5, ఆగస్టు 2014, మంగళవారం

నమః శివాయ

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

        నమః శివాయ       
   
 శ్రీ  గురుభ్యో నమః 

                                శ్రీ ఆది శంకరుల పాద పద్మాలకు సవినయంగా నమస్కరిస్తూ ,
         శ్రీ శృంగేరి పీఠ విరాజిత వర్తమాన పరమ గురుమూర్తులైన ,పూజ్య గురుదేవుల పాద పద్మాలకు శరణాగతిని స్వీకరించమని ప్రార్ధిస్తూ,కలి ప్రభావం వలన కొన్ని తరాలుగా లుప్తమైన ఎన్నో సదాచార ,సంప్రదాయాలను కాపాడు  కోవాలనే తపనతో అమ్మను కృప చేయమని అర్ధించడం తప్ప ఏమీ తెలియని ,ఒకే ధ్యాసతో సాగిన జీవితం , గురుమూర్తులకు సమర్పిస్తూ, అమ్మ  అనుమతిస్తేనే 'గురువు' అనే శబ్దం మనసును చేరుతుందని భావిస్తూ,శారీరకంగా వేరే ప్రదేశంలో ఉన్నా,అంతః కరణతో  గురుదేవుని పాద పద్మములకు,స వినయంగా ,పతి ,పత్ను లిద్దరమూ ,పదే ,పదే నమస్కరిస్తున్నాము .
            నాకు తోచిన నాలుగు మంచి మాటలు ,సంఘానికి కీడు చెయ్యనివి ,సంస్కృతీ ,సంప్రదాయాలకు దూరమై , నాలానే మళ్లీ పొందాలనే తాపత్రయం కలవారితో మనో భావాలను పంచుకోవాలనే తాపత్రయమే తప్ప ,వేరే ఏ ఉద్దేశ్యం లేదు . అమ్మవారి కృపతో ,మన ధర్మం పైన అపరిమితమైన ఇష్టాన్ని ,ఈ నాలుగు మాటలు కలగిస్తాయనే ధృఢ అభిప్రాయం .  గురు దేవుల అనుగ్రహాన్ని ,యాచిస్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాను . ఈ సాహసాన్ని గురుదేవులు మన్నించాలని,ప్రార్ధిస్తున్నాను .
                           అమ్మ పాదాలయందు గురు దేవులను స్మరిస్తూ దీన్ని సమర్పిస్తున్నాను .         
                                     'ఓం' కార ,నాద స్వరూపుడు శివుడు .
 నిరాకారం శబ్దమే.ఒకశబ్దం నుండి ఒక రూపంస్పష్ట మౌతుంది. సాకారం రూపం .రూపం స్పృహలోకరాకముందు 
 నిరాకారమే ,శబ్దానికున్నస్వరూపం . ఎవరి  నుండి   వికి సోకినా  శబ్దం ప్రణవమే , అని మనస్ఫూర్తిగానమ్మిన  వారికి ప్రతిశబ్దము స్వరూప స్వభావాలతో  సాక్షాత్కరిస్తుంది పరమాత్ముని నుండి సకలము , పరమాత్మునికే  సకలము . అని నమ్మినవారి నుండి కదిలి సృష్టిలో వ్యాపించిన ,వాగ్వైభవం అందరి  హితానికై ప్రసాదించిన  మహనీయులకు మనః  సుమాంజలి . ముఖతః అన్నీ వినలేకపోయినా ,పరంపరగా పెద్దల నుండి ,గురువుల నుండి ,గ్రంధాలనుండి విన్నవి   పరమాత్ముని వాణిగా గ్రహించి ,పరమాత్మయే పరమ గమ్యంగా భావించి, జీవించే వారి పాద ధూళిని స్మరించి , విస్మరించలేనివి, ఆస్వాదించే ఆనంద రసాస్వాదన చిత్తులైన తేనేటిగల గుంపులోని ఒక కీటకంగా నన్ను సంభావించి ,సరి పడని భావాలను మైనంగా భావించి విడిచి పెట్ట వలసినదిగా నాద రూపుడైన పరమాత్మను ఈ విశ్వంగా భావిస్తూ అర్ధిస్తున్నాను . వంట అమ్మ కర్తవ్యం . కానీ ప్రతి అమ్మ వంట రుచికి తేడా ఉంటుంది . ప్రతి చేతి వంటకి మారే రుచిలా, ప్రతి వారి అనుభవంలో  పరమాత్మ వైభవాన్నిసరి కొత్త కోణంలో  స్మరించడంలో ఆనందాన్ని ఆస్వాదించే మధుపంలా సమాజపు శైలిని,పరమాత్మ వైభవాన్ని ద్రుష్టి నుండి జారిపోనికుండా ,రెండు వైపులా పదునైన కత్తిని వాడుతున్నట్లు వీలైనంత అనుసంధానం చేసే ప్రయత్నానికి పరమాత్మ సహకరిస్తాడని ఆశిస్తున్నాను . వంట ఎంతో బావుందని మూగవాడు చెప్పినట్లు పరమాత్మను ఇలా స్మరిస్తున్నాను .

         కాలంలో ఎన్నో మార్పులు సహజం .చలనమే లేని శివ స్వరూప కాలానికి ,మార్పు రూపమైన ఆచార సంప్రదాయాలు అమ్మరూపమే .పిల్లల కవసరమైన మార్పులు ,చేర్పులు ,ఓర్పుతో అందించే అమ్మకు తొలి నమస్కారం కానీ తండ్రి మాటను ఏ మాత్రం ధిక్కరించినా ,తండ్రికి తెలియకుండా ఏ వ్యవహారం చేసినా ,అమ్మకు వచ్చే ఆగ్రహం అపరిమితం .ఇది ఆమె పత్నిగా తానై పొందిన ,స్వతంత్ర ప్రతిపత్తి . దీన్ని మాత్రమే అమ్మ స్త్రీ స్వాతంత్ర్యం అనే దిశగా ఆమోదిస్తుంది . భర్త గౌరవం ముందు ,తన గౌరవం ఎంత చిన్నదో ,దక్ష పుత్రికగా నిరూపించిన అమ్మకు నమస్కారం .

