేదు.
         తండ్రికి పిల్లల పట్ల ఏ వైషమ్యము ఉండదు. వారి ,వారి కర్మానుసారం ఎవరితీరు వారిది. దీనికి తండ్రి బాధ్యత ఎంతవరకు వహించ గలడు ?సరిగా అందరికి శరీరం ఒకేలా ఇచ్చాడు పరమాత్మ. ఎక్కడైనా తేడా కనిపిస్తే అది వారి పురాకృతం మాత్రమే.'పరిధి', దీన్ని సరిగ్గా అర్ధం చేసుకుని,జీవితానికి అనుసంధానం చేసుకోవడంలోనే ఎవరి ప్రజ్ఞ అయినా దాగిఉంది. ఒక పక్షి దాని పరిధి ననుసరించి ఎంత మేరకు ఎగరగలదో దాన్ని మించదు. అలాగే ప్రతి ప్రాణికి సృష్టిలో పరిధులున్నాయి. కానీ బ్రహ్మ మొక్కటే అని వేదాంతులు చెప్పినట్లు, ఈ సృష్టిలో బేధాలేవి లేవా ?అంటే వారి పరిధి నుండి వారు చూడ గలిగిన స్థాయి నుండి మనం చూడ గలమా ?సైన్సు పరంగా ఎన్నో విషయాలు ఎన్నో పరికరాలతో ఎన్నో విషయాలను చూడ గలిగే నేర్పున్న వారికి చూపింది. కానీ అందరూ చూడవలసిన అవసరమేదైనా ఉందా ?ఎన్నో క్లినికల్ లేబరేటరీలు ఉన్నాయి,అందరూ వెళ్లి చూసేదేమైనా ఉందా ?వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ,డాక్టర్ కిచ్చినప్పుడు మందులు వేసుకుని ,ఆరోగ్యాన్ని పొందుతాము.నిజానికి,వైద్య విద్యతో గాని ,మందుల తయారీ గురించి గానీ మన కవసరమేమైనా ఉందా ?ఇది ఎంత హాస్యాస్పదమో అంతా ఒక్కటే అనడంకూడా అంతే.
       కానీ ఎవరినీ వాటిని తెలుసుకోకూడదు అనిమాత్రం నిషేధించలేదు. మీకు అర్హత,అవకాశము ఉంటే మిమ్మల్ని అడ్డు కునే వారెవరూ లేరు . దానివల్ల పొందే లాభం వారికి మాత్రమే స్వంతం . కానీ వారి విజ్ఞానాన్ని మాత్రమే కొంత మూల్యం చెల్లించి పొందగలం. అంతేగాని వారి కష్టార్జితంలో భాగం పొందలేము కదా . నిజానికి బ్రహ్మ మొక్కటే అనే చిన్న మాటను పట్టుకుని,మన సంప్రదాయాన్ని బలహీన పరచినంతగా వేరే ఏ అవకాశవాదము ఇంతగా మన సంప్రదాయాలను పడగొట్టలేదు.మనింటి మేడమెట్లు అందరం వినియోగిస్తూ ఉంటాము.కానీ ఒకదొంగ వాటిమీదుగా వచ్చి దొంగ తనానికి ప్రయత్నిస్తే వాణ్ణి ,మెట్లే కదా వాడుకున్నాడు ,అనుకుంటామా లేక రిపోర్ట్ చేస్తామా ?అలాగే  విజ్ఞులు అందిచిన అనుభవ సారాన్ని,మన ఆచార ,వ్యవహార ,కట్టుబాట్లను తప్పించుకోవడానికి వినియోగిస్తే , అలా వాడుకునే విధానాన్ని దొంగతనం అనక వేరే ఏమనాలి ? వారి కష్టార్జితం లోభాగం పొందాలంటే ,వారి ఆచరణకు వారసులం కావాలికదా ?ఆచరణ అనగానే ఎవరి ఇంటి పద్ధతులు ,వారి,వారి కులచారాలు అవసరం కదా . ఇప్పుడు మనకు మన పరిధి గుర్తు రావడం సహజం. దీన్నే మన పెద్దలు వర్ణ వ్యవస్థగా మనకి పరిచయం చేసారు. స్వధర్మం అంటే పెద్దలపరంపరగా అందించిన జీవనవిధానమే. నిజానికి  బ్రహ్మ మొక్కటే అనేదే భగవద్గీతా భాష్యమైతే అంత కష్టపడి అన్నివిధాలబోధ చెయ్యవలసిన ఆవశ్యకత లేనే లేదు.                     
       నిజానికి ధర్మ రక్షణ అనే విషయం మాత్రమే పరమాత్మను భువిపైన అవతరింప జేసింది.అందరిలో ఉన్న పరమాత్మలో ఏ భేదము లేదు. అంతవరకే అదినిజం. బింబ ,ప్రతిబింబ న్యాయంలో,బింబం ఒక్కటే కానీ, ఉపాధి బేధాల వల్ల,ప్రతిబింబాలెన్నో. ఇది కొంతమేరకే వర్తిస్తుంది.నదిలో నీరు, ఏ, ఏ పాత్రలలో ఉంటే ఆయారూపాలు పొందుతుంది.కానీ నీటి తీరు వరకు చూస్తే పరబ్రహ్మ స్వరూపమే కానీ ,పాత్రల వరకూ చూస్తే,అంతా భిన్నత్వమే.పాత్రల రంగు,శుభ్రతల ననుసరించి నీటికి రంగు ,వాసన తదితర గుణా లెన్నో. వీటివల్ల నీరు,అన్నిటిలో వేరు,వేరని అనగలమా?అదే భావం బ్రహ్మ మొక్కటే అనగల విజ్ఞుల భావన.కానీ మన పాత్ర శుద్ధత పైనే మనకు పరి పూర్ణమయిన బ్రహ్మానంద తత్వం అందుబాటులోకి వస్తుంది. దీనినే మనం ఉపాధికి తగిన పరిధిగాఅనుకుందాము.        
             పరిధి అనే విషయంలో ఉండే అవగాహన వలన మనం ధర్మాన్ని సంపూర్ణ స్వరూపంతో తెలుసుకో గలుగు తాము. ప్రతి జీవికి ,ప్రతి మనిషికి ,ప్రతి విషయానికి ,ప్రతి ఆలోచనకి దేని పరిధి దానిదే. ఒకే విషయంలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ప్రవర్తించినా ,అది ఒకరికి ధర్మ మైతే వేరొకరి విషయంలో అధర్మం కావచ్చు. ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీని చూస్తున్నారు. ఒకరు భర్త ధర్మం అయింది . వేరే వ్యక్తి అధర్మం అయింది. జీవితమంతా తన పరిధిని అత్యంత జాగ్రత్తగా కాపాడు కోవడం ఎలాగో చెప్పి ,అదే సాధనగా పరమాత్మను పొందే అసామాన్యమైన విధానాలను మనకిచ్చిందే భగవద్గీత. ఈ బ్లాగ్ ప్రారంభం నుండి పరిధి యొక్క ప్రాధాన్యం గురించి ,చర్చిస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఎవరి పరిధి గుర్తు చేయవలసి వచ్చినా ,ఇంట్లో పెద్దలకు అది బాధ్యత మాత్రమే. కానీ పాటించే పిల్లలకు కొంత అప్పటి పరిస్థితులలో యిబ్బందిగా ఉన్నా ,వారికి కొంత కాలం గడిచాక, అవన్నీ   అత్యంత    ఆవస్యకమైనవని గుర్తిస్తారు. ఎవరు ఏవిషయంలో ఎంత వరకు ఉండాలోవారే నిర్ణ యించు కోగలిగి నపుడు ఎప్పుడూ మనశ్శాంతికి లోటుండదు.         
                 భగవద్గీతలో సమాజం పక్కకు నెట్టిన విషయం,వర్ణ వ్యవస్థ అంటే అతిశయోక్తి కాదు .మన రహదారుల వ్యవస్థే తీసుకున్నా,వన్ వే ట్రాఫిక్ గమనిస్తే,ఇటువైపు వాళ్ళే ఎందుకు వెళ్ళాలి ?అటు వేపువాళ్ళు అంటరానివాళ్ళా అంటే ఏం చెప్పాలి ?ఆభావం  వ్యవస్థితం చేసినవారికుందా ?సర్వ సాధారణమైన వ్యవస్థకే అది సరికానప్పుడు , సకలలోక కర్త, స్వామి రచనలో ఇది లోపమా ?మనం ఒక కార్యక్రమం తలపెట్టాము. ఎంతో వ్యవస్థ అవసరం. దేనికి సంబంధించిన వారిని వానికి నియోగిస్తాము. ఇందులో ఎవర్నీ కించపరిచే ఏ ఉద్దేశము ఎవ్వరికీ  ఉండనే ఉండదు . ఈ విషయానికి వర్ణ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు. ఒక కార్యక్రమాన్ని ఏ కులస్థులు చెయ్యాలన్నా ,ఇది అందరూ పాటించే నియమమే. నాలుగు వర్ణాలవారు ,వారి,వారి కులచారంగా ఇంట్లో ,వివాహాలు జరిపిస్తున్నా రనుకుందాము. వంటవారికి వంటపని ,తుడిచే వాళ్ళకు తుడిచేపని ,అలాగే ఎన్నోపనులు ఎందరికో అప్పగిస్తారు. కానీ వంటచేసే వారు తుడిచే పని ,తుడిచే వాళ్ళు వంటపని చెయ్యవచ్చని ,ఏకులం వారైనా అంటారా ?దీంట్లో కులప్రసక్తి లేకుండా అందరూ ఈ విషయాన్ని ఖండిస్తారు.
