7, డిసెంబర్ 2022, బుధవారం

తపన.

 జీవించాలి.ఎప్పుడూ అదే తపన.ఎందుకంటే తాను ఎప్పుడూ ఉండే సత్యం గనుక.కానీ తాను కాని శరీర తాదాత్మ్యం వలన,అది కోరికలా కనిపిస్తోంది.సంపాదించాలి.తనను తాను ప్రపంచం కంటే వేరుగా ఉన్నాను అనే ద్వైతం వలన,తన పరిమితి నిజం కాదు గనుక అపరిమితమైన తన స్వరూపానుభవ కాంక్షే ఇలా వ్యక్త మవుతుంది.

ఆనందించాలి.నిజానికి తన స్వరూపమే ఆనందం.రెండోది ఉన్నప్పుడే హద్దు.ఉన్నది స్వరూపం మాత్రమే.జీవ భావం వలన మాత్రమే ఇబ్బంది.ఈ మూడింటికి కలను అనుసంధానం చేసుకుని,అనంత శయన నారాయణుని తత్వం గ్రహించి, కలలోని తన పాత్రవంటి జీవభావాన్ని గ్రహించి,కర్తృత్వ,భోక్తృత్వ, అహంకారాన్ని వీడి, కేవలం తన జీవితాన్ని,నాటకం లోని పాత్రగా భావించి,అంతరంగ శాంతిని పొందాలి.నిజానికి మనకు వచ్చే ఆలోచనలు,రెండవ వారి వల్ల మాత్రమే వస్తాయి.తండ్రి గురించి ఆలోచిస్తే తనది కొడుకు పాత్ర,అలానే కొడుకు గురించి ఆలోచిస్తే తండ్రి పాత్ర,అలానే ఉద్యోగి,పాత్ర,భర్త పాత్ర,ఇలానే ఎన్నో.ఇవేవీ లేని అస్తిత్వం స్వరూపం.అదే వర్తమానం.ముందు,వెనుక క్షణాలు మాత్రమే బంధ కారణాలు.ఈ క్షణం అన్ని పాత్రల ముసుగు లేని నిజం.తీరిగ్గా గమనించి గ్రహిస్తే,నెమ్మదిగా స్వరూపం తెలిసి,దాన్నే సాధనంగా గమ్యాన్ని చేరవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి