7, డిసెంబర్ 2022, బుధవారం

తపన.

 జీవించాలి.ఎప్పుడూ అదే తపన.ఎందుకంటే తాను ఎప్పుడూ ఉండే సత్యం గనుక.కానీ తాను కాని శరీర తాదాత్మ్యం వలన,అది కోరికలా కనిపిస్తోంది.సంపాదించాలి.తనను తాను ప్రపంచం కంటే వేరుగా ఉన్నాను అనే ద్వైతం వలన,తన పరిమితి నిజం కాదు గనుక అపరిమితమైన తన స్వరూపానుభవ కాంక్షే ఇలా వ్యక్త మవుతుంది.

ఆనందించాలి.నిజానికి తన స్వరూపమే ఆనందం.రెండోది ఉన్నప్పుడే హద్దు.ఉన్నది స్వరూపం మాత్రమే.జీవ భావం వలన మాత్రమే ఇబ్బంది.ఈ మూడింటికి కలను అనుసంధానం చేసుకుని,అనంత శయన నారాయణుని తత్వం గ్రహించి, కలలోని తన పాత్రవంటి జీవభావాన్ని గ్రహించి,కర్తృత్వ,భోక్తృత్వ, అహంకారాన్ని వీడి, కేవలం తన జీవితాన్ని,నాటకం లోని పాత్రగా భావించి,అంతరంగ శాంతిని పొందాలి.నిజానికి మనకు వచ్చే ఆలోచనలు,రెండవ వారి వల్ల మాత్రమే వస్తాయి.తండ్రి గురించి ఆలోచిస్తే తనది కొడుకు పాత్ర,అలానే కొడుకు గురించి ఆలోచిస్తే తండ్రి పాత్ర,అలానే ఉద్యోగి,పాత్ర,భర్త పాత్ర,ఇలానే ఎన్నో.ఇవేవీ లేని అస్తిత్వం స్వరూపం.అదే వర్తమానం.ముందు,వెనుక క్షణాలు మాత్రమే బంధ కారణాలు.ఈ క్షణం అన్ని పాత్రల ముసుగు లేని నిజం.తీరిగ్గా గమనించి గ్రహిస్తే,నెమ్మదిగా స్వరూపం తెలిసి,దాన్నే సాధనంగా గమ్యాన్ని చేరవచ్చు.

1, ఏప్రిల్ 2020, బుధవారం

మాయ

విద్యుచ్చక్తికి అవసరమైన,నెగిటివ్,పోసిటివ్,శివశక్తులు.గాడ్జెట్ వినాయకుడు.దానినుండి పొందే,వెలుగు,వేడి,గాలి ఇలాఏదైనా సుబ్రహ్మణ్యుడు. ఇది శరీరానికి అన్వయిస్తే ,శరీరం వినాయకుడు.సత్,చిత్,శివ పార్వతులు. ఆనందరూపుడు వ్యక్త మోతున్న జీవుడు,శివా శివుల ఆనందా అంశ .తాను అనే అహం ఉంది అనుకోడమే మాయ.పుట్టినవి ఎన్నైనా పోవచ్చు.ఎప్పుడూ ఉండే చైతన్యానికి,ఏ మార్పు లేదు.

30, అక్టోబర్ 2018, మంగళవారం

శబ్దం

శ్రీ గురుభ్యోనమః.  శబ్దం అమ్మవారు,మౌనం అయ్యవారు. శబ్దాన్ని మౌనంలో సమర్పించడం కల్యాణం. అది వర్తమానంలో సాధ్యం,కనుక కల్యాణం చేస్తున్నది విష్ణువు.