        వేదమే శివానాదం . మూల రూపమైన 'ప్రజ్ఞానం బ్రహ్మ'తత్వమసి'అయమాత్మ బ్రహ్మ'అహం బ్రహ్మాస్మి' అనే దిశలో పరమార్ధాన్ని, గ్రహించడానికి చేసే కృషిని మాత్రమే అమ్మ , తాను ఇచ్చిన మానవ దేహానికి సార్ధక్యం అని , ఆదిశగా వేసే అడుగులకు ఎంతో ప్రీతితో సహకరిస్తుంది . ఈ సాధనకు వేసే అడుగులకు వినాయకుడు ఏ విఘ్నాలు రానివ్వడు . వచ్చినట్లు బయటినుండి చూసేవారికి అనిపించినా,అంతరంలో సాధకునికి ,పాప పరిహారంగా తెలుస్తుందే తప్ప,విఘ్నమని నిరుత్సాహం ఆవరించదు . దేవసేనా ధ్యక్షుడు వీరిని ,వెనుక అడుగు వెయ్యనివ్వడు .            ధర్మార్ధకామమోక్షాలు ,శివ కుటుంబం . ధర్మం తల్లి ,మోక్షం తండ్రి . వారి రక్షణలోని అర్ధ ,కామాలు , వినాయకుడు ,కుమారస్వామి . అర్ధం తరువాతనే కామాన్ని చెప్పాలి . ముందు కోరిక ,ఎంత పరిగెట్టినా ,అర్ధవంతమైన , అర్ధంతోనే అది సాధ్య మౌతుంది .ఇది గణాధ్యక్షుని విషయంలో మనం గ్రహించ వచ్చు . అర్ధం అనే పరమార్ధం అమ్మ సృష్టి. నిత్య ముక్త స్వరూప శివత్వంలో,మౌనమే ,సంపద .దానికి అమ్మ మాత్రమే రూపమివ్వ గలదు . వాగ్వైభవం అమ్మ ఇచ్చే సంపద . భౌతిక సంపదల మూల రూపం వాగ్రూపం .దాని విస్కృత పరిణామం విఘ్నాధిపతి . అందుకే గణపతి 'ఓం'కార రూపుడు . ఎప్పుడూ తల్లి ,తండ్రి చుట్టూ ప్రదిక్షణం చేసి సత్ఫలం పొందుతూ ,మార్గదర్శనం చేస్తున్నాడు .సృష్టిలోని ప్రతికణం పరమాత్మయే .అనే ధారణ వల్ల ,సంయమనం ఏర్పడుతుంది .సుఖ ,దుఖాలు ,మనసుపై , పెద్దగా తమ ప్రభావాన్ని చూపలేవు . ఇదే ప్రదక్షణ ఫలం .
      ఈ స్థితిలో ,కోరిక కదిలినా పెద్ద ప్రమాదకారి కాదు . ధర్మాన్ని అనుసరించి ,సంయమనంతో నడిచే నడతకు , రూపం ,కుమార స్వామి .ఆచరణకు అధ్యక్షుడు ,దేవ సేనాధిపతి .తన పనిపై సందేహం లేని స్వామిత్వమే ,కుమారస్వామి. ఇది ధర్మానికి మోక్షానికి వారధి .మోక్షం కూడా అనుభవానికి ముందు ,కామనయే. ఈతడు అమ్మ నుండి కాక ,అమ్మద్వారా , ప్రేరేపింప  బడి భౌతిక ,ప్రయోజనం లక్ష్యంగా కాక[కామదహనం]పర తత్వమే ప్రయోజనంగా,సాగే ప్రయాణానికి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యుడు.అందువల్ల కాలసర్ప రూపంగా ,సాధనగా సాగుతుంది ,కోరిక . అగ్ని,నుండి వ్యక్తమై ,అవ్యక్త పరమాత్మను చేర్చడమే ,ఇతని గమ్యం . సాధారణంగా కూడా కోరికకు దహించే తత్వం సహజం . మోక్షకామి  అయి ,కదిలితే ,కదలని తానే స్వరూపంగా ,సాధ్యం భాసమాన మౌతుంది .
           ధర్మ,అర్ధ ,కామ,మోక్ష అనే పురుషార్ధాలు నాలుగు దీన్నే నిరూపిస్తాయి .'ధర్మ',గురు ముఖతః వినే ,'ప్రజ్ఞానం బ్రహ్మ''తత్వమసి'అనేవి బాల్యం నుండి వింటున్న బాల్యం, కిసోరావస్థలో అన్వయ మనే అధ్యవసాయంలో పడుతుంది. బాల్యంలో క్రీడ లంత సహజంగానే,పై విషయాల ఆలోచనకూడా అంతే సహజంగా,అధ్యయన సమయంలోనూ అనుస్యూతంగా సాగుతుంది .అర్ధ అనే పురుషార్ధం వద్దకు వస్తే ,ఇంట్లో పెద్దలు ధన సంపాదన ,వినియోగ , సంగ్రహ అనేవాటిని ,ఏ విధంగా విభాగం ఎలా అనేది ,పిల్లల ఊహ తెలిసి నప్పటినుండి గమనిస్తూనే ఉంటారు .ధనమే కాదు తల్లి ,తండ్రులు ,ఏ విషయాలకు ఎంత ప్రాధాన్యత నిస్తారు అనే విషయం ,పిల్లలకు నిర్ద్వందంగా తెలుసు . పెద్దల ద్రుష్టి కేంద్రమే ,పిల్లల సంపద . దీనివలన పెద్దల ద్రుష్టి అత్యవసర విషయంగా ,దేన్నిపరిగణిస్తున్నదో ,తెలుసుకునే నేర్పు వారికి సహజంగానే ఉంటుంది . వారి ద్రుష్టి పడకుండా నిర్వహించ వచ్చు అనుకుంటే ,వారినుండి పెద్దలకు కూడా ,పిల్లల దాపరికమే ఎదురవుతుంది . దీనివలన పిల్లలకన్నా ,పెద్దలే భవిష్యత్తులో బాధకు గురి అవుతారు .అన్నిటినీ దాచి పెద్దల్ని 'మసి పూసి మారేడుకాయ 'చందంగా ,వర్ణాంతర వివాహాలవరకు గాని ,అధవా మా స్వంత విషయాలు అంటూ ,తన భార్య పిల్లలు ,ఒక ప్రత్యేక విభాగం అన్న రోజున ,పిల్లలను పెంచిన ,15సం /జీవితంలో ఎంత అనర్ధం జరిగిందో ఆలోచించినా వ్యర్ధమే . అర్ధ వ్యవస్థకు మనపెద్దలు ,ధర్మానికన్నా తక్కువస్థానం ఎందు కిచ్చారో ,పిల్లలు పెరిగే వరకూ తెలియదు .అపుడు తెలుసుకుని చెబుదామన్నా ,వినేవారు ఉండరు . ప్రత్యక్షంగా పెద్దల ద్వారా వినకున్నా ,తమ స్వంత అనుభవంలో మనసు ఎలా ప్రవర్తించి తల్లి దండ్రులను ఎక్కడ ఉంచిందో గమనించి ,ధర్మ ప్రాతిపదికకు ,అర్ధసంగ్రహం కన్నా మిన్నగా జీవించి ,విలువలకు ప్రాధాన్యతను పెంచి ,జీవించి మాత్రమే ,పిల్లలకు మార్గ దర్శనం చేయాలి .ఇలా జీవించడానికి సంపన్న జీవితం కన్నా ,సంపన్న సంప్రదాయం ముఖ్యం . రోజు వారి సంపాదన ,అయినా జీవించే విధానం మాత్రం స్వీయ పరిణతి మాత్రమే . నిజానికి పెద్దలు సంపదగా పరిగణించింది సాంప్రదాయ బద్ధమైన జీవితాన్నే కానీ ,మట్టిలో పుట్టి ,మట్టి రూప మైన బాహ్య సంపద కాదు . శ్రీ శంకరులు ,కనకధారా స్తోత్రంలో ,మనముందుంచింది ,అర్ధ సంపాదన బాల్యక్రీడ అని తెలియ జెయ్యడమే . తరువాత ఏ సంపాదన ముఖ్యమో ,జీవించినంత కాలం చెప్తూనే ఉన్నారు .
                కామ పురుషార్ధానికి ,కామన అనే అర్ధం అందరికీ తెలిసిందే . అర్ధానికి ధర్మాన్ని జోడించినట్లే ,కామనకు కలపాలి .ధర్మంతో అనుసంధానం చెయ్యకుంటే వీటికి , సార్ధకత లేదు . ఎందువల్ల అంటే ,మోక్షమే శివ స్వరూపం .గమ్య రూపమైన మోక్షానికి ,సాధన ధర్మమే . పత్నిధర్మమే మహా గౌరి .ఆమె తనతో కలిసి శివాజ్ఞను ,అంటే ధర్మాన్ని పాటించ మంటుంది .కానీ శరీర పరిధిని ,తమ పరిధిగా అర్ధ ,కామాలు ప్రవర్తిస్తాయి . కానీ శరీరం , ఈ సృష్టిలో, ఎంత చిన్నదో , వాటి పరిధి అంత చిన్నది .దీని వలన మాత్రమే,చిన్నదైన తన జీవ కుటుంబానికి పరిమితమై ,జనన,మరణ చక్రంలో పరిభ్రమిస్తాడు .అర్ధ కామాలకే పరిమితమైన జీవి . మోక్ష గామి ఐ ,ధర్మ మనే బండిలో మాత్రమే ప్రయాణించేది ,వసుధైక కుటుంబం .
             పైన చూసినట్లు మోక్షమనేది ,ఒక పురుషార్ధం కాదు . ముందున్న మూడు కలిగిన ముముక్షువు పొందే , సాధ్య స్వరూపం .సాధన ,ధర్మ బద్ధమైన ,అర్ధ ,కామాలు . ధర్మ పరమైన నిబద్ధతతో జీవించి ,సృష్టిని ఆచంద్ర తారార్కం ,ధర్మ స్వరూపులైన ,సీతారాముల ,అయోధ్యగా, నిరూపించే జీవితం ,ధన్యం . ప్రజ్ఞానం బ్రహ్మ ,తత్వమసి ,గురు వాక్యాలు . వీటిని బాల్య,కౌమరాలలో పెద్దల ద్వారా బాగా గ్రహించి ,చింతన,కొన సాగించి [థియరీ],యౌవ్వన ప్రారంభం నుండి అర్ధ , కామాలతో బాటు ,మిగిలిన రెండు మహా వాక్యాలు ,స్వానుభవ [ ప్రాక్టికల్]రూపమైన , జీవితం సాగాలి . దీనికి దేశ కాలాలు అడ్డు రావు.అయమాత్మ బ్రహ్మ,అనేది సాధన .అహం బ్రహ్మస్మి అనేది స్థితి .దేశ ,కాలాల్నితమ అపజయానికి    కారణంగా చూపడమంటే ,చాతకాక ,మద్దెల ఓటిదన్నట్లు . బాహ్య కారణాలు అంత రంగాన్నిఏ మాత్రం కదిలించకుండా చేసే సాధన ,స్థిత ప్రజ్ఞత నిస్తుంది . ధర్మమనే కాడికి పూన్చినపుడే ,అర్ధ ,కామాలు ,జీవన రధాన్ని,అహం బ్రహ్మాస్మి అనే , గమ్యాన్ని చేరుస్తాయి .ధర్మ మనే కాడి నుండి తప్పిస్తే ,కనిపించిన అడ్డమైన గడ్డీ తిని,గాడి తప్పిన జీవితాన్ని వ్యర్ధంగా , గడిపేస్తాయి . 
           అమ్మ నమస్కరించే అయ్యకు నమస్కారం . అమ్మ చూపించే తండ్రికి నమస్కారం . శివాయ గురవే నమః . సృష్టిలో అందరి పోషణ భారాన్ని వహిస్తున్న,తల్లి దంద్రులైన శివ ,శివానీ లకు,హృదయ పూర్వక నమస్సుమాంజలి . ఓంకారాన్ని పరిపూర్ణ పరబ్రహ్మంగా మనకు పెద్దలు సూచిస్తారు. అ ఉ మ అనే మాత్రలకు,అర్ధమాత్ర సంపూర్ణ స్వరూపాన్నిస్తుంది.ఆమూడు అక్షరాలలోనే,త్రిమూర్తి రూపమైనా,ముగ్గురమ్మలరూపమైనా,మూడు లోకాలైనా,త్రిగుణాలైనా, అన్నీ యిమిడి ఉన్నాయి.అర్ధమాత్ర సాక్షాత్తుగా ఆది గురు స్వరూపమే.ఒక ఓంకారానికి,మరొక ఓంకారానికి మధ్యనున్న సాక్షాత్ స్వరూపమే నిరాకార పరబ్రహ్మం.ఇదే అర్ధ మాత్ర.ఈ పరిధి లోనిదే సకలమూ.శివుని ,నంది శ్రుంగాల ,మధ్యనుండి చూసే ,ఆలయ ఆచారం లోని పరమార్ధము ఇదే .నిరాకార స్వస్వరూపం శివుడైతే ,అది మన ఎరుకగా ఉన్నది అమ్మ చిత్ స్వరూపమే. వీరి చిద్విలాసమే కదా,జగత్తు. అదే ఆనంద రూపమైన జగత్స్థితి.వీరిద్దరి సంయోగ స్వరూపమే ,ప్రతిజీవి. అంతేకాదు మనకు పరిచయమయ్యే ప్రతి క్షణం. ప్రతికణం. 
       మనలో మనమే ఉంటే,ఈ విషయాలను గుర్తించ వచ్చు.ఎరుక ,మెలకువ ,ఉంటే సాధ్యమే. మనమొక పువ్వును చూశా మనుకుందాము. చూస్తున్న నేను , చూడబడే పువ్వు ,చూసే చర్య ,త్రిపుటి .ఈ విధానాన్ని సాక్షిగా గమనిస్తే,గమనించే నేను అర్ధమాత్ర. ఇదే శ్రీరమణ మార్గం.
    గమనించే సాక్షికి,త్రిపుటితో ఏ సంబంధం ఉండదు. పువ్వులు ఎన్ని ఉన్నా చూసే చూపు ఒక్కటే. అలానే శరీరానికి సాక్షి పరమాత్మ మాత్రమే .పువ్వును చూస్తున్నప్పుడు కలిగే చర్య గమనిస్తే. చూసే సాక్షి శివుడైతే,చూడబడే పువ్వు అమ్మవారే. ప్రతి క్షణం కళ్యాణమే. కలిగేది ఆనందమే. కానీ త్రిపుటిలో మునిగితే సంసారం. అంటే చూసినది కావాలనుకోవడమే సంసారం. సాక్షిగా కదిలే వాటిని గమనిస్తూ పోవడం,పరమాత్మాను సంధానం.
            త్రిపుటి బాహ్యం లోనే లేదు.అంతర ప్రపంచానికి  కూడా అన్వయిస్తే, యిదే ఆనందం అందుతుంది. సాధన
సమయాన్ని కోరదు. అవగాహన మాత్రమే ఆలంబనం అవుతుంది.అందువల్లనే కర్మ,భక్తి అన్నీ లయమై,లక్ష్యంఅందాలంటే జ్ఞానమే ప్రధానమనే ఉపనిషద్ వాక్యం,వర్తమాన క్షణానికి అన్వయిస్తే  మాత్రమే సాధన సంపూర్ణ మౌతుంది.కర్మ,ఇది బాహ్య,అంతర ప్రపంచాన్నిశుద్ధి చేసి వర్తమాన క్షణాన్ని మన ముందుకు తెస్తుంది.దీనికి కర్త, కర్మ,కర్మఫలం.ఇలా త్రిపుటి పైనే ఆధార పడుతుంది. కర్మఫలం కోరని కర్మ,బాహ్య,అభ్యంతర సుచినిస్తుంది.బాహ్య అంతర కర్మ, కర్తయొక్క సపోర్ట్ తో మాత్రమే తన సాధన సాగిస్తుంది. మన మీద మనకున్న కంట్రోల్ కర్మకు సహాయ కారి అవుతుంది. అలలు లేని నీటిలా స్పష్టమైన అవగాహనకు సహకరిస్తుంది. పరమాత్మ దర్శనానికి ప్రధమమైన ప్రాతిపదిక క్లారిటీ,ఇది కూడా మనకు సాక్షిగా ఉండే సాధనలో లభిస్తుంది. ఈ సాధనలో మనకు తెలియకుండానే , పరమాత్మ సామీప్యం వలన,పాప పుణ్యాలు క్షీణిస్తాయి.పిల్లలలకు,తల్లి తండ్రి,ఎదురుగా ఉన్నప్పుడు వారికి కలిగే రక్షణ వంటిదే ఇది కూడా. అందువలన తత్క్షణ ఆనందానికి అర్హుల మౌతాము.
         కర్మలో త్రిపుటి ఉంది.ఒకటి మైనస్ అయితే మిగిలేది భక్తి.భక్తుడు,భగవంతుడు.భక్తిలోకూడాశరీరసహకారంతో
జరిగేది,పూజ.ఇది కూడా,ఎన్నో జన్మలలో చేసిన శారీరిక పాపాలను తుదముట్టిస్తుంది. పాప కర్మకు మనసు కూడా
బాధ్యత వహించింది కనుక,పూజలో కూడా మనసు సహకరిస్తేనే పూజాఫలం అందుతుంది.వీటిని శాసించడం బుద్ధి కర్తవ్యం. కర్మకు శాసించిన బుద్ధి ఇక్కడ శాసనం చెయ్యకపోతే,వక్రమైనదనే అర్ధం.
         అంతర పూజలో భక్తుడు ,భగవంతుడు.  జప,ధ్యానాలు. వీని వలన శరీర సహకారం లేకుండా,మనసును
ప్రేరేపించి బుద్ధి చేసిన పాపాలకు,ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కర్మను,భక్తిని సహకారంగా తీసుకుని సాగినా,పతాక
స్థాయిలో యివి ఏ మాత్రం సహకరించవు.జ్ఞాన స్వరూపమైన ఏకత్వం,మన స్వరూప మౌతుంది. దీనిలో త్రిపుటి
లేదు.అందువలన జ్ఞానాన్నిసాధనంగా కూడా నిరూపించడం కుదరని విషయం.ఏకమైన ఎరుకలోసాధన,సాధకుడు
సాధ్యము,వీని బేధం లేదు.మంచు కరిగి నీరైన చందంగా.  శివానంద రూప శివోహం,శివోహం.
         ప్రకృతిని పరికిస్తే కనిపిస్తున్న ప్రతిదీ, శివుడు ,శక్తి కలిసి ఉన్న స్వరూపం ,ప్రతి జీవిగా ,ప్రతి శరీరంలో అర్ధ నారీ
శ్వరమే .బాహ్యంగా చూస్తే నాటకరంగంలో,వేదిక పైన నటించే కధ కోసం మాత్రమే స్త్రీ,పురుష,బేధం.అంతరంగంలో
కదిలితే,మనకు,మన స్వరూపంగా అనుభవంలో శరీర పర్యంతంగా,భాసించే ఏ చైతన్యం  పరిచయంలోఉందో అది ,
శరీరం గాను,తెలుసుకుంటున్న చైతన్యం గాను,అర్ధ నారీశ్వరమే .అంతరంగంలో పరమాత్మ రూపంగా అనుభవం ఏకమే ఐనా ,సృష్టి పరిధిలో పరమాత్మ ఉన్నతుడు . ఇది పరమాత్మ చెప్పే విషయం కాదు . జీవుడు ప్రతిపాదించ వలసిన విషయం
           ఇదే స్త్రీ ,తనకు తానుగా గీసుకునే ,చిన్నగీత . భర్తకు పెద్ద గీత ,దానంతట అదే ఏర్పడుతుంది . ఇది ఆధ్యాత్మిక పరమైనఅన్వయం . భక్తితో పరమాత్ముని మూర్తి ఎదుట నిలబడి నపుడు ,కళ్ళు మూసుకోవడం ,సాధారణంగా జరిగే ప్రతిక్రియ . ఇలా ఎందుకు ?సాకారంగా శరీరం వెలుపల కనిపిస్తున్నమూర్తి ,అంతరంలో నిరాకర రూప ,అనుభవరూప , సచ్చిదానందరూప స్వానుభవ రూప ,శివోహం ,శివోహం . శరీరస్ప్రుహతో ,మాత్రమే బాహ్యభ్యంతరాలు. శరీరం పురాకృత కర్మ రూపం . కర్తృత్వ భావం విడిచిన తత్క్షణం ఉన్నది ,నిరాకార రూప శివోహం ,శివోహం .
         ఓంనమో నీలకంఠయ మహా మృత్యుంజయాయ నమో నమః . వర్తమానంలో సాధన మోక్షా న్నిస్తుంది . ఇది శాస్త్ర  సమ్మతం.అంటే మనసులోకి భూత ,భవిష్యత్ వీటి ఆలోచన వీడి తత్ క్షణంలో ఉన్ననిరాకార సత్చిద్రూప స్థితి . అనుభవం ఆనందం . ఇది మోక్షం .కానీ ప్రతిబంధకమే భూత కాలం .భవిష్యత్తు గురించి ఆలోచనను నిరోధించ వచ్చు. భూతకాలానికి సంబంధించిన ఆలోచనలు తప్పకప్రతిబంధకాలే.కనీసం ఈజన్మకు సంబంధించిన ఆలోచనలే నిగ్రహించ లేనపుడు గత జన్మల పాపరాసి తప్పక ఏదో ఒకరూపంలోఅడ్డు తగులుతూనే ఉంటుంది.ఇదే మనకుక్షీర సాగర మధన గాధలో తెలుస్తున్నది. 
      విష్ణువే  ఆధారంగా [వర్తమానం]మధన సాగి నప్పటికీ ,దేవతలు,రాక్షసులు వీరికి కల రాకృతం[భూతకాల]మహా కాలకూటవిషం [కాలంలో కూడబెట్టుకున్నది]నిరోధించ శక్యం కానిది ,దీన్ని వర్తమానం దాటలేక  పోయినప్పుడు, పరమేశ్వరుని శరణు వేడితే భూత కాలాధిపతి  ఐన పరమ శివుడే ,విషాన్ని గ్రహించి ,నీలకంఠ నామంతో అనుగ్రహించాడు . ఆసమయంలో క్రింద పడిన విష బిందువులు ,విష సర్పాలుగా మారినపుడు వాటిని తానే ధరించి మానవాళిని  భయ ముక్తులను చేశాడు . మానవుని పురాకృత పాపకర్మ ఎంత ఉన్నా, ఈ జన్మకు వర్తించేది ఒక బిందువే . ఈజన్మకు అందిన పాప ఫలం వ్యాధి,వైరం,దారిద్ర్యం ,అహంకారం,ఇలాఎన్నో రూపాలలో స్తరించి,మనసుకు వర్తమానంలోని  [విష్ణువును] ఆనందాన్ని అందకుండా చేస్తుంది . భయముక్తుడు కాని వాడు మోక్షానికి అనర్హుడు . భయమే మృత్యువు . అందుకు శివుణ్ణి మార్కండేయునివలె మృత్యుంజయా పాహి అనవలసిందే .అదే మనకు క్షీర సాగర మధన సమయంలో దేవత రూపాన్ని ధరించి[మోహ రూపమైన]మాయా రూపాన్ని పొంది,మోసంతోమన అమృతరూపమైన కాలాన్నిహరించి అందవలసిన మోక్షరూపమైన  వర్తమాన కాలాన్ని,రాహు కేతు రూపంగా, సూర్యుని,చంద్రుని, గ్రసించి నట్లు,గ్రహణంలా  కనిపిస్తుంది . కానీ ఇది కూడా పైకి కనిపించే కారణమే ,నీడలాగా . నిజం అంతరాత్మ రూపమైన పరమాత్మ చైతన్యాన్ని, ఇది ఎంతోసేపు మరుగు పరచలేదు. రాహు కేతువులను గుర్తించిన ,విశ్వానికి నేత్రాలైన సూర్యుని ,చంద్రులపై పగబట్టి గ్రహణాన్ని లీలా మాత్రంగా చూపి అంతరంగ ద్రుష్టి ఐన మూడో కన్నును మాత్రం అడ్డుకోలేక విరమించేవే ఇవి .అందువల్ల శ్రీ కాళహస్తీస్వరుని , మూడోకంటి వాణ్ణి భజించి భయ ముక్తులు కావలసిందే . అందరికీ అందే వాడే నాగాభరణుడు . అందుకే భోళా శంకరుడు . ఎప్పుడూ నడుస్తున్నది భూతకాల రూప ప్రారబ్ధమే . శివుడే అందుతున్న వాడు . ఈయన దక్షిణామూర్తి . ఈయన శక్తి జ్ఞాన ప్రసునాంబిక . అందుకే గ్రహణ సమయంలో కూడా శ్రీ కాళహస్తీ శ్వరాలయం తెరిచే ఉంటుంది . మానవాళిని భయముక్తులను చేసే భవ్యాలయం .
       ఇందులోని శ్రీ వాచకం సాలె పురుగును సూచిస్తుంది . ఇది మానవుని కర్తృత్వ భావంతో పెంచుకునే సాలెగూడు . పదార్ధం గూడు కట్టడానికి ఎక్కడి నుంచో రాదు . తానే తననుండి అహం శరీరానిదే వేరే కర్త, లేడనే పరమాత్మ నిరాకరణ రూపమైన ప్రవృత్తి మాత్రమే దీనికి ఆధారం.ఈ విధమైన అహాన్నిమాత్రమే అమ్మ అయిన జగన్మాత జనన,మరణ రూపమైన ఉయ్యాలలో పసి బిడ్డగా లాలిస్తుంది.అందుకే వినాయకుడు తల్లి తండ్రులకు నస్కరించి సఫలీ కృతుడు అయ్యాడు . మానవులు శరీరంలో ఉన్నది ,నిజానికి తల్లితండ్రుల రూపంలో ఉన్న శివా శివులే .దీన్ని గుర్తించి అహం నిర్మూలనం చెయ్యడం సులువు .అంతా ఈశ్వరుడే,అహం  లేదు ,అంతా శివోహం అంటున్న శివుడే, అని నమ్మి సాధన చేసే భక్తులకు జ్ఞాన ప్రసూనంబికగాఅనుగ్రహించి జనన,మరణ చక్ర బేధనం చేస్తుంది .శరీరం ఉన్నంత కాలం,తనలో వ్యక్త మవుతున్నది , శివాశివులని  ఎరిగి,అహం ప్రత్యయం,శరీర పర్యంతమనే సర్ప భావాన్ని వీడి,పరమాత్మనే రజ్జువుగా తెలిసి భయ రహితులై మోక్ష స్వరూపమైన,మార్కండేయులై, శరీర మరణాన్ని తమ మరణంగా అన్వయించక ,శివోహం అనాలి . శరీరానికి అన్వయిస్తే కలిగేది ,రావణాసుర తత్వమే .ఇలా ఈ సాలెగూటి నుంచి శివుణ్ణి ఆశ్ర యించిన 'శ్రీ 'కధ .
      కాళము అంటే సర్పము . సర్పము వర్తమాన కాలానికి గుర్తు . అంటే మన కాలాన్ని శివునికి అలంకరిస్తే , అలంకరణ ప్రియుడైన విష్ణువై ,తత్క్షణం వర్తమాన రూపమైన విష్ణువై, మోక్ష రూపునిగా,సర్వే సర్వత్ర ప్రకాశిస్తాడు.అమ్మ సూర్యుని నుండి వచ్చే కాంతి స్వరూపం .ఇవి నిజానికి రెండు కాదు . ఒక వ్యక్తికి రూపాన్ని గాని ,నామాన్ని గాని వేరుగా ఉహించడం కూడా కుదరనిపని.ఒకే వస్తువును దాని స్వభావాన్ని కూడా వేరు చెయ్యలేము.విద్యావంతుని నుండి విద్య ఎప్పుడూవేరుగా  ఉండదు.ఇదే అర్ధనారీశ్వరo . శ్రీచక్రం . 4శివ కోణాలు . 5శక్తి కోణాలు . బిందువు అద్వైతం .
       లం ,హం ,యం ,రం ,వం ,ఇవి పంచ భూతాత్మక బీజాక్షరాలు . దీనిలోని వాయు బీజాక్షరమ్ యం,వాయువుకు సూర్యుని పంచాయతనంలో తెలియజేస్తారు .'లం'వినాయకుని ,పృధ్వీ రూపంగా ,'హం'విష్ణువును ఆకాశ రూపంగా , 'రం'అమ్మవారిని అగ్ని రూపంగా ,'వం'శివుడు జల స్వరూపం . శివునకు అభిషేకం .దీపం అమ్మవారు .పుష్పం విష్ణువు. ధూపం సూర్యునికి .నివేదన వినాయకుడు . నివేదనలో పదార్ధం ,పంచ భూతాత్మకం.