           ఎన్నో జన్మల పరంపరలో, ఎవరికి ఏ ప్రదేశంలో ,ఏ ఆర్ధిక పరిస్థితులలో ,ఏవంశం లో ,ఏ తల్లి దండ్రులకు నిర్దేసించ బడిందో, ఆ జననాన్ని నిర్ణయించిన పరమాత్మ నిర్దేశం,వర్ణ వ్యవస్థకు మాత్రం ,అంటరానిదైపోయిందా ? కొంచెం పరిసీలిద్దాo .కర్తృత్వ భావంతో చేసే కర్మ వలన,పాప ,పుణ్యాలు ఏర్పడతాయనే ,విషయం మీద పునర్జన్మ సిద్దాంతం ఆధారపడిందనే విషయం నిర్వివాదం. కనుక సమాజంలో,హెచ్చు తగ్గులు మాములే. వీటితో ముడిపెట్టి వర్ణవ్యవస్థ తప్పు అనడం ఎంత వరకు సమంజసం ?పుట్టుకతోనే ఎన్నో పరిధులు,మనిషికి ఏర్పడతాయి. బాగా చదివి, ఆర్ధిక పరంగా ఎదగడానికి,వర్ణవ్యవస్థ ఏమాత్రమూ అడ్డు కాదు. పిల్లలను గౌరవనీయమైన పదవులకు చేర్చే విషయంలోనూ ఏ యిబ్బంది లేదు. వారి ,వారి మానసిక పరిణతి ,పట్టుదల ప్రధానం.
          నిజానికి ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఎవరి ఇంటిలో వారి జీవితాలు వారివి. ఇందులో విభేదించే విషయమేమీ లేదు. ఏమీ కారణం లేకుండా అందరూ ఒకేచోట వండుకుని తిని,ఒకే డేరాలో నిద్రిస్తూ బతకరు కదా. వర్ణ వ్యవస్థ లేకున్నా జీవితవిధానం ఇది మాత్రం కాదు. ఎవరి ఇళ్ళల్లో వారు బ్రతుకుతారు. ఎవరి ఆర్ధిక పరిస్థితిని బట్టి వారి , జీవిత విధానం ఉంటుంది. అలాగే ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఉన్న వారు, ఒకచోట ఉండడం పెద్ద తప్పేమీ కాదే. పూర్వం వర్ణవ్యవస్థ ఆధారంగా ఎవరి ఆచారాల కనుగుణంగా వారికి గృహ నిర్మాణం ఉండేది. ఇప్పుడైనా ఆర్ధిక పరమైన కారణాల వలన,ఎవరి కనుకూలమైన ప్రదేశాల్లో వారుంటారు. కానీ సమానత్వమని, మీ గృహ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులందరిని మీ ఇంట్లో ఉండమంటారా ?దీనికి వర్ణవ్యవస్థతో ఏ సంబంధం లేదు. హెచ్చు తగ్గులు సమాజంలో సహజం. కానీ అకారణంగా వీటన్నిటికి వర్ణవ్యవస్తే కారణమనడం ఎంతవరకు సమంజసం ?ఆర్ధిక పరమైన కారణాలకన్న, అత్యంత సూక్ష్మ మైన కారణాలు, ప్రతి మనిషి జీవితంలో కోకొల్లలు. ఒకే తల్లి పిల్లలైనా కొంతకాలానికి ఎవరిజీవిత విధానం వారిది. ఈ సమాజమైనా భేదమే లేని సమాజం అనే వీలేం లేదు.
         నాలుగు రోడ్ల కూడలి ఉంది. కలసినంత మాత్రాన, మళ్లీ ఎవరి మార్గం వారిదే. మార్కెట్ ప్లేస్ ఉంది.ఎంతోమంది వస్తూ వెళుతూ ఉంటారు. ఒకరైల్ ప్రయాణం ఉంది. పైన అనుకున్న ఏ విషయంలో నైన,మనకు వర్ణ వ్యవస్థ ఏ నిబంధనలు విధించదు. మన ఇంటిలో మన ధర్మాన్ని ఆచరించకుండా ఎవరూ అడ్డు పడలేరు. మన అలసత్వమే,కారణం, కానీ వేరే ఏమిలేదు. కొంచెం రిలాక్సు అవుదామనే,నెమ్మదిగా అన్నీ వదిలేశాం. మనం హా యి గా ఉపిరి పీల్చుకున్నాం,అనుకునేలోపు పిల్లలు ,చాలా అవసరం లేనివి ,ఎడాప్ట్ చేసుకున్నారు. మనం అన్నీ తెలిసి కొంచెం రిలాక్స్అయ్యేలోపు,పిల్లలు అసలు బంధనలే లేవు ,అని ఫిక్స్ అయిపోయారు. ఈ పరిస్థితిలో మనం మన వర్ణాశ్రమ ధర్మాలు పాటించి ఉంటే,ఇంతఅనర్ధం జరిగి ఉండేది కాదు,అని అనిపించకపోదు.ఈ విషయాలన్నీ మన సమాజంలో సగం భాగాన్ని మెలి పెడుతున్న సమస్యలు. ముందు తరాల పర్యవేక్షణలో గాని, స్వీయ పరిపక్వతతో గాని బయట పడినవారు ధన్యులు.
       సమాజం నుండి విడిగా బ్రతకమని మనను,మన వర్ణవ్యవస్థ శాసించ లేదు.ఎవరి పరిధిలోవారిని బ్రతకమంది. పరిధిని అతిక్రమించడం ఎంత ప్రమాదకరమో,మనకు సీతాదేవి కన్నా బాగా తెలిసేలా ఎవరు చెయ్యగలరు ? ఆనాడు రాముడున్నాడు సమర్ధించాడు. ఈ రోజుల్లో మనజాగ్రత్తలో మనం ఉండాలే గాని సాధారణ జీవి,ఏమీ చెయ్య లేని పరిస్థితి.మన మనసు పరిధిని అధిగమించ నప్పుడు మనకు ఓటమి లేనే లేదు. ఇది జరిగినప్పుడు మన వర్ణ వ్యవస్థ ,మనకు వన్నె తెస్తుందే తప్ప, హీనంగా బ్రతికేలా చెయ్యదు. ఉదాహరణకి కులాంతర వివాహాల ప్రసక్తే ఉండదు. ఎవరి కులాల్లో వాళ్ళకు ,వారి ,వారికీ తగిన వధూ ,వరులు లేరా ?ఇలాటివి చేసుకుని జీవిత కాలం వాళ్ళని వాళ్ళేసమర్ధించుకుంటూ,వేరే వాళ్ళకు కూడా అదే ఊబిలొదిగే సలహాయిస్తూ,తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని బతికేసే వాళ్ళు ఎంత మందో ప్రస్తుత సమాజంలో. ఎక్కడో అవసరంలేదు,మాట్రిమోనియల్స్  చాలు ఉదాహరణకి. కుల పట్టింపు లేని ,భవ్య సమాజ నిర్మాణంలోఇవే కలికి తురాయిలు.ఎన్ని విడాకుల కేసులో,ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూబ్రతికే జీవులెందరో,బాధ్యత ముందు తరానిది కాదా?ముందుతరం, మనస్సాక్షి ముందైనా,వారిని,వారు సమర్ధించుకో గలరా?హద్దులు అన్ని విషయాల్లో పాటిస్తే,పెద్దలను మన్నిస్తే,ఈ పాట్లుండేవా?ఇప్పటికి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేరా ?ఇప్పటికైనా మన  కంటిముందు కదిలే పిల్లలకు సరిఅయిన సమాజంలో,బ్రతికేందుకు ,తమ,తమ పరిధిని తప్పక పరిచయం చెయ్యక తప్పదు. ఇందుకు ఎంతగానో సహకరించేదే మన గీతాచార్యుని,గీత లోని వర్ణ వ్యవస్థ .అన్య మతస్థుల పరిపాలన,చొరబాటు, వీటి కన్నా,మనమీద ,మనకు నమ్మకం లేకపోవడమే పెద్ద శాప మైంది. అనాగరికులైన అన్య మతస్థులను చూసి ,వారిని అనుకరించి ఇంత ముప్పు తెచ్చుకుంది, మన సమాజం. ఇప్పటికీ అదే అమాయకత్వం. కళ్ళు మూసుకుని ,గ్రహగతులు లెక్కించే మన వ్యవస్థపై చిన్నచూపు. మన విలువల్ని మనమే ,విధ్వంసం చేసుకునే,బేలతనం.వివాహ బంధాన్ని గౌరవించి ఒక స్త్రీ ,ఒక పురుషుడు శారీరక అవసరమైన ,అలాగే పితృ ఋణం తీర్చగలిగిన ,శారీరిక బంధాన్ని కొనసాగించడం మన మహోన్నత సంస్కృతికి తార్కాణం. సమాజంలోని ఎన్నోరుగ్మతలకు కారణం ,అన్యమతాల వల్ల ఏర్పడిన  అవ్యవస్థ మాత్రమే. మిగిలిన మతాలలో లేనిముఖ్య విషయం కూడా ఇదే.
                  చిన్నదిగా కనిపించినా,సమాజం యొక్క పూర్తి స్వరూప,స్వభావాలను మార్చే శక్తి ఈ చిన్న విషయానికే ఉంది. పుట్టిన దగ్గర నుండి మన సమాజం పిల్లలకు ఈ విషయాలను చాలా స్పష్టంగా ,ఆచరించి చూపి నిర్ద్వందంగా శాసించింది. ఈ కారణంగానే మిగిలిన మతాలను అనాగరికం అనడం అసహజమేమీ కాదు.
           ఈ విషయానికి ఎంతో సహకరించేదే మన వర్ణ వ్యవస్థ. ఒక జంట వరకూ పరిమిత మైనదే శారీరక సంబంధం. మిగిలిన ఏ ఆలోచన అయినా పశు ప్రవృత్తి మాత్రమే. మానసికమైనా ఖచ్చితంగా దాన్ని పశు జీవనమనే అనాలి. కనిపించనంత మాత్రాన మనోకామన అయినా వ్యక్తిత్వానికి మాయనిమచ్చ మాత్రమే.మనిషి సమాజం కోసం బ్రతికే దాని కన్నాఎక్కువగా, తనకోసమే బ్రతుకుతాడు. తనకు పెద్దలు ఎవరిని సూచించారో వారితో జీవించి ,శరీరము , మనస్సు,మాట, ఒకే పరిధిలో ప్రవర్తించడం వలన ,   త్రికరణ శుద్ధి గా భారతీయుల జీవన విధానం ,ఎంతో సూక్ష్మ పరిజ్ఞానంతో వ్యక్తిత్వ పురోగతిని సాధించ గలిగింది. వీరి బలమంతా కుటుంబ పురోభివృద్ధికి,పిల్లల,మానసిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడింది. జీవించినంత కాలం ఆత్మ తృప్తినిచ్చింది. గౌరవాన్ని నిర్ద్వందంగా యిచ్చింది. ఇటువంటి  తరహా జీవన విధానంలో జీవించిన వ్యక్తికి ఆంతరంగిక బలం ఉంటుంది. ఈ తరహా వ్యక్తిని 'ఉక్కు మనిషి' అంటుందిగానీ,కండలు పెంచిన వారిని కాదు. కండలు ఎంత పెంచినా ఎన్నో కుటుంబ కారణాలు,సామజిక కారణాలు వీరిని క్రుంగదీయవచ్చు. కాని మానసికంగా దృఢoగా ఉండే వ్యక్తి జీవితంలోని ఆటు పోట్లను సులువుగా గెలుస్తాడు. అందువల్లనే పిల్లలను చాలా బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు మాత్రమే వారి ప్రపంచంగా ఉండే బాల్యావస్థ మాత్రమే దీనికి సరిఅయిన సమయం.
           అపుడు వారి పరిచయంలోకి అత్యంత పవిత్రమైన బంధాల స్పష్టత ఉండాలే తప్ప, అన్య విషయాలు వారికి అన్యాపదేశంగా కూడా తెలియ కూడదు. అంటే T.V,మనం మాట్లాడుకునే మాటలు ,పరిచయాలు ,సినిమాలు ,మన చుట్టూవాతావరణం ఇలా ఎన్నోకారణాలువారికి ,లేని పోని ఆలోచనలకు తావిస్తాయి. ఈ కారణంగానే తండ్రికి ఒక పడకగదిని పూర్వం విడిగా ఏర్పాటు చేసి ,సాధారణంగా తల్లి,పిల్లలు ఒకగదిలో నిద్రించే ఏర్పాటు ఉండేది.ఎప్పటికీ ఇది మంచి విధానమే. నెమ్మదిగా విషయాలు అర్ధమయ్యే సమయానికి ,ప్రపంచంలో అత్యంత అల్ప జీవులకు కూడా ఈ విషయం సాధారణమేనని ,మానవులకు ఉన్న కుటుంబ వ్యవస్థ వాటికి లేదని ,నాగరికతకు ముఖ్య భూమిక, కుటుంబ వ్యవస్థదేనని ,చాలా సునిశితంగా చెప్పవలసిన దౌర్భాగ్యం ,ఇతర మతాలవల్ల మనకు పట్టింది.
      ఇలాచెప్పడానికి బాధగాఉన్నా,నిజమదైనప్పుడుచెప్పక తప్పదు.విదేశాలకు స్వంతమైన10సం/వయసునుండి అందరితోతిరుగుతూ,అదేదోచరిత్ర సృస్టించామనుకునే,పిల్లలకు వారి సమాజం ఏనిర్దేశం చెయ్యగలుగుతుంది? ఎంతో మనోనిగ్రహం ఉన్నవారికే, ఎన్నో సమస్యలు ,తీసుకురాగల విషయాలు ,అంత చిన్నవయసులోవారికి అవసరమా ? ప్రతి పక్షికి,ప్రాణికి, క్రిమి,కీటకాలకు సహజమైన విషయం ,సభ్య సమాజంలో ప్రత్యేక సమయం లేకుండా ,పరిచయం చెయ్యడం అంత అవసరమా ?మానవులకు తప్ప మిగిలిన జీవులకు ,ఆహారము ,నిద్ర ,మిధునము కాక వేరే విషయాల అవసరం లేదు . మనంకూడా అవే పరిమితులకు జీవితాన్ని సరిపెట్టుకుంటే ఇంక మనకు, పరమాత్మ బుద్ధిని ప్రసాదించినందుకు సార్ధకత ఏమిటి ?
            బుద్ధి జీవులైన మానవులు కూడా ఆహార సంపాదన ,నిద్ర ,శరీర సుఖం వరకు పరిమితమైతే ,మనకున్న మేధస్సుకు ఎలా న్యాయం చేసిన వారమోతాము ?ఇవి లేకపోతె ధర్మ సాధనకు ఉపకరించే సాధనమైన శరీరం నిలబడదు ,నిజమే. కానీ వీటికే పరిమితం కాదు అనేది ,పరిచయమే లేకపోతె ఎలా ?ఇప్పటికీ  మన విద్యా వ్యవస్థ ఆహార సంపాదన లక్ష్యం మాత్రమే పరిగణన లోకి తీసుకుంది. లేదా భౌతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలపైన అవగాహన పెంచుకునే దిశా నిర్దేశం జరుగుతున్నది . మిగిలిన మతాల దృష్టి కూడా ఇంతవరకే పరిమితమై ఉంది. మన ధర్మం హిందూ ధర్మం అయితే ,దీని ప్రాతిపదిక పునర్జన్మ అనే దానిమీద ఆధార పడింది . ఇదికాదు అని వాదించా లంటే ,వాదన మాత్రమే మిగులుతుంది ,కానీ గమ్యం అనేది మృగ్య మౌతుంది .మన హిందూ ధర్మానికి మాత్రమే,మానవుడు,మాధవుడయే గమ్యం ప్రతిపాదించ బడింది. ఇందువల్ల మాత్రమే మనం మతానికి అతీతమైన ధర్మానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పే వీలుంది.మన సాధన అనే విషయాన్ని పరిశీలిస్తే,తత్వాన్ని అన్వయించినప్పుడు,అది ఎవరు పాటించినా పొందే ఫలం సమానమే. ఈ కారణం వల్లనే మనలో అన్ని వర్గాలవారు వారి,వారి కులచారంగా ఏదైతే విధించ బడిందో,ఆమార్గంలోనే తరించిన ఉదాహరణ లెన్నో ఉన్నాయి. తరించే తపన ముఖ్యం గానీ,విధానం కాదు.ఆకాశరాజు బంగారు పువ్వులకన్నా,కుమ్మరి దాసుడైన కురువరసి నంబి, మట్టి పూలను,ప్రీతిగా స్వీకరించిన శ్రీనివాసుడేగా కలియుగ దైవం. ఎన్నో ఉదాహరణలు, మనకు ఉత్తరాది భక్తుల నుండి,అలాగే ఆళ్వారులు ,ఎంతోమంది శివ భక్తులు నాయనార్లు,ఎందరో భక్తులు  కనిపిస్తారు.
        కానీ బ్రాహ్మణులే వేదం ఎందుకు చదవాలి,మిగిలినవారు ఎందుకు చదవకూడదు యిలాటి వాదనలతో కాలం వెళ్ళబుచ్చే కంటే ,ఆ సమయాన్ని వారి కనువైన సాధనకు వినియోగిస్తే గమ్యాన్ని సునాయాసంగా చేరవచ్చు. బుద్ధి అనే విషయం పరిశీలించి నపుడు దీని విషయంలో ఉన్నన్ని ,సూక్ష్మతమ  బేధాలు ఈ జగత్తులో వేరెక్కడా కనిపించవు. విద్యార్ధి దశలో ,పిల్లల వయసు ,మిగిలిన ఎన్నో విషయాల్లో అందరూ ఒకేలా అనిపించినా మేధస్సు విషయంలో ఎంతో బేధం కనిపిస్తుంది.ఇది అందరూ ఒప్పుకునే విషయమే. దీనిని పైన బాహ్య దృష్టికి అందేలా చెయ్యగలిగే సాధనాలేవి లేవు. ప్రతి వారి అవగాహనల్లో ఎన్నో బేధాలుండడం మనకు తెలిసిందే. మన కంటి ముందు కనిపించే విషయాలను అర్ధం చేసుకోలేని మనం,భగవంతుని చాతుర్వర్ణ వ్యవస్థను ఏ మాత్రం విశ్లేషించగలం ? కనిపించని ఎన్నోవిషయాలను సర్వసాధారణంగా ఒప్పుకునే మనం,భగవంతుని దిశా నిర్దేశ స్వరూపమైన వర్ణ వ్యవస్థను,సగౌరవంగా మన్నించడంలోనే విజ్ఞత ఉంది.నాలుగు వర్ణాలవారు భగవదారాధన చేసే వివిధ విధానాలు ఎన్నోఉన్నాయి.ఎవరికి నిర్దేసించిన విధానాలను పాటించి భగవత్ సాన్నిద్ధ్యాన్నిపొందవచ్చు.నిజానికి అహం అనేది శరీరసంబంధం లేనిదని,పరమాత్మకు పర్యాయ పదమని భావించే ఆత్మానుసంధానానికి వర్ణ వ్యవస్థ అడ్డు కాదే ? ఇందువల్లనే 'బ్రహ్మ మొక్కటే'అనేది అవగాహనా ప్రధానమైనదేగాని,ఆచరణకు అందుబాటులో లేనిది. దీనిని  అనుభూతి ప్రధానమైనదిగా వివేకంతో గ్రహించి,ఆచరణలో మనకు నిర్దేసించిన కులచారాలను సంపూర్ణంగా, జీవన విధానంగా జీవించడంలోనే విజ్ఞత దాగి ఉంది.
             ఇనుము అనే లోహంతో చిన్నసూది ,అలాగే గునపం రెండూ తయారవుతున్నాయి. పదార్ధంగా రెండింటిలో పదార్ధం ఇనుము,ఇది బ్రహ్మాన్ని సూచిస్తే,ప్రయోజనాలు,ఎన్నో భౌతిక విషయాల,బేధాలు కనిపించి,ద్వైత పరమైన అంశాలతో దేని పరిధిని దానికి నిర్ణయించేవి,కులచారాలు. ఇనుము తోనే మాకు సంబంధం, మిగిలిన వాటితో సంబంధం లేదు,అన్నప్పుడుమనకు ఇనుప ఖనిజం ఏమాత్రము ఉపయోగ పడదనేది, నిర్వివాద విషయం. లౌకిక పరమైన ఉదాహరణలోనే మనకు అంతుబట్టని విషయం,ఎంతో గహనమైన జన్మ,కర్మ,పరంపరకు సంబంధించిన, పురాకృత విషయాలను తెలిసిన పరమాత్మను,మనకు తెలిసిన పరిజ్ఞానంతో, అయన చెప్పినవి ,కొన్ని నమ్మి కొన్ని నమ్మము,అనిచెప్పడం  చిన్న పిల్లల తీరే  అనాలి.
          నారాయణుని పాదాలనుండి ,ముఖం వరకు దర్శనం చేద్దాం అనుకున్నాం కదూ. విశ్వరూప దర్శనం భగవద్గీతలో,పాదాలు శూద్రునిగా పరిచయం చేశాడు గీతాచార్యుడు. అలాగే భక్తు లెవరికైనా స్వామి పాదాలే దిక్కు. శ్రీ మహాలక్ష్మి పాదాల చెంతనే ఉంది.గతి ప్రదానం చేసేవే పాదాలు. మనం వినయంగా నమస్కరించేది పాదాలకే . మనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రగతి,గురువు గారి ,పాదాలను అంటే, ఆయన ప్రతిస్టితులైన ఆత్మజ్ఞానాన్ని అనుసరించడమే కదా. సేవ పరమ గమ్యమని తెలిపేదే విష్ణు పాదాలుగా పరిచయమైన తత్వం. అందుకే శిరసు వంచి పాదాభివందనం. అందరూ తలవంచి నమస్కరించే సేవా తత్వమే శూద్రత్వం అనే పేరుతొ సూచించినంత మాత్రాన ఈ సమాజం దీన్ని తక్కువ అని ఎలా భ్రమపడిందో ఆలోచించినా అర్ధంకాదు. ఈ సమాజం ఈ రూపంలో నిలబడిందంటే సేవ అనేదానికి పరమాత్మ ఇచ్చిన ప్రాధాన్యం ఎంతో తెలుస్తుంది. ఎవరైన ఇంటికివస్తే కాళ్ళు కడుగుకోడానికి నీళ్లి స్తాము,కానీ నెత్తిమీద పొయ్యం కదా. శ్రామికులు చల్లగా ఉన్నప్పుడే జగత్తు,సుఖంగా ఉంటుంది. ఈ భావాన్ని గుర్తించిన సమాజం ఎల్లప్పుడూ వారిని గౌరవించింది. ఎక్కడైనా పొరపాటు జరిగిందంటే , అది మనలను ఎన్నో దుష్ప్రభావాలకు లోను చేసిన పరాయి పాలన,మన సంస్కృతీ సంప్రదాయాలకు జరిగిన ఎన్నో పరభవాల్లో  ఇదికూడా ఒకటి మాత్రమే. ఎన్నో నష్టాల్లో అది కూడా ఒకటి గాని ,అదొక్కటే నష్టపోలేదు . దీన్ని ఎన్నో అనర్ధాలకు కారణంగా చెప్పుకోవచ్చు .
             మన జ్ఞానేంద్రియాలు ,కర్మేంద్రియాలు, మనసు ,బుద్ధి కలిపి మానవునిగా భావిస్తే ,మన బుద్ధి నడిపినట్లు శరీరం పనిచెయ్యడం మనకు తెలిసిందే. దీనినే మనకు విశ్వరూప దర్శనంలో పరమాత్మ చూపే ప్రయత్నం చేసాడు. పాదాలను సూద్రునిగాను,ఊరువులు,వైస్యునిగాను ,బాహువులు రాజు గాను, తలను భ్రాహ్మనునిగాను,వర్ణించింది గీత. నిత్యాధ్యయనం ద్వారా సకలలోక హితాన్ని పాటించే కర్తవ్యమ్ బ్రాహ్మణునికి కేటా యించి నపుడు ,బాధ్యత ఎవరిమీద ఉంచబడింది ?మీరు బాగా ఆలోచించి నిర్ణఇంచిన తరువాత ఎటు వెళ్ళాలో అటు నడక ప్రారంభిస్తారు. ఇలా ప్రవర్తించిన మీకు, మీ తల ఎక్కువనికాని ,పాదాలు తక్కువని కానీ అనిపించిందా?సంఘం తన స్వరూపంగా భావించిన పరమాత్మకు అంతా తన స్వరూపమే.తక్కువ అనే భావాన్ని పొంది స్వయంగా ఆత్మ న్యూనతకు గురి కావడం జరిగిందే కానీ ఇందులో ఏ పాటి నిజం లేదనిపిస్తుంది. ఇది గీతచార్యుని అవగాహన. ఒక శాస్త్రవేత్త రాసిన పరిశోధన ఆరంగంలో ఉన్నవారికే అర్ధం అవడం సహజం కానీ ,అందరికీ అందించే తపనలో కొన్ని వివాదాలు రావడం సహజం . కొంత పరిమితికి చెందిన వాటికే ఇంత కష్టమైతే ,సర్వజనీనమైన గీతను మన సమాజానికి   అన్వయించి, సమాజ హితానికి అందించాలనే పెద్దల తాపత్రయం ,మనకు తెలియాలంటే , ఎంత బుద్ధి సూక్ష్మత అవసరమో అర్ధం అవుతుంది.
              వర్ణాచార వ్యవహారం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక నటుడు లేదా నటి ఉన్నారనుకుందాం. ఒకే సమయంలో,బహుకోటి పాత్రలను,రూప, స్వభావాలే కాక,సకల విరుద్ధ విషయాలను,ప్రతిబింబించేలా నటిస్తే ఎలా ఉంటుంది?అదే పరమాత్మ తత్వం.మనకు అన్వయిస్తే,బిచ్చగాని పాత్ర,రాజు పాత్ర నటించినపుడు దేనికి సంబంధిం- చిన దుస్తులు మిగిలిన వస్తువులన్నీ వాడుకున్నప్పుడు,అవన్నీ ఆపాత్రకు మాత్రమే పరిమితం కదా. కధలో ఏ పాత్ర ప్రాధాన్యం దానిదే.దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో దర్శకుడు నిర్ణయించినట్లు,పరమాత్మ ప్రతి విషయానికి వాటి,వాటి పరిధి నిర్ణయించాడు. రాజు కిరీటమైనా,బిచ్చగాని గిన్నె అయినా, వీటికోసం నటులు విభేదించరు. వారి నటన యొక్క భావ ప్రకటనకు,వారు ప్రాధాన్యం యిస్తారు. అలాగే మనకు ఉన్న వనరులతో అందరినీ మెప్పిం- చడంలో ఉన్న ఘనత,రాజుగారి గద,కిరీటం పక్కన పెట్టుకోవడంలో లేదు. అవి ఎక్కడ,ఏ ఆహార్యంలో అవసరమో అక్కడ వాడడం అత్యవసరం. దీనికి దర్శకుని నిందించడం ఎంత హాస్యాస్పదమో మనకు తెలుసు.
         ఒక సాధారణ వ్యక్తిని గురించి కధ ఎంచుకున్నప్పుడు,కధానాయకుడు ఎక్కువ పారితోషకం తీసుకుని దానికి అనువైన వస్త్ర ధారణ చేస్తాడు. అంతేకాని నకిలీ కిరీటము,ఆభరణాలు ధరించడంలో ఎటువంటి ఆసక్తి వహించడు. కానీ పాత్రను ఎంచుకునే వీలు వాళ్ళ కుందని మనం భావిస్తాం. కానీ వాళ్ళు కృషితోనే దాన్ని సాధించారు. నిజానికి ఈ ప్రపంచంలో కూడా మనపాత్ర మనమే ఎంచుకున్నాము. దీనికే ప్రారభ్ధం అని పేరు. పురాకృత కర్మ. కాబట్టి మన పాత్రను మనమే రచించుకున్నాము.ప్రపంచం అంటే ఐదు వస్తువులే,ఆకాశం,వాయువు,నీరు,అగ్ని,భూమి.అసలురూపంతో,ప్రతిదాన్ని   తెలుసుకుంటే,ఆసక్తి తగ్గుతుంది. పాత్రోచితంగా ప్రవర్తించి ఉంటే,ఇది పాత్ర మాత్రమే అనుకుంటే దానికి తగినట్లు వర్తిస్తే,మనకు మోక్షమనే రివార్డు లభించే ఉండేది. ఇప్పుడుకూడా ఈ భూమ్మీద ఉన్నామంటే,ప్రపంచాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా,చూసినవన్నీ నిజమనుకోవడమే గాని వేరే కారణమేమి లేదు. లేనిది ఉన్నట్లుగా భ్రమింప జేసేదే మాయ. అదే మాయలేడి.
            దీనికి చిక్కి మన పరిధి మరిచి,ఎవరో చేసేపని చెయ్యాలనే తపన వల్లనే ఇన్ని అనర్ధాలు. మన పరిధిని నిశ్చయించి చూపేవే కులచారాలు. వీటిని పాటించడంలో లాభ నష్టాల బేరీజు ఏమీ లేదు. అలాగే తక్కువ,ఎక్కువ అసలే లేవు. మన అజాగ్రత్త మాత్రమే ఇప్పటి మన పరిస్థితికి కారణం. ఇప్పుడు కూడా అదే పొరపాటు మళ్లీ చేస్తే మన వివేకానికి అర్ధం ఏముంది ?