5, జులై 2018, గురువారం

వైరాగ్యం

వైరాగ్యం. 
      వైరాగ్యం  అనేది ప్రధాన భూమిక ముముక్షువులకి. అన్నీ వదిలెయ్యడం అనేది లౌకికర్ధం. వదిలెయ్యడంలోని అర్ధం తెలియడం వైరాగ్యం . తాడుని చూసి పాము అనుకున్నా,లేదా ఏదైనా నీడచూసి పాము అనుకున్నా, జ్ఞానం వల్ల మాత్రమే భయం పోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా మరి భయం కలగదు .అలానే ముత్యపు చిప్పలోని వెండి.
       చూడడానికి రెండు వెలుగులు కావాలి . బయటివెలుగు,మనసు కళ్ళు వలన మనదృష్టి. ఈ రెంటితో 
భయం పోయింది.భౌతిక ప్రపంచము ఈ తాడు వంటిదే. కానీ పరమాత్మ విషయం తెలుసుకోడానికి ఈ వైరాగ్యం ఒకటి సరిపోదు .ఈ జ్ఞానం ఏమిటో తెలియాలి. ఎందుకంటే రెండు వెలుగులు భౌతిక వస్తువులు 
చూడడానికి పనికివస్తాయి. కానీ జ్ఞాన అజ్ఞానాలకు ఆవల పరమాత్మ. 
       గదిలోఉన్న దీపం వస్తువులను ప్రకాశింప చేస్తుంది. కానీ దీపాన్ని ఎవరూ ప్రకాశింప చెయ్యలేరు. 
ప్రకాశంలోని వస్తువులు,దీపముకూడా తెలియడం,అలానే ప్రకాశం లేనప్పుడు అవి తెలియక పోవడం కూడా 
మనకు తెలుస్తోంది.అంటే జ్ఞానము అజ్ఞానము కూడా తెలుస్తున్నాయి.పరకాశిస్తున్న వస్తువులు ,పై  ఉదాహరణ
లోని తాడు ,పాము వంటివి. అంటే అస్థిత్వం లేదు . ఏది ఒకసమయంలో మాత్రమే ప్రకాశిస్తుందో ,అది 
నిజానికి లేదు .రెండు వెలుగులు లేకపోతె సృష్టి మృగ్యం. మొదలు తుది ఉన్నది భ్రాంతి. ఈ రెండు లేనిది పరమాత్మ తత్త్వం ఒకటే. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ప్రకాశింప చేస్తున్న తాను మాత్రమే నిజం. ప్రకాశింప బడుతున్న 
శరీరం అజ్ఞానం . శరీర జ్ఞానం కలిగిఉన్న తాను పరమాత్మ.

2, జూన్ 2018, శనివారం

జీవితం

పెద్దల జీవితం -పిల్లల భవిష్యత్తు.
      పెద్దల జీవన విధానమే, పిల్లలకు జీవిత పాఠాలుగా మారతాయి.వివాహంతో ప్రారంభమౌతుంది జీవితం.పిల్లలకు పూర్వరంగం.
అత్తవారింటికి చేరింది కోడలు.చక్కగా అత్తగారింటిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.అత్తగారుకుడా ఎంతో ఓపికగా అన్నీ చె పుతారు. అపుడు ఆమె తమ అత్తగారి ఔన్నత్యం,తనకు అన్నీ నేర్పిన వైనం,అలానే ఆడ పడుచులతోఉన్న చక్కని అనుబంధం,
అలానే బావ గారిని గౌరవించడం కానీ,మరుదులతో సోదరిలా మెలగడం గాని,ఇలా ఎన్నో సంగతులు తెలియజేస్తారు.దీనికి ఆమె
ఎంతో సంయమనం పాటిస్తారు.తన పుట్టింటిని గురించి ఏమీ చెప్పరు. ఇలా ప్రవర్తించడం వలన,వచ్చిన కోడలికి కూడ చక్కని
అవగాహన ఏర్పడుతుంది తన ఇంటి గురించి.అంతేకాదు తన పుట్టింటి గురించిన ఆలోచనలు కూడా తగ్గు ముఖం పడతాయి.అదే
అత్తగారు తన పుట్టింటి కబుర్లతో కాలక్షేపం చేస్తే,కొడలుకూడ తన పుట్టింటిని విడిచి వేరే ఆలోచనను చెయ్యదు.
             అలానే భగవంతుని పూజ,వారి ఇంట్లోని విషయాలు,నమ్మకాలు తెలియజేస్తారు.చక్కని నియమాలు పాటిస్తూ మార్గ
దర్శనం చేస్తారు.ఇందులో భాగంగా విష్ణువు,లక్ష్మీదేవి,తల్లి,తండ్రులుగాను,శివ,పార్వతులు వారికి తల్లితండ్రులుగాను భావించి
ప్రతి విషయాన్ని వారి ముందు ఉంచి,ప్రయత్నం చేసి,అయితే,దానితో తమకు అవసరం ఉందని,అవకపోతే ఇబ్బందులు పడకుండా
భగవంతుడు రక్షించాడని, ఎప్పుడూ తమకు భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉందనే భావాన్ని గృహంలో కలిగిఉండాలి.
దీనివలన ఇంట్లో పాజిటివ్ ఏటిట్యూడ్ పెరుగుతుంది.
       
