12, ఏప్రిల్ 2018, గురువారం

ఆనందం

ఆనందం.
       సత్,చిత్ అనేవి అనుభవంలో అందుతాయి.కానీ ఆనందం యొక్క లక్షణం సృష్టి పరంగా భ్రమింపజేస్తుంది.ఆనందం అనేదే మనకి ఇష్టంగా వ్యక్తమవుతోంది.అంతరంలోని ఆనందం,సృష్టిలోని జీవులకర్మ ఫలంగా లభించిన జీవితాల్లో మాయరూపంగా మూడు రూపాలుగా
విడిపోతున్నది.అవే ఇచ్చా,జ్ఞాన,క్రియ శక్తులు. మొదటి ఇచ్చా శక్తికి సంబంధీచినవే,కామ,క్రోధాలు, జ్ఞానాశక్తికి సంబంధిచినవి లోభ, మోహమూ,అలానే క్రియకు మద, మాత్సర్యాలు.వీటి మూలరూపం తెలిసి అర్ధం చేసుకుంటే ,ఇవి బాధించవు.
       ఇచ్చా,లేదా కామ ,కోరిక.ఎదో ఒకదానిమీద దృష్టి లగ్నమై,అది కావలనిపించడం కోరిక.చివరకు దాన్ని సాధించి పొందే తృప్తి యొక్కరూపం ఆనందం.తిరకపోతే క్రోధం.కోరిక తీర్చుకునే క్రమంలో,ప్లాన్ చేస్తున్నపుడు అది తనకి మాత్రమే ఉండాలనే మోహమూ,
చాలా ఎక్కువగా దాచుకోవలనే లోభము. క్రియలో సాధించిన దానిపట్ల మదము అంటే అహంకారము,వేరేవారికి దొరకకూడదన్న
మాత్సర్యము, ఇవి సహజం.కామ,లోభాలు ,మదము వ్యక్తిగతం. వేరేవారు అవే సాధించినపుడు,లేదా తాను ఓడిపోయినప్పుడు కలిగేవి ,
క్రోధ,మోహ,మాత్సర్యాలు.నిజానికి ప్రకృతిలోని ప్రతిదీ పరమాత్మది.అది ఏదైనా ధర్మ బధ్ధంగా, ప్రసాదం గానే భావించాలి.లేదా అదే
మోహాన్ని కలిగిస్తుంది.వేరేవారి వస్తువు ఆశించడం మోహం.వారికి ఉంటే క్రోధం.తాను పొందలేకపోతే మాత్సర్యము.
ఇలా అన్నీ ఆనందం యొక్క సగుణ రూపలే. అంతా పరమాత్మదనే జ్ఞానం,అనుభవంలో కలిగితే అది ఆనందం,తృప్తి.అదే ప్రసాద 
మనస్తత్వం.ఇది మోక్షకరణం.మోక్షం.ఇదే రాధ.


     