        పాత్రను తానుగా భావించడం అనే అవివేకం వల్లనే కర్తృత్వభావన కలిగింది.దీనివల్ల జన్మబంధం అలా సాగుతూనే ఉంటుంది. నిజంగా ఇది అగాధం కదా. దీనినుండి తప్పుకోవాలనే తపనే,మనిషికి ఎంతగా ఎన్ని విషయాలు తెలిసినా,ఏదో తెలియవలసింది ఉందనిపిస్తుంది.ఇంకా సంపాదించాలనే తపనకూడా దీన్నేసూచిస్తుంది కానీ సరిఅయిన వివరణ లేక,అంతులేని ఆవేదన మిగులుతుంది. అంతరార్ధం తెలియక దిశ మారిపోతుంది. దిశా నిర్దేశం,పరమాత్మకృపతోనె సాధ్యం.ఉదా: పిల్లలుమనమాట వింటూ,చెప్పినవన్నీ ఆచరిస్తే మీరు వారికి అవసర సమయంలో అన్నీ అమరుస్తారు. కానీ మాట వినక వాళ్ళకు నచ్చినట్లు,తలబిరుసుగా తయారైతే,చాలా మినిమం బాధ్యత వరకూ మాత్రమే పరిమితమౌతారు. ఇది మీకు వారిపట్ల అభిమానం లేనట్లా?ఈ పరిస్థితులలో మాక్సిమం చేస్తే వారికి కీడే తప్ప,మేలు జరగదు. ఇదే విధానం మన ప్రకృతి మనకు అమలు చేస్తుంది. ఇలా నష్టాలు చవి చూస్తున్నామంటే,ఒకసారి మళ్లీ తిరిగి ఆనందం మనకు ఎందుకు దూరంగా ఉందో పరిశీలించి చూద్దాం.బహుశా వస్తూ,పోతూ ఉండే సుఖం మనం ఆనందంగా భావిస్తూ ఉండవచ్చు. సుఖం,ఆనందం అనేవి భిన్న ధ్రువాలు ఒకే రేఖపై ఉన్నా అవి ఏ సంబంధం లేనివి. తనకు తానుగా తన పరిధిని,ఏ ప్రశ్న వెయ్యకుండా అవలంబిస్తే కలిగేది ఆనందం. ఇదే స్థిరమైన ప్రజ్ఞ. తృప్తిగా భోజనం చేసిన వ్యక్తి స్వీట్ ఇస్తే పెద్దగా పొంగిపోడు. ఇవ్వక పోయినా పట్టించు కోడు.మనకు మనపెద్దలు నిర్దేసించిన విధానంలో జీవించే వారికి కలిగే ప్రయోజనం ఇలాంటి తృప్తి.వీరికిజీవితంలోని సుఖ,దుఃఖాలు పెద్దగా అలజడి సృష్టించలేవు.వీరుకూడా సుఖానికి సంతోషంగానూ,దుఃఖానికి బాధ పడకుండా ఉంటారని అర్ధం కాదు. ఆనందానికి వాటితో ఏ సంబంధం లేదని, తృప్తిగా ఉండగల నేర్పు వీరి స్వంతం.
        ముందు అనుకున్నట్లు,పాత్రనే తమ స్వరూపంగా భావించే అజ్ఞానం వలన,పాత్రకు మాత్రమే పరిమితమైన సుఖ,దుఃఖాలను తమకు,ఆపాదించుకునే వారికి, సుఖం మళ్లీ వచ్చేవరకు అది కావాలనే తపన ఉంటుంది. ఇది ప్రతిబంధకమై,పరమాత్మ స్వరూపమైన ఆనందం గురించిన సరిఅయిన అవగాహన ఏర్పడదు. సృష్టిలో అన్నీ పరమాత్మ స్వరూపంగా చూడగల నేర్పు అందువల్లనే,మన శాస్త్రాలు మనకు పరిచయం చేసాయి. తన వరకు చేర్చ బడిన ఏ అనుభవమైనా, ప్రసాదంగా భావించగల నేర్పు,భారతీయుల స్వంతం. కానీ అదే సమయంలో తన పాత్ర పోషణ పూర్తిగా శాస్త్ర బద్ధంగా ఉందా?కుటుంబ మంతా ఎవరి పరిధిలో వారు ప్రవర్తిస్తున్నారా, అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.తనపాత్రోచితకర్మనుఅహంతోముడి వేసి,త్రికరణ శుద్ధి అనే దానికి తిలోదకాలిచ్చి,అన్నీ పరమాత్మ చేస్తున్నాడని,తమకేమీ సంబంధం లేదని,తప్పించుకు తిరుగు వాడు,ధన్యుడు సుమతీ !దీని కధ చాలా పెద్దది.       దీనికి అంతరంగమే సమాధానం చెప్పగలదు. ఎవరెవరి అహం ఎంతవరకు సహకరిస్తుందో అంత వరకూ దున్నేయచ్చు. వారినివారు సమర్ధించుకుంటూ ఎలాగైనా బ్రతికేయవచ్చు. కానీ చివరకు ఇది అజ్ఞానంలో పూర్తిగా కూరుకుపోవడానికి సహకరిస్తుంది. పునరపి జననం,పునరపి మరణం ,మాములే. దీనికి ఎవరు కర్తలు ?బుద్ధిని పరమాత్మ అందరికీ ఇచ్చాడు. వాడుకోవడంలో ఎవరి ప్రజ్ఞ వారిది. దీనికి పరమాత్మ బాధ్యత వహించడు. సూదితో, రెండుగా ఉన్న వస్త్రాన్ని  కలిపి కుట్టవచ్చు.
  లేదా కంట్లో పొడుచుకోను వచ్చు. దీనికి సూదిని సరిగ్గా లేదనడం మూర్ఖత్వం. జన్మ యిచ్చిన తల్లిదండ్రులు,పరిమితులను,కట్టుబాట్లను యివ్వక పోవడమే యిప్పుడు ఉన్న సమాజానికి,90%కారణం.బాధ్యత వహించకుండా చెప్పే కారణాలు అనేకం. దీనివల్ల మిగిలిన వారికి కలిగే యిబ్బంది అనూహ్యం.ఇది అన్యాయం కదా. వారికి పరోక్షంగా జరుగుతున్న అన్యాయానికి బాధ్యులెవరు ?వారిలో, సంఘంలో సరి అయిన విధానాలను తెలియజెయ్యాలనే తపన సహజం. యిది వారు చేసే తపస్సే. వారికి ధన్యవాదాలు.       నిజానికి ఏ పాత్ర గొప్పదనం ఆ పాత్రదే. దేనిని ఒక దానితో ఒకటి పోల్చే సాహసం చెయ్యకూడదు. గొప్పదనం దేనికి ఆపాదించినా భగవంతుని వ్యవస్థను చూసే నేర్పు లేనట్లే కదా.ఇతర మతాలలో కూడా వాళ్ళ వ్యవస్థను నిలబెట్టుకునే విధానాలు,వాటిని నిలిపే వ్యక్తులు,ఉంటారు.కానీ అందరు చేప్పేవారైతే మొత్తం వారి వ్యవహారం ఎలా నడుస్తుంది ?వాళ్ళెందుకు చెప్పాలి,మేమెందుకు వినాలి ?అంటే వ్యవస్థ ఎలా నడుస్తుంది ?స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ఎందుకు ఉండాలిఅనేది కూడా ప్రశ్నేనా.మనం గుర్తించ లేనివి,ఎన్నోఉన్నాయి.కొన్నిసూక్ష్మవిషయాలను ఈ సైన్స్ గుర్తు పట్టడానికి చాలా సమయం పడుతుంది. ఉదాహరణకి జ్యోతిష్యం గణన హిందూ సమాజంలో,ఆది కాలంగా ఉంది. వాటిని మిగిలినవారు ఇప్పటికి కొంతమేర గ్రహించారు.అంటే గ్రహ గతిని ఇప్పుడు కూడా ఏ ఆధారం లేకుండా గుణించే వారు మనకు తెలుసు. ఒక బ్లడ్ గ్రూప్ వారికి వేరే గ్రూప్ రక్తం ఎక్కించడం ఎందుకు కుదరదు ? అంటే,అడిగిన వాళ్ళని ఎలా చుస్తారనేది మనకు తెలుసు.దీనికి సమాధానం జ్యోతిష్యులు చెప్పలేరు. గ్రహగతిని డాక్టర్లు చెప్పలేరు. ఎవరి విద్య వారిది. అలాగే మన వేద విద్య అపారమైనది. ఎంతో గహనమైనది. అలాగే వర్ణ వ్యవస్థ కూడా ఇప్పటి సమాజానికి అంతు చిక్కనిది. కానీ విమర్సించ దగినదికుడా కాదు. అర్ధం కాకపోయినా పరవాలేదు. కానీ అపహాస్యం చెయ్యడానికి మనకు అధికారం లేదు.
    బ్రాహ్మణులు'మడి'పాటిస్తారనేది,సమాజంలో ఎంతో చులకనగా చూస్తున్న విషయం.ఉదా: పిల్లలు ఇలా ఉండాలి, అని తల్లి దండ్రులు నిర్దేసిస్తే, దానికి అనుగుణంగా వారు ప్రవర్తించాలని అందరమూ ఒప్పుకుంటాము. శాస్త్ర నిర్దేశాన్ని అలాగే పాటించడం విజ్ఞుల లక్షణం. ఒక ఆపరేషన్ ధియేటర్లోకి డాక్టర్,స్టాఫ్ ఎందుకు అంత పరిశుభ్రంగా వెళ్ళాలి? మిగిలిన వాళ్ళంతా లోపలికి ఎందుకు వెళ్ళ కూడదు ?ఇవి ప్రశ్నిoచ కూడని విషయాలు. అవి అలాగే చెయ్యాలి. అంత దూరం ఎందుకు ? ఇంట్లో కూడా వంట అపరిశుభ్రంగా ఉంటే ఎవరైనా స్వికరిస్తారా ?ఇవి పైకి మన కంటికి కని పించేవి. ఎన్నో పరిమితులున్నాయి. అమ్మ తన బిడ్డకు భోజనానికి ఎంతో గోప్యత పాటిస్తుంది.దీన్ని చాదస్తం అంటే ఏమనగలం ?అలాగే ఎన్నో విషయాలు రహస్యంగానే కొనసాగుతాయి. పడకటింటి విషయమూ అంతే.