      ఈ రకమైన వాతావరణంలో వచ్చిన పిల్లలు చక్కని భవిష్యత్తు కలిగి ఉంటారు.వీరికి జీవితాన్ని ఏకోణంలో చూడలో తెలుస్తుంది.
ఎప్పుడూ, ఎక్కువగా పొంగిపోకుండా,అలానే కుంగిపోకుండా జీవితాన్ని చాలా స్పష్టంగా జీవిస్తారు.అలానే భావితరాలకు చక్కని
మార్గదర్శనం చెయ్య గలుగుతారు.

4, మే 2018, శుక్రవారం

కాల భైరవ

మన బ్రతుకులన్నీ కాలాధీనం. కాలం అనుకూలిస్తేనే ఏదైనా సాధించగలం. ఎవరికైనా కాలం అనుకూలించేటట్లు చేసే దైవం "శ్రీ కాలభైరవుడు". కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున (ప్రత్యేకంగా సాయంత్రం) ఆ దేవుని స్మరించుకోవడం సర్వాభీష్ట ప్రదాయకం. శ్రీ శైవ మహాపురాణంలో శ్రీ ఉపమన్యు మహర్షి వారు దర్శించిన "శ్రీ శివ పంచావరణ స్తోత్రం"లో చెప్పబడ్డ కాలభైరవుని ప్రార్థిద్దాం.
ఇది శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి పోస్టు..

క్షేత్రపాలో మహతేజా నీలజీమూత సన్నిభః;
దంష్ట్రాకరాళ వదనః స్ఫురద్రక్తాధరోజ్జ్వలః

రక్తోర్ధ్వ మూర్ధజశ్శ్రీమాన్ భ్రుకుటీ కుటిలేక్షణః;
రక్తవృత్త త్రినయనశ్శశి పన్నగ భూషణః

నగ్నస్త్రిశూల పాశాసి కపాలోద్యత పాణికః ;
భైరవో భైరవైస్సిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః

క్షేత్రే క్షేత్రే సమాసీనః స్థితో యో రక్షకస్సతాం;
శివప్రణామ పరమః శివ సద్భావ భావితః

శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ ;
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం

వీరభద్రో మహాతేజా హిమకుందేందు సన్నిభః ;
భద్రకాళీ ప్రియో నిత్యం మాతౄణాంచాభిరక్షితా

యఙ్ఞస్య చ శిరోహర్తా దక్షస్య చ దురాత్మనః ;
ఉపేంద్రేంద్ర యమాదీనాం దేవానాం అంగ తక్షకః

శివస్యానుచరః శ్రీమాన్ శివశాసన పాలకః ;
శివయోశ్శాసనాదేవ స మే దిశతు కాంక్షితం