16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సనాతనం

                                        సనాతనం.
అన్ని శాస్త్రాల సారం ,నామరూపాలు భ్రాంతి అని ,స్వరూపమైన అహం ,జీవాత్మకాదని ,శరీరాన్ని తానుగా భావించడాన్ని,మనసుకి ఆలంబనగా ఇవ్వకూడదనేదే సారాంశం. మనసుకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పే విధానాలను ఎందరో సాధనాపరులు తెలియజేస్తూనే ఉన్నారు . అలాంటివి మనన రూపంగా స్మరిస్తున్నాను. వ్యక్తి ఒక్కడే అయినా అతడు తండ్రికి కుమారుడు,సోదరికి అన్న అలానే భర్త ,తన పిల్లలకు తండ్రి కూడా . కానీ ఇవన్నీ అనుబంధాలు తప్ప వేరు కాదు . వీటిని వార్డరోబ్లో హాంగార్లకు తగిలించే దుస్తులుగా ఊహిస్తే ,జ్ఞానం,వైరాగ్యం సిద్ధించేందుకు అవకాశం కలుగుతుంది. నిజానికి వీటిని తిరస్కరిస్తే ,ఎప్పటికీ మనసు లొంగదు . కానీ వ్యవహారం అవసరమైనపుడు తన పాత్రకు న్యాయం చేస్తూ ,అది అవగానే తన మూలమైన స్వరూప అహంలో విశ్రాంతి పొందాలి. ఇది నిజానికి రోజూ నిద్రలో జరుగుతున్నదే . సంబంధాలు అపుడు లేవు . దానివల్ల నిజజీవితంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దీనిని జాగ్రత్తులో సాధనగా మార్చినపుడు మనసు స్వరూపంలో నిలకడ పొందగలదు .

15, ఫిబ్రవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం. 
     స్త్రీ,పురుష సంబంధం లేని ,భార్యా లోలత్వం,పాతివ్రత్యం. జీవుడు సనాతనుడు. శరీరం లేనపుడు కూడా ,సూక్ష్మ 
శరీరంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దీన్ని మనశాస్త్రం అంగీకరిస్తున్నది. పాప,పుణ్యాలు సమమైనపుడు ,
మానవదేహం కలుగుతుంది. సూక్ష్మదేహం శరీరమనే ఉపాధితో కలిసింది. అంటే సూక్ష్మశరీరం పురుషుడు,శరీరం స్త్రీ, 
అనిభావిస్తే,భార్యని పువ్వులా చూస్తూ అన్నీ అమరుస్తూ,దానికోసమే జీవితాన్ని సమర్పించడం,భార్యా లోలత్వం. 
  తన శరీరము ,ప్రాణము ,మనసు కూడా ,జన్మ పరంపరలు దాటించడానికే అనే ఎరుకతో జీవి ప్రయత్నించడం అనేది ,పరమేశ్వరుని పతిగా గ్రహించి ,ధర్మ విరుద్ధం కాని కర్మాచరణతో జీవన్ముక్త స్థితికి ప్రయత్నించడం పాతివ్రత్యం. 

25, జనవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం . 
        విశ్వం విరాట్పురుషుని ,విశ్వరూపం. బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే పిండాండంలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఏదైతే శాస్త్రం ,బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శుద్ర అనే వర్ణ విభాగాలు 
తెలియజేస్తున్నదో, అది ఒకే శరీరంలో ప్రతీకాత్మకంగా తెలియబడుతున్నది. ధర్మార్ధకామమోక్షాలు ఒకే సాధనను 
తెలియజేసినట్లే ,సోపాన క్రమంగా వర్ణ విభాగాలు కూడా ఇదే అంతరార్ధాన్ని తెలియజేస్తున్నాయి. 
అహం , శరీరాన్ని ఉపకరణంగా వాడుకుని ఈ నాలుగు వర్ణాలను తనలోనే కలిగి ఉన్నది. తననే సర్వస్వం అనుకుని 
సకలము తానే సాధిస్తున్నాననే అహంకారం క్షత్రియ ప్రవృత్తి . చూసినవన్నీ తనకే కావాలి ,అనే  భావంతో వైశ్యత్వము ,శరీర సుఖం తప్ప అన్యమేది అక్కరలేని తత్వం శుద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని 
సాధనాలుగా తెలిసి ,మనోబుద్ధిచిత్తాహంకారాలు, పరమాత్మ సేవకు ఉపయోగపడేలా ,బుద్ధి ప్రయత్నం చేస్తే క్రమంగా శుద్ధ సత్వగుణాన్ని పొంది ఆత్మ ,పరమాత్మగా అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి ప్రయత్నం ,పరమాత్మ కన్నా అన్యం లేదని తెలిసి సాధన  చేస్తున్న దశలో శరీరాన్ని త్యజిస్తే బ్రాహ్మణ జన్మను ,దేన్నో శరీరహంతో సాధించే దిశలో
శరీర ప్రయాణం క్షత్రియత్వాన్ని,ఐశ్వర్యమే జీవిత పరమార్ధమైతే జీవి వైశ్యత్వాన్ని,శరీర సుఖమే జీవన సూత్రమైతే
శుద్రుని ఇంట జన్మ సాకార మోవుతుంది. 

21, జనవరి 2018, ఆదివారం

సనాతననం

సనాతనం. 
         ధర్మార్ధ కామమోక్షాలు ,జీవ బ్రహ్మైక్య, సోపానాలుగా గ్రహించి చరించే విధానాన్ని,ఆచార సంప్రదాయాల 
రూపంలో అందించింది మన శాస్త్రం. దీన్ని అనుసంధానం వలన ,సాధన పటిష్ట మోతుంది. మనస్సు ,హృదయంలో 
అణిగి ఉండడం మోక్షం. మనసు ,చేతనతో కూడి ఉన్నప్పుడే విషయ జ్ఞానం కలుగుతుంది. ఇది లేకపోతె పరధ్యానం 
అంటాము . అంటే బాహ్యంలో గాని ,అంతరంలో గాని మనసు చరించాలంటే చేతన సహకరించాలి. కాబట్టి ఈ జంట 
కలిసి మాత్రమే చరించ గలదు. మనసు చరించక హృదయంలో అణిగి ఉండడమే మోక్షం. దీనికి సాపేక్షంగా గృహిణి 
ఇంట్లో ఉండాలి అని ఆచారంగా చూపి ,సాధనా క్రమాన్ని సూచించారు పెద్దలు.