30, మార్చి 2018, శుక్రవారం

మన శాంతి

    సర్వం బ్రహ్మ మయం జగత్.అనేది పారమర్దిక సత్యం.పార్షిక సత్యం కాదు.ఈ జగత్తు పార్షిక సత్యం.ఈ జగత్తులో వివాహానికి తరతమ బేధాలు తప్పనిసరి.నిజానికి ఆధ్యాత్మిక సాధనా స్థాయిని తెలిపేది జన్మతో వచ్చిన వర్ణం యొక్క స్వభావం.నాలుగు కాళ్ల జంతువులు,అడ్డంగా వెన్నుపాము కలిగినవి ,అన్ని ఓకేరకం కాదు.కొన్ని గడ్డి,ఇతరమొక్కలు వీటిపై ఆధారపడి జీవిస్తాయి.
కొన్ని మాంసహారులుగా జీవిస్తాయి.వీటిలో ఎక్కువ ,తక్కువ అని ఏమీలేదు.వేటి జీవన విధానం వాటిది. భగవంతునికి అన్నీ
సమానమే.కర్మ గతిలో వేటి స్థానాన్ని అవి పొందాయి.అలానే. మనుషులు ఒకేలా కనిపిస్తున్నా, ఎన్నో బేధాలతో జీవిస్తారు.
వేరు వేరు విభాగాల జంతువులు వాటికి అవే సమానత్వం ఉన్నవాటితోనే జతకడతాయి. ఇది ప్రకృతి సహజం.బేధాలు జంతువుల
వలె ,మనుషులకు తెలియవు.అంత మాత్రాన లేవని కాదు.అందువల్లనే పరమాత్మ వర్ణ విభాగం చేసాడు.ఒకే రకమైన ఆచార,
వ్యవహారాలు,ఆలోచనా ధోరణి కలిగిన వారు ,పైకి విబేధాలు ఉన్నట్లు కనిపించినా, పెద్దగా సమస్య ఉండదు.
        కానీ,వర్ణాంతర వివహాలలో,ముందుగా శరీర పరంగా ఆలోచించి అంతా బావుంది అనుకున్నా, పరమాత్మ సృష్టిలో నియమాన్ని తప్పినట్లే అవుతుంది.నియమాల ప్రకారం కాలం నడుస్తున్నది.ప్రకృతి అంతా స్వభావ సిద్ధంగా నడుస్తున్నది.
కానీ పరమాత్మను చేరడానికి ఇచ్చిన వివేక జ్ఞానం ,తప్పుతోవపట్టి శరీరానికి సంబంధిచిన విషయాలకు,అనవసర ప్రాధాన్యం ఇచ్చి మానవాళి ఇక్కట్ల పాలవుతున్నది.ఇలా పెద్దలు కాదన్న వివాహాలు,ఎంతో గొప్పగా ఉన్నాయి అని నిరూపించాలనుకునే వారు
ఎక్కువే.కానీ మనసును మభ్యపెట్టి తమలో తమ అంతరంగములో వాదించుకుని సరిపెట్టుకుంటారు.కానీ నిజాన్ని ఒప్పుకోరు.
ఎందుకంటే అహంకారం అడ్డు వస్తుంది.పెద్దలను కూడా బలవంతంగా ఒప్పించినా, అంతరంగం మాత్రం అందరికీ కల్లోలమే.
ఎప్పుడూ మన శాంతి ఉండదు.దీనికి బదులు ముందుగా పిల్లలు తమ మనసునే లొంగదీసుకుంటే ఏ సమస్యలు ఉండవు.
అందుకే పిల్లలకు చిన్నప్పుడు ఇటువంటి సంఘటనలు,ఎలా తెలిసినా, పెద్దలు తప్పక ఖండించాలి.వారి మనసులో అటువంటి
విషబీజాలు పడకుండా కాపాడుకోవాలి.ఇటువంటి వాటికి సహజంగా చిన్నప్పుడే బీజాలు పడతాయి.స్నేహాలు ఆడపిల్లలకు,
అడపిల్లలతో ఉండేలా జాగ్రత్త పడాలి. వారి మధ్యన కూడా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో గమనించాలి.మన పెద్దలు చూపిన బాటలో నిలకడగా సాగాలి.మన శాంతితో, జీవించి,పరమఅర్ధం వైపు సాగాలి.లేకుంటే ఇలాంటి తప్పులు పిల్లలు చేసినా పెద్దలకు
పర మార్ధం అందదు.మనో చాంచల్యం వదలదు.తస్మాత్ జాగ్రత.ప్రాప్యవరాన్నిబోధత.