           అంతరార్ధం చూస్తే 'మడి'అంటే దేనికి అంటనిది.పాంచ భౌతిక ప్రకృతికి పరమై, వీటి ద్వారా తెలియబడక , ఏ తత్వం నిస్సంగమై ఉందో దానిని సూచించడమే మడి పరమార్ధం. ఉదాహరణకి,కంటితో చూసి మనమున్నామని కానీ,శ్రవణం ద్వారా తెలుసుకోవలసిన అవసరంగానీ,అలాగే ఏ ఇంద్రియం ద్వారాగాని మనం ఉన్నామని నిర్ధారణ అవసరం లేకుండా తెలుస్తుంది. మిగిలినవి ఇంద్రియాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. తనంత తానుగా ప్రకాశించే తత్వాన్ని గ్రహించే నేర్పు 'మడి 'అనేదాని ద్వారా తెలియబడాలని ఆ ఆచారాన్ని బ్రాహ్మణులకు విధించారు.
       పైన చూసినది పరమాత్మస్వరూపమే.శివుడైనవాడుశివుని పూజించాలనేదిశాస్త్రం.తత్వగ్రాహి అయి,తరవాత మాత్రమే,భగవంతుని పూజించాలి దీనిని ఆచార పరంగా పాటించడమే మడి అనేదాని పరమార్ధం. మామూలుగా మన విద్యా వ్యవస్థలో ఒక తరగతి నుండి మరో తరగతికి ప్రతి సం/పురోగతి అతిసామాన్య విషయం. కానీ ఆధ్యాత్మిక పురోగతిలో ఒక జన్మలో సాధించిన పురోగతి,ఆ జన్మలో ఆగిపోకుండా మరో జన్మలో సహకారి కావాలని,జన్మ కు వర్ణాశ్రమ వ్యవస్థగా రూపకల్పన చెయ్యబడిందేగాని,మిగిలిన ఏ విషయాలకు దీనితో సంబంధం లేదు.ఉదా: పిల్లలు నాల్గవ తరగతి,ఆరవ తరగతి చదువుతున్నారనుకుందాము. తల్లిదండ్రులకు వారిలో ఎక్కువ,తక్కువ ఏమైనా ఉంటుందా ?ఎవరి పురోగతి వారిది. ఎవరి సిలబస్ వారిది. దీనిక్కూడా ఘర్షణ అవసరమా?పెద్ద తరగతివాడు ఫెయిల్ అవడని,చిన్నవాడు రాంక్ లో పాస్ కాకూడదని ఏమీ లేదు.  ఐతే భేదం అనేది చదువులు, వీటివరకే పరిమితం. ఒక మంచి స్వీట్ ఉంది. అది ఇంట్లో అందరికి సమానమే.అలాగే భగవత్కృప, అందరికీ సమానమే. క్రమానుగత పరిణతికి మాత్రమే బేధం ఉంది. ఎవరైనా కర్తృత్వ భావనను వదల గలిగితే,వర్ణచార వ్యవస్థ వారి గమ్యానికి ఏ విధంగానూ ప్రతిబంధం కాదు.అహం లేనపుడు మోక్షానికి వేరే ప్రార్ధన అవసరమే లేదు. నేను జీవిని అని గిరిని దాటడానికి చేసే ప్రయత్నమే సాధన. దాటేవరకూ ఉండేదే కర్తృత్వం. ఎవరెవరి యోగ్యతను బట్టి,మోక్ష మార్గంలో ప్రయాణించే సమయంలో,శరీరం పడిపోయినపుడు ఆజీవి యొక్క కర్మ ఫలంగా ఎక్కడ పుట్టాలో నిర్ణయం జరిపి వారిని అక్కడ,వారి ప్రకృతే ప్రవేశ పెడుతుంది.ఎవరి కలకు వారే బాధ్యులు.వేరేవారు బాధ్యులు కారు. దీనికి భగవంతుని ప్రమేయం ఏమీ లేదు. అయనసాక్షి మాత్రమే.
              అందు వల్లనే జీవించి ఉన్నంతకాలం, వారి పరిధిని అతిక్రమించ కుండా భగవంతుని నిర్దేశం ప్రకారం, ఎదుటివారికి మనం దేనిని సూచిస్తున్నమో,అదే మనం  వారి స్థానంలో ఉంటే పాటించ గలమా ?అని నిలకడగా అర్ధం చేసుకుని,అహం వీడి,స్వ స్వరూపాన్ని అనుసంధానం  చేస్తూ గమ్యానికి చేరడం లక్ష్యం.
          పురాకృతంలో పూర్తిగా నియమ పాలన,జీవులపట్ల సరియిన అవగాహన,దయ ,అహింస వంటి కారణాలతో ఏర్పడేదే బ్రాహ్మణ వర్ణంలో జననం. ఇవి పాటించిన ఏ వర్ణం వారైనా పొందే రివార్డే గానీ, వేరే ఏ భేదము పరమాత్మ ద్రుష్టిలో లేదు. బాగా చదివిన వారికి గోల్డ్ మెడల్ ఇవ్వడం ,అందరినీ ఆ దిశగా ప్రోత్సహించడానికే గాని,వారి పట్ల ఏ ప్రలోభము ఈశ్వరునికి లేదు. కానీ సంవత్సరాంతంలో వచ్చిన గోల్డ్ మెడల్,మిగిలిన వారికి తరువాతి సం /లో కదా,ప్రయత్నించి సాధించ గలిగేది ?అలాగే ఈజన్మలొ చేస్తున్న సాధన ఫలించేది, మరు జన్మకే. బ్రాహ్మణ జన్మ గురించిన వాదోపవాదాల బదులు,సమయాన్ని ఆత్మ శోధనకు ఉపయోగిస్తే  కలిగే ప్రయోజనమే ఎక్కువ,అనేది గీతాచార్యుడు,పరధర్మో భయావహహః,అని సూచించడం జరిగింది.క్రమగతిలో బ్రాహ్మణ జన్మ కలిగినా,అది తనకు ఏమి సూచిస్తున్నది,అనేది తెలియకపోతే,దానివల్ల పొందవలసిన ఫలం పొందలేరు. దీనివలన ఎక్కువగా నష్టం కలిగేది ఈ బ్రాహ్మణ జన్మలోనే. అందువల్లనే వారికి ఎన్నో నియమ నిబంధనలు పాటించ వలసిన అవసరం చాలా ఎక్కువ. నిచ్చెన చివరి మెట్టుకు చేరిన వారికే పడిపోయే ప్రమాదం ఎక్కువ. ప్రమాదంలో ఉన్నవారికే ఎవరైనా జాగ్రత్తలు చెప్తారు.అందువల్లనే వారికి ఉన్నన్ని నిబంధనలు ఎవరికీ ఉండవు. అయినా గమ్యానికి వీరి కర్మాచరణతో చేరే స్వాతంత్ర్యం ఏం లేదు. శరీరం +అహం,తాను కాదని,అహంగా ప్రకటించ బడుతున్నది పరమాత్మ అనేది అను - భవంతో మాత్రమే పొందవలసిన సమాధానం.        దీనికి విశ్వామిత్రునికి మించిన ఉదాహరణ మనకు కనపించదు. తపించి బ్రహ్మర్షి కాలేకపోయినా,బేధాన్ని మరిచి నిజాన్ని గుర్తించిన వెంటనే,వసిష్టుని ద్వారా గుర్తింపు పొందగలిగాడు. సాధన దశలో ఉండగా ఆశ్రఇంచిన త్రిసంకుడుకి దక్కిన ఫలమేదో మనకు తెలిసిందే.
        నడకకు పాదాలు శ్రమిస్తే, ఆలోచనతో బుద్ధి శ్రమిస్తే,సేద తీరాలంటే కాసేపు కూర్చోక తప్పదు. సమాజం సేద తీరాలంటే ,ఊరువుల సాయంతో కూర్చోవాలి. అదే వైశ్య వ్యవస్థ. మొత్తం వ్యవస్థకు అవసరమైన,సకల పదార్ధాలు , సమకూర్చిఅందరకి అన్నదాత లవడంలో,రైతులతోబాటు సమాన కృషిని,వస్త్రాలను,అవసర సామగ్రిని సమాజానికి సేవా భావంతో అందించే బృహత్తర ప్రణాళిక ,వీరికి పరమాత్మ పదాన్ని అందించ గలదు. కానీ వీరికుండే న్యాయ పరమైన అవగాహన లోపించినపుడు గమ్యం,మృగ్య మౌతుంది.
          ఏ అవయవాలకు ఆయుధాల వ్యవస్థ అవసరం లేదు. ఒక్క బాహువులే వీటిని ధరిస్తాయి. రాజుకు ప్రతీకగా బాహువులు సూచించ బడ్డాయి. కానీ సమాజానికి కావలసిన రక్షణ వీరిద్వారా సూచించ బడింది. వారిని వారు కాపాడుకోవడం కాదు. సమాజ శ్రేయస్సే ధర్మంగా కాపాడినవారికి పరమాత్మ అనుగ్రహానికి లోటేముంది ?వీరందరి బాధ్యత సరిగ్గా అవగాహన చేసుకుని, తగిన సలహా సంప్రదింపులను అందరికి అందించి దేశం సుభిక్షంగా ఉండేలా తగిన సమయంలోతగిన క్రతువులునిర్వహిస్తూ, ఇంటి పెద్దలా వ్యవహరించాలనే సూచన బ్రాహ్మణులకు నిర్దేశించారే తప్ప,అందరి బాధ్యతలు సమాజానికి మేలుచేసేవే,ఎక్కువ తక్కువ లేవి లేవు. ఉదా:మన ఇంటిలోని వారిలోనే , కొందరు అహంకారంతో వ్యవహరిస్తారు,కొందరు సాధు స్వభావంతో ఉంటారు. కొందరు క్రోధాన్ని,కొందరు లోభాన్ని, మరికొందరు ఈర్ష్య,అసూయ కలిగిన వారుండ వచ్చు.అంత మాత్రాన వారిని,కుటుంబం లోనివారు కాదు అనలేము. తండ్రి కాస్త కోపగించినంత మాత్రాన అతనిని  ఇంటిలో ఛిత్కరించడం ఎంతవరకు సబబు ?ఒకే శరీరంలో ఎక్కువ తక్కువ అనేవి లేనే లేవు. అవగాహనాలోపం వున్నఇరుగు,పొరుగుల మాటలు మనింటికి ఎలాటి ముప్పు కలిగిస్తాయో అదే  పరిస్థితి మన శాస్త్రాల అవగాహన లేనివారివలన, మనకు కలిగింది.
          మన శాస్త్రాల అవగాహనతో సంఘంలో ఎన్నో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు. విద్యా వ్యవహారాలకు బ్రాహ్మణ వ్యవస్థను వాడుకోవచ్చును. మొత్తం రక్షణ వ్యవస్థను రాజుల కుల వ్యవస్థనుండి గ్రహించ వచ్చును. అలాగే వ్యాపార రంగానికి వైశ్యులను నియోగించ వచ్చును.వ్యవసాయ రంగానికి,మిగిలిన ఎన్నోసాంకేతిక రంగాలకు మిగిలిన అన్ని వర్ణాలవారికి అవకాశం ఇవ్వవచ్చు. ఒక ప్రయోగంలా కొంతమందికి కొన్ని,కొన్ని శాఖలలో ప్రవేశం కల్పించి వారి సమర్ధతను పరీక్షించి,నిజానిజాలు తెలుసుకోవచ్చును. ఇవి అన్ని రంగాలకు వాడవచ్చును.   ఉదా:అన్ని శాస్త్ర,సాంకేతిక రంగాల్లోను అధ్యాపకుల అవసరం ఉంటూనే ఉంటుంది.బ్రాహ్మణులను ఆహ్వానించ వచ్చు.గురువుకు మనమిచ్చే ప్రాధాన్యమే మనకు సకల శ్రేయస్సులను యిస్తుంది.   పరిశ్రమల స్థాపన,నిర్వహణ బాధ్యత క్షత్రియ వ్యవస్థకు అన్వ యించి చూడవచ్చు. అన్నిరంగాల్లో ఉన్న వ్యాపార లావాదేవీలను వైశ్యులకు అప్పగించవచ్చు. ఎన్నో ఉద్వోగ వ్యవహారాలను మిగిలినవారికి పంచవచ్చు. పిల్లలను విద్యార్ధి దశ నుండి,ఈ దిశలో ప్రోత్సహించి మన వ్యవస్థకు న్యాయం చెయ్యవచ్చు.
         జ్యోతిష్యం అనేది ఒక కులానికి,మతానికి సంబంధించినది కాదు. పుట్టిన సమయము,చోటు వీటిని గణన చేసి ఎవరిస్వభావాన్నైనాతెలియజేస్తుంది.దీనిఆధారంగాఎవరికి తగిన విద్య,ఉపాధి విషయాలను పరిశీలించితెలుసుకుని నిర్ణయించు కోవడం మంచి విధానం. నిజానికి కొన్ని,కొన్ని సంస్థలకు నిజాయితి,కష్ట పడే తత్వం,ఇలా విభిన్నమైన అంశాలు పరీక్షించే అవసరం చాలా ఉంటుంది.దీనికి వ్యక్తిత్వ విలువలు చాలా ముఖ్యం.వీటిని వారి జాతక పరిశీలన ద్వారా గమనించి,నియామకాలు చేపట్టడం చక్కని పరి ష్కారం. మన శాస్త్రాలను విమర్శించే ముందు పరీక్షించి సరైన అవగాహనకు రావడం మంచిది. సరి అయిన సమాచారం సరిఅయిన సమాధానం సూచిస్తుంది. తప్పుగా తీసుకున్న సమాచారానికి,శాస్త్రం బాధ్యత ఎంతవరకు వహిస్తుంది ?ఇలాటి ఎన్నో మానవ తప్పిదాలకు,శాస్త్రాన్ని తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం ?
             ఒక కంచె వేసి చేను కాపాడి,ధాన్యాన్ని ,ఎండకి ,వానకి వదిలిన రైతు చందంగా ఉంది,మన పరిస్థితి. పెద్దలు  ఎంతోజాగ్రత్తగా కాపాడిన విజ్ఞానాన్నివాడుకోవడం మరచి,పరాయి వారి దయకు ఎదురుచూస్తున్నచందంగా ఉంది. నలుగురితో కలసి బ్రతకడంలోతప్పేంలేదు.మన ఉనికి మనం మరచి పోవడం తప్పు.ఎన్నోదేశాలు,మన విజ్ఞానాన్ని సగౌరవంగా వాడుకున్నాయి,యిప్పటికి మన సేవలు కొనసాగుతున్నాయి. కానీ వారి జీవన శైలిని వారు మార్పు చేసుకోలేదు. మనం చేసుకునే ఎన్నో దిగుమతులకన్నా, వారి సంస్కృతీ,సంప్రదయాలనే ఎక్కువ దిగుమతి  చేసుకున్నాము.'సెక్యులరిజం' పేరుఅంటించుకుని పూర్తిగా విదేశీ మతాలకు,మత మార్పిడులకు అవకాశం  కల్పిస్తున్నాము.  దీనికి సహకరించేలా ,వారు మనను ఎంత అవమానించినా గుర్తించనట్లు నటిస్తున్నాము. మన ఇరుగు ,పొరుగు వారు మన విధానాలను విమర్శిస్తే మనం ఊరుకుంటామా?కానీ మన శాస్త్రాలను, విగ్రహా రాధనను,విమర్శించినపుడు మన ఉదాశీనత వారికి అలుసుగా లేదా?హిందువులకు వారి శాస్త్రాల అవగాహన లేదు అందువల్ల,ఎవరూ పట్టించుకోరు అనేదే,అన్య మతస్థుల బలం. బలహీనమైన వ్యవస్థను బలపరుచుకోవడం తప్పు కాదు. కానీ ఎదుటివారి బలహీనతలను ,సోపానాలుగా వాడుకోవడం తప్పు. ఎంతో సంపద గలిగిన వారిని ,మత్తుకు గురిచేసి,నీవు పాపివి,మా దగ్గర బిచ్చమెత్తుకో అంటే,మత్తులో లేని మిగిలిన సంఘ సభ్యులు ,వారిని ఎదిరించ లేకపోవడం,శోచనీయం. పైన చూసిన విధంగా మన వర్ణ వ్యవస్థలో, ఏ విధమైన లోపమూ లేదు. విగ్రహారాధన తత్వానికి ప్రతీక మాత్రమే. అహం భ్రహ్మాస్మి అని గర్జించే,పరబ్రహ్మ తత్వాన్ని తనకు తానుగా అన్వఇంచుకుని,తన పరిధికి [పాత్ర]ఏమాత్రం భంగం వాటిల్లకుండా,నాటకంలోని పాత్ర పోషణ చేసినంత సుసంపన్నంగా జీవితాన్ని నడిపే మన కౌశలం అనన్య సామాన్యం. ఒక్క హరిశ్చంద్రుడి జీవితం చాలు,బడుగు వర్గాలకు మార్గ దర్శనం చేయ డానికి. ఒక జన్మలోనే ,రాజు ,పేద కావలసిన అవసరం ఏం లేదు. తత్వపరంగా పరబ్రహ్మమే. జీవితం రణరంగం కాదు ,నాటక రంగం అయితే సరిపోతుంది. దీన్ని జీర్ణించుకున్నఎంత లేమిలో ఉన్న వారైనా మతాన్ని మార్చు కోలేరు. విద్యా వ్యవస్థ మారాలి. ఇతర దేశాల వ్యవహారాలకు తగిన విద్యా వ్యవస్థ వారికుంది. మనం మనకు కావలసిన,మన శాస్త్ర అవగాహన పెంచే విధానాలను భవిష్యత్తుకు ,పరిచయం చెయ్యక పొతే ఎలా ?సంపదను ఎరగా వేసిమతాన్ని బాహాటంగా అమ్ముకుంటున్న విధానాలను గర్హించక తప్పదు. 
      సినిమాలతోఎంతో,బాహాటంగాపిల్లలనుఎన్నోఅనర్ధాలకుగురిచేయడం,ఎంతమందిప్రాణాలతో చెలగాటమో,మూడు తరాలుగా,దీనివల్ల ఎంత అనర్ధం హిందూ సమాజానికి జరిగిందో ఎవరైనా లెక్కించగలరా? వీటి వల్ల ఉహా ప్రపంచంలో జీవిస్తూ,జీవితాలను నరకం చేసుకుంటున్న వారెందరో. జీవితమంటే ,ప్రేమ ,వేరే కాన్సెప్ట్ జీవితానికి ఏమి లేదు. ఎన్నోజీవితాలు గమ్యం తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నయి.కారణం తమపైన సినిమా ప్రభావం ఉందని కూడాతెలియనంత మత్తు. డబ్బు సంపాదించి సినిమా రంగమంతా,వారి జీవితాలు వారు బాగానే జీవిస్తున్నారు. వారు రంగు వేసుకుని తుడిచేసుకున్నా,చూస్తున్న ఎన్నో జీవితాలు అవి చూసి మోసపోయి,తరగని ఊబిలోకి ,కూరుకు పోతున్నాయి.100సం /జీవితం. తెరమీద చూసేది ,రెండు గం . అందులో వీరి తల కెక్కేది , హీరో,హీరోయిన్ కలిసి గడిపే 10నిముషాలు. దీనికోసం జీవితాన్ని పణంగా పెట్టి చదువుకునే వయసులో పిల్లలు వేసే తప్పతడుగులకు, బాధ్యత ఏ సినిమా వాళ్ళు తీసుకుంటారు ?తల్లి దండ్రులు ఎంత తలబాదుకున్నా అర్ధం కాని వయసు. సినిమాలు చూడకపోతే పిల్లలలో విజ్ఞానం తగ్గి పోతుందా?