           సూర్యుడు సకల దేవతా స్వరూపుడు .హనుమంతుని, వేద వేత్తను చేసిన గురువు శ్రీ సూర్య నారాయణ మూర్తి .నమస్కరిస్తే కరుణించే కారుణ్య మూర్తి .అలాగే శ్రీ కాళ హస్తీ శ్వరుడు ,వాయు లింగ రూపుడు .ఆదిగురువు దక్షిణా మూర్తి . అందువలన సూర్యునిలో ' శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సహిత శ్రీ కాళ హస్తీ శ్వరుని ' భావించి నమస్కరిస్తే ,రాహు ,కేతు బాధల నుండి విముక్తులు కావచ్చు .  
       హస్తి ,ఏనుగు పూజించిన సర్వేశ్వరుడు.మానవ కపాలం ఏనుగు కుంభ స్థలమైతే,మూలాధారం వరకూ ఉన్న సుషుమ్నా మార్గమే తొండం . ఏనుగు తొండంతోనే అన్నీ అందుకుంటుంది .స్పర్శ అనే జ్ఞానేంద్రియానికి గుర్తుగా కూడా ఏనుగు చెప్పబడుతుంది.ఎప్పుడూ క్రిందికి వేళ్ళాడుతూ ప్రేయో మార్గాన్ని ఆశ్రయించి,ఎంతో సూక్ష్మ బుద్ధి కలిగి శ్రవణంలో  ఎంతోనిపుణత కలిగివున్నా,సృష్టితో అనుబంధాన్ని వదులుకోలేని బలహీనత,మదించి ఉండడం వలన,శ్రవణం లోని జ్ఞానాన్ని, అనుభవానికి అందక,సంసారం అనే కాసారంలో తిరుగాడుతూ ఉంది . కాలం [మొసలి]వర్తమానంలో శరీరాన్ని,గ్రసించే సమయంలో  స్థితి కారకుడైన విష్ణువును 'నివేతప్ప ఇతః పరం బెరుంగ' అని గుర్తించి ,మనసును ఏకాగ్రం చేసి ,చేసిన ప్రార్ధనను,శ్రీ హరి మన్నించి ,సిరికి చెప్పకున్నా,[హృదయ స్థిత లక్ష్మి ,వాగ్రూపంగా]గరుడుని మాత్రం అధిరోహించాడు.అంటే శ్రవణానక్షత్రాధిపతి ,శ్రీ మహా విష్ణువు.గరుడ రూపంలో  సూచించ బడిన వేదవిద్య ,స్ఫురణకు తెచ్చి,కరిని కాచి రక్షించాడు. నీటిలోని మొసలి ఏనుగును వెదుకుతూ రాలేదు .అలానే కాలగతిలో ఏనుగనే శరీరమే,మృత్యువనే మొసలి వద్దకు చేరింది .అప్పుడు తాను కాలాన్ని ఎంతగా అపహాస్యం చేసిందో , అర్ధం అయింది . వర్తమానంలో అంటే విష్ణు కృపతో,శ్రవణం ద్వారా తాను పొందిన జ్ఞానంతో ,అంతర్ముఖమై ,మూలానికి చేరి , అంతర్గత చైతన్య రూపమైన శక్తి ,వాడక పోవడం వలన ,చుట్ట చుట్టుకుని నిద్రిస్తున్నట్ట్లున్న అనంతమైన కాలం [సర్పం] బుసలు కొడుతూ, ఏనుగు తొండంలో [సుషుమ్నలో]ప్రవేశించి,సహస్రారం చేరి పరమాత్మలో లీనమైంది . ఇది వాయు నిరోధంతోనే సాధ్యం. వాయువు యొక్క కుమ్భకస్థితిని ఏనుగు అని సంభావించినపుడు సమయమనే కాళము కుంభకంలో జాగృతిచెంది శివుని చేరి సాలెగూటి వంటి సంసారం నుండి విముక్తి  పొందడమే సమాధి .
        శబ్ద రూపమైన మంత్రం కానీ స్తోత్రం కానీ ,వెన్ను నిటారుగా ఉంచి ,శబ్దాన్ని ఎక్కడ పుడుతున్నదో అక్కడే నొక్కి , ధ్యాసతో చదవడం వలన,మనసు కదలక శబ్ద మూలంలో రమిస్తూ ,బాహ్య ప్రపంచం కోసం వెంపర్లాడదు.స్వానుభవం సాకార మౌతుంది .జీవ బ్రహ్మైక్యమే శ్రీ కాళ హస్తి .     
            సాధన సంపూర్ణం అవాలంటే కీలకమైన అంశం, పైన చూసిన దృశ్యంలో తెలుస్తుంది . క్రమంగా మనః చక్రాన్ని,దృఢo చేసిన కొద్దీ ,సుదర్శనమై ,కాలాన్ని[భూత,భవిష్యత్]నిలిపి ,వర్తమానం ,అనే కాలాతీత స్వరూప ,క్షణంలో , నామ రూపాతీత స్థితిలో నిలిపితే ,అదే మోక్ష రూపుడైన విష్ణువే . కదలకుండా ఉన్న క్షణంలో ఉన్న మనస్సే ,సుదర్శన చక్రం . త్రిగుణాతీతమైన ఆనంద స్వరూపమే ,తత్ క్షణంలో అందుతుంది .
                దీన్నే విష్ణు రూపానికి అన్వ యిస్తే ,సూర్యుడు నారాయణ రూపు డైతే ,కిరణాలు లక్ష్మి స్వరూపం . పద్మం నీటిలో  ఉంది . సూర్య రస్మితో వికసిస్తుంది .సంసారమనే బురదలో [శరీరంలో]మనసు పద్మం వంటిది.అందువల్లనే జీవినే పద్మావతిగా చూస్తే ,పరమాత్మ  జ్ఞానం జీవి మనసును వికసింప జేస్తే [షట్చక్ర బేధన రూపమైన ]సహస్రారంలోని వెంకట రమణునిలో లీన మౌతుంది .క్రింద పద్మావతి  ఏడుకొండల పైన [షట్చక్రాలు పైన]వేంకట రమణుడు .కిరణాల రూపంతో లక్ష్మి ఒక పత్ని.ఆమె మరో రూపమే పద్మావతి . సృష్టి అనే క్రీడలో విష్ణువు యొక్క శక్తి శ్రీ మహాలక్ష్మి . ఆమె అలంకరించుకుని ,దర్పణంలో తనను తాను చూసి మురిసిన ,ప్రతిబింబ రూపమే పద్మావతి . ప్రతిబింబానికి ఉన్న మరో లక్షణం .కుడి ,ఎడమగా కనిపించడం . బింబంనిరాకారం . సాకారం ప్రతి బింబం . ప్రతిబింబ రూపమైన శరీర పరిధిని తానుగా భ్రమించే జీవాత్మ ,అద్వైత పరమాత్మ శివోహం అంటే ,నేను అంటూపూర్తిగా వ్యతిరేక దిశలో శరీరమే అని అన్వయించి,తనను విలక్షణంగా బింబం కంటే వేరంటూ,నిర్ణ యించి మోక్షం కావాలంటూ మొర పెడుతుంది . ప్రతిబింబం తాను అనగానే ,కాలం అనేది ప్రారంభం అవుతుంది . బింబానికి కాలం అలంకారం మాత్రమే శివునిలా. పాన్పుగా ఉంటుంది విష్ణువుకు .అద్దం ముందుకు రావడం జన్మ ,తప్పుకోవడం మరణం. లక్ష్మిమాత్రమే  పద్మావతికి  శ్రీనివాసునితో కళ్యాణం చెయ్యగలదు .జ్ఞానం మాత్రమే  ఆత్మను పరమాత్మతో కలప గలదు . ఇద్దరు భార్యలు  అని సూచించిన అంతరార్ధం ఇదే .
          వర్తమాన క్షణంలో[విష్ణువు ],దేహం [భూదేవి],కాలం [శ్రీదేవి] ప్రాణ స్వరూపం ,ఒకే బిందువు వద్ద ,ఐక్యమై
స్వస్వరూప ,మోక్ష రూపంగా,దర్శనమిస్తున్నారు .ఆకాశమే నామరూపాలకు ,అవకాశమిస్తుంది .ఆకాశం విష్ణువు,శబ్దం లక్ష్మిరూపం ,రూపం భూదేవి . బుద్ధి ,నామరూపాల వరకే పరిమితమై ,పరమాత్మను ,గ్రహించలేదు .బల్బు విద్యుత్తుతో , ప్రకాశిస్తుంది కానీ ,విద్యుత్తును ,దృశ్యంగా ఎప్పటికీ తెలుసుకోలేదు .అలానే ప్రకృతి సాకారం . విష్ణువు నిరాకారం . వీరి కళ్యాణ రూపమే సృష్టి . పద్మావతి భూమి మీద అవతరించే లీల దిశగా అర్ధం చేసుకుంటే ,లక్ష్మీదేవి ,భ్రుగు పుత్రిక కూడా . భ్రుగు మహర్షి ,వైకుంఠఆనికి వచ్చి,నారాయుణుని పరీక్షించి,హృదయం పై కాలితో తన్ని నపుడు లక్ష్మి అలిగి,కొల్హాపురి చేరిందనేది,ఐతిహ్యం .శ్రీ మహాలక్ష్మిని విష్ణు పాదాలు కడిగి కన్యను అతని పాదాల చెంత ,సమర్పించి నపుడు ,ఆమెకు పాదాల వద్ద మాత్రమే స్మరణ ఉండాలి . స్వామి ఆమెను హృదయంలో దాల్చవచ్చు. కానీ లక్ష్మికి తాను పాద సేవకురాలననే స్పృహకు అంతరాయం కలగ రాదు . తాను హృదయంలో ఉన్నాననే భావాన్ని పొందడం వలన ఆమెకు , ఏ మేలు కలగక పోగా, అహం వల్ల తన స్థానాన్ని కోల్పోయింది.అలానే ఆధార రూపమైన,శరీర పర్యంతం కాని ,సోహం వలన,అహం నిరాకరణ రూపమైన ముక్తి పొందుతాడు. అలానే భక్తిలోఅహం లేని శరణాగతి కాక,నా అంతటి భక్తుడుగాని, జ్ఞాని గాని లేడు అనుకున్నప్పుడు అన్నీ అనర్ధాలే .స్వామిని విడిచి ,మళ్లీ తపించ వలసిందే . ఇదే కాల చక్రం తో విష్ణువు చేసే వధ . భౌతికంగా చూసినపుడు,అమ్మాయిని,అణుకువగా,అత్త మామల సేవ చేసి ,భర్త హృదయాన్ని ,గెలవమనే పెద్దల మాటలో అర్ధం అదే. అత్త ,మామలే భర్త శరీరానికి ఆధారం . కనుక సృష్టిలోని తన జీవిత నాటకం ,సరిగ్గా సాగడానికి , పెద్దలమాట చెవిన పెట్టడం మంచిది .భర్త హృదయాన్ని గెలిచినా,అణకువ తప్పదు .సతీ దేవి కధలోకాని ,పై కధలో కానీ తండ్రి చేసిన తప్పుకు ,తనయలు బాధకు గురి అయారు .        
       పంచ భూతాలు ,నిరాకారమైన పరతత్వాన్ని సూచిస్తే ,పంచీకరణతో,సృష్టి సాకర మైంది .భక్తి సాకారం ,జ్ఞానం నిరాకారం నీరు ,మంచు వీటి మధ్యన ఉన్న బేధం మాత్రమే ,వీటి మధ్యన ఉన్నది కూడా . పంచ భూతాలతో పోలిస్తే , నిజానికి పంచీకరణ జరిగింది ,సృష్టిలో చాలా స్వల్పం . అలానే ద్వైతంతో పోలిస్తే ,అనంతమైనది అద్వైతం . లాలించే అమ్మగా ద్వైతాన్ని భావిస్తే , అనంతుడే తండ్రి .అహం వీడి ఆలోచిస్తే ,శరీరం రూపంలో అమ్మగా,లోపల ,బయట అంతటా నిండిన పంచ భూతాలను తండ్రిగా సంభావిస్తే ,కలిగే ఆనందానికి అంతు ఉండదు .పరిమిత అహం ,'నేనుగా' శరీర భ్రాంతిగా , ధర్మ పరిధిని కాపాడనంత వరకు , ప్రకృతి స్వరూపిణిగా ,మాయగా భ్రమింప చేస్తూ ,అమ్మగా ఆడిస్తూనే ఉంటుంది . అంతా పరమాత్మేనని గ్రహిస్తే ,అమ్మ, సర్వే సర్వత్ర ప్రకాశించే  పరమాత్మగా,శివునితో ఏకమై ,ప్రకాశిస్తుంది .ఇది జీవ బ్రహ్మైక్యం .ఈ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ,స్త్రీ  శరీరాన్ని ప్రకృతిగా భావించి ,భర్త జీవించి ఉండగా ,స్త్రీ శరీరం ,లయం కావడాన్ని ముక్తి ,అనే దిశగా ,సంప్రదాయ వాదం భావించి ఉండవచ్చు.కాశిలో విశ్వేశ్వరుడు అనంతుడు ,మనను స్పృశించి , సేదతీర్చే తల్లి గంగ .కాశి నగరమే ,విశాలమైన కన్నులతో చూచి, అందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ .శివుని అర్ధ శరీరం అన్నపూర్ణ [గౌరి] .మూడో కన్ను విశాలాక్షి.శివుని కరుణ,జటాఝూటం నుండి జాలువారే గంగ . వెరసి కాశి అర్ధనారీశ్వరం
            త్రి భాషా సూత్రం వలన అన్నీ గ్రహిస్తున్నా ,అన్ని ఉపన్యాసాలు విని ,అంతరంగంలో సత్సంగ భావాన్ని విడువలేక తెలుగులో ఇలా కొద్దిగా మనన , రూపంగా క్రింది విషయాలు వ్రాస్తున్నాను .స్వామి అనుభావానంద స్వామికి దన్యవాదాలర్పిస్తూ ,స్వానందమనే ద్రుష్టి తప్ప ,మిగిలిన ఎలాంటి స్వలాభాపేక్ష లేదని ,సత్సంగ రూపంగా గ్రహించడానికై , అర్ధిస్తున్నాను .         
    మౌనం శివ స్వరూపం,శబ్దం అమ్మవారి స్వరూపం.స్వామి  అనుభవానంద,సనత్సుజాతీయం,అనేదాన్నివివరిస్తూ[హింది] జీవుడు తననుతాను ,స్త్రీ ,పురుష ,తండ్రి ,తల్లి ,పుత్రుడు ,పుత్రిక ,సోదరుడు ,సోదరి ,భర్త ,భార్య , అత్త ,మామ ,బావ ,వదిన ఇలా ఏదో ఒక పాత్రను ,ఆపాదించుకుని ,[ఫ్రేమ్]వ్యవహరించడానికి ,శబ్దం మాత్రమే సహకరిస్తుంది.ఇది సంసారం .వీటినుండిమనసు మరలిన క్షణం ,వున్నది ,మౌనం.అమ్మ త్రిపుర సుందరి .శివుడు త్రిపురాంతకుడు .తనను తాను, ఒక పాత్ర అని నమ్మితే ,ధర్మం అనే చట్రంలో బంధించ బడతారు . సర్కిల్ ప్రారంభం అవుతుంది . ప్రవర్తన మాత్రమే ధర్మానికి కట్టుబడాలి . కానీ మనసు ధ్యాన మగ్నమై మౌనంలో ,పరమాత్మలో అబేధతను,సాధించడమే ,జీవిత లక్ష్యంగా మారాలి . ఇదే ఉపరతి . మాటలు సంసారం .మౌనం ,ముక్తి . వాక్కు ,మనస్సు ,రెండింటి నుండి శబ్దం మరలడమే సాధన .సాధనలో ,మౌనము ,శబ్దము ,ఒకచోట ఉండవు.సాధ్యంలో, మౌనం, శబ్దంగా  పరివర్తన చెందడం స్పష్టంగా తెలుస్తుంది . ఉన్నవి రెండుగా కనిపిస్తున్నా నిజానికి ఒకటే . అనుభవాలు  శబ్ద రూపంలో ,నిక్షిప్తమై ,తిరిగి జ్ఞాపకం వస్తే రూపాలుగా కూడా తెలుస్తా యి . తనలో తానైన సంతృప్తి నుండి వెలువడిన ,కళా స్వరూపమే సృష్టి . ఆనందమే దీనికి రంగము ,రంగు ,కుంచె . అర్ధనారీశ్వరమే ,జీవన్ముక్తి .
             మనస్సు ఒక క్షణం కూడా వర్తమానంలో నిలవదు . బాహ్యంలో ఎప్పుడూ భూత కాలం గురించి ,మనసులో ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది .మౌనమే వర్తమానం .అత్యంత సావధానం అవసరం .ఒకటి తనలో తను మాట్లాడుకోకుండా ఉండడం,ఎవరితోనైనా మాట్లాడేటపుడు,ఇప్పుడు మాట్లాడడం అవసరమా?అని ఒక క్షణం మనసును ఆపితే ,మౌనంలో ఎంతో ప్రశాంతత పొందుతుంది .జ్ఞానం అనుభవంగా అందుతుంది .స్వరూప విస్మృతి ,లేదా నేనది ,నేనిది అనే అధ్యారోపం,ఇవే మరణ సద్రుశాలు .ఇదే సంసారం .
          సంగ్రహము ,సంబంధము ,ఇవి రెండే ,మనిషి మోసే బరువులు . ఇవి పరిమితిని మించక ఉంటే ,సాధన ,నిరాటంకంగా సాగుతుంది .గౌరవం ,ద్వేషం ఈ రెండూ ,సంస్కారాలను బలపరుస్తూ ఉంటాయి . వీటిని అధిగమించక తప్పదు .భగవద్గీతలో చెప్పినట్లు ,సుఖ దుఃఖాలు ,లాభా లాభాలు ,జయాపజయాలు ,వీటి సంస్కారాలు ,నిర్మాణం కానప్పుడు కదా ,సాధన ప్రారంభం .అందువల్లనే కర్మ చెయ్యడం వరకే ,స్వాతంత్ర్యం ఉంది .కానీ ఫలాలు పొందే టపుడు ,ప్రకృతి నియమాన్ననుసరించి దాని ఫలాన్ని తప్పక పొంద వలసిందే . అందుకే నవ్వుతూ తప్పులు చేస్తే ,ఏడుస్తూ అనుభవించాలానే నానుడి ఉంది .     
            మననీడకు ,ఎప్పుడైనా సత్యత్వం అనేదాన్ని ఆపాదిస్తామా ?అది బురదపై పడినా ,గొప్ప వస్తువుపై పడినా మన కేమీ సంబంధం ఉండదు .నీడపై ,బురద పడిందని స్నాన మెవరు చెయ్యరు .గొప్ప వస్తువుపై పడిందని గొప్పలు చెప్పరు . దీనిలో సత్య ప్రతిష్ట లేదు . అంతే దూరంగా తత్వాన్ని ,శరీరాన్వయాన్నిగుర్తించాలి . పుణ్యం చేసినా అందులోని ,కర్త్రుత్వాభి మానం పాపమే . అందువల్లనే పుణ్య కర్మలు కూడా ,కర్త్రుత్వాన్ని విడిచి ,ఆత్మశుద్ధి లక్ష్యంగా సాగితే ,జ్ఞానానికి ,సత్వ ప్రకాశం తోడై సాధన,పరిపక్వతకు దారి తీస్తుంది .ఇది సద్యో ఫలితాన్నిస్తుంది .కర్త్రు త్వాభిమాన కర్మ,భవిష్యత్జన్మలలో కొంత సుఖాన్నిచ్చి మళ్లీ ,జన్మ పరంపర నిస్తుంది . నిరహంకారకర్మ ,జీవన్ముక్త  స్థితికి ,దారి సుగమం చేస్తుంది . దుఃఖం వచ్చినా ,దుఃఖితుడు కాని డిటాచ్మెంట్ ,తప్పక ఇస్తుంది .
               బ్రహ్మ దేముడు విష్ణువు నాభి కమలం నుండి వచ్చినపుడు ,మొదటగా విన్న శబ్దం తప . వెంటనే బ్రహ్మ ,తాను వచ్చిన  నాళం లోనికి ప్రవేశించి ,తనలో తాను లీనమై ,మళ్లీ తిరిగి బాహ్యంలో సృష్టిని ప్రారంభించాడు . తమలోతాము లీన మయ్యేదే తపస్సు . అప్పటి సద్యో ఫలం జ్ఞానం . ఇదే రమణ మార్గం . మనమార్గం 'నేను' తోనే ప్రారంభం . దాంట్లో ప్రవేశిస్తే దొరికేదే తత్వమసి అంతరార్ధం .
            ఇల్లు అంటుకున్నవాడు ,వేరే వాళ్ళ యోగ క్షేమాలు విచారించ లేడు . అలానే ప్రపంచపు విషయాలు ,జిజ్ఞాస కలిగిన సాధకుని మనసులో ,ప్రవేశించ లేవు .ఉదా:సినిమాలో ఉన్న రెండు ,గంటలు దానితో తాదాత్మ్యం చెంది ,నవ్వి ,ఏడ్చి , ఇంటికి రాగానే సుఖంగా నిద్ర పోయినట్లు ,నాటకంలోని పాత్రధారిలా ,సకలమూ నియమబద్ధంగా చేస్తూనే ,తనలో తాను మునిగి ఉండే ప్రజ్ఞ , పై సాధకుని స్వంతం . అతడు ఏ కర్తవ్యాన్ని విడిచి పెట్టడు .
               కానీ తపస్సు వలన ,ఎదుటి వ్యక్తిని కించ పరిచే ,లక్షణం వచ్చేఅవకాశం ఉంది . అందువలన సాధకులు , బాహ్యంలో ప్రపంచ రూపంగా ఉన్నది ,తన స్వరూపమే అయిన పరమాత్మగా గుర్తించి ,ఇక్కడ కలిగే అనుభవాలను , స్వామి కల్పించిన పరీక్షగా భావించి , ఓర్పుగా ,తమసాధనకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాలి . సాధారణంగా ,భక్తులు గాని ,జ్ఞానులు గాని ఎవరినీ శపించడం అనేది ,పురాణాలలో తక్కువగా కనిపిస్తుంది . తాపసులు క్రోధాన్ని ప్రదర్శించడం గమనిస్తాము .
               తపస్సులోని ముఖ్య సూత్రం ,ప్రపంచలోని ఏ వస్తువులు గాని ,వ్యక్తులుగాని లేకుంటే ,బతకలేము అనేదాన్ని విడిచి పెట్టాలి . పరావలంబనం పెద్ద ముప్పు . వేదవ్యాసులు 'సర్వం పరవశం దుఃఖం ,సర్వం ఆత్మ వశం సుఖం 'అన్నారు . ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి . భక్తిలో ,భగవంతుని పట్లగల విశ్వాసం ,క్రమంగా ఆత్మవిశ్వాసంగా పరిణతి చెందుతుంది . అలా కానప్పుడు తపస్సు చేయలేదనేదే యదార్ధం .ఈ రెండు కలిగితే తపస్సులో విఘ్నాలు ,తొలగినట్లే .
               అంతఃకరణ విక్షేపం లేకుండా ,కామ ,క్రోధాదుల అభావం కలిగేలా జీవించాలి . వచ్చాయి కనుక ,వీటికి అభావం సాధ్యం . ఎప్పుడూ ఉండే శాంతికి అభావమే లేదు . ప్రతి మంత్రానికి చివర 'శాంతి ,శాంతి ,శాంతిః 'అని చెప్పడంలో ,ప్రధమం శరీర శాంతి ,వీలైనంత వరకు శరీరం కదలకుండా ఆసనం .ప్రాణం నెమ్మదిగా కుదుట పరిస్తే ,తరువాత మనస్సు ,శాంతిస్తుంది . మూడు శాంతించాక,కావలసింది సావధానం .లేకపోతే నిద్ర సహజ మౌతుంది . ఇంద్రియ నిగ్రహం వల్ల కలిగే  ఆనందం ,ఇంద్రియ భోగాల వల్ల కలగదనేది ,అనుభవానికి అందుతుంది . కత్తిమీద సాము అన్నట్లు ,జగత్తులో సావధానం ,కలిగి ఉండాలి .
         కొందరిలో ఎదుటివారికి బాధ,కలుగుతుందేమోనన్న,ఆలోచనే ఉండదు . వారికి ఏ చెడ్డ లక్షణాలు లేకున్నా , అలా మాట్లాడడం తప్పు అనేదే తెలియదు . హృదయంలో కటుత్వం లేకున్నా ,మాట చాలా కటువుగా ఉంటుంది . దీన్నే శాస్త్రం ప్రమాదం అంటుంది.మనస్సుతో నెమ్మదిగా ప్రయత్నం అనేదాన్ని విడవాలి.లేకుంటే అహంశక్తి బలహీన మవదు .గాలిపీలిస్తే శ్రమగా ఎవరూ భావించరు .కానీ ప్రాణాయామం ,శ్రమగా అందరికీ తెలుసు . దీనిలో అహం వ్యక్త మవడమే శ్రమకు కారణం . భగవద్గీత వినడం వలన దుఃఖాన్ని అధిగమిస్తేనే ,అది తెలుసుకున్న ఫలం .మనస్సు ,బుద్ధిలో లీనమవ్వాలి .మనస్సు కళ్ళజోడు లాగా ,తనకోసం దేన్నీ గమనించదు .విషయాలను తెలియజేస్తుందంతే . బుద్ధి వివేచన చేస్తుంది ,చింతన పెరిగినకొద్దీ . మనస్సును నిగ్రహించడం కష్టం అన్న అర్జునునితో [మనసు], అభ్యాసం చెయ్యమనే ,శ్రీ కృష్ణుని సూక్తిలో ,అంతరార్ధం , మనసు మళ్లీ ,మళ్లీ ,ప్రశ్నల,వలతో కూడా,విసిగించ వచ్చు.ఎక్కువగాదీనికి అవకాశం ఇవ్వకూడదు .మనసు జ్ఞాత మాత్రమే.దీని పరిధి సంసారం .బుధ్ధి ,దీన్నిఅధిగమించి[జ్ఞేయం]పరమాత్మనుపరిచయం చెయ్యగలదు.దేహాత్మ భావం నుండి విముక్తి .దేహం నుండి విముక్తి అంటే ,నీడలా ఉండవలసిన,దేహమే నేననే భ్రాంతి,సత్యం అని బుద్ధిని ఎలా పరిభ్రమింప చేస్తోంది ?  అని నిత్య, నిరంతర చింతన సాగాలి . తన బ్రహ్మచర్యం తోడు కావాలి ,ఆంజనేయునిలా పరిశ్రమించాలి .బ్రహ్మమే పరమ గమ్యం ,అని పరిశ్రమించడమే ,బ్రహ్మచర్యం .ఇప్పటి వరకు ప్రపంచంలో చరించిన బుద్ధి ,ఇకపై బ్రహ్మాత్మగా చరించే అభ్యాసం చెయ్యాలి . కోరిక లేని పరిస్థతి . దేహాత్మ భావంనుండి  విడిపడాలంటే ,తల్లి తండ్రులు ఇచ్చిన శరీరాన్ని,వాడుకున్నా,అహాన్ని,గురువు పాదాల వద్ద సమర్పించి ,జన్మతో కలిగిన శూద్రత్వాన్ని వదలి ,ద్వితీయ జన్మ , బ్రహ్మాన్నిగమ్యంగా సాగి , బింబంగా తనలో తాను మునగాలి .సాధకుడు గురువు ఉపకారాన్ని మరవకుండా ఉండడమే ,ఆయనకు ఇవ్వగల దక్షిణ . శరీర స్పృహ ఉన్నంతవరకు ,దీనికి విస్మృతి ఉండరాదు . అప్పుడు దేహాత్మ భావాన్ని గెలవగలరు .