23, మార్చి 2018, శుక్రవారం

స్వభావం

స్వభావం.
  ప్రతి మనిషిలోను స్పష్టంగా అందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇవి సహజమైన నిత్య సత్యమైన పరమాత్మ లక్షణాలు. అవి  ఎప్పుడూ తాను ఉంటాననే నమ్మకం. అంతా తెలుసనే లక్షణం. ప్రకటితం కాకున్నా తనలో తనపట్ల సంతృప్తి.ఇవి సతిచ్చిదానంద లక్షణాలు.ఎప్పుడూ ఉండడం సత్ లక్షణం.తెలుసు అనేది చిత్, ఆనందం సంతృప్తి.ఇవి లేని మనిషి ఉండరు.కానీ వీటిని శరీర పర్యంతంగా భావించడమే
అవిద్య.అలానే పరబ్రహ్మ తత్వంలో, అహం ప్రజ్ఞ తెలిస్తే సృష్టి.ఇదే అద్వైతంలో ద్వైతం.స్పందించిన అహం తిరిగి స్వస్థితిని పొందాలనే సహజమైన కోరిక మోక్షం.ఇది శరీర పర్యంతమైనపుడు,బాహ్యంలో జంట కోసం వెతుకుతుంది. కానీ అంతరార్ధంగా గమనిస్తే,ఇది నిజానికి తనలోనే ఉన్న తనను చేరడమే.బాహ్యంలో స్త్రీ,పురుష బేధం తెలిసే 8సం. వయసు నుండి పరమాత్మ జ్ఞానాన్ని అందించ గలిగితే ,తమలో
కలిగే భావాలకు మూలం తెలియడం వలన పిల్లలు, తమను తాము అనవసర భావజాలం నుండి కాపాడుకో గలుగుతారు.శ్రీరాముని యోగ వశిష్ఠ అనుభవం ,ఈవిషయాన్ని తెలియ జేస్తున్నది.అనవసర సమయంలో,అక్కరలేని విషయాలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.విజ్ఞానం అవసరం లేని పశు జనాలకు మాత్రమే తినడం తెలిశాక, తరువాత ప్రత్యుత్పత్తి మాత్రమే గమ్యం.కానీ మానవ జన్మ పరమార్ధం
గ్రహించాలి.                                                       