         చదువుకునే వయసులో వారికి సినిమా అంత అవసరమా ?దీన్ని ఆపలేమా?వయో నిబంధన విధించ లేమా? అనవసర సమయంలో,అనవసర ఆలోచనల నుండి పిల్లలను కాపాడుకోలేమా?పెద్దలలో కూడా కొద్దిమందికి,ఎప్ప- టికీ విదదీయలేని బంధం సినిమాతో ఉంది.తమ తరవాతి తరాలు ఏమైపోయినా ఏసంబంధం లేదా?ఎవరి పిల్లలను వారు కాపాడుకోవడం ఊరికి ఉపకారం కాదుకదా. బాగా చదువుకుని రాంక్ తెచ్చుకునే కొంతమంది విద్యార్ధులలో కూడా ఎన్నో  అవలక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో కలిగే శారీరిక ఆకర్షణను ,ఇది సమయం కాదని సూచించే విధానం మన విద్యా వ్యవస్థలో ప్రవేశ పెట్టడం మాని,ఇంకా వివరణ ఇవ్వాలనుకునే వ్యవస్థను ఇంత నీచంగా తీర్చి దిద్దుతున్నా ఎవరికీ పట్టదా?సామాన్యుల గోడు వినేవాళ్ళు లేరా?కో-ఎడ్యుకేషన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ? అన్ని సమస్యలకూ మూల కారణం ఇదే కదా. ఇంకా ఘోరాతి ఘోరంగా,పెళ్లి వయసు 18సం /అని చెప్పకుండా ,  'పరస్పర శృంగార అంగీకార వయసు'అని చట్టాలు చేస్తుంటే అడిగే నాధుడే లేడా?మన హిందూ సమాజానికి ఈ విషయాలతో ఏ సంబంధం లేదా ?అసలీ పదం మన సమాజం ఎలా వప్పుకుంటోంది?సమాధానం లేని ప్రశ్న లెన్నో.
             ఎన్నో ఆలోచనలు,అంతు లేనన్ని సమస్యలు. ఆలోచిస్తున్న వారే కదా ఈ బ్లాగ్ చూస్తున్నవారు. మనతో విబేధించినా,ok కొందరు ఇలా ఆలోచిస్తున్నారు అని ,చదువుతున్న మీకందరికీ ధన్యవాదాలు.
            ఎవరి పరిధి వారిది.అనేదే మొదటి మాట.ధర్మ బద్ధం అయితే నెమ్మదిగా,
1. ఆ పరిధి విశ్వ వ్యాప్తమౌతుంది.
2. తనలోతానై మాయమౌతుంది.మొదటిది విశ్వరూపం.రెండవది పరబ్రహ్మ తత్వం. రెండింటి మూల స్వరూపం ఒక్కటే.మనస్సుకు చలించడం అలవాటు.ఏదోఒక ఆధారం ఉండాలి.పరమాత్మ జీవులకర్మల కనుగుణంగా యిచ్చిన శరీరంతో తన పాత్ర ,పాత్రత నెరిగి ,శరీరరధం లో  ఊరేగుతున్నపరమాత్మ దర్శనం చేశాక,అంతా సమయమే. అప్పటి  వరకూ ఒక్క నిమిషం మనసు ఖాళీగా ఉండదు. ఏదో వెలితి చూపిస్తూనే ఉంటుంది. కానీ శ్రీరాముని,రధం శరీరమైనప్పుడు, అది లాగుతున్న వైనం అర్ధం అవుతుంది. జై శ్రీరామ్.
            ఈ జ్ఞానాన్ని అందించిన మన వేదవేత్త లైన గురువుల ఋణం తీర్చుకోవడానికి,భారత భూమిలో ఎన్ని జన్మలైనా, అది తక్కువనే ఆనందం మాటల కందనిది. కానీ ఎప్పుడూ శరీరాన్ని  రధంగా తెలిసి,రధం  లాగాలనే తపన పెద్దది. అలసటతెలియకుండా,యిలా ధర్మాన్ని వీలైనంత ప్రతిపాదించాలానే చిరు కోరిక, పరమాత్మ యిలా అనుగ్రహించాడని ,స్వామికి ఎన్నో ధన్యవాదాలర్పిస్తున్నాను.
            స్వామి కళ్యాణం svbc ఛానెల్ లో చూస్తున్నప్పుడు,అమ్మవారి తరఫున ,అయ్యవారి తరఫున ,కొబ్బరి కాయలను బ్రాహ్మణులు దొర్లించి మార్చుకోవడం మనం చూస్తాం. నిజానికి ఈ జగత్తంతా అమ్మవారి ,అయ్యవారి లీలే కదా. శివ స్వరూపం రాత్రిగా చూస్తే,పగలు అమ్మవారి రూపం. వీరిరువురి మధ్య తిరుగుతున్న కొబ్బరికాయ లాంటి వాడే జీవుడు. కానీ తనకు తానే స్వయం ప్రతిపత్తిని ఆపాదించు కున్నందు వల్ల మాత్రమే కర్మబంధం ఏర్పడుతుంది. ఇలాంటి అనుసంధానం వలన అహం బలహీన పడి,మనకు సహకరిస్తుంది.
          శ్రీనివాసుని ఇరువురు దేవేరులు,శ్రీదేవి ,భూదేవి. శ్రీదేవిని కాల స్వరూపిణి గాను,భూదేవిని దేశ స్వరూపం గాను అనుసంధానం చేసినపుడు,పరమాత్మ వీరిరువురి ద్వారా ప్రకటించ బడుతున్నాడు. మనం తల్లి ద్వారా ప్రకటించ బడినట్లు ,జగత్తు,దేశ కాలాల వలన ప్రకటించ బడుతుంది. ప్రకటింపబడనప్పుడు ఇరువురూ కలసి ఏకరూపమై,స్వామి హృదయంలో వసిస్తే అది పరబ్రహ్మానంద స్థితి. ఆది నారాయణ స్వరూపం. శ్రీనివాసుడై నిలిస్తే కాలం నిరాకారం కనుక,అమ్మస్వామిలోలీనమైనట్లు,పద్మావతిరూపం,భూరూపంగా అనుగ్రహిస్తున్నట్లు,గ్రహిస్తే లక్ష్మీదేవి యొక్క ప్రతిబింబ రూపమే దేశం.సాకార అనుగ్రహరూపమే అలివేలుమంగాసమేత వేంకటరమణుడు .
        నేర్చుకోవాలన్న తపన ఉంటే ,మంచిని అన్ని విధాలా తెలుసుకోవచ్చు . సృష్టి ,మంచి చెడుల మిశ్రమం . హంస,పాలను వేరుచేసినట్లు , మనలోను ,ప్రపంచంలోను ,మంచిని గ్రహిస్తూనే ,చెడును విడిచిపెట్టి జీవించడం లోనే విజ్ఞత దాగి ఉంది . ఇలా జీవించడమే ,సాధనగా అమ్మ సరస్వతి హంసను,అధిరోహించి ,ఎలా ప్రయాణించాలో ఉపదేశిస్తున్నది .అలానే శ్వాసను కూడా హంసగా పెద్దలు తెలియ జేస్తారు . ప్రతి శ్వాస గతి , పరమాత్మ లక్ష్యంగా ,సాగాలి .
        ఈ బ్లాగ్ 'అమ్మమ్మ' అని కాక ,'నాన్నమ్మ లో అమ్మ' అని వ్రాశానని ,మా అమ్మాయిలు ,అడిగారు . దానికి సమాధానం రాయాలనిపించింది . ఆడపిల్లలకు ఏ విషయాన్నైనా, కొంత పరిమితి వరకూ చెప్పే స్వేఛ్చ ఉంటుందని నమ్మే సాంప్రదాయ  వాదిని నేను .ఏ విషయాన్నైనా పరిచయం చెయ్యవచ్చు కానీ ,అది ఎప్పుడూ వారి కుటుంబ జీవితానికి వన్నె తెచ్చి ,అత్త మామ లకు ,చేరువ చేసే దిశా నిర్దేశం చేసేదై ఉండాలి . ఈ ఆలోచన కలవారెవరైనా వారి హద్దులను ,అతిక్రమించ లేరు . కానీ బాధ్యతను స్మరించి ,కొడుకు ,కోడలికి దిశా నిర్దేశం చేసి ,భావి తరానికి ,పరమాత్ముడే పరమ గమ్యంగా ,ఈ ఆధునిక కాలంలోనూ జీవించ వచ్చునని ఎలాగైనా తెలియ జేయ్యాలనే తపనతో ఈ బ్లాగ్ ప్రారంభించాను . నాలానే కుమారులకు ,కోడళ్ళకు ,చెప్పాలనే  తాపత్రయం ఉన్నా ,తీరికలేని ముందు తరాలవారు ,దీన్ని ఉపయోగించాలానే తాపత్రయంతో దీన్ని వ్రాస్తున్నాను . మా  అమ్మాయిలు కూడా ,వాళ్ళ ఆడపిల్లలు ,మగపిల్లలు ,వీరిపట్ల ,అవసరానికి తగినట్లు చరిస్తారని  ఆశిస్తున్నాను .