          గురువును దేనితో పోల్చగలం ?పరుసువేది అయినా లోహాన్ని బంగారంగా మారుస్తుంది . కానీ ఆ బంగారం ,మళ్లీ బంగారాన్ని తయారు చెయ్యలేదు . బంగారంగా మారిన శిష్యుడు మాత్రం ,మళ్లీ శిష్యులను బంగారంగా మార్చే శక్తి నిచ్చిన గురుదేవునకు , ఏమీ యివ్వలేడు . నిజానికి అహం సమర్పించానని శిష్యుడు అనుకున్నాడే తప్ప ,గురువు దృష్టిలో అహం మిధ్య ,జగత్తులోని ఏ వస్తువిచ్చినా ,అది మాయ . అందువలన ఏమీ ఇవ్వక్కరలేదనే ,లోభత్వాన్ని పొందక ,ఏ మిచ్చినా గురువు ఋణం తీరదని గుర్తించి ,వారు చూపిన పధంలో పయనించి గమ్యం చేరాలి .
             శిష్యుడు గురువు చెప్పినట్లు తనను తాను మలచు కుంటాడు . అందుకే భక్తితో పరమాత్మను సేవించినా ,భక్తునికి భగవంతుడు గురువు రూపంలో మాత్రమే ,జ్ఞానమనే బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు .భక్తులతో కలసి ఉన్నప్పుడు విక్షేపం సహజం .గురువు సాన్నిధ్యంలో ,ఆవరణ ,విక్షేపం ,ఆశ్రమం బయట కాపలా ఉంటాయి .కృతజ్ఞత లేనివారిని పట్టుకుంటాయి . శిష్యునకు తనకు తెలిసింది ,గురువుకు  ఏమిస్తే బావుంటుందనేదే తప్ప,గురువు యొక్క సూచన ఏమిటి ,అనే ఆలోచన ఉండదు. వారు చెప్పింది వినాలే తప్ప ,ఏదీ ఒప్పించే ప్రయత్నం చేయకూడదు . అలానే బంధించాలనే తపన ఉన్నవాడు గురువు కాదు . బంధనాలను తెంచ గలవాడు గురువు .శిష్యుని ప్రయత్నంతో కలిగేవాటికి పరిమితులుంటాయి . గురువు ప్రసాదించేది,పరిపూర్ణ స్వరూపం . పరిమితమైన తన ప్రయత్నంతో ,గురువును సమీపిస్తే అపరిమిత స్వ స్వరూపం స్వంతమౌతుంది . ఇది గురువు అనుగ్రహమేకానీ ,తన ప్రయత్నఫలం కాదు .నా ప్రయత్నం అనే భ్రాంతి ,పయత్న లోపాన్ని ,అందుకు భగవంతుడు వేసిన శిక్ష మాయగా ,సాధన నా ప్రయత్నమే అనే ,అహంకారాన్ని ఇస్తుంది .        
            బ్రహ్మచర్యం ,అనే ఈ విభాగంలో నాలుగు పాదాలున్నాయంటుంది ,సనత్సుజాతీయం . సమయం అనేది మొదటిది . క్రమంగా పక్వమవాలి . ఒక్కొక్క ఆలోచనా ,ధర్మ నిరతిని ,న్యాయ బద్ధతని ఆపాదించు కున్న కొలది ,సాధన ,పరిపక్వమౌ- తుందని గుర్తు . సాధనలో ఉత్సాహయోగం వలన , ఉపలబ్ధి కలుగుతుంది . జ్ఞానంవలన ,ఆత్మతృప్తి స్వంత మౌతుంది . శాస్త్ర విచారం ,తృప్తిని ధృఢ పరుస్తుంది .ఇవి గురు కృపతోనే సాధ్యం .
            ఏమీ తెలియని బాలకుని వంటి ,ఆనందం . భారమూ లేదు ,భయమూ లేదు . restore factory settings. పిల్లలు అబద్ధం చెపితే ,పెద్దలు 'వీడు పెద్దవాడవుతున్నాడు'అంటే ,సహజం కాని వాటిని అభ్యసిస్తున్నాడని .బాలునికి తన వారని పరాయి ,అనే భావనే లేదు .సంగ్రహము తెలియదు . పాత్రను సక్రమంగా పోషిస్తున్నా ,మనసుకు బాల్యమే ,ఆనందం . నచికేతుని వంటి జ్ఞానంతో ,మరణాన్ని జయిస్తాడు . తన స్వరూపాన్ని గమనించడం తప్ప వేరే మార్గం లేదు . ఆరాధన అంటే ప్రతి ,క్రియ పరమాత్మకే సమర్పణం . దీనివలన కర్తృత్వం లేని కర్మతో ,అంతఃకరణం శుద్ధ మౌతుంది . తత్వ జిజ్ఞాస కలగడమే దీనికి కల ప్రయోజనం . దయ పేరుతో ,ఎవరినీ అవమానించ కూడదు . హీనత్వం ఎవరి పట్ల కూడదు . సేవా భావం అవసరం . అప్పుడు అహం బలపడదు .
                    అంతఃకరణలో వైరాగ్యంతో కూడిన ఆత్మ చింతన ,బాహ్యంలో సకలమూ పరమాత్మ చైతన్యంగా గుర్తెరిగి ,తన భూమికను ,రసవంతంగా పోషించేది ,స్థిత ప్రజ్ఞత్వం . పై రెంటిలో నీరసం లేదు . సకలమూ పంచ భుతాత్మకం అనే దృష్టి వలన కలిగేదే వైరాగ్యం.మంచి ఆకలి కలిగి ,మంచి భోజనం చేసిన వ్యక్తికి ,మళ్లీ ఎన్ని రకాలైన ఆహార పదార్ధాలైనా ,ఎలాటి ప్రలోభాన్నికలిగించ లేనట్లే  , సకల సృష్టి ,పంచ భూతాలనే స్పృహ వలన , అతనికి ,ఏ మాత్రం ప్రపంచ వాసనలు,ఆనందాన్ని ఇవ్వలేవు . ఇదే వైరాగ్యం . మనసు బాహ్యంలో కదిలి నప్పుడు , పరమాత్మ, సృష్టిగా వ్యక్తమైతే దాన్ని ,విశ్వరూప దర్శనంగా , భావించే ద్రుష్టి కలిగి తానుకూడా అందులోని భాగ మైనందుకు కలిగే ఆనందాన్ని,నిశ్చయంగా కలిగి ,బాహ్యాంతరాలలో, భావించేవారికి సకలమూ సంతృప్తినే ఇస్తుంది . రసో వై సః .
            నాదమూలం ,మౌన స్వరూప ,ఉనికి . సత్స్వరూపం . నాదబిందు కళాతీతం . సృష్టి కళారూపం . రూపానికి పూర్వంశబ్దం .శబ్దానికి పూర్వం ,సత్స్వరూప మౌనం .క్రమంగా రూపం పట్ల ,మోహాన్ని వీడి ,రూపాలను,చిత్రకారుని,చిత్రంలా భావిస్తూ కారణమైన శబ్దంలో,లయం చేస్తూ,శబ్దాన్ని కారణమైన మౌనంలో ,పరమాత్మలో మనస్సు శాంతిని పొందేలా కృషి చెయ్యాలి . ఇదే నివృత్తి మార్గం . ఇదే బ్రహ్మ మానస పుత్రుల స్థితి . వీరు సృష్టికి విముఖులు . విముఖత్వం మాత్రమే మోక్ష మార్గం . మనోలయమే మార్గం .మనస్సు వైరాగ్యానికి ,ఎప్పటికీ ఒప్పుకోదు .ఆనందం బయట మాత్రమే ఉందనేది మనస్సుకున్న అభిప్రాయం. జ్ఞానం మాత్రమే ,ఆనందం బాహ్యంలో లేదని,తన అంతరంగాన్ని,చిదంబరంగా హృదయాన్ని గ్రహించి ,నామరూప నాట్యాన్నిగమనించాలి . లయకారుడైన శివుడు జన్మ ,మరణ రూపమైన అజ్ఞానాన్ని ,లయం చేస్తాడు .ఇదే ఆనందవనం ,మహా స్మశానంకాశి . దీన్ని గమనించే కాలం ,కాల భైరవం . మృత్యుం జయం .
            విష్ణువు ,అమ్మవారు ఒకటే స్వరూపం .విశ్వం రూపమైన ఆవరణ రూపం .ఈ ఆవరణ భంగమే ,శివుని దిగంబరము . సృష్టిని ,క్రమంగా ,సాధనతో ,విశ్వాన్ని ,విశ్వనాధుడైన శివునిలో లీనం చేసి తత్ స్వరూపమైన ,సద్రూపమై శివోహం అనాలి .నిద్రలో, కళ ,కళాకారుడు వేరుకాదు . అలానే ప్రపంచ నిరాకరణ రూపమైన ,జ్ఞానం ,విశ్వాన్ని విశ్వనాధునిలో లీనం చేస్తుంది .సృష్టిలో చరిస్తున్నప్పుడు ,సకలము,దైవ రూపంగా,ప్రతి క్షణం,అనుభవానికి అందితే,అదే వర్తమాన రూపమైన మోక్షం.ప్రకృతిని ఈ శ్వరుడు వశం చేసుకుని ,నడిపిస్తున్నాడు . ప్రకృతిని వశం చేసుకున్నవాడు ,దేముడు . ప్రకృతికి వశమై పోయినవాడు జీవుడు . వీటినే మన సంప్రదాయంలో ,తత్వాన్ని, నాటకీయమైన  సృష్టిలో ,భర్తను ,భార్య అనన్య శరణంగా ,అనుగమించాలని స్పృశించింది . తాదాత్మ్యం చెందడం బంధం .తాదాత్మ్యం తెగడానికి ,సకలము పరమాత్మదే  అనడమే ,పరిష్కారము .కర్మతో తాను కర్తను కానని తెలిసి ,శరీర ధారణ వలన ,ఏ ఏ శాస్త్ర విహిత కర్మలున్నాయో ,వాటిని ఫలాపేక్ష విడిచి ఆచరించడం వలన కలిగే స్థితి ,దీన్ని సాలోక్యం అంటుంది ,శాస్త్రం . తన్మాత్రలు వశమైతే ,[శబ్ద స్పర్శ రూప రస గంధములు ]వీటితో తాదాత్మ్యం విడిచి పెడితే ,కలిగేది సామీప్యం . బుద్ధితో ,అహంకారంతో ,తాదాత్మ్యం విడిస్తే కలిగేదే సాయుజ్యం .
        పూజలో సకల పదార్ధాలు , పరమాత్మవే అని భావించడం కొంత సహజమే . కానీ తన శరీరం ,అది తననే అహం ,దానివి తను కలిగి ఉన్నాననే భావం నాది . ఈ మూడు నిజానికి తనవా ?వీటితో కలిపిన పూజ ,నమస్కారమే . అంతః బహిశ్చ తత్ సర్వం వ్యాప్త నారాయణ స్థితః .
        సర్వం బ్రహ్మ మయం జగత్ . ఇది హృదయం లోనికి అవరోహణం . ఇది ప్రస్థానం ,జీవికి . కానీ శరీర లయమనే ,మహా ప్రస్థానం,జరిగే లోపు,శరీర చలన సమయంలో,విధి ,నిషేధాలు తప్పవు .అంతరంగంలో సర్వం బ్రహ్మ మయం,ఇదే బ్రాహ్మణత్వం వేద ప్రతి పాదిత మైన తన కర్మాచరణ ,విడువక ,దీక్షతో త్రికరణ శుద్ధిగా ,ఆచరించడమే ,క్షత్రియ ధర్మ పాలన .సృష్టిలో ఎవరెవరికి ,ఎంత ప్రాధాన్యత నివ్వాలో ,తెలిసి ,సమతూకంతో,మమతకు లోనుకాక ,తన పాత్రను అర్ధవంతంగా,పోషించే నేర్పు వైశ్య . ఈ మూడిటికి తగినట్లు శరీరాన్ని,తమస్సుకు తావివ్వక సృష్టిలో చరించడమే శూద్ర ,అనే ,ఒకే వ్యక్తిలోని వర్ణ వ్యవస్థ .
           హృదయ గతమైన పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించి ,దానికి సాకార రూప పుజావిధిని నిర్వర్తించి ,వేద విధిని అనుసరించి ,యజ్ఞ యాగాది క్రతు నిర్వాహణే ధ్యేయంగా ,జీవించే బ్రాహ్మణ వ్యవస్థలో ఏ విధమైన ప్రలోభానికి తావివ్వక ,తమ ఆచార ,వ్యవహార క్రియలకు వారసత్వాన్ని అందించాలనే ,తలపు ,బ్రాహ్మణునిలోని ,బ్రాహ్మణత్వం.దానికి తగినంత ,మనసుతో పోరాటం ,క్షత్రియం.మనసు జగత్తులోని సకల భోగాలను చూపి,సంధ్యా వందన,పూజాది ,సకల విధి నిర్వహణకు ,ఆటంకాలను కలిగిస్తూ ,ధర్మ విచ్యుతికి ,నిరంతరం ప్రయత్నిస్తూ ,పైపైన విధులు నిర్వహిస్తున్నా,త్రికరణ శుద్ధికి ఏ మాత్రం సహకరించదు .దీన్ని గెలవాలంటే , శ్రీరాముని వంటి క్షత్రియ ధృతి అవసరం . ఇది ఉంటేనే బ్రాహ్మణుని ,బ్రాహ్మణత్వం కాపాడ బడుతుంది .బ్రాహ్మణుడు ,భర్త అయితే ,బ్రాహ్మణత్వం భార్య ,దాన్ని కాపాడు కోవడంలోనే అతని ,సార్వభౌమత్వం దాగి ఉంది .
             దీనికి తల్లి తండ్రులు ,గురువు ,సజ్జనులు ,సాంగత్యం ,వీటి విలువ తెలిసి ఉండాలి . పరమాత్మ అపార కృప కలిగితేనే ఇది సాధ్యం .ఈ గణనే ఎవరికి ఎంత విలువ ,దీని వలన మాత్రమే అతని విజ్ఞత ,బేరీజు వెయ్యబడుతుంది.ఇదే అతని వైశ్య ధర్మం. ఇదే నిజమైన ధనం,బ్రాహ్మణునికి.అలాకాక తనలోని క్షాత్రానికిఅలానే వైశ్యానికి తగినంత ప్రాధాన్యత నివ్వకపోతే కలిగే అనర్ధం , తమోగుణ రూపమైన ప్రతిబంధకం . దీన్ని గెలిచేందుకు తప్పక కృషి అవసరం . జపాన్ని ,ధ్యానాన్ని పెంచి మనసును ,తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే ,కృషి రూప శూద్రత్వం.వీటిలో ఏది తక్కువ ?ఏది ఎక్కువ ?నిజానికి విష్ణుపాదాలు విశ్వరూపంలోని శూద్రులు . అంటే కృషిని ఆశ్రయిస్తే తప్ప ,తన అస్తిత్వాన్ని నిలుపుకోవడమే ప్రశ్నార్ధకం .
           ఇదే విషయాన్ని క్షత్రియ పరంగా చూద్దాం .క్షాత్రాన్ని గ్రహించిన రామావతార గాధ ,రక్షించడం అనేదాన్ని,త్రికరణ శుద్ధిగా పాటించిన పరమాత్మను ,మనకు రాజుగా ప్రకటిస్తున్నది . రక్షణను పితృవాక్య పరిపాలన ,ధ్యేయంగా ప్రారంభించాడు రాముడు.గుర్వాజ్ఞకు రక్షణ నిచ్చి,యాగ పరిరక్షణ,సీతా పాణిగ్రహణంచేసి,అంశావతారమైన పరశురాముని నిగ్రహించి,అతణ్ణి అప్పటి వరకు పాటించిన క్షాత్ర ధర్మాన్నివిడిచి,తన తపో భూమికతో,సనత్కుమారుని దిశా నిర్దేశంతోదత్త గురుని కృపతో,తన  'అహం బ్రహ్మస్మి'అనే స్వస్థితికి దారి సుగమం చేసి,ధర్మ పరిరక్షణకు ,క్షాత్రం తప్పదని తన అవతార కాలమంతా,మోనంగా నిరూపిస్తూనే ఉన్నాడు శ్రీ రాముడు.ఆచరణ రూపమైనది ధర్మం.కదులుతూ ప్రదక్షిణ చేస్తుంది,సత్యానికి.సద్రూపం పరమాత్మ.అహం బ్రహ్మాస్మి వరకు తోడుండి ,పరమాత్మలో లయింప జేసేది ధర్మం .
         శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ,తమ శివపదంలో 'అడుగు కలిపెను గౌరి ,హరుని అడుగులలో 'అంటారు . నిరాకార రూపమైన ధర్మం ,[గౌరి]నిరాకారమైన శివునిగా చేసి 'అహం బ్రహ్మస్మి'అనిపిస్తుంది .శరీరం శివుడైతే ,అంతః చైతన్యం శివాని. శివా శివుల నర్తనమే,సృష్టి .ఆనందమే కుమారుడు సుబ్రహ్మణ్యుడు.ఇలా సృష్టిని ,అనుసంధానం చేసి,శరీరమే తాననే అహంను శివుని కుడికాలి క్రింద మోపడానికి ,సమర్పించ వలసిందే . అదే చిదంబరం .శివునిది కుడి పాదం ,అమ్మవారిది ఎడమపాదం . అదే సూచనగా ,మగవారు గోచీ పోసిన పంచ కానీ ,స్త్రీలు గోచీ పోసిన చీర కానీ ,ధరించి నపుడు ఎడమకాలు పూర్తిగా మూసి , కుడికాలు కొసలు ఉండేలా వస్త్ర ధారణ చేస్తారు . నటరాజ మూర్తి ఎడమ కాలు పైకెత్తి ,సృష్టిని ప్రతిపాదిస్తే ,కుడికాలు స్థిరమైన శివ తత్వాన్ని ,చాటుతుంది . కదులుతున్న సృష్టిలో శరీరం నర్తిస్తున్నా,మిధ్యా నేను అయిన అహంను స్థిరమైన శివోహం అనే పరతత్వంగా ,ప్రకాశించే చిన్మయ మూర్తికి సమర్పించి , తానే శివోహం అనాలి .
              బ్రహ్మమే తాననే స్థితిలో సాధన సాగించి ,పూజాదికాలతోనిరంతర ,సమాజ శ్రేయస్సుకు ,పరమాత్మను సేవించడమే తప్ప వేరే ప్రక్రియ లేదు అని నమ్మి,చరించే వ్యవస్థకు ,బ్రాహ్మణ అని నామకరణం చేసినట్లే ,కొంత మానవ ప్రయత్నం అవసరం, అని నమ్మి అవ్యవస్థితిని సవరించే దిశగా ,గురు నిర్దేశిత పధంలో సమాజ నిర్మాణానికి ఉద్యమించిన వారికి క్షత్రియులని పేరు . దీనికి అవసరమైన శారీరిక అవసరాలకు తగిన వస్తువులను సేకరించి సమాజానికి అందించే వ్యవస్థ  ,వైశ్య నామం కలిగి ఉంది . అలానే శారీరిక కష్టాన్ని వహించి ,సమాజానికి అన్నాన్ని అందించే ,వ్యవస్థకున్న నామమే ,శూద్రులు .
             ఓం కారంలోని మూడున్నర అక్షరాలైనా ,మూడు శరీరాలు ,అంతరాత్మ అయినా ఒకే వ్యక్తికి నిర్వచనం . అదే కుల వ్యవస్థలోను ప్రతిబింబిస్తుంది . ఇది బీజ స్థితి నుండి ఒకచెట్టు సంపూర్ణంగా ఆవిర్భవించిన స్థితి . దీనికి బీజం పరమాత్మ అనడం అందరికీ సమ్మతమే . మొదటి అంకురం అత్యంత పదిలంగా కాపాడితే ,అది వ్యవస్థను పోషిస్తుంది . ఏ ప్రాజెక్ట్ అయినా ముందు జ్ఞాన రూపంలో ఉంటుంది . అపుడు దానిపట్ల జాగ్రత్త అవసరం . ఇష్టం వచ్చినట్లు అందరూ మేమెందుకు గియ్యకూడదు అని , అల్లరి పిల్లల్లా, తలో గీత గీసేస్తే ,సాకారమెలా అవుతుంది ?అందువల్ల సర్వవిషయాలు కలిగిన వేద విజ్ఞానాన్ని,అన్య విషయాల పట్ల అయిష్టత కలిగిన బ్రాహ్మణ వ్యవస్థకు ,ఎన్నో ఆంక్షలతో అందించారు . రూప కర్తలైన వీరికి ,ఏ విధమైన ,ఆర్ధిక పరమైన వరాలు కల్పించలేదు ,వారి దిన భ్రుతి కూడా ,యాయవారమే ,మేధస్సుకు పదును చాలా అవసరం . అందువలన వీరికి ,పాలన కానీ ,వ్యాపారం కానీ ,శారీరిక శ్రమగానీ విధించ బడలేదు . అలానే వీరిని సౌకర్యాలకు ,విలాసాలకు కూడా దూరంగా ఉంచి వీరిని శాస్త్రం ,కఠినంగానే ,వారిని వారే నియంత్రించుకుని ,కట్టుబాట్లతో జీవించమంది .
             చెట్టుకు వేళ్ళు నీటిని గ్రహించి అన్ని శాఖలకు అందిస్తాయి . అలానే ఎవరూ చూసి మెచ్చుకోవాలనిగాని ,తామెంతో గొప్పవారమనే భావాన్ని ,పొందే అవకాశం కూడా వారి కివ్వక ,మగ వారికి పిలకను ,స్త్రీలకు ,మడి అనే కట్టుబాటును ఉంచి వేరే అగ్రహారాలలో ఉంచారు.అలా ఉన్నా రేణుకా దేవి గాని ,అహల్య గాని పడిన ఇబ్బందులు,అందరికీ తెలిసినవే. సమాజానికి దారిని ,పరమాత్మ అనే కరదీపికతో చూపవలసిన బాధ్యత వారిపై ఉంది . దాని ప్రయోజనానికి భంగం కలగ కుండా ఉండాలనే వారికి వేరే అగ్రహారాన్ని చూపారు . కానీ కలి వారిపై మోపినన్ని అభాండాలు ,వేరెవరిమీద మోపలేదు . కలి లక్షణమే ,ఆచార సంప్రదాయాలు నేల రాయడమే.కానీ హృదయ దౌర్బల్యం పొందక,పై పై మెరుగులకుమోసపోక తమ కట్టుబాట్లుకాపాడుకునే సహజత్వాన్ని వీరు పొందిన రోజు మళ్లీ ,వారి బాధ్యతైన సమాజానికి దిశా నిర్దేశం చెయ్యగలుగుతారు .
          వేళ్ళను చెట్టు అని ఎవరూ అనరు . దీని బలమైన మాను క్షత్రియ వ్యవస్థ . ప్రస్తుత సమాజంలో కీలకమైన స్థానాల్లో ఉన్న మహామహులందరూ ,ఈ వ్యవస్థకు చెందిన వారే . కానీ ఆత్మ విమర్శతో,సమాజానికి సహకరిస్తే పూర్తి సమాజం వారికి పట్టం కట్టి ,బ్రహ్మ రధం పడుతుంది . పరమాత్మయే రాజై గౌరవించిన ఈ వ్యవస్థను ఆయనే కాపాడాలి. వామనావతారమైన ,విష్ణువు రాజై పాలించ లేదు.అంతటా పరమాత్మను తెలిసి,అహంకరించ వద్దని మాత్రమే సూచించాడు.క్షత్రియ వంశ సంజాతుడై రాముడు రామరాజ్యాన్ని ,ఎన్ని అవరోధాలైనా ఎదిరించి ధర్మానికి , ఏ మాత్రం భంగం కలగనీక ,తానై క్షత్రియ ధర్మాన్ని లోకానికి ప్రకటించి వీరిని ధర్మ పరిరక్షణకు ,శాసించాడు .సూర్యుడు గ్రహాలలో క్షత్రియుడు. ఆయన కన్నా రాజ వ్యవస్థకు మార్గం చూప గలవారెవ్వరు ?సమాజరక్షణే వీరికి బ్రహ్మ విద్య .           
     ఆకులు లేని చెట్టు జీవాన్ని కోల్పోతుంది . సూర్యుని నుండి గ్రహించిన రస్మితో చెట్టును పోషిస్తుంది . సంగ్రహించి పంచి పెట్టే వ్యవస్థ ,వైశ్య .కానీ అవసరానికి తగినంత ,సేకరణ ,తగిన వితరణ , దీన్ని మరచి రెంటిలో ఏ తూకం మార్చినా ,అది ,సమాజానికి అనారోగ్య కారణం . అవసరానికి మించి చేరిస్తే సమాజానికే క్యాన్సర్ . తగినంత అందించకపొతే ,చెట్టు ఎండు
తుంది .సమన్యాయం వీరికి బ్రహ్మవిద్య .
        చెట్టుకు పూసిన పువ్వులే శూద్ర వ్యవస్థ,వేళ్ళు నీటినిచ్చినా,మాను రాలకుండా గట్టిగా పట్టుకున్నా,ఆకులు సహకరించినా చెట్టుకు అందాన్ని,అంకురాన్నిచ్చి,వ్యవస్థ ఎదురుచూసేలా,తనను తాను సమర్పించుకునే త్యాగ లక్షణం,వీరి స్వంతం.పువ్వులు చెట్టు నుండి వేరు చేసినా,లేక చెట్టుకే ఉంచినా,తనంత తానే ముడుచుకుని,తన కర్తవ్యం వరకే,బాహ్యంలో చరించాలనే సూచనతో మానవులకు మార్గ దర్శనం చేస్తున్నాయి.అందుకే అందరూ తల వంచి మొక్కే,తన పాదాలను వారికి గుర్తుగా,పరమాత్మఅను గ్రహించాడు.వీరికి సేవా గుణమే బ్రహ్మవిద్య.విష్ణు పూజకు పువ్వులే శ్రేష్ఠం.అవి పాదాలను చేరి అందరి కష్టాలు గట్టెక్కిస్తాయి . అంటే త్యాగమయ సేవ , పరమాత్మునికి సమర్పించే పుష్పం .
           విశ్వానికి  బాహ్య శరీరం ,శూద్ర వ్యవస్థ . మనోమయ వ్యవస్థ ,వైశ్య . బుద్ధి రూపం క్షత్రియం . జీవ రూపం బ్రాహ్మణ . వీరందరి గమ్యం ముక్తి . అన్ని వ్యవస్థలు ,అహం అనేదాన్ని పక్కకి పెట్టి తమ కర్తవ్యాన్ని ,బ్రహ్మ విద్యగా ఉపాసిస్తే కలిగేది మోక్ష రూప గమ్యం .అలానే కారం బాహ్య ఆవరణం ,దాని లోపల కారం ,దాని అంతరం కారం , తరువాతది అర్ధమాత్ర . కానీ మొత్తం కలిపితేనే 'ఓం'. ఓం కార ప్రణవానంతరం ,స్వరూపమే ,పరమార్ధం ,పరమాత్మ , నిరాకార రూపం .
        కర్తవ్యాన్ని,బ్రహ్మ విద్యగా అంటే ,తన కర్తవ్యమైన దేన్నైనా,విశ్వ నాటకంలోని పాత్రగా మాత్రమే గమనిస్తూ పోషిస్తే ,అదే పరమాత్మను చేర్చే బ్రహ్మవిద్య .శరీర పర్యంతం ,శరీరానికి ,బాహ్య ,అభ్యంతరాలు వ్యావహారిక సత్యాలు . ఇవి రెండూ రైలు పట్టాల వంటివి ,జీవి రధాన్ని ,గమ్యం చేర్చడానికి . బాహ్యానికి అన్వయించుకునే , రైలు పట్టా ,'సంస్కృతీ-సాంప్రదాయం' . అభ్యంతర శుచికి ,జీవిని  పరమ గమ్యానికి  చేర్చే రెండో రైలు పట్టా ,'అంతర్మధనం' .నిరాకర ,సాకార రూపమైన తత్వాను సంధానమే దీనికి లక్ష్యం .