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సనాతనం

సనాతనం. 
       శ్రీ గురుభ్యో నమః. 
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. కలియుగంలో తరింపచేసే మంత్రం.
ఇందులో మనకు కనిపించేవి మూడు నామాలు .మూడు ముక్తిమార్గాలు. తాపత్రయాల నుండి తప్పుకోడానికి ఈ మంత్రం. సంసారమనే కాసారంలోని సుఖపడాలనే తపనే గజేంద్రుడు ఈదులాడిన సరస్సు. కాలమనే మొసలి సమీపిస్తే ,తన ఆత్మబంధువులైనా ఏమీ చెయ్యలేరు. చాలామంది ఇక్కడ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేని దురవస్థ. అంతేకానీ ఇందులో బంధుజనుల అలసత ఏమిఉండదు. పూర్వపుణ్య విశేషం ,అలానే 
తనశక్తి ఏమీ పనిచెయ్యడం లేదని తెలిసిన క్షణం పరమాత్మను అంతర్యామిగా గుర్తించడం వలన అతనిని శ్రీహరి 
రక్షించాడు. దీనికి సంసారంలోఉన్నా పరమాత్మపట్ల అవగాహన కలిగి ఉండడం వలన ,వీలైనంత శాస్త్ర అవగాహన , భక్తి ,అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ,గజేంద్రునికి సహకరించాయి. అవి ఈజన్మకు సంబంధించినవి కాకపోయినా జంతుశరీరంలో రక్షించాయి. కానీ మానవుడైకూడా ప్రయత్నశీలుడు కాకుంటే పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . ఎన్నో జన్మల తపః ఫలంగా లభించిన మానవదేహం తన గమ్యాన్ని చేర్చే నావ . మిగిలిన ఉపాధులకు 
ఈఅవకాశం లేదు. మానవజన్మలో గమ్యం చేరాలంటే అడ్డుగా ఉన్నవి ,అహం,మమ. నిజానికి ఈరెండూ కలిగి ఉన్నది  పరమాత్మ.కానీ శరీరంలో పరమాత్మ తేజస్సు  శరీరికి అర్ధం కానివ్వదు . శరీర పర్యంతంగా తెలుస్తున్న 
చైతన్యాన్ని అహంగా భావిస్తాడు. కుమ్మరి కుండ తయారైన మాత్రాన ,అందులో ఆకాశం నింపబడలేదు. అలానే 
బయటి ఆకాశంకన్నా వేరుకాదు. కుండ తన ఆకాశం అంటే ఎలాటిదో ,శరీర పర్యంత అహం తాను అనుకోవడం 
అలాంటిదే. అలానే పంచేద్రియాలు గ్రహించే సకలము తనది అయిన ప్రపంచం అవుతుంది. ఇవన్నీ పరమాత్మ 
సృజనలో పంచభూత వికారాలే . కనుక తను అనేది ,తనది అనేది మిధ్య. అంటే [పుట్టుకతో] మధ్యలో వచ్చాయి. 
మధ్యలోనే పోతాయి. ఆకాశంలా తానెప్పుడూ ఉండేదే. కుండ రాకపోకలతో ఆకాశం దుఃఖిస్తే ఎలా?
        కానీ ఇదే అజ్ఞానం ఎన్నో జన్మలుగా ధృఢపడి కుండే నిజమై కూచున్నది. జంతు జన్మలలో జ్ఞానార్జన అవకాశం లేదు కనుక ,ఈ జన్మకు ఎంతో ప్రాధాన్యత నిచ్చింది శాస్త్రం. మానవ మస్తిష్కమే ముక్తి సాధనం . సాధన వరకే దీని 
ఉపయోగం. సాధ్యం అంతటా నిండియున్న ఆకాశమే తాను అని గ్రహించడమే సారాంశం. అందుకే ఆకాశమే విష్ణువు అంటుంది శాస్త్రం . ఆకాశం అంటే జడంకాదు . మనలో చైతన్యం మనకు తెలుస్తున్నది కదా ?అదే అంతటా నిండి ఉన్నది. జీవితంలో భుక్తికి అవసరమైనంతగా మాత్రమే ,కుటుంబ అవసరాలవరకు ధర్మబద్ధంగా సంపాదించి , ధార్మిక జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత సమయాన్ని ,తత్వ ,భక్తి శాస్త్ర అధ్యయనంలోనూ,సజ్జన సహవాసం తోను, పరమాత్మ కృపకు పాత్రులైతే హృదయంలో గురుసాన్నిధ్యం కలుగుతుంది . శివాయ గురవే నమః. బాహ్యంలో గురువు ,మీ శాస్త్ర విహిత కర్మాచరణతో మీముందుకు వస్తారు. మన పెద్దల బాటను విడువక ఆరాధన,కొనసాగిస్తేనే 
తగిన గురువు మార్గదర్శనం చేస్తారు . పెద్దల బాటకు బద్ధకం ,కుతర్కం తోడైతే ,సాధనను మోసపుచ్చే గురువే 
లభ్యం అవుతారు. దీనికి పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . కనుక తన ఆచార వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. 
          జ్ఞానం తనను ఉద్దరించుకోడానికే ,జంఝాటానికి కాదు . ఈసాధనకు గమ్యాన్ని ప్రసాదించే మహామంత్రమే 
హరే రామ ,హరే కృష్ణ . అహం మన సాధనకు అడ్డుపడుతున్నపుడు రామనామము,ప్రపంచం నాదిగా తిప్పలు 
పెడుతున్నప్పుడు కృష్ణ మంత్రము,అన్నివేళలా హరి మంత్రము ,ముముక్షువుకు సహాయపడతాయి. ఏకాగ్రతతో, బుద్ధి సహాయంతో అహం రూపమైన రావణ సంహారాన్ని, చిన్ననాటినుండి ఆశ్రయించిన యోగ వశిష్ఠ గీత యొక్క అనుభవ సారంతో జీవన విధానాన్ని,కలిగిన శ్రీరాముని కధనుండి ప్రేరణ పొంది,శ్రీరామనామంతో అహంను జయించాలి.అన్ని తావులయందు తన వైభవాన్ని చాటి ప్రతి వారితోను ప్రతి సంఘటనతోను,మమేకం అయినట్లుఉన్నా, క్రీడగా తన పాత్రను ప్రపంచంలో ప్రకటించిిిన కృష్ణానామాన్ని ,ఇదం అని తెలియబడుతున్న      ప్రపంచాన్ని,బాహ్యం లోను,అంతరంగంలోను ,విశ్వం అంతా పరమాత్మ భావాన్ని పొందడానికి కృష్ణానమాన్ని గ్రహించి చరించాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే .