25, జనవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం . 
        విశ్వం విరాట్పురుషుని ,విశ్వరూపం. బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే పిండాండంలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఏదైతే శాస్త్రం ,బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శుద్ర అనే వర్ణ విభాగాలు 
తెలియజేస్తున్నదో, అది ఒకే శరీరంలో ప్రతీకాత్మకంగా తెలియబడుతున్నది. ధర్మార్ధకామమోక్షాలు ఒకే సాధనను 
తెలియజేసినట్లే ,సోపాన క్రమంగా వర్ణ విభాగాలు కూడా ఇదే అంతరార్ధాన్ని తెలియజేస్తున్నాయి. 
అహం , శరీరాన్ని ఉపకరణంగా వాడుకుని ఈ నాలుగు వర్ణాలను తనలోనే కలిగి ఉన్నది. తననే సర్వస్వం అనుకుని 
సకలము తానే సాధిస్తున్నాననే అహంకారం క్షత్రియ ప్రవృత్తి . చూసినవన్నీ తనకే కావాలి ,అనే  భావంతో వైశ్యత్వము ,శరీర సుఖం తప్ప అన్యమేది అక్కరలేని తత్వం శుద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని 
సాధనాలుగా తెలిసి ,మనోబుద్ధిచిత్తాహంకారాలు, పరమాత్మ సేవకు ఉపయోగపడేలా ,బుద్ధి ప్రయత్నం చేస్తే క్రమంగా శుద్ధ సత్వగుణాన్ని పొంది ఆత్మ ,పరమాత్మగా అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి ప్రయత్నం ,పరమాత్మ కన్నా అన్యం లేదని తెలిసి సాధన  చేస్తున్న దశలో శరీరాన్ని త్యజిస్తే బ్రాహ్మణ జన్మను ,దేన్నో శరీరహంతో సాధించే దిశలో
శరీర ప్రయాణం క్షత్రియత్వాన్ని,ఐశ్వర్యమే జీవిత పరమార్ధమైతే జీవి వైశ్యత్వాన్ని,శరీర సుఖమే జీవన సూత్రమైతే
శుద్రుని ఇంట జన్మ సాకార మోవుతుంది.