                                                                                             

5, జులై 2014, శనివారం

సర్వం బ్రహ్మ మయం జగత్

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

సర్వం బ్రహ్మ మయం జగత్ 


         కనిపిస్తున్న జగత్తుగా పరమాత్మ అనుభూత మైన స్థితిలో ఒక ముని అనుసంధానంతో చెప్పే మాట 
                                                          సర్వం బ్రహ్మ మయం జగత్ . 
        కానీ ప్రతివారికి ఈ అనుసంధానం ఎంతో అవసరం . ప్రతి సంఘటన అనుకూలమైనదైనా ,ప్రతికూలమైనదైనా, అది  అందించే అవగాహనతో సాగే జీవితం , సాధనా మార్గం.అనుకూలమైన విషయాలను భగవద్విభూతి గాను , ప్రతికూలత ,పూర్వ కర్మ దోష పరిహారం గాను భావించి ,సాధన సాగించాలి . విశ్వం ,విష్ణువే .శక్తి లక్ష్మి .పోషించే విష్ణు స్వరూపం , ఇలలో లక్ష్మి రూపం .ఏ ఐశ్వర్యమైనా అష్ట లక్ష్మీ రూపమే .అన్నిటి సమగ్ర రూపమే ,వాడుకలో ఉన్న ధనం. ప్రతిదీ , త్రిమూర్త్యాత్మకమే ,సంపాదన ,కలిగి ఉండుట ,ఖర్చుఇలా. ప్రతి రూపాయి అమ్మకు ఆహ్వనమే అనే స్పృహతో  సంపాదనను కలిగి ఉన్నప్పుడు,అది సృష్టి .అంటే కుమారుడైన బ్రహ్మను ఆశీర్వదించినట్లు ,అమ్మ ఆశీర్వ దిస్తుంది. శివుడు ఖండించిన ఐదవ తల [అహం] వదిలి ,శాస్త్ర బద్ధంగా అంటే నిజాయితీగా సంపాదన లక్ష్మీ స్వరూపం అది పవిత్రమై ఎంతో తృప్తితో ఇంట నిలిచి ఉంటుంది .కానిది డబ్బు మాత్రమే . సమృద్ధి కాదు .సృష్టి ,స్థితి , చూశాము 
అమ్మకు అయ్యతో కళ్యాణమే ఖర్చు. అంటే అంత ఆదరంతో ఎంతో ప్రీతితో,ప్రతి రూపాయి పరమాత్మకే సమర్పిస్తున్న
భావన లక్ష్మీ , నారాయణ కళ్యాణమే . అప్పుడు తనకు,కుటుంబానికి , సమాజానికి , ప్రతి దైవ కార్యానికి,దానానికి 
మనసు ఆనందంతో,ఇది పరమాత్మ సేవయే అనే భావంతో శాంతిని పొంది సాధనకు సహకరిస్తుంది . విశ్వం విష్ణువే .
         విష్ణు ధామమైన వైకుంఠఆనికి ,జయ,విజయులు ద్వార పాలకులని మనకు తెలుసు.జీవితంలోవ్యక్తికి కలిగే జయము ,విజయము ,అహంకారాన్ని కలిగించి , పరమాత్మ నుండి జీవాత్మను వేరు పరుస్తూ , వేరైన తనకు కలిగిన విజయానికి పొంగి పోతూ,ద్వైతాన్ని బలపరిచి,కర్మ బంధాన్ని మరింత జటిలంగా మారుస్తాయి. పరమాత్మకు ,తాను భిన్నమనే అజ్ఞానాన్ని బలపరిచే , వీరు నిజంగా ద్వార పాలకులే . అందువల్లనే  విద్య వలన  కలిగిన జ్ఞానానికి వినయాన్ని జోడించి ,కలిగే గెలుపు ,ఓటములకు ,పొంగక , క్రుంగక జీవించే విధానం సాధనా మార్గం .
       బ్రహ్మ మానస పుత్రులైన , సనక ,సనందన ,సనాతన ,సనత్కుమార , విష్ణు దర్శనార్ధులై ,వెళ్ళినపుడు
జయ ,విజయులు అడ్డుకున్నందు వలన వారి శాపానికి గురై ,హిరణ్యాక్ష ,హిరణ్య కశిపులుగా,అలానే రావణ ,
కుంభ కర్ణులుగా ,శిశుపాల ,దంత వక్త్రులుగా ,వైరి భావంతో విష్ణువును చేరిన వైనం మనకు తెలుసు .సనక
 [పురాతన ],సనందన [ఆనంద]రూపమైన, సనాతన [శాశ్వతమైన],సనత్కుమార [బాల్యంతో]ఈ లక్షణాలు
తురీయ స్థితిని సూచిస్తాయి.ఈ గురు స్వరూప లక్షణాలు ,సాధన దశలో శిష్యునికి ,మార్గ దర్శనాలు.ఈ  సాత్విక సాధనకు ,విఘాతం కలిగించేవే ,తాను గొప్ప సాధకుడననే అహం ,తనకు ,విజయం కలగడం వలన పరమాత్మకు తానే, చేరువగా ఉన్నాననే భావం ,వలన కలిగే అహం .ఇవి సాధనతో పరమాత్మను చేరనీయక అడ్డు తగులుతాయి .
స్వరూప లక్షణాలను ,శరీరానికి ఆపాదించి ,తను శరీరంగా భావిస్తూనే ,శరీరానికి సంబంధంలేని ,శాశ్వతత్వము,
ఆనందము ,అనుభవంలో ఉన్న, ఉనికి వలన కలిగిన బాల్యం వంటి స్వఛత, వీటిని శరీరం కలిగి ఉందనే ధృఢ
భావనే ,ఐశ్వర్యమంతా తనదనే ,అహంకారానికి ఆలంబనగా ఉంటుంది . ఇదే హిరణ్యాక్షుని ద్రుష్టి .
           కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలనేవే ,జయ ,విజయుల ఆరు జన్మలు .[వీరికి] వీటికి మరణం ఉండ కూడదనేదే ,మొదటి కోరిక . దీని కోసమే ఎంత తపస్సైనా . ద్వైత ద్రుష్టి వల్ల మాత్రమే ,ఇవి జీవించి ఉంటాయి .
శరీర స్పృహతో జీవి ,ప్రపంచ వస్తు సంచయమే గమ్యంగా బ్రతికి నపుడు ,ఈ ఆరుగురి ప్రతాపానికి లోటు ఉండదు .
పరమాత్మను చేరడం ,గమ్యంగా గలవారికి ,సృష్టి పరమాత్మ స్వరూపమే అనే దృష్టిని ప్రసాదించి ,[శరీరం]భూమిని , [తనదనేది లేదనే బాల్యాన్ని]ప్రహ్లాదుని ,[సృష్టి లోని అమ్మవారి రూపమైన సంపద]సీతను ,తమో గుణ రూపమైన
కుంభకర్ణుని నిర్జించి ,[గురువు,శాస్త్రము ,చెప్పినవి,వినని ,మొండితనాన్ని].అసూయా స్వరూపమైన [మాత్సర్య]
శిశుపాలుని[మద]దంతవక్త్రుల నుండి ,మనః రూపమైన రుక్మిణిని ,కాపాడి ,తనలో తనే రమించే' అహం బ్రహ్మస్మి'
స్థితిని ,వర్తమాన రూపమైన విష్ణువై ,ప్రసాదిస్తాడు .
          పరమాత్మ నుండి స్వాభావికంగా ప్రకటిత మయే ప్రతిభే సృష్టి . దీనికి కారణం లేదు . నీటి చల్లదనంలా ,అగ్ని
వేడిలా ,వాయు చలనంలా ,ఆకాశ వ్యాపకత్వంలా ,పృధివి లాంటి సహనంలా ,స్వామి ప్రతిభే సృష్టి . దాన్ని అలానే
చూసే వారికి ,రాగ ,ద్వేషాలు కలగవు . ఇవి రెండు లేనంతవరకు,సందేహం లేదు.సందేహంలేని జ్ఞానం పరబ్రహ్మమే.
ఇంద్రజాలికుని సృష్టి ,మాయ అని అందరికీ తెలుసు.కానీ స్వామి స్వయంప్రభను ఎరుగక ,పంచభూత మహాప్రపంచం
అమ్మవారిగా గ్రహించక ,పొందే ద్వైత భావాన్ని నిరసిస్తూ ,అద్వైత ప్రతి పాదనమే వేద సారం . తానొక్కడే తప్ప అన్య
మెరుగని స్థితి ,సంన్యాసం . వారికి కలిగిన అనుభూతి సర్వం బ్రహ్మమయం జగత్ . కానీ చెవిన పడిన ప్రతి వారు
సాధన విడిచి అంత ఒక్కటే అనడం,పిచిక సముద్రాన్ని 'అవుపోసన'పట్టడం లాంటిదే. జన్మ పరంపరలలో ,శరీరాన్ని
తానుగా భ్రమించి ,అదే తననే అహంతో చేసిన కర్మ ఫలాలు ,పాప ,పుణ్యాలుగా కలిగి ,పునరపి ,జననం ,పునరపి
మరణం అనే చక్ర భ్రమణం నుండి ,అంతా పరమాత్మయే ,అంతా పరమాత్మదే అనే జ్ఞానం వరకు మాత్రమే ,అద్వైతం
నుండి గ్రహించి,సృష్టిలో చరించేటపుడు జీవ భావంతో, తన కర్తవ్యాన్ని విడువక ,బుద్ధి యోగంగా మాత్రమే ,జ్ఞానాన్ని
గ్రహించాలి . ఆచరణకు ధర్మాన్ని ఆశ్రయించాలి .
     సకల జీవకోటి లోను పరమాత్మను చూడగల మానవ జన్మకలిగి నందుకు ,పరమాత్మకు కృతజ్ఞతా ఆవిష్కారమే
సాధన . జీవాత్మ ,పరమాత్మగా, ప్రతిబింబ భావాన్ని విడిచి ,బింబమే తానుగా ,మౌనంలో రమించే ,స్వానుభవం
గమ్యం . దీన్ని యోగ పరంగా షట్ చ్రక్ర బేధనంగా అంటారు . సృష్టి అంతా అమ్మవారి రూపమే . మూలాధారం నుండి
ప్రస్థానం ప్రారంభం . అమ్మ [సృష్టి ]తాను , పరమాత్మయే అని చేరేదే ప్రస్థానం . ఇదే అమ్మవారి ఏ రూపమైనా ,మళ్లీ
అర్ధ నారీశ్వరమై శాంతిస్తుంది . మాయా వ్యాప్తమైనపుడు కూడా ,నిద్రలో ఏకమైతేనే కానీ ,విశ్రాంతి లేదు .
     వేద ప్రతిపాదితమై ,భారతీయ జీవనాధారమైన, ఆచారమైన ,కళ్యాణ శోభ, ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది .
కలియుగ వైకుంఠము తిరుపతి లో ,అమ్మవారి కళ్యాణము ,తిరుమలలో అయ్యవారి కళ్యాణము ,వీటిని ఒకసారి
పరి శిిలిద్దాం . ఉనికి పరమాత్మ . వైభవం అమ్మ . కానీ సృష్టి నుండి పరమాత్మను చేరడానికి ,ఏడు కొండలు ఎక్కాలి
సృష్టిలో కూడా పరమాత్మ ఉనికి లేనిదే ఇది నిలబడదు.హృదయాంతర్గతమైన ,చైతన్యం సూక్ష్మంగా ఉంటుందని
పెద్దలు అంటారు . అమ్మవారు వరించి తిరుపతిలో,చేసుకునే కళ్యాణ మూర్తులను గమనిస్తే ,స్వామి మూర్తి ,చిన్నగా
ఉంటుంది . అలానే పూజించి అర్చించే మూర్తి ,గృహంలో కూడా కొంత పరిమాణాన్ని దాటకూడదు . పూజకు త్రిపుటి
ఉంటుంది . నిజానికి పరమాత్మ ,త్రిపుటికి అందనివాడు . అతనిని ఒక మూర్తిలో చూడడం అంటే ,అంతకంటే ఏమీ
చెయ్యలేము గనుక . ఇది మానవ యత్నం పరమాత్మను చేరడానికి ,ఇది తిరుపతిలో అమ్మవారి కళ్యాణం . స్వామీ
నీవే మాకు కావాలి ,ఇతరమేది వద్దు ,అనే సంపూర్ణ ప్రజ్ఞతో చేసే పూజ ,జప ,ధ్యానాలు ,మానవ యత్నం .
          ధ్యానంలో మనసు లయించి ,సర్వే సర్వత్ర ఉనికి ప్రకాశిస్తే , అది పద్మావతిని కానీ ,అలానే గోదాదేవిని గాని
స్వామి చేపట్టిన కళ్యాణం . ఇదే అంతరార్ధంతోనే అమ్మాయికి ,వివాహ సమయంలో ,గోత్రం మార్చి ,ఆమె ఉనికి
భర్త ఉనికిలో ఏకమై ,వేరనే భావనే లేక కరిగి పోవలనేదే ,సంప్రదాయం .మా అమ్మాయి ,మా ఇష్టం ,అనేది కాదు .
శాస్త్రాన్ని గమనించాలి ,అనుసరించి ,అనుసరింపచెయ్యాలి .
               
        

