12, ఏప్రిల్ 2018, గురువారం

ఆనందం

ఆనందం.
       సత్,చిత్ అనేవి అనుభవంలో అందుతాయి.కానీ ఆనందం యొక్క లక్షణం సృష్టి పరంగా భ్రమింపజేస్తుంది.ఆనందం అనేదే మనకి ఇష్టంగా వ్యక్తమవుతోంది.అంతరంలోని ఆనందం,సృష్టిలోని జీవులకర్మ ఫలంగా లభించిన జీవితాల్లో మాయరూపంగా మూడు రూపాలుగా
విడిపోతున్నది.అవే ఇచ్చా,జ్ఞాన,క్రియ శక్తులు. మొదటి ఇచ్చా శక్తికి సంబంధీచినవే,కామ,క్రోధాలు, జ్ఞానాశక్తికి సంబంధిచినవి లోభ, మోహమూ,అలానే క్రియకు మద, మాత్సర్యాలు.వీటి మూలరూపం తెలిసి అర్ధం చేసుకుంటే ,ఇవి బాధించవు.
       ఇచ్చా,లేదా కామ ,కోరిక.ఎదో ఒకదానిమీద దృష్టి లగ్నమై,అది కావలనిపించడం కోరిక.చివరకు దాన్ని సాధించి పొందే తృప్తి యొక్కరూపం ఆనందం.తిరకపోతే క్రోధం.కోరిక తీర్చుకునే క్రమంలో,ప్లాన్ చేస్తున్నపుడు అది తనకి మాత్రమే ఉండాలనే మోహమూ,
చాలా ఎక్కువగా దాచుకోవలనే లోభము. క్రియలో సాధించిన దానిపట్ల మదము అంటే అహంకారము,వేరేవారికి దొరకకూడదన్న
మాత్సర్యము, ఇవి సహజం.కామ,లోభాలు ,మదము వ్యక్తిగతం. వేరేవారు అవే సాధించినపుడు,లేదా తాను ఓడిపోయినప్పుడు కలిగేవి ,
క్రోధ,మోహ,మాత్సర్యాలు.నిజానికి ప్రకృతిలోని ప్రతిదీ పరమాత్మది.అది ఏదైనా ధర్మ బధ్ధంగా, ప్రసాదం గానే భావించాలి.లేదా అదే
మోహాన్ని కలిగిస్తుంది.వేరేవారి వస్తువు ఆశించడం మోహం.వారికి ఉంటే క్రోధం.తాను పొందలేకపోతే మాత్సర్యము.
ఇలా అన్నీ ఆనందం యొక్క సగుణ రూపలే. అంతా పరమాత్మదనే జ్ఞానం,అనుభవంలో కలిగితే అది ఆనందం,తృప్తి.అదే ప్రసాద 
మనస్తత్వం.ఇది మోక్షకరణం.మోక్షం.ఇదే రాధ.


     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి