14, ఆగస్టు 2023, సోమవారం

దక్షిణామూర్తి.

 🕉️🙏అమ్మవారు దక్షిణామూర్తి రూపిణీ.అమ్మవారిని ఆశ్రయిస్తే కర్మ కలే,అని కర్మబంధాన్ని మాయం చేస్తుంది.చేతుల్లోని ఆయుధాలు చూస్తే,ధనస్సు మనస్సు.బాణాలు కోరికలు.కోరికలు మనస్సులో నిలపకుండా, అంకుశంలాంటి శాస్త్ర విహిత నిష్కామ కర్మ,ఆత్మ జ్ఞానంతో నిగ్రహించాలి.మనస్సుని పరమాత్మ పట్ల రాగమనే,భక్తి పాశంతో బంధిస్తే, తనంత తాను ప్రీతితో బంధించ బడుతుంది.భగవంతుని పట్ల ఏకాగ్రమైన మనసుకి  భగవంతుని పట్ల కలిగిన ప్రీతి,స్వాత్మా నందంలో లీనం చేస్తుంది.ఆలోచనలు లేని మనస్సు.చిత్ స్వరూపమే.అయ్యవారి మోనానికి అమ్మవారి రూపమే వ్యాఖ్యానం.కామకోటిలో బాల,శివకంచిలో కామాక్షి ఏకామ్రేశ్వరులు.అలానే పలుకుల తల్లి,శృంగేరి శారదా దేవిగా నామ వ్యాఖ్యానం.🙏🕉️

13, ఆగస్టు 2023, ఆదివారం

కారణం

 కలకి ఉపాదాన కారణం,నిమిత్త కారణం ఏవి? సృష్టికి కూడా అవే.

25, జూన్ 2023, ఆదివారం

నమస్కారం

 🙏నమస్కారం అనే సంస్కారం భారతీయులకు భగవంతుడి ఆశీర్వచనం.గౌరీ పంచాక్షరీ బీజమంత్రం యొక్క ముద్ర.ఇలా నమస్కరిస్తే,ఈ సృష్టిని అమ్మవారి స్వరూపంగా స్మరిస్తున్నాను అని భావం.అంతేకాని అది ఎదుటి వారి అహంభావానికి చేస్తున్నది కాదు.చైతన్యానికి చేసే వందనం.🙏

తత్వం

 🙏తత్వం,ఆలోచన రూపంలో ఉయ్యాల లూగుతుంటే అమ్మవడి,తనలో తానైతే నాన్నవడి,ఎరుక ఎప్పుడూ బాల్యమే,సృష్ఠిరూప వినాయకుడైనా,ఎరుకరూప స్కందుడైనా🙏

7, డిసెంబర్ 2022, బుధవారం

నిజం.

 నిజమైన భగవన్నామం 'నేను'అని జడచేతనాల్లో ప్రతిధ్వనిస్తోంది.ధ్వని పరమాత్మది.ప్రతిధ్వని జీవులు తమదను కుంటున్నాయి.

తపన.

 జీవించాలి.ఎప్పుడూ అదే తపన.ఎందుకంటే తాను ఎప్పుడూ ఉండే సత్యం గనుక.కానీ తాను కాని శరీర తాదాత్మ్యం వలన,అది కోరికలా కనిపిస్తోంది.సంపాదించాలి.తనను తాను ప్రపంచం కంటే వేరుగా ఉన్నాను అనే ద్వైతం వలన,తన పరిమితి నిజం కాదు గనుక అపరిమితమైన తన స్వరూపానుభవ కాంక్షే ఇలా వ్యక్త మవుతుంది.

ఆనందించాలి.నిజానికి తన స్వరూపమే ఆనందం.రెండోది ఉన్నప్పుడే హద్దు.ఉన్నది స్వరూపం మాత్రమే.జీవ భావం వలన మాత్రమే ఇబ్బంది.ఈ మూడింటికి కలను అనుసంధానం చేసుకుని,అనంత శయన నారాయణుని తత్వం గ్రహించి, కలలోని తన పాత్రవంటి జీవభావాన్ని గ్రహించి,కర్తృత్వ,భోక్తృత్వ, అహంకారాన్ని వీడి, కేవలం తన జీవితాన్ని,నాటకం లోని పాత్రగా భావించి,అంతరంగ శాంతిని పొందాలి.నిజానికి మనకు వచ్చే ఆలోచనలు,రెండవ వారి వల్ల మాత్రమే వస్తాయి.తండ్రి గురించి ఆలోచిస్తే తనది కొడుకు పాత్ర,అలానే కొడుకు గురించి ఆలోచిస్తే తండ్రి పాత్ర,అలానే ఉద్యోగి,పాత్ర,భర్త పాత్ర,ఇలానే ఎన్నో.ఇవేవీ లేని అస్తిత్వం స్వరూపం.అదే వర్తమానం.ముందు,వెనుక క్షణాలు మాత్రమే బంధ కారణాలు.ఈ క్షణం అన్ని పాత్రల ముసుగు లేని నిజం.తీరిగ్గా గమనించి గ్రహిస్తే,నెమ్మదిగా స్వరూపం తెలిసి,దాన్నే సాధనంగా గమ్యాన్ని చేరవచ్చు.

1, ఏప్రిల్ 2020, బుధవారం

మాయ

విద్యుచ్చక్తికి అవసరమైన,నెగిటివ్,పోసిటివ్,శివశక్తులు.గాడ్జెట్ వినాయకుడు.దానినుండి పొందే,వెలుగు,వేడి,గాలి ఇలాఏదైనా సుబ్రహ్మణ్యుడు. ఇది శరీరానికి అన్వయిస్తే ,శరీరం వినాయకుడు.సత్,చిత్,శివ పార్వతులు. ఆనందరూపుడు వ్యక్త మోతున్న జీవుడు,శివా శివుల ఆనందా అంశ .తాను అనే అహం ఉంది అనుకోడమే మాయ.పుట్టినవి ఎన్నైనా పోవచ్చు.ఎప్పుడూ ఉండే చైతన్యానికి,ఏ మార్పు లేదు.