9, జూన్ 2014, సోమవారం

సాధన

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

సాధన

       జిజ్ఞాసువు అయిన వారికి శాస్త్ర మర్మం తెలుసుకోవాలనే తపనతో ,సాధన సాగుతుంది . అందువలన పరమాత్మ పాదాలయందు ధ్యాస ఉంచినా ,శాస్త్ర విషయాల నుండి ,అలానే తనచుట్టూ పరిసరాల నుండి అన్వయంతో పరమాత్మాను 
సంధానమే ,ఎంతో తృప్తిని ఆనందాన్ని ,ప్రసాదంగా ఇస్తుంది . ఈ దశ కారణాతీత ఆనందాన్ని పరిచయం చేస్తుంది .
                నారాయణ స్వరూపం ,స్వస్థితిని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ ,తనలో తాను ములిగే మునకతో, అంతఃకరణ స్నానంతో,సాధనకు శ్రీకారం . కుమ్భకంలో స్వస్థితిని సంభావించి ,ఆలోచన లేని స్వరూపాన్ని స్మరించి ,అదే శ్రీ మహా  విష్ణువు ప్రసాదించిన అమృతంగా గ్రహించి ,ఈ స్థితిని దూరం చేసే జగత్తుకు సంబంధించిన ఆలోచనలు , జగన్మోహినిగా తెలిసి ,విష్ణు పాద రూపమైన ,స్వస్థితిలో నిలకడ సాధించాలి . 
         ప్రతి ఆలోచన నిజానికి తననుండి ,తనను దూరం చేసేదే . దీన్ని సహించలేని స్థితి గోపికలది . దీనికి జ్ఞానం కన్నా సాధన అవసరం . ఈ సాధన మానసికమూ కాదు ,శారీరికమూ కాదు . ఎరుక మాత్రమే . అందువల్ల మాత్రమే దీనికి  జ్ఞానం అనే పేరు ,కానీ నిజానికి నామరూపాతీత స్థితి . నిజానికి ఆలోచనలే అమృత మధనంలోని ,ప్రారంభం లోని విషం . ఇవి తననుండి తనను దూరం చెయ్యడంవలన ప్రపంచం మనసుపై దాడి చెయ్యగలుగుతుంది . ఇది శివుని తెలుసుకోడానికి  బ్రహ్మ చేసిన ప్రయత్నం . లేదా పురాకృత విషయాలను తవ్వి తలకెత్తుకోవడం ,ఇది విష్ణువు మూలాన్ని ,లేదా కారణాన్ని తెలుసుకోవాలనుకోవడం . నిజానికి కార్య ,కారణాతీత స్థితి ,కాలాతీత స్థితి , స్వస్థితి .
      విష్ణువు కృపతో సాధన సాగే సమయంలో ,దాన్ని శరీరానికి ముడి పెట్టి ,తన సాధన అని అహం ప్రారంభమయ్యే క్షణమే ,గ్రహణం . దీన్ని అధిగమించేదే గ్రహణ సమయంలో చేసే సాధన . దీన్ని గుర్తు పట్టి మళ్లీ మునగడమే ,సూర్యుడు , చంద్రుడు రాహువును ,గుర్తించడం . మళ్లీ మళ్లీ ఈ గ్రహణం వస్తూనే ఉంటుంది . ఇదే సాధనకు అసలైన ప్రతిబంధకం . దీన్ని ఎంతగా గుర్తు పడితే అంతగా శరీరాధ్యాస తగ్గుతుంది .
        నిజానికి సూర్యుని ప్రతిభకు ,రాహువు అడ్డు పడగలడా ?అలానే అంతరాత్మ చైతన్యాన్ని,అహం ఎన్నటికీ కప్పి 
ఉంచలేదు .ఇది శరీరాధ్యాస మాత్రమే.మనస్సనే ప్రపంచానికి రాహువు అడ్డు వస్తున్నాడని తోస్తుంది కానీ ,సూర్యుని స్థాయి  నుండి అసత్యం .అసత్యం ఎన్నటికీ పారమార్ధిక సత్యం కానేరదు. కనుక శరీరాధ్యాస ,పాక్షిక సత్యం మాత్రమే .
         ఈ విషయామే మరో పౌరాణిక విషయంగా అనుసంధానం అవుతున్నది .పార్వతీ దేవి ,ఒకసారి శివుని కళ్ళు 
మూసిందట .లోకాలు అల్లకల్లోలమయ్యాయి .ఇది గ్రహణంగా గుర్తిస్తే ,అమ్మవారు దోష పరిహరానికై తపస్సు చేసిందట . తను పరమాత్మకు వేరుగా ఉన్నందు వల్ల జరిగిన అనర్ధాన్ని గుర్తించి ,తపించి అర్ధనారీశ్వర తత్వాన్ని పరమేశ్వరుని  నుండి వరంగా పొందింది . ఉన్న ఏకైక సత్యాన్ని ఎన్నో కోణాలతో అర్ధమయ్యేలా చేసేదే మన వాజ్ఞ్మయమంతా . అధికారి  బేధాన్నిబట్టి ఇవ్వబడిన సాధనా విషయాలే అన్నీ . పైకధ కేదార వ్రతంగా మనకు తెలుసు .
    ఏ సాధన అయినా త్రిపుటి సహజమే . అదే ఓం కారంలోని మూడు మాత్రలు . ఈ మూడు కలిసే ప్రజ్ఞా కేంద్రమే , బిందువే  తత్వం .అలానే త్రివేణి సంగమం .సరస్వతి అంతర్వాహిని .సత్యం అనంతమైనది ,ఆనంద స్వరూపమైనది,తన స్వరూపమే , ఏకమే ,అనే జ్ఞానం అంతర్వాహినిగా ,శరీరాధ్యాస వలన తెలియ బడుతున్న ద్వైతం పట్ల అవగాహన కలిగి ,మనసనే పరిధి  సృష్టిని అధిగమించ లేదు కనుక ,సృష్టిని పరమాత్మగా భక్తితో సేవించి అంటే నియమ పాలన వహించి,తనది ఏదీ లేదనే  వైరాగ్య భావం కలిగిన కర్మాచరణకు బుద్ధిని ప్రేరేపించే జీవన శైలి , సేవగా సంభావించి గమ్యాన్ని చేరాలి . భక్తి గంగ . యమున వైరాగ్యమే . ఈ మూడిటి గమ్యం సాగర సంగమమే .
       ఇదే మనకు భాగవతంలో భక్తిని ,తల్లిగాను ,జ్ఞాన వైరాగ్యాలను ,కుమారులుగాను పరిచయం చేసింది . భక్తి నుండి  మాత్రమే జ్ఞాన ,వైరాగ్యాలు కలగాలి ,లేదా అవి సరిగా గమ్యాన్ని చేర్చలేవు . వాటి ప్రాదుర్భావం ,భక్తీ నుండి మాత్రమే  సాధ్యం . జ్ఞాన వైరాగ్యాలు ముసలివారై ,తల్లి భక్తి ప్రౌఢగా భాగవతం పరిచయం చేస్తున్నది . శ్రుతుల వలన కలిగిన కేవల  జ్ఞానం వృద్ధాప్యం మాత్రమే . అది పరమాత్మానుసంధానం వల్లనే రసవంతం అవుతుంది . విష్ణువే రసో వై సః . వర్తమాన  క్షణంలో తనలో తాను మునిగి అమరు డవాలి . అలానే భక్తితో కూడిన వైరాగ్యం మాత్రమే సేవగా తరింపచెయ్యగలదు .
       యజ్నమే కర్మగా ,కర్మనే యజ్ఞంగా, భావనా బలంతో సాగే జీవిత విధానం భారతీయుల శైలి . ఎన్నో యజ్ఞాలు ,
యాగాలను శాస్త్ర బద్ధంగా నిర్వహించాలని ,ప్రతిరోజూ నిత్యాగ్నిహోత్రం నిర్వహించడం గృహస్థాశ్రమ ధర్మంగా ,శాస్త్రాలు 
శాసిస్తున్నాయి . ఒక వ్యక్తి జీవిత అవసరాలకు ,సమాజం నుండి ఎంతో వస్తు సముదాయం అవసరం . తాను సంపాదించి  వీటిని పొందుతున్నానని సహజంగా అందరూ భావిస్తారు . కానీ నిజానికి కష్టానికి కూలి చెల్లించ గలమే గాని ,దానికి  ప్రకృతి ,పరమాత్మ ,సహకరిస్తేనే అది అందరికీ అందుతుంది . నాటే గింజ ,పోషణ ,ప్రతివారికి అందే సౌలభ్యం ,వీటికి ప్రకృతికి ,పరమాత్మకు ,కృతజ్ఞతను తెలపడం మానవుల ,కనీస బాధ్యత . మిగిలిన పశు సంతతికి ఇది వర్తించదు . వాటికి అవసరాలు తీర్చుకోవడం మాత్రమే తెలుసు .కానీ అవి వాటి పరిధిని మించి వర్తించవు.వాటి తిండి వరకే పరిమిత మౌతాయి. తన పరిధిని దాటి అందరిదీ తనకే కావాలనే ,రాక్షసత్వాన్ని  విడిచి పెట్టి ,ప్రకృతి నుండి తాను తన ప్రారబ్ధం వలన పొందిన వస్తు సంచయానికి ,కృతజ్ఞతగా యజ్ఞం విధించబడింది .
        అగ్ని, మానవులు వస్తువులుగా వాడే యజ్ఞ సమిధలను ,పరమాత్మకు స్వర రూపంగా అందించే ,మంత్రాలతో కలిపి ప్రకృతికి అందిస్తుంది .ప్రకృతి ,కృతజ్ఞతను గుర్తించిన ,తన సంతానానికి సకలాన్నీ ఇచ్చి రక్షిస్తుంది . ఇది ఇలా సాగాలంటే గోవులు ,బ్రాహ్మణులూ రక్షించబడాలి . శాస్త్రం కోసం బ్రాహ్మణులు ,ద్రవ్యం కోసం గోవులు ,అందు వల్లనే శాంతి మంత్రంగా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం . యజ్ఞం కర్మాగా ఎంత పవిత్రమైనదో ,యజ్ఞ భావన అంతే పవిత్రమైనది . భగవంతునికి ,ప్రకృతికి,తన జీవితం కృతజ్ఞతను తెలిపే సాధనంగా భావించి ,దానికే అంకితమై ,అలానే దానికే అంకితమైన గో,బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యతనిస్తూ,యజ్ఞాలకు సహకరిస్తూ ,సాగించే జీవితం ,బ్రహ్మయజ్ఞంగా భావించే వారికి,యజ్ఞం సకల సంపదలను ప్రసాదిస్తూనే ,భక్తి ,జ్ఞాన ,వైరాగ్యాలను కానుకగా మానవాళికి అందించ గలదు . ఇది క్రమ ముక్తికి సోపానం .
      శాస్త్రం తన సంపాదనలోని పదవ వంతు ధర్మ కార్యాలకు వినియోగించాలని విధిని విధించింది . అలానే తనకున్న సమయాన్నీ ,శారీరిక శక్తిని అని గమనించాలి . సమయము,శక్తి కలిస్తే ధర్మం ,సంపాదన అర్ధం ,మనస్సులో ఎటువంటి వికల్పము లేకుండా ఈ మూటిని వినియోగించాలనే తపనే కామంగా,పరిశ్రమిస్తే కలిగేది చిత్తశుద్ధి . దీనివలన జ్ఞానం . ఇది మాత్రమే మోక్ష ద్వారం .
                  తనంత తానుగా నిర్వహించేది తమ కుటుంబానికి ,తమవంతు కృతజ్నతకు మాత్రమే ,బ్రాహ్మణులు     తమ ఇంటిలో నిత్య అనుష్టానం ,అగ్నిహోత్రంతో నిర్వహిస్తారు . అదే విధంగా సంకల్పిమ్చినవారికి,సహాయపడే వారికి చూసినవారికి ,చూడలేక పోతున్నామనే తపన కలిగినవారికి,వారి,వారి భాగస్వామ్యాన్ని బట్టి ,ఎవరికి ఎంత చెందాలో ,అంత అందిస్తూనే లోకానికంతటికి మేలు చేసేలా ,ఆలయాలలోను ,వీలైన స్థలంలోను యజ్ఞాలు నిర్వహిస్తారు . తమంత తాముగా సమయాభావం వల్లగాని ,ఆర్దికాభావం వల్లగాని ,ధర్మానికి కట్టుబడి తాము చెయ్యకూడదనుకుని ,ఇలాంటి ఎన్నో కారణాల వలన ధర్మ గ్లాని సంభవించకుండా,అందువలన లోకం సుభిక్షంగా ఉండాలని జరిగే యజ్ఞాలలో పాల్గొని,తమవంతు ధర్మాన్ని పాటించడం శ్రేయస్కరం .
           స్వధర్మ నిరతి ,యజ్నమే . కానీ ఒక సమృద్ధి కలిగిన వ్యక్తి ,పత్రం ,పుష్పం ,ఫలం ,తోయం ,అని ,ఎంత ఉన్నా
తన శక్తికి తగినంత ,సమాజ రూపమైన ,పరమాత్మకు సమర్పించకుండా ,లోభత్వాన్ని పొందడం ,అధర్మమే . ఎవరికి
ఈ విషయాలకు లెక్కలు చెప్పకున్నా,హృదయాంతర్వర్తికి అన్నీ తెలుసు .కనుక లోభాన్ని విడువడమూ యజ్ఞాంగమే . అలాగని ,తన కులాచారం కాని ,వేద ప్రతిపాదిత కర్మలను చెయ్యడమూ అధర్మమే . పూర్వ ప్రతిపాదిత కులాచార ,పెద్దల ద్వారా తెలిసిన , తమ పరిధి లోని విషయాలకు ప్రాధ్యాన్యత ఇవ్వాలి . సామాజిక మార్పుల వల్ల     ఎంతో ఉన్నత పదవులను పొందినా ,ఆచార వ్యవహారాలకు మాత్రం ,తమకట్టుబాట్లను పాటించి ,ధర్మ రక్షణకు సహకరించాలి .
     ఈ విషయాలను పదే ,పదే చెప్పడానికి కారణం ,ఎంతోమందికి ఉన్న కులాచారం తప్పు అనే భావం వలన , చెయ్య వలసినవి చెయ్యక పోవడం ,చెయ్యకూడనివి చెయ్యడం అనే ప్రపంచ పోకడ వలన ,పొందవలసిన ఆత్మ జాగృతికి ,తామే అవరోధంగా మారడం శ్రేయస్కరం కాదని సవినయంగా ,తెలియజేయడాన్ని ,మన్నించాలని కోరుతున్నాను . ఒక సాధారణ వ్యక్తికే తన కర్తవ్యం ,విలువలు , ఏది ఎంతవరకు సబబు , అనేది తెలుసు . అలాటిది జగన్నిర్మాత ,అంతర్యామి అయిన పరమాత్మ ,పురాకృత కర్మ ప్రకారం ,సాధన , విద్య ,ఐశ్వర్యాలను వితరణ చేసే దిశగా ,ఏర్పరచిన వ్యవస్థలో ,పూర్వ ఆచార ,సాధన పటిమకు తగిన కులాచార వ్యవస్థను ఏర్పరచడం జీవుల ఉన్నతికే . ఇప్పుడు తన స్థితిని గుర్తించి ,సాధన సాగించాలనేదే  తాత్పర్యం .ఎంతో కృషి పురాకృతంలో చెయ్యడం వలననే ,అన్ని కులాలలోను విద్యావంతులు ,ఐశ్వర్య వంతులు  ఉన్నారు ,దీనికి ఎవరు ఎంత ,పూర్వ పుణ్యంతో తెచ్చుకున్నారో దానికి ,కులంతో ,ఏ సంబంధం లేదు . వారు విద్యావంతులు ,ఐశ్వర్యవంతుల ఇంట ,జన్మించి ఆవిషయాలలో అభివృద్ధి సాధించ వచ్చు . కానీ పూర్వ భగవత్సాధన విషయం ,ఆచార సంప్రదాయాలు మాత్రమే , బ్రాహ్మణ కుల యవస్థకు మూలం .
     ఒకే రకమైన లోహంతోను ,అలానే కాగితం తోనూ ,నాణాలు ,నోట్లు ,చలామణిలో ఉన్నాయి . లోహం ఒకటే అయినా కాగితం ఒకలాంటిదే అయినా వాటి విలువలు వాటివే . రూపాయి పది రూపాయలు అని ఏ బ్రహ్మ వేత్త బాహ్య ప్రపంచంలో వర్తించడు . సరే సామాన్యుని విషయం సహజమైనదే . దీన్ని తప్పు అనడం లాంటిదే ,వర్ణ వ్యవస్థ కూడా . ఆచార కాండ దీని మీద మాత్రమే ఆధార పడింది . అంతా బ్రహ్మమయం అంతరంగానిది . బాహ్య ప్రపంచం సాకార రూప పరమాత్మ స్వరూపం.అంతరంగంలోని పరమాత్మ,మనతో మాట్లాడుతూ ,ఆడుతూ ,పాడుతూ ,నవ్విస్తూ ,ఎడ్పిస్తూ ,అన్ని రూపాలతో నర్తిస్తూ ,నర్తింపజేస్తూ ,అంతా తానేనని , అనుభవంలో జీవాత్మగా భావిస్తున్న సాధనకు ,ఎన్నో అవరోధాలను ,కరుణతో దాటించి ,అక్కున చేర్చి తనపదవి నివ్వడమే ,కుచేలోపాఖ్యానం . కానీ శరీర పర్యంతం బాహ్యంలో పరమాత్మను ,అన్ని రూపాలతో అంగీకరించి ,ఆయన ఏర్పరిచిన వ్యవస్థను గౌరవిస్తూ ,గమ్యం చేరడం కర్తవ్యం .
       పరమాత్మను చేర్చే పరమ ధర్మం ,మనిషి తనలో ,నిరంతరం సాగే క్షీరసాగర మధనంలోని రాక్షసులను , దేవతలను గుర్తు పట్టి ,దుష్టశిక్షణ ,శిష్టరక్షణ బాధ్యతను ,స్వీకరించడమే ప్రారంభ ధర్మ సోపానం.దీనికి సూచన అందితే ,అంతరంగంలో గురువు అనుగ్రహించినట్లు భావించ వచ్చు . ప్రతి వారికి బాల్యం నుండి భగవంతుని గురించిన కొంత పరిజ్ఞానం ,పెద్దలనుండి సహజంగానే వస్తుంది . నెమ్మదిగా తమలో బాహ్యం ఆకర్షించడం మొదలవుతుంది . ఉదాహరణకి ,శ్రీ రామ జయ రామ జయ జయ రామ ,అనే నామం 11సార్లు అనుకోవాలి అనుకున్నప్పుడు ,బాహ్యానికి సంబంధించిన ఆలోచనను ,తనలోని రాక్షస భావంగాను ,ఏ భావన లేని సాత్విక స్థితిని దైవ భావంగాను గమనించి నపుడు ,బాహ్య వస్తు ,వ్యవహార చింత సురా పానం గాను ,సాక్షి భావమే అమృత పానం గాను , బాగా అను సంధానం చేస్తూ ,సాక్షి చైతన్యాన్ని విష్ణువుగా,తెలిసి ,సాధన సాగితే ,మనసు అత్యవసర విషయాలను మాత్రమే గ్రహించి ,సత్వ గుణాన్ని చాలా సహజంగా స్వీకరిస్తుంది . ఇది చాలా సాధారణమైన మంచి లక్షణం కావడం వలన ,చేసే పనిలో కలిగే ఏకాగ్రత వలన ,ప్రాపంచిక విషయాల్లో కూడా అన్నిటా విజయం కలుగుతుంది . దీనికి కారణం గురుకృప ,దైవకృపగా ,గుర్తించడమే ,విష్ణువు ఆధారంగా సాగే అమృత మధనం.
తన విజయం నుండి ,ఒదిగే లక్షణాన్ని కలిగి ,అహం అనేది వంచించని స్థితిని కలిగి ,ఉండడమే ,తనలోని విష్ణువు యొక్క కూర్మావతారం . తనలో తాను మునిగి ,బాహ్యంలో చరించినా దేన్నీ అంటని సహజ స్థితికి,పరిణామమే దేవతలకు అమృతం అందడం అనేదానికి మూల కారణం . సురాపానం చేసిన వారికి అమృతం అందక పోవడమే , న్యాయం .ఒకే క్లాసులో చదివినా ,బాగా శ్రమించి చదివిన వారికీ ,అల్లరి చిల్లరిగా చదివిన వారికీ ,ఒకేలా మార్కులు వేస్తె న్యాయం కాదు కదా ? పొలంలో నాటిన గింజలుకాక ,మిగిలినవి కలుపు మాత్రమే .ప్రూనింగ్ చేసి , శ్రద్ధతో,ఎరుకతో చేసే కృషి మాత్రమే ఆహారాన్ని, ఆనందాన్ని ఇస్తుంది . లేకుంటే,ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి , అనేక క్రిమి కీటకాలు ,పాములు తేళ్ళు చేరడం సహజమే .
      తమచుట్టూ ఉన్న సమాజానికి సమయమనే ,భగవద్విభూతిని సాక్షాత్తుగా లక్ష్మిని తమవశం చేసుకోవడం సహజం .విష్ణువుని[అంటే సాక్షిని]విడిచి వుండని అనపాయిని ,లక్ష్మి ,జగన్మోహినికి [సురాపానానికి]దాసోహం అన్నవారిని,ఎన్నటికీ చేరదు .ప్రారబ్ధ వశంగా అందిన సంపదకు ,ఎదుగూ ,ఉండదు . స్వరూపమైన విష్ణు తత్వాన్ని నిరంతరం చింతన చేసే వారికి శ్రీనివాసుని అనుగ్రహం,అన్ని సద్గుణ రూపాలుగాను,మన శాంతి రూపంలోనూ సాధకుని చేరుతుంది .
                   ఎన్నో సార్లు అందరికీ ఒక మంచి పనికి పూనుకున్నపుడు ,ఎన్నో అవరోధాలు మనసుకు వికల్పాలు కలిగిస్తాయి . పూజ ,జపము ,ధ్యానము ,ఎవరికైనా సహాయము ,తీర్ధ స్నానము ,యాత్ర ,ఇలా అన్నిటికీ ముందు , అంత అవసరమా ?అనే ప్రశ్న విసిగించడం సహజమే . కానీ ఒక సత్సంకల్పానికి , పరమాత్మ కృప ,అలానే పురా
కృత పుణ్యము కారణము . దీన్నే పెద్దలు అదృష్టము అన్నారు . ఎన్ని సంపదలున్నా, శ్రేయోమార్గాన్ని చూపిన
క్షణమే కదా విలువైనది . విలువైన సంకల్పాన్నివ్వడం వరకూ పూర్వ జన్మ పుణ్యం తీసుకు రాగలదు . కానీ
చెయ్యాలనే ధృఢ సంకల్పం మాత్రం ,పురుష ప్రయత్నమే .మన ముందుకు శ్రేయోమార్గం తీసుకు రాగల అదృష్టం,
చేయించగల సామర్ధ్యాన్ని, యివ్వడంలో విఫలం అవుతుంది . తన ప్రయత్నమే తనకు సంకల్ప సిద్ధిని యిస్తుంది .
జీవితమంతా ఈ రెండింటిని ,సరిగ్గా అన్వయించడంలోనే శ్రేయస్సు దాగి ఉంది .
          పుణ్య ,పాపాలు విడదీయ లేని జంట . పాలు నీళ్ళలా . సత్సంకల్పం పుణ్యం ,విఘ్న కారణమైన ,వికల్పం
పాపం . వికల్పాన్ని ,గుర్తుపట్టి విఘ్నాధిపతిని స్మరించి ,వికల్పాన్ని విస్మరించి ,ద్వందాతీత స్థితికి చేరడానికి
సోపానంగా చిత్తశుద్ధి కరమైన ,పవిత్ర కర్మలకు ,పాలను ,నీటిని విడదీయగల హంసలా సాధన సాగించాలి .చెయ్యక
పోయినా ,పరవాలేదు . అనే వాదం వలన ,పుణ్యం వలన ముందుకు వచ్చిన ,శుభ సంకల్పం ,చిత్తశుద్ధిని ఇవ్వ
లేక ,నిర్వీర్య మౌతుంది . దీనివలన ఎన్నో జన్మల పరంపరలో కలిగిన మానవ జన్మ, తనకు  కలిగిన అవకాశాన్ని
కేవల తమో గుణ లాలసతో చేజార్చు కున్నట్లు అవుతుంది . దీనికి ఎంతో మెలకువ అవసరం . క్రమంగా మెలకువ
జ్ఞాన కారణ మౌతుంది .
           తీర్ధ స్నానం ఎంతో పవిత్రమై , సంచిత పాపరాశిని ధ్వంసం చేసి ,చిత్తశుద్ధి కారణ మౌతుంది . అలానే క్షేత్ర
దర్శనం కూడా . ఋషులు తమ తపస్సును ఆయా స్థలాలలో చేసి ,ఫలితాన్ని మానవాళి శ్రేయస్సుకు ,అక్కడ
నిక్షిప్తం చెయ్యడం వలన అవి ,ఎంతో శక్తి వంతమై పాప ప్రక్షాలణతో ,చిత్త శుద్ధిని కలిగిస్తాయి . కరెంటు యొక్క
సామర్ధ్యం అంతటా ఒకటే అని తెలిసినా ,జీరో వాట్ అతి తక్కువగాను ,1000వాట్స్ చాలా ఎక్కువ పవర్ కలిగి
ఉండడం మన పరిచయం లోనిదే . అలానే తపించిన వారి శక్తి సామర్ధ్యాలు ,ఎంతో శక్తి కలిగి ఉండడంలో ఆశ్చర్యం
ఏమీ లేదు . అంతేకాక తపస్సును త్యాగం చెయ్యడం వలన ,వారి శక్తి ద్విగుణీ  కృతం అయింది . అందువల్లనే
ఏపాటి పూజ ,జపము ,దానము ,ఇలా ఏదైనా పూర్తి అయిన వెంటనే 'కృష్ణార్పణం 'అనే గొప్ప విధానానికి మన
పెద్దలు ,పెద్ద పీట వేశారు . ఇలా చెప్పిన క్షణంలోనే తాను చేసిన పని భారం తొలగడంతోబాటు ,అహం అనేది , తాను
చేసినది సమర్పించిన భావం వలన ,చిత్తశుద్ధిని కలిగించి ,లుప్తమైపోతుంది .
              అలానే వస్త్ర ధారణ విషయం తీసుకున్నా ,ఇంట్లో తనకు హాయి నిచ్చే వస్త్రాలు ,ఆఫీసుకు తగిన వస్త్రాలు , పండుగలకు ,పెళ్ళిళ్ళకు తగిన వస్త్రాలు ,యిలా విభాగాలు అందరికీ ఉన్నాయి . అలానే పూజకు పెద్దల ద్వారా ఆచారంగా వచ్చిన వస్త్ర ధారణ వలన ,అలానే ధరించిన ,విభూది ,చందనం ,కుంకుమ వలన ,నేను ఈపనికి పరిమిత మయ్యాను ,అని మనసు స్పందిస్తుంది . అందువలన పూజకు వినియోగించే వస్త్రాలు ,మిగిలిన అన్నిటితో ,కలపక ,విడిగా ఉంచాలని ,మన పెద్దలు మనకు సూచించారు . ధరించే విధానం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది . వీటిని ఆరవేసాక ,తప్పక తడి బట్టలతో మాత్రమే తీసి ,మిగిలిన వాటితో కలపక ఉంచి ధరించడం వలన ,సత్వ ప్రకాశం కలుగుతుంది . దీన్ని పాటించిన కారణం వలన ,రజో గుణ ,తమో గుణ ప్రకోపం తగ్గుతుంది . భగవంతుని పూజకు అవసరమైన సత్వ గుణాన్ని పొందేందుకు యిది కూడా సోపానమే .
        మనస్సే తులసి.విష్ణు పాదోదకంతో పెరిగితే అంతకన్నా పవిత్రం ఏముంటుంది ?ఈతులసి కన్నాపూజార్హమైనది
ఏముంటుంది ?తులసి యొక్క విష్ణు భక్తి అపారమైనది .తులసి లక్ష్మీ స్వరూపమే.నిజానికి ప్రతి జీవి,సృష్టిలో విష్ణువే ,శక్తి లక్ష్మియే .తానంటే తనకు ఇష్టం ,ఇదే అనపాయిని లక్ష్మి అనడంలో అంతరార్ధం . నేనంటే నాకు ఇష్టం . ఇది స్వరూపస్థితి . ఇదే మనకు నిరాకారంగా [సృష్టికి ]కి ముందు అర్ధనారీశ్వరం .ప్రతి జీవిగా సంపూర్ణ అర్ధనారీశ్వరం . తనకు తాను , తనను చూడాలనే తపనే సృష్టి .అది అలా కనపిస్తే ప్రతిబింబమే కాని ,వస్తువు కాదు. ప్రతిబింబిస్తున్న వరకు,ప్రతిబింబానికి , పరిమితు లుంటాయి. అదే ధర్మం .చిన్న అద్దం ఉంది ,పెద్ద కొండ దూరం నించి అందులో పూర్తిగా ప్రతిబింబిస్తుంది . కానీ ప్రతిబింబం ఎంతవరకు నిజం?కొండ ధర్మాలు, ప్రతిబింబానికి వర్తిస్తాయా ?అలానే ప్రతిబింబ ధర్మాలు కొండకి వర్తిస్తాయా ?జీవిగా ప్రతిబింబిస్తున్న వ్యష్టి ,జీవ ధర్మాలతో సంపూర్ణం . పరమాత్మ బింబ ధర్మాలతో సంపూర్ణం . ప్రతిబింబ ధర్మాలలో భాగంగా,చిన్న బీట ఉన్న అద్దంలో కనిపిస్తున్న రెండు రూపాలే , సృష్టిలో భార్య ,భర్త . ప్రతి జంట . వేరుగా ఉన్నంత వరకే ఎవరి ధర్మాలు వారివి .కళ్యాణంతో,ధర్మ,అర్ధ,కామ మూడు పురుషార్ధాలకు ,ఒక్కటై సాగాలి .కానీ మోక్ష గామిగా, సంసారంలో ఉన్నా,సాధనకు ఒకరికి ఒకరు సహకరిస్తూ ,ధర్మాచరణ చెయ్యాలి. పిల్లల బాధ్యత పూర్తి అయ్యే వరకు , ఇంచుమించు షష్టి పూర్తితో కామ, పురుషార్ధానికి శలవు ,ప్రకటించాలి . అంటే శారీరిక ,మానసిక ,బౌద్ధిక అలసటను తగ్గించి , తమలో తామే రమించే ,బింబ రూపమైన పరమాత్మకు మనసుతో చేరువ కావాలి .
        ఈ ప్రస్థానంలో,ప్రతి వారికీ బాల్యం నుండి పెద్దలు అందించిన భక్తి బీజాలు,నెమ్మదిగా అంకురించి ,పెళ్ళితో ,ఒకరి
కొకరు సహకరించడంతో,బలంగా వృద్ధి చెంది,ఇంట్లో పిల్లలకు మార్గ దర్శనం చేస్తూనే,గమ్యమైన బింబతో సారుప్యానికి
మనసు సహకరిస్తుంది . ఈ క్రమంలో మనసు సత్వ ప్రకాశాన్ని పొందడానికి ఉపకరించేవే ,పూజ ,జపము ,ధ్యానము
పూజ కాయికం ,జపం వాచికం ,ధ్యానం మానసికం . ఇదే త్రికరణ శుద్ధి . ఈ మూడు ఏకాగ్రమై ,గమ్యం వైపు సాగాలి .
ఈ మనసే తులసి ,దీనికి అందే నీరు ,పరమాత్మానుసంధానమే , విష్ణుపాద తీర్ధం .పరమాత్ముడే గమ్యంగా సాగే ప్రతి ఆలోచన ఒక తులసి దళమే ,కానీ ఏకాగ్రత ముఖ్యం . 
     తులసి కధను ఒకసారి స్మరిద్దాం .జలంధరుని భార్య తులసి ,మహా పతివ్రత . అలానే పరమ విష్ణు భక్తి తత్పరురాలు . ఆమె పాతివ్రత్య మహిమతో కలిగిన శక్తితో ,జలంధరుడు అకృత్యాలకు పాల్పడ్డాడు . రావణాసురుని ప్రాణం నాభిలో ఉన్నట్లు ,జలంధరుని ప్రాణం ,భార్య పాతివ్రత్యంలో దాగి ఉంది . రామునికి నాభిని గురి చూడడం తప్పనట్లుగానే ,విష్ణునికి తన భక్తురాలిని అనుగ్రహించడం తప్పనిసరి . ఇది సంకేతాలతో చెప్పిన ,ఒకే వ్యక్తిలోని సాధనా రహస్యం . రాధాకృష్ణులకు వివాహం అంటే వీలుకాదు . అది సంకేతాలతో చూపే ఒకే వ్యష్టికి సంబంధించినది . ముందు ప్రస్తావించిన తానంటే తనకిష్టం . రాధా కృష్ణ తత్వం . దసేంద్రియ సహిత శరీర పరిమితంగా తనను తాను భ్రమించే జీవుడే జలంధరుడు . మనసు తనను తాను నియంత్రించుకుని పరమాత్ముని సేవించి పొందే శక్తిని , పరమాత్మ కృపగా తెలియక,తన ప్రయోజకత్వంగా భావించి లౌకికంగా,నా అంతటి వారు లేరు అని ,భక్తికి ,జ్ఞానానికి , సేవకు,అహంకారాన్ని జోడించి విర్రవీగడమే ,జలంధరుని యుద్ధం.కానీ దీన్ని నిర్జించి ,మనసును కరుణతో అనుగ్రహించి ,మనసులోని ప్రతి ఆలోచన పరమాత్మునే గమ్యంగా చేసి , తాను శరీర పర్యంత జీవి కాదని ,ఇది ప్రతిబింబం మాత్రమేనని ,శివోహం అనే దిశగా చేసే పరిశ్రమకు ,భగవంతుని ప్రేరణే , తులసిని విష్ణువు అనుగ్రహించడం .ఎన్నోసార్లు సాధన సమయంలో ,విసుగుతో సాకార రూప ,పూజ ,జప ,తపాలకు మనసు సహకరించక ,విగ్రహ స్వరూపాన్ని కేవలం ,పదార్ధ భావంతో ,చూడడమే ,తులసి శ్రీ మహా విష్ణువును శిలవు కమ్మని
శపించడం . కానీ అప్పుడు కూడా మనసును అనుగ్రహించి ,సాలగ్రామంతో బాటు తప్పక తులసి ఉండాలని , అను గ్రహించి , సదా మనస్సు పరమాత్మతో ఉండాలని సూచించేదే ,తులసి కధ .మనసే తులసి ,మనముందు ఉన్న విగ్రహ రూపమే విష్ణువు.
                         శ్రీ తులసీ ధాత్రీ సహిత కార్తిక దామోదరార్పణ మస్తు .
     
                                           

సంపూర్ణ యాత్ర 

      రామేశ్వరం ,కాశి ,రామేశ్వర యాత్రను ,పెద్దలు సంపూర్ణ యాత్ర అన్నారు . ఈ విషయాన్ని పరిశీలిద్దాం . రామేశ్వరంలో ,సంపూర్ణంగా ,శారీరిక ,మానసిక ,పాప నివారణ రూపమైన సేతు స్నాన ,సకల రామేశ్వర తీర్థ స్నానాలు 
ముగించి సేతువు నుండి రేతిని [ఇసుక ]గ్రహించి ,దాన్ని తీసుకుని కాశి చేరి ,రేతిని కాశి గంగలోను ,త్రివేణి సంగమం లోను కలిపి ,తరువాత కాశిలో 9 నిద్రలు చేసి ,త్రివేణి జలాలను తీసుకుని ,రామేశ్వరం లోని రామనాధ స్వామికి అభిషేకించడంతో 
యాత్ర సంపూర్ణ మౌతుంది . 
        స్త్రీలు తమ రజో సంబంధిత దోషాలను ,గృహస్తాశ్రమ ధర్మంలో పురుషులు వీరితో సహజీవనం చేసేటపుడు తెలిసి, తెలియక కలిగే దోష నివారణకు రామేశ్వరంలో ,ప్రత్యేక సంకల్ప పూర్వక స్నానాలు చేసి ,వారి ధర్మాన్ని అనుసరించి  పితృ తర్పణాలు ,పిండ ప్రదానాలు చేసి ,శుద్ధుడై ,ఇసుక సేతువునుండి గ్రహించి ,మూడు భాగాలుగా [కుప్పలు]గా చేసి బిందు మాధవ ,సేతు మాధవ ,వేణు మాధవ  రూపాలుగా అర్చించి ,బిందు మాధవ ,సేతుమాధవ భాగాలను అక్కడే సముద్రంలో కలిపి ,వేణు మాధవునిగా పూజించిన దానిని ,కాశి యాత్రకు భద్రపరచాలి . కాశిలో సంకల్ప సహిత స్నానాలు  ముగించి ,ఇసుకను సంగమంలో కూడా కలిపి ,కాశి గంగతో ఈశ్వరుని ,అభిషేకించి , త్రివేణి నీటిని గ్రహించి ,వాటితో  రామేశ్వరుని అభిషేకించడంతో యాత్ర సంపూర్ణ మౌతుంది .
      దీన్ని జీవిత యాత్రకు అన్వయిస్తే ,రామేశ్వరంతో యాత్ర ఆరంభం అవుతుంది. రామచరిత పరంధామునిదైనా , మానవ  జీవితానికి ఆదర్శం అవుతూనే ,ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో ,ఆ లీల నుండి గ్రహించ వచ్చు . పరమాత్మ రావణాసుర  సంహారం ,మానవుని అహంకార నాశనానికి గుర్తు . ఆ క్రమాన్ని ,సాధనగా తీసుకుని , బిందు రూపమైన జీవుని ,సింధు  రూపమైన ,విశ్వంగా అనుసంధానం చేసేదే ,సాధన . అంటే బిందువును , సింధువులో కలపడం . తరువాత ఇసుకను గ్రహించి ,అంటే భౌతిక సంపద ,శరీరంతో సహా ,మట్టితో సమానంగా గ్రహించి ,దాన్ని త్రివేణి సంగమంలో కలపాలి . ఆజ్ఞా చక్ర స్థానం త్రివేణి సంగమంగా కూడా అనుసంధానం చేస్తారు . పాంచ భౌతిక వ్యవహారాలకు ,తగినంత మాత్రమే విలువనిస్తూ ,మహా స్మశాన రూపమైన ,శరీరమనే కాశి వాసం చెయ్యాలి . నిత్యం ,అనిత్యమైన సంసారం గురించి చింతనమే శివాభిషేకం రామేశ్వరంలో . ఇలా యాత్ర సంపూర్ణం .
    


14, డిసెంబర్ 2013, శనివారం

సంస్కృతి -సంప్రదాయం



   ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః. 

సంస్కృతి -సంప్రదాయం
     పరమాత్మ వైభవం అద్వైతం . సమాజం ద్వైతం . రెండు విడివిడిగా ప్రశ్నించబడి సమాధానాలు వెదికి
క్రుతక్రుత్యతనుసాధించాయి . కానీ వీటి అనుసంధానం మాత్రమే మనిషికి అంతరంగ శాంతికి అత్యంత ఆవశ్యకం .ఆత్మ శోధనలో అంచులు చూసినా ,అంతరంగంలో మాత్రమే ధ్యాన స్థితిలో ,లేదా తనలో తాను మునిగినంత వరకు శాంతికి ఏ భంగము కలగదు. కానీ శరీరపరమైన వ్యవహారానికి సమాజంలో కదలిక తప్పదు . 'అహం బ్రహ్మాస్మి 'అని నిర్ద్వందమైన అనుభవం స్వంతమైనా, చరించే దిశలో ద్వైతపరమైన సందేహాలు సహజమే . అలానే ద్వైతపరమైన ఎన్నో ఆటంకాలు దాటేందుకుసంపూర్ణ భక్తి,లేదా శరణాగతి నిర్ద్వందమైన సమాధానమైనా,ఉన్న శరీరంలో ఇప్పుడే ఇక్కడే 'అహం బ్రహ్మాస్మి'   అని శాంతిమంత్రాన్ని చెప్పే సాహసం కొరవడుతుంది .అద్వైతం శివుడైతే ,అమ్మవారిని ద్వైతంగా  ,పెళ్లి కూతురుగా సింగారించికళ్యాణం చేస్తే కదా,అర్ధ నారీ శ్వరుని చేస్తే కదాజీవకళ్యాణం.అంతరంగ వైభవంగా అద్వైతం ,భాసిస్తున్నా,పరమ సంతృప్తిగా జీవితం విరబూసిన పుష్పంగా సాగాలంటేఅన్వయం ,అత్వంత ఆవశ్యకం .నిజానికి ద్వైత బోధగాని ,అద్వైత  బోధగాని, శిష్యుని రూపంగా ఒకవ్యక్తి పొందుతాడు,నిజానికి ఒక నీటి బొట్టుకు ఒక ఆవర్తం ఏర్పడుతుంది .ఏ చుక్కకైనా అదే పరిధి . ప్రతి నీటి బొట్టు తన పరిధికి మించినది,లేదనే అనుకుంటుంది ,తనలో ,కానీ జాగ్రదావస్థలో మాత్రమే సాధ్యం . నిద్రలో  పరిధి జారి పోతుంది.ద్వైతాన్ని మెలకువలోకాపాడుకోవచ్చు ,కానీ నిద్రలో కాదు . అంతా  సమానమేఅనేనిద్రాస్థితిని మెలకువకు  అన్వయించడం ,అసాధ్యం. అందువలన కలను, ఉపమానంగా సృష్టిని అనుసంధానం చేశారు పెద్దలు అందువలన కలను యధాతధంగా స్వీకరించినట్లు కష్ట ,నష్టాలనుస్వీకరించి ,ప్రతి మనిషి సహనంతో వాటిని దాటవచ్చు . అంతవరకూ మాత్రమే ఈ అవగాహనకు అవకాశం ఇవ్వాలి . లేకుంటేప్రయత్నం అనేది కుంటు పడుతుంది . నైరాశ్యం ఎదురవుతుంది .
      దీన్నుండి బయటపడా లనుకుంటే కర్మ యోగం యొక్కఅవగాహన అవసరం . మెలకువకు మాత్రమే కర్మయోగం అనుసంధానం అవుతుంది . మెలకువకున్న ప్రధాన లక్షణం పరిధి .ఇది ద్వైతంలో మాత్రమే ప్రవర్తిస్తుంది .  అందువల్లనే ఎవరి పరిధిని వారు అతిక్రమించక జీవించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించక తప్పదు .ఈ విషయంలో మాత్రమే మతాలు మానవత్వాన్ని శాసిస్తాయి .అందరికీ సమానమైన నీరు ,నిప్పు ,గాలి ,ఆకాశం, నేల ,ఒక్కటే  అలాగే సుఖఃము ,దుఖఃము , నిద్ర ,జనన ,మరణాలు అందరికీ సమానమని అన్ని మతాలు ఒప్పుకుంటాయి . అందరూ ఒప్పుకునేది అద్వైతం . విబేధాలున్నది ద్వైతం . విబేధాలున్న ద్వైతంలో ఎవరి భావాలు వారు ఎవరితోవిబేధించకుండా కాపాడుకుంటే ,అదే సభ్య సమాజం .కానీ ,ఒకరికి ఎంతో గొప్పదైన భావజాలం వేరొకరికి పేలవంగా అనిపించవచ్చు . ఎవరి పరిధి వారిది అని సరిపెట్టు కోవలేకాని వాదన వలన పరిష్కారాలకు బదులు ,ప్రమాదాలే మిగులుతాయి.కర్మ యోగం లోని ప్రధాన ప్రతిబంధకం,పని తాను చేస్తున్నాననే భావం వలన ఏర్పడే,పాప పుణ్య రూపమైన,జన్మ కారణమైన సంచితంగా, మార్పు చెందడమే .దీనినుండి బయట పడాలంటే ,భరతునికి పట్టం కట్టవలసిందే .భరతుని పాదుకా పట్టాభిషేకాన్ని జీవుడు తనంత తానుగా స్వీకరించి , కర్తృత్వ భావం నుండి విముక్తి పొందాలి .
       దీన్ని వేరే కోణం నుండి పరిశీలిస్తే ఉన్నది అద్వైతమే . అర్ధం చేసుకోవడమే పరిష్కారం కానీ ,వాదన కాదు . కన్ను ఎన్నో వస్తువులను చూస్తున్నది . వస్తువులు మారుతున్నాయి . కానీ కన్నులో కానీ , చూడడం అనే క్రియలో కానీ ఏ మార్పు లేదు . దాన్ని గమనిస్తూ వస్తువుల విషయాన్ని పరిగణన లోకి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా జీవిని ఉద్ధరించే , భగవదత్త మైన జీవిత కాలాన్ని వినియోగించుకునే నేర్పే ధర్మం .తల్లి ,తండ్రి ,పిల్లలు ,మనుమలు ,ఇలా తొలి పరిధి కుటుంబం . కంటికి కనిపించక పోయినా ముందు తరాల పెద్దలు వీరికిఆధారం .ద్వైతంలో ధర్మవాదులకు వేద ,శాస్త్ర , గీతాది గ్రంధాలు,ఆధారంగా  అందరికి పరిధులు విధించబడ్డాయి .జన్మ తోనే పరిధి ప్రారంభ మౌతుంది . తల్లి దండ్రుల ఆర్ధిక సామాజిక ,స్థితిగతులే ప్రమాణంగా ,ప్రతివారి పరిధి ,పుట్టుకతోనే నిర్ణయమౌతుంది . ఈపరిధిని గౌరవించి జీవించి
ఎంతటి పురోగతి నైనా సాధించ వచ్చు . ఈ విధమైన జీవిత విధానం ధర్మ పరిరక్షణకు సోపానమౌతుంది .
      అదే ముందు తరాలవారికి మార్గ దర్శకమౌతుంది . ఎవరి కుటుంబ పరిధి వారు కాపాడుకుంటూ ,చాలా తక్కువగా ప్రపంచంతోఅనుబంధాన్ని కొనసాగించారు . అందు వలన పల్లెలు పోషించబడ్డాయి.కుటుంబం తరవాతి పరిధి విద్యకు కేటాయించారు . దీనికి వృత్తి ప్రాధాన్యంగా,వేద  జ్ఞానమే సాధనంగా ,బ్రాహ్మణులు . ఈజ్ఞాన సహాయంతో రాజులు , పరిపాలనాపరమైన విషయాలను ,వైశ్యులు న్యాయ బద్ధమైన వ్యాపారాన్ని ,మిగిలిన వారంతావ్యవసాయ, గోపాలనాది వ్యవహారాలు నిర్వహించి ఎవరి పరిధిలో వారు తృప్తిగా జీవించారనడంలో ఎటువంటి సందేహం లేదు .ఆక్రమణల పేరుతో కానీ ,వ్యాపారం పేరుతోకాని విదేసిపరిచయంతో మాత్రమే మన వ్యవస్థ కుప్పకూలింది .దీని ద్వారా ఏమి పొందగలిగమొఅందరికీ తెలుసు .
      ఈ విపత్కర పరిస్థితులలో, ప్రస్తుతపు మన మొదటి పరిధినైనా కాపాడుకోవలనుకోవడం అత్యాశ మాత్రం కాదు . ఒక్కరిద్దరుపిల్లలైనా, మన  పెద్దలు ఆశించిన రీతిలో దిద్ది ,తల్లి దండ్రుల ఋణం తీర్చుకోవడం ప్రధమ కర్తవ్యం .ఇది ద్వైతంలో విషయం .మరి అద్వైతంలో, ప్రతి మనిషిలో అంతః కరణ చతుష్టయంలో అహంకు జ్ఞాన యోగాన్ని ,చిత్తానికి భక్తి యోగాన్ని,బుద్ధికికర్మ మార్గాన్ని ,ప్రతిపాదించి వీటియొక్క సంపూర్ణ ప్రజ్ఞతో మనస్సును స్వాధీన పరచి, శరీరం సాధనంగా మాత్రమే గుర్తించాలి.కానీ శరీరం కోసం మాత్రమే జీవితాన్ని సమర్పించ కూడదు .
                     శ్రీ రాముని చిత్రంలో ,మనకు శ్రీరాముడు ,సీత ,లక్షణుడు ,హనుమంతుడు సాధారణంగా కనిపిస్తారు . శ్రీరాముడు  జ్ఞానం ,సీత భక్తి ,లక్ష్మణుడు వైరాగ్యం ,హనుమంతుడు బుద్ధి యోగం . సర్వే సర్వత్ర ఉన్నది సీతా రాములే . లక్ష్మణుడనే జీవుడు , వైరాగ్య భావంతో ,నాది అనే భావాన్నిశరీరానికి  [ఊర్మిళలా]నిద్రాణంగాఉంచి , ప్రచోదనం చెందిన హనుమంతునివంటి బుద్ధితో, సర్వే సర్వత్ర సీతారాములే ఉన్నారని ,తానంటూ వేరుగా లేనని పొందే  అనుభవం ఒక  వ్యక్తిదే కానీ ,సాధన స్వరూపాన్నే మనకు 4మూర్తులుగా పరిచయం చేస్తున్నది ,రామాయణం. శరీరమే తను . శరీరానికి సంబంధించినవి తనవి . ఇదే జీవతత్వం . తాను శరీర మాత్రుడు కాదని, సృష్టి, దృష్టిలో ఉన్నా అనుభవానికి రావడం పరతత్వం . దృష్టిలో, సృష్టి కదలుతున్నా , మెలకువలో బుద్ధి పరతత్వంలో మేలుకొని సృష్టిలో కదలు తున్నదంతా పరమాత్ముని శక్తి మాత్రమే, అనే అనుసంధానాన్ని కొనసాగించి ,ప్రతి కదలికను జ్ఞానాగ్ని పునీత సీతగా గ్రహించి అష్ట సిద్ధి రూపంగా కలుగుతున్న భౌతిక ,ఆధ్యాత్మిక సంపదను మాయగా గుర్తెరిగి ,సాక్షాత్తుగా సీతా మహాదేవి ప్రసాదించిన మాల,అయినా,తన అంతరంగంలో శాంతికి ఏ మాత్రం భంగం కలగకుండా సాధనలోని ఏకాగ్రతను సడలనివ్వక ప్రతి క్షణంలో,రామపట్టాభిషేకాన్నిద్రుష్టి నుండి దూరం కానియక[అంతా పరమాత్మదే]అని,నిద్రలోనడిచే వ్యక్తిలా[భరతుడు] అవసరమైనంత వరకే ,సృష్టిలో చరిస్తూ,చేరే ,జీవన్ముక్త స్థితికి నిర్వచనమే,రామాయణం.ప్రతి అవతార గాధ, వివిధ,మానవ స్వభావాలకు,వివిధ మార్గాలను గమ్యాన్ని చేరడానికి నిర్దేసించినవి. ఎన్నో మానవ స్వభావాలకు వేరు,వేరుగా బోధ సాగడానికి అనువుగా పెద్దలు వివిధ దేవతా రూపాలుగా,తత్వాన్ని పరిచయం చేశారు .విద్యుచ్చక్తి అనేక ఉపకరణాలుగా , వినియోగించ బడినంతమాత్రాన,దాని ఏకత్వానికి ఏభంగం లేనట్లే ,అనేకదేవతారాధన అని అందరూ భావించేది,అవగాహనా రాహిత్యమే కానీ,నిజం కాదు .దీన్ని కూడా అవసరం లేని వారిని లోపలికి రానివ్వని కంచెలా , అర్హత లేని వారిని సాధనకు రాకుండా  కాపాడే మాయ మాత్రమే.
       ఆదివారంతో ప్రారంభిస్తాము వారాలని . ఆదిత్యుడు పరిపూర్ణ పరబ్రహ్మ తత్వంగా సంభావించారు పెద్దలు . 
అందువల్లనే ఇష్ట దేవతను సూర్యునిలో భావిస్తారు . సమయ పాలనలో ఆదిత్యుడే అగ్రగణ్యుడు . ఆయనరాకకంటే ముందే  లేచి చేతులు వినమ్రంగా ముడిచి అర్ఘ్య ప్రదానంతో ప్రారంభించే జీవనశైలి భారతతీయులది .గర్వించ దగిన భూమండలంలోని పూజగది మన భారత దేశం . పుజారిలా ఎవరికివారే సంపూర్ణ స్వాతంత్ర్యంతో నమస్కరించి , సూర్య నమస్కారాలతో  అందరూ సేవించే, పరమాత్మ స్వరూపం ఆదిత్యునిదే .నవగ్రహ పరమాత్మాంశలలో 'శ్రీ రాముడు' సూర్యుని పరమాత్మంశ. ఏ కష్టమైనా రాజుతో మొర పెట్టుకునే స్వాతంత్ర్యం ఉంటే ,పట్టాభిషేకంతో, రాముని మహారాజుగా మన శాస్త్రాలు పరిచయం  చేసాయి  . సర్వులూ ధనుర్ధారి అయిన శ్రీరాముని ప్రార్ధించి, తమ వెతలను విన్నవించడానికి వెనుకాడరనడానికి, ప్రతివీధిలో జరిగే సీతారామ కళ్యాణాలే సాక్ష్యం .రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు పెద్దలు . ఏది ధర్మం ? ప్రాధమికంగా సృష్టి అంతా పరమాత్మది .శరీరంతో సహా సకలము పరమాత్మదనే సంపూర్ణ అవగాహనే సంపూర్ణ శరణాగతి .ఈభావంనుండి మనసు   జారిపోనికుండా జీవన యాత్ర సాగించేవారికి శ్రీరాముడు  ధనుర్ధారి అయి వారిని రక్షిస్తాడు .జీవ భావంతో ఏది తనదిగా భావించినా శిక్షిస్తాడు . జ్ఞానేంద్రియాలు ,కర్మేంద్రియాలు మొత్తం పది ,ఇవి కలిగి ఉన్న తాను ప్రకృతిలో కనిపిస్తున్నది తనదిగా భావించినపుడు యుద్ధం ప్రారంభం అవుతుంది . ఒక పువ్వుని చూశాo అనుకుందాం . పరమాత్మ సృష్టికి ఆనందిస్తే కలిగేది ఆనందం .కానీ అది తను పెంచిన మొక్కది కనుక నాది .ఈ అవగాహన తప్పు .సృష్టిలో ఉన్న సూర్య రశ్మిని నీటిని,  బీజాన్ని ఇవన్నీపరమాత్మ ఇవ్వడం వలన, అది పువ్వు పూసింది .దాన్నిపెంచే తీరిక దొరికే జీవితం కూడా భగవంతుని  ప్రసాదమే . ఆత్మను ధర్మంతో ఎక్కుపెట్టిన బాణంలా ,గమ్యం చేరే వరకు ప్రయత్నించాలనే పరమ లక్ష్యంతో మొదటి అడుగు వెయ్యాలని 'ఆదివారం 'మన చెవిలో రహస్యంగా చెప్తోంది. 
           స ఉమా వారం ,సోమవారం .ఉమా శివులిద్దరూ, విడిగా కూడా ధరించి  నెలరాజును ,పొంగు కుంగు జీవితంలో   సహజమే ,అంటూ తమ విశ్వకుటుంబానికి తెలియజేస్తూనే ఉన్నారు . నవగ్రహాలలో చంద్రుని పరమాత్మాంశ 'శ్రీ కృష్ణుడు'. వెన్నదొంగ . యింద్రియాలన్నీ ఎవరూ చూడట్లేదనే ,ధైర్యంతో చేసే ప్రతి పని ,ఆలోచనా గమనించే సర్వసాక్షి . ఎవరికీ  దొరకకుండా ఉండాలంటే మరి రాత్రే కదా రావాలి . కృష్ణ జన్మాష్టమికి ,ఉట్టి కొట్టడానికి ఏ బంధనాలున్నాయి ?అందరివాడే పరమాత్మ.  నావాడే, అనే ధైర్యం ఉంటే కనురెప్ప కాడా కన్నయ్య ?ప్రతి భావం వెనుకా కృష్ణయ్యను పట్టుకునే గోపికగా మారితే,మనలోనే లేరా, పదారువేలమంది కన్యలు ?జీవితానికి అందమైన ఆధారం వేరే లేదని గుస గుస లాడింది సోమవారం
     మంగళుడంటేనే కుజుడు . ప్రహ్లాదుని రక్షించిన నరసింహునిలా, పరమాత్మను పరమ గమ్యంగా చూపే ఉగ్రమూర్తి . కుజునికి పరమాత్మంశ ,'నరసింహుడు' . ఎన్నో బాధలు పీడిస్తున్న ప్రహ్లాదుని వలె, కలిలో ఋణ ,రోగార్తులైన మనుజులకు బాహ్య అభ్యంతర సంధిలో ,మృగమవకుండా కాచి రక్షించి ,హిరణ్య కశిపుని స్థితి నుండి, సర్వే సర్వత్ర పరమాత్మ దర్శనం చేసే ప్రహ్లాదుని ,గమ్యంగా, పయనానికి సంసిద్ధం చేసే మంగళ వారాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే .కుమారస్వామి  మరో రూపం కుజుడు.అందువల్లనే మంగళవారం, సుబ్ర్హహ్మణ్య స్వామి ఆరాధనం శాస్త్ర సమ్మతం . కుమారస్వామి గుడిలో పూజలు ,కళ్యాణాలు అందుకుంటే ,సుబ్రహ్మణ్యుడు ,సర్వే సర్వత్ర ,అందరిచేత పుట్టలో పాలుపోయించుకుని అందరూతన వారనే తల్లి దండ్రుల,వారసత్వాన్ని, యిలకు తెచ్చి అందరివాడై ,భయ భక్తులు రెండూ అవసరమంటూ,అల్లరి పిల్లల ఆట కట్టే పద్ధతిని పరిచయంచేస్తుంది మంగళవారం . భయ పెట్టి మరీ భగవంతుని చేర్చే లక్ష్య సాధనను చెవి మెలి పెట్టి మరీ చెప్తుంది మంగళవారం.
      ధీ యో యో నః ప్రచోదయాత్ .ఒకేఒక ఆకాంక్ష .మానవ జన్మ సార్ధకతకు చిన్న ఆశ .అంకురం .ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే . బుద్ధి ప్రచోదనం వల్లనే భగవంతుని విశ్వరూప సందర్శనం సాధ్యం . అదికూడా ఎప్పుడో కాదు ఇప్పుడే ,ఇక్కడే అంటుంది బుధవారం . విష్ణువు వర్తమానానికి ,ఆకాశ తత్వానికి ప్రతీక,వ్యాపకత్వం .ఈ క్షణం వర్తమానం . ఇదే పరమార్ధం, విష్ణువు అధి దైవతంగా కలిగిన బుధవారం చేసే బోధ .బుద్ధిని ఏకాగ్రంచేసి వర్తమాన క్షణంలో, శరీర పర్యంతం కాని, ఉనికిలో మునకవేయ్యమనే 'బుద్ధుడు',బుధవారపు పరమాత్మంశ .పుట్టుకకు కారణమైన పాప పుణ్యాల చిట్టావిప్పిదిగులు పడకుండా విష్ణువు పాదాలు పట్టమనే ప్రబోధం ,బుద్ధుడుకాక ఎవరివ్వగలరు ?తారా,చంద్రుల కుమారుడుగా బుధుడు పేర్కొన బడ్డాడు.  గురుపత్ని అనగానే పురాణకధను ,పక్కదారి పట్టించకుండా ,అర్ధం చేసుకుంటే ,పత్ని అంటే శక్తి . గురువుగారి శక్తిని ,తార అన్నారు . అంటే ,శిష్యుడికి అర్ధమైన గురు శక్తి , నక్షత్రమంత మాత్రమే .మినుకు ,మినుకుమని ఎంత కాంతి శిష్యుని వరకు చేరుతుందో, అదే సంపూర్ణమనుకుని మధ్యలోనే ,తనంతతానుగాపరిపూర్ణతను ఆపాదించుకునే ,చంద్రుని వంటి  శిష్యులకు కలిగిన భావావేశం ,ఉపదేశాలకు తావిస్తే కలిగే అనర్ధాలకు ఎవరు బాధ్యత వహించే వారు ?ఇటువంటి భావోద్వేగాలే ,చంద్రుని వృద్ధి క్షయాలకు, ఒక కారణం కావచ్చు . కారణం ఏదైనా బుద్ధి వికల్పానికి గురైతే కలిగే విపరీతాలకు సంకేతమే బుధుని జననం .వీరి బారిన పడినవారికి  ఏకైకమార్గంవిష్ణువుకు పరిపూర్ణ శరణాగతులవడమే . తస్మాత్ జాగ్రత అని బోధించి , గురువు దరి చేర్చేదే మంచి బుధవారం .అంతేకాదు వర్తమానానికి గుర్తుగా అటు మూడు రోజులు ఇటుమూడురోజులు కలిగి మధ్యలో ఉంది బుధవారం.గురువును చూపించి,వారి బోధను సంపూర్ణంగా గ్రహించమని,గోల చేసి వినమంది బుధవారం.
       శ్రీ గురుభ్యో నమః . నిస్వార్ధ గురువు ,బృహస్పతి . గురువారం వీరికే ప్రత్యేకం . ఆదిగురువు దక్షిణా మూర్తి ,విష్ణు రూపంగా హయగ్రీవ మూర్తి ,దేవీ రూపంలో సరస్వతిని ,అందరూ ఆరాధిస్తారు .గురువారానికి అధిపతి బృహస్పతి . అందు వల్లనే బృహస్పతివారం కూడా.గురువుకు పరమాత్మంశ 'వామన మూర్తి'.నిస్వార్ధానికి గుర్తుగా, చెయ్యి చాపి అర్ధించే మూర్తి వామన మూర్తి . సకలమూ తానైన విష్ణు రూపునికి ,దయ తప్ప వేరే కారణం లేదు చెయ్యి జాపడానికి . తాను అంతరంలో క్రీడించే క్రీడలో,తానే పాత్రధారిగా వామనావతారాన్ని గ్రహించ వచ్చు.ఉదాహరణకి,అంతర ప్రపంచంలో చూస్తున్న, వింటున్న ప్రతిదానికి,ఏ విధమైన పాంచ భౌతిక వస్తు సముదాయము అంతరంలో లేదు.కానీ ప్రతివారి ప్రపంచము అదే.అంతరప్రపంచానికి ఏ విధంగా తానే ఆధారమో ,అలానే దృశ్య ప్రపంచం పరమాత్మ అంతరంలోనిదే . అతడే ఆధారం . ఈ పరమార్ధాన్ని తెలిపే కౌపీనధారి అయిన పరమాత్మ ,అతని ప్రపంచాన్ని తమదిగా భ్రమిస్తున్న మానవాళికి ,'అహం'అని వారు భావిస్తున్న, అహం తనదని , వారి అహంతను అణగ ద్రొక్కి [బలి ]తీసుకుని ,బాహ్యంతరాలు తానై వెలిగే ,ప్రస్థానానికి గురువు అనుగ్రహంతో కదలమని శాసిస్తున్న, శాసనాన్ని మౌనంగా విందాం .
          గురువు శాసనాన్ని మనసా, వాచా, కర్మణా, అనుసరించే వారికి కలిగే శుభ సూచకమే ,శుక్రవారము .64 కళలు శుక్రుని అనుగ్రహంతో ప్రాప్తిస్తాయని పెద్దల వాక్కు . భగవంతుడు తన స్వరూపాన్ని ,వైభవాన్ని తెలిపే, ఒక నాటకాన్ని ,ఈ విశ్వమనే చిత్రంగా భావిస్తే ,భగవంతుని పురుషునిగాను ,శక్తిని స్త్రీ గాను భావిస్తే,శరీరం ఆధారంగానే శక్తి ప్రకటించ బడుతుంది. అలాగే వాక్కు శరీరం ద్వారా ప్రకటించ బడుతుంది .అందువల్లనే జప ,హోమ,వేద ప్రతిపాదితమైన సకల శాస్త్రాలు,పురుషుడే పఠించాలానే వాదం ప్రకటించబడి ఉండవచ్చు .బహుశా స్త్రీలు చదవరాదనే దానికి ఇది ఆధారమై ఉండవచ్చు .అన్ని కళలను ఈ విధంగా అర్ధం చేసుకుంటే భగవంతుని శక్తి ప్రకటించబడిన రీతిగా ,మానవులు మాత్రమే కళ ద్వారా తమను తాము వ్యక్త పరచు కుంటారు . సృష్టికి వ్యక్తీకరణ మాత్రమే ఆధారం . అవ్యక్తమైనది వ్యక్తమైతే కలిగేదే ఆనందం.ఆనందానికి అలంకారమే సంకేతం .అలంకార ప్రియుడు శ్రీ మహా విష్ణువు . ఆయన పత్ని శ్రీ మహా లక్ష్మి ,శుక్రవారపు అధి దేవత .భ్రుగు పుత్రిక .ఈ వారం . భ్రుగు వారం . ఈ వారానికి పరమాత్మంశ 'పరశు రాముడు' .పైన తెలిపిన విధంగా గురుబోధను గ్రహించి సకలమూ పరమాత్మదని , తాము పాత్ర ధారులమనే కళా కోవిదులకు ,పరశు రాముడు తన శక్తిని కూడా రాముని కిచ్చిన విధంగా ప్రసాదిస్తాడు .సృష్టిలోనిదంతా తమదనే ,అజ్ఞానాన్ని ,తమ రాజసంగా ప్రకటించాలనకుంటే, పరశువుతో,ప్రహారం చేసి,రాజస భావాన్ని వదిలేలా ఎన్ని సార్లైనా [21]ప్రహారం చేస్తాడు.ఏదైనా దానం చెయ్యాలనుకునే బలి వంటివారికి ,రాజసం శుక్రునిలా అడ్డు పడుతూనే ఉంటుంది . అలాంటి శుక్రునికి అజ్ఞానమనే కంటి చూపు పోగొట్టి ,త్రి విక్రముడై ,సకలమూ తానేనని తెలిపిన శ్రీ మహా విష్ణువు ,పరశు రామునిగా అనుగ్రహిస్తాడని శుక్రవారం తన ఆశీర్వాదాన్ని, సున్నితంగా వినిపిస్తోంది .
        సూర్యుని కుమారుడు శనైశ్చరుడు . ఈ పేరుతో ఉన్నదే శనివారం . సూర్య నారాయణ మూర్తి ,తెలిపే ఎన్నో విషయాలు,నెమ్మదిగా జీవితంలో అనుసంధానం చేస్తూ నారాయణుని చేరాలనే ఉత్సాహం కలవారిని ప్రోత్సహిస్తూ,లేనివారికి దండ ధరుడై ,దండిస్తూ,ప్రక్కనే ఉన్న భాను వారం వైపు నడిపిస్తాడు.భానుడు తూర్పు వైపు ఉదయిస్తే,పడమర వైపు చూస్తూ భగవంతుని నియతిని ఎదిరించే [ఎదురుతిరిగే వారిని ]గుర్తించి ,వారి పురాకృత పాపాల ఫలితమైన దుఃఖాన్ని వారికి గుర్తు చేసి ,కర్మ ఫలాలను అందించే కరుణా మూర్తి . పిల్లలను గదమాయించైనా సన్మార్గంలో పెట్టే పెద్దన్నగారిని గుర్తించి ,తండ్రి మాటను అమలు చెయ్యమని గుచ్చి ,గుచ్చి చెబుతోంది శనివారం . శనివారానికి పరమాత్మంశ 'ఆది వరాహ మూర్తి '. యజ్ఞ వరాహ మూర్తి .యజ్నమంటే కర్మ. శ్రద్ధగా కర్మాచరణ చెయ్యమంటుందిశనివారం .[అలసత్వాన్ని క్షమించడు శని] భూ వరాహమూర్తి కదా స్వామి .సముద్ర జలాల్లో మునిగిన భూమిని ధరించి తెచ్చి,యజ్ఞ కల్పనకు అందించిన వరహముర్తి. పురాక్రుతమైన పుణ్య ,పాపాలకు అనువైన శరీరాన్నిచ్చి ,శరీరం వదిలి ,మరో శరీరం కోసం అలమటించే జీవులను ఉద్ధరించి శరీరమనే ,భూమిని ,దారి తెలియక అగమ్యంగా తిరిగే సముద్రం నుండి ఉద్ధరించి ,కర్మాధికారం ప్రసాదించిన గోవిందునికి నమస్కారం . యజ్ఞ ఫలంగా ,పరమాత్మ తాననే సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు ,ప్రతిజన్మలో తోడుండి ,మానవ కర్తవ్యాన్ని సక్రమంగా పూర్తి చెయ్యమని శాసిస్తోంది శనివారం . అన్నగారి మాట చెవిన పెట్టాలి కదా .
భద్రం కర్ణేతి  శృణు యామ దేవాః . అనేది మొదటి శ్రుతి వాక్యం . బాహ్యం కంటే నిజానికి అంతరంగమే ఎక్కువగా
వ్యక్తులు వింటారు.ఎప్పుడూ పరమాత్మ విషయాలు వినడానికి ,బాహ్యానికంటే అంతరంగమే సరిఅయిన వేదిక. బాహ్యమైతే ఉపద్రవాలు కలగవచ్చు . అంతరం మౌనానికైన ,మాటకైనా సిద్ధంగా ఉంటుంది,సంస్కరించబడి ,సాధన చేస్తే . కుమారునికి , గర్భాదష్టమంలో,ఉపనయనంలో,తండ్రి,గురూపదేశమైన గాయత్రీ మంత్రాన్నివినిపిస్తాడు.ఉపదేశం అంటే సమీపంలో కూర్చుని అతనికి మాత్రమే,వినిపించేలా చేసేది,అనికదా అర్ధం. ఇది బాహ్యోపదేశానికే కాదు.ఈ సూచన నిజానికి అంతరానికే ,ఎక్కువ అనుసంధానమౌతుంది .అంతరానికే వేరే ఏమీ వినకుండా ఉపదిష్ట  మంత్రాన్ని వినే శక్తి ఉంది. అందువలన ,భగవత్ సంబంధ విషయాలను వినడం ఈ వయసు నుండి మనసుకు నేర్పించడం వేదవిధి .అందువల్లనే ధృవుడైనా,ప్రహ్లాదుడైనా అతి త్వరలో పరమాత్మ సాక్షాత్కారం పొందినట్లు గమనించవచ్చు .జీవుడు సనాతనుడైతే ,ప్రతిజన్మ ,పరమాత్మ ప్రస్థానంలో ఆరోహణలో భాగమే . దానికి మనో నియంత్రణతో కూడిన నిబద్ధతను అందించడం తల్లి దండ్రుల ప్రాధమిక కర్తవ్యం. మననం చేయడం వలన తరింప జేసేదే మంత్రము.మననంలో వినడమే ప్రాధాన్యం వహిస్తుంది .అనడంకన్నాప్రభావంతో  మనసును అదుపులో ఉంచడానికి వినడమే ప్రధానం .నాదానికి మనసును వశం చేసుకునే శక్తి ఉండడం వలననేసంగీతజ్నులు, మనోనియంత్రణకు నాదాన్ని వినడమే సాధనగా సాగించారు. పాడుతున్న వారు ,తమ పాట తాము వినడంలోనాద మయులౌతారు . అంటే తన్మయులౌతారు.వింటే కలిగే తన్మయం పాడడం మీదకు దృష్టి మళ్ళినపుడు ఏకాగ్రతగా సాధన స్వరూపంగా మారుతుంది . వింటే ఆనందంగా ఇంద్రియాతీత స్థితినిస్తుంది . క్షణాలలో మనసు రెంటినీ మార్చడం వలన కలిగే అనుభూతి ఆనందంగా మాత్రమే అనుభూతమౌతుంది . శ్రవణానికి కూడా ,శ్వాస పై ధ్యాస ఎలా పరమాత్మను చేరుస్తుందో అంతే శక్తి ఉంది . అందువలన రామ నామమైనా హృదయంలో వింటే ,ఈ సాధన సాక్షిత్వాన్నిస్తుంది .అందువలన బాల్యంలో పిల్లలకు వినే నేర్పును పరిచయం చేస్తే వారి భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది . వినడం వలన వివేచనా జ్ఞానం పెరుగు తుంది . సారభూతమైన మంచిని స్వీకరించే శక్తి మెరుగౌతుంది . 
         ఏ తల్లి దండ్రులైనా పిల్లల బాగుకన్నా కోరేదేమి లేదు . కానీ బాగు శరీర పర్యంతమా ,శరీరిక్కూడా అవసరమా ? జీవభావం వదలలేదు కనుకనే శరీరం ప్రాప్తించింది .అది వదిలే లోపే ఉద్ధరణ అవసరం . శతం జీవతి . కానీ ఉద్ధరణ మాత్రం ఎప్పుడు ప్రారంభమో శాస్త్రం నిర్దేసించింది.ఎనిమిది సం/.బాహ్యంతర వివేకం మొదలవుతుందని సూచనగా మననానికి మంత్రాన్నిపరిచయం చేసింది . మంత్ర మిచ్చి చేతులు దులుపుకోమనలేదు . చర్విత చర్వణంగా పరమాత్మ సంబంధిత విషయాలను ధారా పాతంగా వినిపించే బాధ్యత పెద్దలు స్వీకరించి,తాము తమను ఉద్ధరించుకుని ,పిల్లలకు సహకరించడం కర్తవ్యం.గృహస్థాశ్రమం స్వీకరించేదే,తాము తరిస్తూ,తరించడానికై ఎదురుచూస్తున్నజీవులకు శరీర దానమే ప్రధమ లక్షణంగా గ్రహించాలి . అంతేకాని శరీర సుఖం పరిధిగా గృహస్తాశ్రమం విధించ బడలేదు . వధూ వరులకు బాల్యంనుండి భగవత్ ప్రాప్తి లక్ష్యంగా జీవన విధానాన్ని సంస్కరించి ,వారి ఇంద్రియాలు వారు చెప్పినట్లు వినేలా నేర్పి ,వారికి వివాహంతో ,సంతాన సంరక్షణే ధ్యేయంగా జీవించే ప్రాధమిక సూత్రాన్ని అవగాహనకు అందేలా చేసేదే ,వైదిక జీవన విధానం .ఏకాగ్రత అవసరమైన క్షణంలోమనసు,అన్నిఇంద్రియాలను నిగ్రహించి,తనలోతాను లక్ష్యసాధనలో మునిగే,ఈ అచంచల స్థితి,ఆ శ్రీకూర్మనా ధునిదే. ఈ పరిచయం కోసమే ,ఉపదేశం . పిల్లల మనసుకు దగ్గరగా పెద్దల మనసు దిగివచ్చి వారికి చప్పే ప్రతి మాట ఉపదేశమే . దీనిని మరిచే కన్నా ,సంతానానికి చేసే వేరే అపకారమేది లేదు . ఇదే పెద్దలు,పిల్లల కిచ్చే నిజమైన ఆస్థి . అస్థికల కంటేలా ఏకాగ్రత  ఎంత ఆవశ్యకమో ,తెలియజేసి ,భుక్తి పరిధికి ఎంత వరకు అవసరమో అంతే విలువ,విదేశీయులు అంటగట్టిన చదువుకిచ్చి ,పరమ గమ్యాన్ని కూడా నొక్కి వక్కాణించాలి .  'శ్రీ రామాయ  నమః.'. వాక్కు పలికే మానవ శరీరం కలిగి ఉన్న వారెవరైనా పలకవచ్చని ,సాక్షాత్తుగా బోయవానిచేత పలికించిన మంత్రం ,నేర్పే ఓర్పు ,నేర్పు ఉండాలేగాని కులాలు అడ్డు వస్తాయా ?  ధర్మవ్యాధునికన్నా ఎక్కువ ధర్మాన్ని , అధర్మంగా ఎవరినో చూసి చెయ్యనక్కరలేదు . మనసును సరి పెట్టే ,మిషతో అధర్మాన్ని గెలిపించ వద్దని పిల్లలకు , నేర్పే తల్లి దండ్రులు ధన్యులు .            
               సంస్కృతీ, సంప్రదాయా లంటేనే ధర్మ ప్రతిపాదన.సంస్కరించ బడితేనే సాంప్రదాయం ఆవిష్కరింప బడుతుంది. సంస్కారం సంప్రదాయమైతే,సాంప్రదాయం సంస్కృతిగా మారుతుంది.సంస్కరించు కోవడానికి ఆధార బిందువే నేను. ఎలా?నేను తానై ,పరకాయ ప్రవేశం చేస్తే సాధ్యం. ఎదుటివారి స్థానంలో మానసికంగా ప్రవేశించి,తాను,తను మాట్లాడే మాటలువింటే ఎటువంటి సంతోషం,లేదా బాధ,కోపం ఏ భావాన్నిపొందుతారోగమనించి[వాడే ప్రతిమాట,వాక్కుతో,][భావం మనసుతో,][శరీరంతో అవ్యగ్రత]కలిగితేదాన్ని మాత్రమే ప్రపంచంలో కలిగి ఉంటే,ఎదుటివారికి,అలాగే తనకు న్యాయ బద్ధమైన ధర్మానికి సంస్కరణ ప్రారంభంఅవుతుంది.సాక్షిగా ధర్మాన్ని ప్రతిపాదిస్తే అందులో న్యాయం లోపిస్తుంది.అనుభవ శూన్య మైనధర్మబోధకుటుంబానికి,తమవంతుఅన్యాయాన్నిఅందించినట్లౌతుంది.ఒకపాటగురించిఆలోచిద్దాం.ఉదా:పనిలోపాటపాడుతూశ్రమనిమరచిపోడానికి,ఒకరుజానపదంలోని దైవసంబంధితంగాని,వ్యంగంగాని,ఎత్తిపొడుపు కానీ,స్త్రీ,పురుషుల సల్లాపాలు కానీ ఏదోఒకటి పాడుతూ ఉంటారు.దీంట్లో కూడా మనిషి,మనిషికి భావ ప్రాధాన్యం మారిపోతూ ఉంటుంది. నెమ్మదిగా భజనకు తావిచ్చి భగవత్తత్వానికి చేరువై కొద్దిమంది వారి శైలి మార్చుకుంటారు. కానీ ఒక శాతం కూడా కష్టమే. కానీ అవకాశమే లేదు అనలేము. కానీ ఎన్నో తరాలుగా సంగీతంలో రమించి తరించిన కుటుంబాలు పూర్వపు తరాల్లో ఎక్కువే.వారింట పుట్టి ,పెద్దగా పెద్దలమాట వినక, సాధనచేయ్యక,తమోగుణం వలన జానపదులైనా  తరించే సంగీతం తో తరిస్తానని పలకవచ్చు. తమోగుణం తో దేన్నైనా సాధించడం అసాధ్యం. పరమాత్మ ప్రసాదించిన ,జన్మించిన కుటుంబానికి వన్నె తెచ్చేలా బ్రతికితే దాన్ని దైవం పట్ల కృతజ్ఞత అని,ధర్మం అనీ అనుకోవచ్చు. తమ అనుకూలత మాత్రమే ప్రధానం ఐతే ధర్మం పట్ల అన్యాయమే.మానవులు తమకి జరిగే అన్యాయానికి కోర్టులో న్యాయాన్ని ప్రశ్నించవచ్చు. కానీ మానవ హృదయమే న్యాయ స్థానంగా ఉన్న ధర్మం ప్రశ్నించేది ఎక్కడ ? ఎన్నో సందర్భాలు జీవితంలో తారస పడినపుడు, భగవంతుడు ప్రసాదించిన ,దేశ,కాల,కుల,కుటుంబ నేపధ్యానికి తగిన జీవితవిధానం ,గుణ ప్రతిపాదన లేని ధర్మ కర్మాచరణ న్యాయాన్ని ప్రసాదిస్తే 'ధర్మో రక్షతి రక్షితః 'అనేది అందరికీ అనుసంధానమౌతుంది.
     మన సంప్రదాయం వేద ప్రతి పాదనం.  దీనికి ఆధారం మన శాస్త్రాలే. మౌలికంగా వ్యక్తిత్వ ప్రధానంగా చూస్తే
రామాయణాన్ని దీనికి ప్రాతిపదికగా తీసుకోవచ్చును. మనం ధర్మప్రధానంగానే ఎవరికైనా ప్రాధాన్యత నిస్తాము. పొగిడినా,తెగిడినా అదే ఆధారం.వేరే దేన్నైనా ఆధారంగా గ్రహిస్తే ,దానికి గుణమే ప్రాధాన్యం వహిస్తుంది.కానీ గుణం ప్రధాన్యత వహిస్తే ,మనకున్న అరిషడ్వర్గాలు బలపడతాయి,అంతేకాని మనకున్న  షడ్గుణైశ్వర్యాలు బలపడవు.
      నిజానికి గుణాధారంగా భగవంతుడు ఏర్పాటుచేసిన వ్యవస్థ మాత్రమే,కుల వ్యవస్థ. పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ,ఎవరి పుట్టిన తేది ,చోటు ,వీటి ప్రధానంగా అనుసంధానం అవుతాయో,అలానే గుణ ప్రధానంగా మాత్రమే వర్ణవ్యవస్థలో,జన్మ సంభవిస్తుంది.ఇవి భౌతిక సూత్రాలకు అందవు. రసాయన శాస్త్రం,విద్యుత్తూ ఇలాంటి ఎన్నో విషయాల్లో , అవి అలా ఉన్నాయి ,అని తెలుసుకో వలసిందే తప్ప,అవి అలా ఎందుకున్నాయి?అని ప్రశ్నించడం వీలుకాదు. అటువంటి విశ్లేషణకు అందనిదే వర్ణ వ్యవస్థ.
          శ్రీరాముడు సంపూర్ణ పరబ్రహ్మమే అయినా,అవతార ప్రయోజనం,రాక్షస సంహారం కనుక,రజోగుణ ప్రధాన మైనక్షత్రియ వంశంలోజన్మించి గురువుగా వసిష్టుని స్వీకరించి అందరికీ మార్గ దర్శకుడైనాడు.'బ్రాహ్మణుడైనా,పరి- పూర్ణమైన పరబ్రహ్మమైన,నాకంటే వసిస్టుడు ఎలా గొప్పవాడు?'అని ప్రశ్నించ లేదు.అలాగే ఎన్నో అస్త్ర ,శస్త్ర విద్య లిచ్చిన,విశ్వామిత్రుని, నీవు కూడా క్షత్రియ గుణాలు కలిగి ఉన్నావు కనుక,నీవు,నేను సమానమే. అని అతనిని, సమానత్వం ముసుగులో ,కించ పరచలేదు.విశ్వామిత్రునితో యాగ సంరక్షణకు వెళ్ళినా ,మా నాన్న కన్నా మేమే అర్హులము ,అని విర్రవీగ లేదు.
      పరంపర ముసుగులో,మానాన్నకు ముగ్గురు భార్యలైతే ,నాకు ఆరుగురు అనలేదు.తండ్రి ఇచ్చిన మాటకు, తల్లి చేతిలో , తండ్రి కీలు బొమ్మ ,అనలేదు. ప్రధమ సంతానానికే రాజ్యం ,ఇది పూర్వీకుల ఆస్థి, దీనిని నీకు దానం చేసే హక్కు లేదని , న్యాయ వ్యస్థను అడ్డు పెట్టుకోలేదు.అడివికి పోయినా ప్రైవసీ లేదని,లక్ష్మణుని పై గొణగలేదు. ఒక సారి, శబరి పెట్టిన పళ్ళను తిన్న స్వామి, ఎవరు ఏమి పెట్టినా,ఎంగిలి ,సంగిలి లేకుండా, అన్ని వర్గాలవారు, అలానే అన్ని వర్ణాలవారు ,ఏక పంక్తి భోజనాలు ,చేస్తేనే సమానత్వం కాపాడ బడుతుందని ,దండోరా పీకలేదు. అలా చెయ్యని వారంతా ,సంఘ ద్రోహులని ప్రకటించలేదు. అల సముద్రం కన్నా వేరుకాదు కనుక ,అలలకు పెద్దా చిన్నా బేధం లేదుకనుక,అంతా సమానం అని బోధ , చెయ్యక, ఎవరి వ్యవస్థ వారికి నేర్పిన కట్టుబాట్లు వారు, పాటించడం వలన ,రామరాజ్యం సుసంపన్నం అయింది.అంతేకాదు అరణ్యవాస సమయంలో,తండ్రి ఇవ్వక పోయినా,తాను సంపాదించ గలనని,వారిని నిందిస్తూ,వేరే సామ్రాజ్య స్థాపన చెయ్యలేదు. అందుకుగాను,జనకుడు, మీనాన్నకు చేతకాక పోయినా నీకు నేనున్నానని మర్యాద అతిక్రమించ లేదు. సీతాదేవి మీనాన్న చూసారా మనకు ఎంత అన్యాయం చేశారో అని భర్తకు నూరి పోయ్యలేదు. ఎవరి పరిధి వారు అతిక్రమించ లేదు.
    నావికుడైనా,ఈతగాడైనా అలలను పట్టించుకోకుండా గమ్యానికి చేరడానికి ప్రయత్నిస్తాడే కానీ,చిన్న , పెద్ద అని లెక్కలు పెడుతూ ఉండడు కదా.గుహుడి జీవన విధానమే పడవ నడపడంకానీ,ప్రయాణిస్తున్ననావలో ప్రయాణానికి, తన నావను ఎంచుకున్న పరభ్రహ్మాన్ని గుర్తు పట్టినందువలన తరించాడు.మానవుని ప్రయాణ సాధనం శరీరం ,ప్రయాణిస్తున్న పరబ్రహ్మాన్ని గుర్తు పట్టడమే గమ్యం. దీనికి అతని జన్మ,కర్మలతో సంబంధం లేదు . వీటికోసం వాదులాట కన్నా ,లక్ష్యం పట్ల ప్రీతితొ కూడిన అవగాహన ముఖ్యం.
     హనుమంతుడు, రామబ్రహ్మాన్ని చేరే దిశా నిర్దేశంలో,భక్తి రూపమైన సీతమ్మను రామునికి చేర్చడానికి పడిన తాపత్రయం మనకు తెలిసిందే. మనొరూపమైన వాయుపుత్రుడు ,చలించడమే ప్రధానంగా కలవాడు ,దాన్నే సాధనగా మార్చినవైనం ,మనకున్న ఏ జన్మ లక్షణ మైనా,సాధనకు వాడుకోడానికి ప్రేరేపిస్తుంది. అందువల్లనే దశావతారాలు క్రోధ,లోభ స్వరూపమైన విధానాలు కూడా పరమాత్మను చేర్చిన విధానం, అనుసరణీయం కాకున్నా ఆలోచనకు తావిస్తాయి.కానీ సత్వ ప్రధానమైన భక్తి ,జ్ఞాన,వైరాగ్యాల సమ్మేళనం,వలన కలిగే జీవన్ముక్తికి పరమేశ్వ  రానుగ్రహం తోడవుతుంది. పై విధానంలోని ,క్రోధాన్ని ఆయుధంగా వాడితే ,ప్రతిగా స్వామికూడా ఆగ్రహాన్నే చూపినపుడు మనకు కనీసం అర్ధం కూడా కాదు.ప్రతి దానికి శాస్త్రం అడ్డదారి వద్దని,సరళ మైన దారిలోపయనాన్ని, ప్రోత్సహిస్తుంది.పరమ ప్రశాంతమైన జీవన్ముక్త స్థితికి,నిర్మలమైన సత్వమే కదా కారణం. ఆగ్రహాన్ని కూడా అను గ్రహంగా చూసే నేర్పు ,జీవన్ముక్త స్థితి మాత్రమే ఇవ్వగలదు.
         ఏదైనా మన పరిస్థితిని బట్టి ప్రయాణం సాగాలేకాని,మనకు అనుగుణంగా లేని విధానాలను ,ఎవరినో చూసి గ్రహించడం అంత అనువైనది కాదు. వాతావరణానికి అనువుగా వస్త్రాలంకరణ ఉండడం సహజం. అంతేకాదు ఉండే పరిసరాలు,జీవన విధానము,వయసు ఇలా ఎన్నో పరిమితులు మనను శాసిస్తాయి.వేటినీ మనము బంధనాలుగా భావించము. చాలా సహజంగా ప్రవర్తిస్తాము. కానీ తమకు ఏది ధర్మ బద్ధంగా విధించబడిందో దానినివదలి వేరే విధానాలను అనుసరించడం,ఆధ్యాత్మికతకు అంతగా సహకరించదని తెలిసినా,కొందరు 'అన్నప్రాసన రోజే ఆవకాయ'అన్న చందంగా సాధన అనే అంశాన్ని ప్రక్కన పెట్టి సర్వే సర్వత్ర వినిపించే 'అంతా బ్రహ్మ మయం 'అని తమను తాము మభ్య పెట్టుకుని సాధనకు న్యాయం చెయ్యలేక పోతున్నారు. దీనివలన ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించిన వ్యక్తి ,అదే చదువుతో ఎంతో ఉన్నత స్థాయిలోఉన్న పై అధికారికి అంత జీతమెందుకు అని ప్రశ్నిస్తే , సమాధానం,సాధన,దానికి పట్టిన సమయాన్ని గుర్తు పట్టలేదని,వెంటనే గుర్తిస్తాము. దీన్ని గుర్తించడం సులువే. కానీ జీవత్వం నుండి పరతత్వాన్ని చేరే సాధన పూర్తి అయిందని, తనను తాను ,మభ్యపెట్టుకోకుండా పయనించడానికి త్రిపుటిని గమనించడం అనే సాధన ఉపకరిస్తుంది. ఇది బాహ్య పటాటోపం లేని అంతర సాధన. ఏ పనీ ప్రతి బంధకం కాదు. ఈ సాధన గమ్యాన్ని సుస్పష్టంగా,సాక్షి తత్వాన్ని ధృఢ పరచి సహకరిస్తుంది. కొందరికి కొన్ని సాధనా విధానాలు ప్రశస్తం కావచ్చు,కానీ అందరికీ  అన్వయం కాకపోవచ్చు. అవగాహనకు తగిన భగవద్విషయాలను,ఆచారవ్యవహారాలను మాత్రమే  అందించాలి.
       మతమార్పిడులు ఎంత అసహజంగా వ్యాపిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ప్రలోభాలకు గురి చేసి , చేసే మతమార్పిడి తల్లి దండ్రులకు తెలియకుండా వారిని విమర్శించి,పిల్లలను దారి మళ్ళించడం లాంటిదే. సృష్టిలో అన్నిటికీ పరిమితులున్నాయి. వాటిని గౌరవించడం మన కర్తవ్యం. అలాగే ఏ అంతస్థుకు,ఎవరి అవగాహనకు వారిని ప్రేరేపించాలి తప్ప,మన విధానాలే ఎంతో గొప్పవని ,మిగిలినవన్నీ పనికిమాలినవని ,వాటిని పాటించడం వ్యర్ధమని వారిని కించపరచడం , మన అవగాహనా లోపాన్నే తెలియ జేస్తుంది. భగవంతుని చేర్చే ఎన్నో సోపానాలున్నాయి.ఏదీ  ఎక్కువ,మరొకటి తక్కువ అయ్యే అవకాశమే లేదు.మధ్యలో ఆలయం ఉంది అనుకుందాం. నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి. తూర్పు వైపుగా వచ్చే వారికి,పడమరలో వచ్చేవారు కనపడరు. అంతమాత్రాన వారి దారి తప్పని చెప్పే అధికారం మనకు లేదు. అందరూ పరమాత్మను దర్శించ గలరనేది నిర్వివాదాంశం. దీన్ని అవగాహన చేసుకున్న ఏ కులమైనా,ఏ మతమైనా మిగిలినవారిని కించ పరిచే విధానాన్ని అవలంబించదు.
        నిజానికి వేరేవారెవరైనా మన మతాన్నిఅవలింబించాలానే ప్రకృతికి ఆధారం అహం మాత్రమే.దీనిని నిర్జించడమే మత ప్రయోజనం. మౌలిక ప్రాతిపదిక లేనిదే ,మత మార్పిడిగానీ,లేదా యుద్ధంతో మతస్థాపన గానీ ,ఆలోచనా రాహిత్యాన్ని సూచిస్తుంది. ఇది కీచక విధానమే గాని,దీనికి ధర్మం ప్రాతిపదిక అనడానికి ఆధారం లేదు. ఎవరు ఏ విధానంలో సాగినా పరమాత్మను చేరతారనే,ప్రాధమిక సూత్రాన్ని విస్మరిస్తే,ఆయా మతాలు,పరస్పరాధారమైన మానవత్వానికి ఏ విలువ నిచ్చాయో ప్రశ్నార్ధకమే. మన బిడ్డను చాక్లెట్ చూపించి ఎవరైనా రోజూ పిలిచి, చివరకు వారిని తమ కనుకూలంగా మార్చుకుంటే,దానిని మనము,ఏ రకంగా సమర్ధిస్తాము?హిందూ సమాజంలో నిమ్న వర్గాలున్నట్లే,అన్నిమతాలలోను అణచివేయబడ్డారని సూచించే,అదే మతస్తులకు సంబంధించిన వారికి కొరతేమి లేదు. వారి ఉద్ధరణకు ఎంతో కృషి అవసరం. దాన్ని వదలి మత మార్పిడులకు ప్రయత్నించడం,హాస్యాస్పదం.      వర్గ విబేధాలను హిందూ ధర్మానికి లోపంగా చూపించే మతాలలో,విబేధాలే లేవా ?వాటిని వారుకూడా అధిగమించ లేదనేది ,నిర్వివాదాంశం. పేరు బేధమేగాని, వివాదాలు అన్ని మతాలలోను సమానమే. సమానత్వం ఇక్కడ మాత్రం ఎవరూ అధిగమించలేరు. మత మార్పిడికి ,అమాయకత్వం, లేమి,కారణమేగాని వేరే ఆధారమేమి లేదు. వీటిని వాడుకుని చేసే మత ప్రచారం,వారి విధానాలను చెప్పకనే చెబుతుంది.
         హిందూ విధానంలో గుణ,కర్మ విభాగం మాత్రమే వర్ణ వ్యవస్థకు ప్రాతిపదిక. మాథ్స్ బాగా చేసేవారు ,దానికి సంబంధించిన ఉద్యోగాలను ఆశ్రయించి జీవనం నడిపినట్లే,ఎవరి అర్హత ననుసరించి,వారి జీవన విధానం ఉంటుంది. కానీ ఒకే రకమైన విద్య అభ్యసించినంత మాత్రాన వారి జీవితాలు, ఒకేలా ఉన్నాయనుకోవడం, ఏరకంగానూ సరి అయినది కాదు, వివిధమైన చదువులు ,వేరే వేరే గమ్యాలను నిర్దేశిస్తాయి. అన్ని గమ్యాలలోను హెచ్చు,తగ్గులు సామాన్యం.ఇంతే సహజమైనది హిందూవర్ణ వ్యవస్థ.దీనికి వైషమ్యాలను,ఇతర మతాలు జోడించాయే తప్ప,నిజాలు స్వల్పం. ఆర్ధిక పరమైన అంశాలు మానవులను విభాగించినంత మాత్రాన,మానవత్వానికే మాత్రమూ భంగం కలగ నట్లుగానే,ఆచార వ్యవహారాలు కొద్ది మార్పులతో ఉన్నా, గమ్యం హిందూ ధర్మంలో మోక్షం మాత్రమే. ఆహార,ఆచార విధానాలు వేరైనా,అవి సాధనా పరమైనవే. గమ్యం మాత్రం బ్రహ్మమొక్కటే. కృషిలో బేధాలకు,బాధ్యత గమ్యానిది కాదు. కలలలో బేధానికి నిద్ర కారణం. మెలకువలో అందరికి గాడిద ,గాడిదే. గుర్రం,గుర్రమే. నిద్రలోని కలల బేధానికి అజ్ఞానం కారణం.అలానే సాధనా పరమైన అంశాలను,గమ్యమైన ఏకత్వానికి,వైషమ్యాలను జోడించడం,విజ్ఞతకాదు.
          జంతూనాం నర జన్మ దుర్లభం ,అనేది శాస్త్ర వాక్యం. కానీ వాటినుండి వేరుపరిచే మొదటి విషయం బుద్ధి. ధర్మ ప్రతిపాదన అనేదానికి ఇదొక్కటే సాధనం. మిగిలిన పాంచ భౌతిక విషయాలు జంతువులతో సమానత్వాన్ని ప్రతిపాదిస్తాయి. మానవునిగా నిరూపణకు బుద్ధి అవసరం. కుల మతా తీతంగా,నాస్తికులు కాకుండా మిగిలిన వారందరికీ,గమ్యం మోక్షం. ప్రతి మనిషి పుట్టినప్పటినుంచి పడే తాపత్రయం,ఆనందం కోసమే. అది శారీరిక సుఖం కానీ ,మానసిక సంతోషం కానీ,కొంతకాలానికి పరిమితమైన సమాధి కానీ అయితే ,కాల పరిధిని అతిక్రమించ లేవు. జీవితం పట్ల సరిఅయిన అవగాహన ఆనందానికి హేతువు అవుతుంది. ఇది అపరిమిత తత్వాన్ని పరిచయం చేస్తుంది.దీనికి మన మనసును వేధిస్తున్నఏదైనా ప్రశ్నకు,అనుకోకుండా సమాధానం అయాచితంగా లభిస్తే ,మనం ఎలాంటి భావాన్ని పొందుతామో,ఒకసారి ఆలోచిస్తే అర్ధం అవుతుంది.దీనికి భౌతిక ప్రయోజనమేమీ లేదు,అలానే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పేం లేదు. కానీ విచిత్రమైన తృప్తి అనేది సహజంగా కలుగుతుంది. భోజనం కాదు,నిద్రకాదు  కానీ తృప్తి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చాలా స్వల్పంగా కనిపించినా ఆనందానికి ,ఆధారం అవసరం లేదని మాత్రం తప్పక తెలియ జేస్తుంది. ఒక గులాబీ మొక్క కొమ్మను తెచ్చివేసాం అనుకుందాం. సరి అయిన పోషణ లేక నెమ్మదిగా ఒక మొగ్గ వెయ్యడం లాంటిదే,ఈ పరిచయం. మనం పెద్దగా ఏ విషయాలపైనా శ్రద్ధ పెట్టక పోయినా,ఒక ప్రశ్న,దాని సమాధానం మనకు తృప్తి నిచ్చాయి. అదే జ్ఞానంలోని ,సుకుమారంగా, సున్నితంగా,అంతే సునిశితంగా కలిగే ఆనందం. జాగ్రత్తగా జిజ్ఞాసను పోషిస్తే అది మనలోని బుద్ధి అనేదాని ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది.      
            అందువల్లనే పరబ్రహ్మ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి,జిజ్ఞాస మొదటి లక్షణంగా,జగద్గురువులు ఆది శంకరులు ,బ్రహ్మసూత్రాలలో తెలియజేస్తారు.జిజ్ఞాస అంటే అర్ధం పర్ధం లేని ప్రశ్నకాదు. బాహ్యాడంబరం లేని అంతర్మధనం, అదే సాధనగా కూడా అపరిమిత ఆనందాన్నిస్తుంది. అంతరంగంలో ఏ బాహ్యాంతర వస్తు సహకారం లేక నిద్రించకుండా, తనని తాను  గుర్తిస్తే కలిగే స్పందన. ఇది జడం కాదు. జడాన్ని గుర్తించే చైతన్యం. నిజానికి బాల్యంలో, ఊహ తెలిసాక, తరువాత 15సం /వయసులో,మళ్లీ 25సం/కు,ఇలా కొంత,కొంత వ్యవధిలో  స్వస్వరూప స్థితిని గుర్తు చేసుకుంటే,శారీరిక మార్పులు,మానసిక మార్పులు కాకుండా  స్వానుభవంలో ఏ మార్పు జరగ లేదని స్పష్టం అవుతుంది. దీని పరిచయంతో, అనుభూతమైన స్వరూపం గురించి స్పష్టమైన అవగాహనకు జరిగే అంతర్మధనం,గురువు కోసం తపిస్తే కలిగే తపన తపస్సు. దీనినుండి కలిగే ఆర్తి జిజ్ఞాస. ఇది అగ్ని సమానం. పురాకృత కర్మ ప్రభావాన్ని ప్రక్కకు తోసి సాధనకు సహకరిస్తుంది. ఇది ఎవరెవరి తపనకు ఎంత బల ముందో,దానిఫలంగా పరిపక్వతకు సమయం నిర్ధారించ బడుతుంది.
         ఇది అత్యంత బుద్ధి సూక్ష్మతకు పరాకాష్ట. బాల్యం నుండి బుద్ధిని పదును పెట్టినపుడు బాహ్యావసరాలైన అతి సాధారణమైన,ఆహార,గృహ,గృహస్థ అవసరాలకు పరిమితం కాని,జన్మకు మూలమైన అజ్ఞాన నివారణకు అవసరమైన విజ్ఞానం వైపు దృష్టిని సారించే ప్రయత్నం బుద్ధి సాగిస్తుంది. కానీ పరిచయం చెయ్యడం మానవ కర్తవ్యం. సాధారణంగా మానవయత్న లోపం దీనిని పరిచయం చెయ్యక పోవడం వలన,శరీరం తాను భూమిపైకి వచ్చిన అత్యంత ఆవశ్యకమైన పరిపూర్ణతా స్వరూపమైన ముక్తి అనేదాన్ని పొందకుండా,go to pevillion.
         భౌతికమైన ఎన్ని విజయాలైనా,స్టేజి డ్రామాలో షో వరకూ పరిమితమైన వాటితో మాత్రమే సమానం.దీని కోసం  మానవ జీవితం,కోల్పోతున్నగమ్య రూపమైన మోక్షాన్ని,గుర్తు పట్టక పోవడమే,ఆధ్యాత్మిక పరంగా,ప్రమాదంగా మన శాస్త్రాలు,తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అధిగమించి ప్రస్థానం సాగించాలంటే,దానికి బాల్యం నుండి పరిచయం అవసరం. బాల్యానికి డేటింగ్ ఆవశ్యకత లేదు. అన్ని జంతువులు చదవకుండానే ఈ విషయాల్లో నిష్ణాతులు.వీటికోసం సినిమాలు,కంపూటర్లు,వీడియోలు అవసరం లేదు. ప్రకృతికి ఏ సమయానికి ఏమి అందించి వంచించాలో బాగా తెలుసు. దీనికి కృషి ఆవశ్యకత లేదు. ప్రకృతిని అధిగమించి గమ్యాన్ని చేరడానికి,బుద్ధి బలం అవసరం,దీనిపరిచయం ఖచ్చితంగా బాల్యంలోనే జరిగి తీరాలి.అందువల్లనే ఉపనయనం వయసు ఏడవ సం/రమే. అపుడు చేసేది స్త్రీ,పురుష సంయోగం గురించిన ఉపదేశం కాదు. బ్రహ్మమే తానని తెలియడానికి,ప్రాతిపదికగా , గురు స్వరూపంగా ,తండ్రి చేసే ఉపదేశం. దీనికి ప్రత్యక్ష నారాయణుడైన సూర్య నారాయణుని,కిరణాల రూపంలో మనను సమీపిస్తున్న గాయత్రీ మాతగా సంభావించి,బుద్ధి ప్రచోదనాన్నే వరంగా,రోజూ ముమ్మార్లు ప్రార్ధించడాన్ని,  సంధ్యావందనంగా మనకు తెలుసు.ఇందులో మోక్షాన్నిఇమ్మని అడగడం లేదు.తనను తాను తెలుసుకునేరీతిలో బుద్ధి సహకరించేలా,చెయ్యమనే ప్రార్ధన ఉంది. నిజానికి ముక్తి తనకున్న అజ్ఞానాన్ని లేదని తెలుసుకోవడమే తప్ప వేరే కొత్తగా సంపాదించే,సంపాదన కాదు. అజ్ఞానాన్ని విడిచి పెట్టడమే లక్ష్యం కనుక,త్యాగమే జీవనము అని తెలియజేస్తుంది శాస్త్రం. అది వదిలించుకునే వ్యవహారంలో భాగమే సంన్యాసం. కానీ అది సూచించిన అజ్ఞాన నిరాకరణమే దీని గమ్యం. దిని ప్రాతిపదిక బాల్యంలోనే ప్రారంభం.
      తల్లి ఒడి నుండి బడికి,తల్లిని వదిలితేనే సాధ్యం. ఇక్కడ ప్రారంభం అయిన ప్రయాణం పరమాత్మను చేర్చే దిశగా కదిలే బృహత్తర ప్రణాళిక మన వేద విద్యకు మాత్రమే స్వంతం.ఇది కొంతమంది ద్వారా సమాజానికి మేలుకుర్చే విధంగా అందించడమే ఈ యుగంలో ఎన్నో బేధ భావాలకు తావిచ్చింది. కానీ ఎప్పుడూ తండ్రి పిల్లల మేలు కోరినట్లే శాస్త్రం సమాజ శ్రేయస్సుకు కొన్ని నియమాలు ప్రకటించింది. ఎంతో ధర్మ బద్ధంగా కష్టపడి ఒకవ్యక్తి ఎంతో అభివృద్ధిలోకి వచ్చి,ఆనందానికి నోచుకోక తనువు చాలించాడనుకుందాము. న్యాయమేనా?మనకే అన్యాయమనిపిస్తే,సృష్టిలో పరమాత్మ తప్పకుండా న్యాయం చేస్తాడు.మళ్లీ వారసుడిగా వచ్చి తన హక్కును తాను వాడుకుంటాడు. అందువల్లనే పునర్జన్మ అనేది భగవంతుడిచ్చిన, మొదటి న్యాయ వ్యవస్థ. న్యాయ మంటేనే,తప్పు, ఒప్పుల మధ్యన జరిగే పోరాటంలో ఒప్పు గెలవడమే. ఇటువంటి ఎన్నో విశ్లేషణలతో కూడిన పునర్జన్మ సిద్దాంతంలో,భగవంతునే గమ్యంగా సాధన సాగిన జీవులకు కూడా న్యాయం చేస్తే,వారికి దొరికినది బ్రాహ్మణ జన్మ. వీరి కోరిక మేరకు భగవంతుడు,తనసేవకు గాను వేద విజ్ఞాన సముపార్జన జీవికగా ఏర్పాటు చేశాడు. పురాకృత పుణ్య,పాప ఫలంగా,ఎన్నో బేధాలతో ఉన్న సృష్టిలో చెట్లు ,జంతువులు ,మానవులు ఇలా ఉన్నా, మళ్లీ అన్నింటిలోను విభిన్నత్వం ఉంది. వీటిని ఎవరూ తప్పు పట్టరు. మామిడిపండ్లలోనే ఎన్నో రకాలు. మళ్లీ పక్వాన్ని బట్టి రుచిలో బేధాలు. ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారు. కంటికి కనిపించని ఎన్నో బేధాలుగల మానవులను వర్ణ , వర్గాలుగా విభజించినపుడు,దీన్ని అత్యంత సహజమే అని ఈ సమాజం ఒప్పుకోకపోడమే పెద్ద ఆశ్చర్యం.        ఉపనయనం  కులాచార ప్రాతిపదిక మాత్రమే.
             ఎందరో B SC డిగ్రీ చేశారనుకుందాం,అందరూ బి ఇ డి చెయ్యరు,అంత మాత్రాన,డిగ్రీకి ఏ విలువా లేదా ? ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ట్రైనింగ్ అవసరం.దీనివల్ల వారి గౌరవం పెరిగి పోలేదు. మిగిలిన వారికి తగ్గి పోలేదు. ఎవరి కులవృత్తి వారిది.అటువంటి విధానమే ఉపనయనం.ఒక కుమ్మరి,ఒక కమ్మరి,ఒక రైతు,ఒక మంగలి అందరూ సమానంగా,మాములుగా చదువుకునే డిగ్రీ అందరికీ సమానమే. కానీ విడిగా, వారు,వారి వారి కుల వృత్తిని అభ్యసించ కూడదనే శాసనం ఏమీ లేదు. అలాంటి ఒక ఆచార వ్యవహారమే ఉపనయనం. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను అన్వయించుకోడానికి,చదవాలి,తెలుసుకోవాలనే తాపత్రయం అవసరం కానీ వేరే ఏ అవసరమూలేదు. పరమాత్మను చేరాలనే తపన తపస్సుగామారుతుంది.అంటే అడవులు పట్టి పోవడం ఎంతమాత్రమూ కాదు.తన బాహ్యావసర జీవనానికి అవసరమైన విద్యతో బాటు,బుద్ధిని సూక్ష్మతరం చేసే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం. ఇది  భౌతికంగా చర్చకు అందనిది.
     దీనికి మన శాస్త్రాలను,ఎలిమెంటరి విద్యనుండి పరిచయం చెయ్యడం ఎంతోఅవసరం.సమయం పరమాత్మ స్వరూపం. నిరాకారమైనా జీవితాన్ని శాసించి,లక్ష్యపెట్టకపొతే,చివరకు నిరర్ధకమైన జీవితాన్ని కళ్ళముందు ప్రకటించి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది.సమయాన్ని గుర్తు పట్టడమే నిజానికి అన్నిటికన్నా గొప్ప సాధన. ఇది అవకాశం అనేదాన్ని అందించ గలుగుతుంది. అనవసర విషయాల వైపు మనసు పోకుండా,అవసరమైనంత వరకు సమయాన్నివినియోగించగల నేర్పు పిల్లలకు నర్సరీ నుంచి తెలిసేలా చేసి వారి భవిష్యత్తుకు,నిర్దిష్టమైన విధానాన్ని తప్పక పరిచయం చేయాలి.నిజానికి చాలామంది సమయం సరిపోవడం లేదుఅని, అంటూ ఉంటారు. కానీ భౌతిక పరమైన అంశాలకు ఎంత మేరకు తప్పనిసరి అవసరమో,అంతవరకు ఆలోచిస్తే,చాలా భాగం,మనసు అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన,ఎంతో సమయం వృధా అవుతుంది.       నిజానికి ఇపుడు కలియుగమైనా మన సాధన మాత్రం కలి నుండి ద్వాపరానికి,ద్వాపరంనుండి త్రేతాయుగానికి, త్రేతాయుగం నుండిసత్యయుగానికి ప్రయాణం సాగిస్తున్నామని భావించవచ్చు. ప్రశ్న పుట్టకుండా మన సమయా న్నంతా మింగేసేదే కలియుగం. ఐతే,మనసులో,ఆలోచన లేదాప్రశ్నకు 100శాతం అధర్మం వైపు మనసు ప్రయాణం చేస్తున్నా ,5శాతం మనసును   ధర్మం అడ్డుకున్నామనప్రయాణం ప్రారంభం అయినట్లే. 100మంది అధర్మ పరులైన కౌరవులు,5గురుధర్మపరులైన పాండవులు గానుపరిచయం చేసింది భారతం . దైవం పై అచంచలమైన విశ్వాసంతో, పట్టుదలతోమనలొఉన్న దుష్టస్వభావం,పై విజయం సాధించిన కొద్దీ భగవద్గీత మనకు అనుసంధానం అవుతుంది. తన ప్రవృత్తితో అంతరంగాన్నిశ్రీ రామరాజ్యంగా మార్చిన సమయం త్రేతాయుగమే.సత్యం తన స్వరూపంగా భాసించే వారికి సత్యమే,పునరావృత్తి రహిత సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
         వస్తువు యొక్క పరిపూర్ణ జ్ఞానం వల్లనే వైరాగ్యం సంభవం. పరబ్రహ్మం పొందవలసినదనే ధృఢ నమ్మకంతో సాధన ప్రారంభం అవాలంటే తత్వజ్ఞానానికి సంపూర్ణమైన మద్దతును మనసుకు అందించాలి. అన్నివిధాలుగా ఎన్ని ప్రశ్నలు మనసు వేసినా,అన్ని ప్రశ్నలకు శాస్త్ర అవగాహన పెంచుకుని,చిన్న పిల్లలకు,తల్లిదండ్రులు ఎలా సమాధాన పరుస్తారో అలా ఓపిగ్గా negative వైపు ఆలోచన పోకుండా శాస్త్ర జ్ఞానాన్ని ఆలంబనగా ప్రయత్నం సాగించాలి.
         అదే సమయంలోఎంతో బలమైన పూర్వ జన్మ సంస్కారాలు,శరీర పరమైన అవసరాలు,సుఖ,దుఃఖాలు,కామ క్రోధ,లోభ,మద,మాత్సర్యాలు,వీటిలోని ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చిమనసు ,భగవత్స్వరూపమైన కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది.నిజానికి దేశ కాలతీతమైన స్వరూపం,స్వంతమైనా,చకోర పక్షి,స్వాతి చినుకు కోసం తపించి నట్లు,సాధనకు అవసరం లేని negative attitudeవల్లనే ఏర్పడిందంటే అతిశయోక్తి లేదు. 
    తనకు తాను బలవంతంగా నిగ్రహించిన మితిలేని భౌతిక వస్తు,సుఖాపేక్ష,కారణంగా,నిద్రాణంగాపేరుకు పోయిన అజ్ఞానమేజన్మకారణం.దీనికి జవాబుగా,సకల జగత్తూ పాంచ భౌతికమనే అవగాహన,మనకు మోక్షద్వారం.తన స్వ స్వరూపం భౌతిక జగత్తుకు సాక్షి.శరీరాన్నితానుగా భ్రమించి,భౌతిక వస్తువులే గమ్యంగా సాగిన జీవితం,మనను అహంభ్రహ్మాస్మి అననివ్వకుండా అడ్డుకుంటోంది.
           ఎప్పుడూ ఉన్న చైతన్య స్వరూపంగా ,మనం ముందు యుగాల్లో బహుశా ఏమి చూసి ఉంటా మంటే,సత్య యుగంలో హరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడి నప్పుడు,బాధ మాత్రం తప్పకపడి ఉంటాడు.కానీ శారీరిక, మానసిక బాధ మాత్రమే అని తలచి తన స్వ స్వరూపంలో ఒదిగి,వడ దెబ్బ తాపం నుండి,తనకు తాను,తన ఇంట్లో సేద తీరినట్లు, తప్పించు కున్నట్లు,బహుశా మనం చూసి ఉండవచ్చు.    
          బహుశా త్రేతా యుగంలో రాముడు ఎంత కష్టపడినా లెక్కచేయకసీతను దూరంచేసిన చాకలి రూపంలో అప్పుడు,ఎవరు సత్య,ధర్మాలను వారికి వీలైన పరిధిలో, ఇప్పుడు అనుష్టించినా,విసుగూ,విరామం లేకుండా వారిని విమర్శించేవారు,ఇప్పటికీ వారి స్వగుణాలను చాటుకుంటూ ఉండడంమనం చూస్తూనే ఉంటాము.తరిమి తరిమి అవస్థల పాలైన సాధకులను విసిగించే విధానం హరిశ్చంద్రుని కాలంనుండి వస్తూనే ఉంది. [1]ఇది సత్య యుగం నుండి ఇప్పటి వరకూ కొనసాగుతున్న అరాచకం.
            త్రేతా యుగం నుండి బహుశా,పర స్త్రీ కాంక్ష,కలి యుగం,సంపాదించుకుని ఉండవచ్చు.[2] ద్వాపరం నుండి  అన్నదమ్ముల,దాయాది పోరు సంక్రమించి ఉండవచ్చు. [3]ఇలా ఈ మూడు పువ్వులు,ఆరు కాయలై,అన్ని యుగాల్లోని వ్యతిరేక ఆలోచనా విధానాలు కలి యుగానికి కలికితురాయిగా భాసిస్తున్నాయి.మళ్లీ మనం తిరుగు ప్రయాణం చెయ్యాలంటే ఇప్పటి విధానాలకు వ్యతిరేక దిశా ప్రయాణం చేసే నావ ఎక్కక తప్పదు.
             వైవిధ్యం సృష్టి. ఏకత్వం దృష్టి. సృష్టిలోని మనీషులకు అంతరంగ మధనంలో సాధించుకున్నది,శివుని మూడోకన్ను,జ్ఞానమే నేత్రము. చర్మ చక్షువు కాదు.ఎప్పుడూ విడదీయలేని అంతర్ముఖత్వం. యిదే శివత్వం. శివుడు వేరుగా తత్వం వేరైన శివ తత్వం కాదు. తత్వమే తానైన శివత్వం. ఇది అనుభవం మాత్రమే. ఏకత్వం.
          ప్రవర్తన కాదు. ప్రవర్తించాలంటే సృష్టిలో మాత్రమే సాధ్యం. సృష్టి వివిధం. ఏకత్వ ప్రతిపాదన అసాధ్యం. అందు వల్లనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం.మౌనమో అంతర్ముఖత్వం.అందువల్లనే, చెప్పి,చెప్పి అలసిపో యిన శ్రుతి మూగ బోయింది,పరమాత్మ విషయంలో.
       మౌనంగాశ్రుతి,శివత్వమే తానై,శివంగాఅరాధించ బడుతోంది,సృష్టి చేత.శివం ప్రవహిస్తే,శ్రుతి. శబ్ద గంగ.ప్రశ్నించే వారికోసం ఘనీభవించి గురువుగా ప్రకటించబడుతోంది.శిలా సదృశంగా అర్చా మూర్తిగా పూజింప బడుతున్నది. రూప రహితంగా లింగరూపంగా,నిరాకర తత్వాన్ని,అనేక స్వరూపాలతో సాకార సృష్టి రూపంగా,అన్ని రూపాలలోని ఏకత్వాన్ని ప్రస్ఫుటంగా తెలియ జెయ్యడానికి అనేక ఆలయాల్లో అనేక శిలా దేవతా మూర్తులుగా కేవల శివత్వమే ప్రకాశిస్తున్నది. ప్రపంచరూపంగా అరాధించ గలిగేవారికి 'విశ్వం'విశ్వరూప దర్శనమే.
             సృష్టి  వివిధం.దాన్ని అలానే ఒప్పుకోవాలి. తప్పదు. సృష్టికి మూల రూపం ఏకత్వమైనా,పాంచ భౌతికంగా మాత్రం వివిధత్వం మాత్రమే సృష్టికి ఆధారం. పోలిక ఉండవచ్చు,కానీ ఏ రెండూ ఒక్కటే అనిమాత్రం చెప్పలేము. కాపీ అనేది యాంత్రికం. వివిధత్వం మాత్రం సజీవం. కనీసం కవల పిల్లలుకూడా ఒకేలా ఉండరు. ప్రతి అణువు తన వైభవాన్ని చాటుతుంది. తనను తాను సంస్కరించు కోవాలనుకునేవారి ప్రధమ లక్షణం తను తక్కువ. అప్పుడు మాత్రమే సాధన అనే పదానికి అర్ధం ఉంది. అన్ని విషయాలలో పూర్ణత్వం అసాధ్యం. ఏవిషయంలో తన తెలియక పోవడం ఉందో దాని జ్ఞానాన్ని పొందడానికి సవినయం అవసరం. అంతమాత్రాన అతని మిగిలిన విషయాల్లో జ్ఞాన వైభవం కుంచించ బడదు. వినయం వలన అన్నీ మరింతగా ప్రకాశిస్తాయి.
            తెల్లని వస్త్రం బ్రహ్మాన్ని సూచిస్తుంది,కానీ ఉపయోగానికి రావాలంటే,దానికి అంచు ఉండి తీరాలన్నది,శాస్త్రం. అంతేకాదు దేవాలయాల్లో ప్రవేశానికి,పంచె,ఉత్తరీయం ధరించి రావాలనే శాస్త్ర వాక్యంలో,ఎంతో అర్ధం ఉంది. ఎక్కడా చింపడం కానీ అతుకు వెయ్యడంకానీ లేకుండా ధరించే విధంగా ఈవస్త్రధారణ ఉంటుంది.పరబ్రహ్మం వస్త్రంగాభావిస్తే, అందులో తగ్గించ వలసినది[కత్తిరించడం]కానీ,అలాగే కలప వలసింది[కుట్టడం]కానీ,అవసరంలేకుండా ధరించడం సాంప్రదాయం.అంటే తత్వానికి కలప వలసినదీ లేదు,తీసి వేసేదీ లేదు.ఉన్నతత్వాన్నిఉన్నట్లుగా ధారణ చేస్తు న్నాను,అని సవినయంగా భక్తితో,భగవంతుని ముందు నమస్కరించడమే,ఈఆచారం వెనుక అంతరార్ధం.అంతేకాదు సృష్టిలోని భిన్నత్వాన్ని అంతే సవినయంగా ఒప్పుకుంటున్నట్లు తెలియ జేసేదే ఉత్తరీయం. శుద్ధ సత్వమైన బ్రహ్మ తత్వానికి ప్రతీకగా రెండు వస్త్రాలు తెల్లనివి మాత్రమే ఉంటాయి. అంచు లాగా రంగు వాడినట్లే,సృష్టిలో చరించడానికి తగినంత మాత్రంగానే,మిగిలిన సత్వ ,రజో ,తమో గుణాలను ఉపయోగిస్తాననే సూత్రం దాగి ఉంది.భారతీయ స్త్రీ ధరించే చీర కూడా ఏక వస్త్రమై ఎక్కడా అతుకు,కుట్టు లేకుండానే,అంచు కలిగి ఉంటుంది. అంచు అనేది సృష్టిలోని కట్టుబాట్లపట్ల గౌరవాన్ని సూచిస్తుంది. పరిధిని పరిచయం చేస్తుంది. పూర్వపు స్త్రీ పై వస్త్రాన్ని కట్టుకున్నట్లు  చిత్రీకరిస్తారు కానీ,చీరను బుజాల నిండుగా కప్పుకోవడాన్ని మాత్రం చిత్రీకరించడం మరవడం వలన మన సాంప్రదాయాన్ని ప్రకటించ లేక పోయింది. ఈ పై వస్త్రం కూడా ఆ రోజుల్లో అతుకు లేకుండా ఉండేది. వీటి వెనుక,పైన అనుకున్న అంతరార్ధం ఉంది.
        బ్రహ్మచారి ఒక వస్త్రాన్ని ధరించవచ్చు. గృహస్తు ఉత్తరీయాన్ని తప్పక ధరించాలి. అంటే శక్తి సహిత శివ రూపం. భార్యకిచ్చిన గౌరవం,తనుకట్టుకున్నవస్త్రం కన్నాపై స్థానంలో ఉంచి,అంటే ఉత్తరంగాఉత్తరీయంఉంచి స్త్రీని గౌరవించిన ఆచారం మనది.అందుకే పెళ్ళిలో ఉత్తర జంధ్యాన్ని మామగారు తమ కూతురుతోపాటు సమర్పిస్తారు.నిజానికి మగ వారికి జీవితం అంటే కుటుంబమే కానీ,అవసరాలన్నీ కుటుంబానివే. వారి కష్టమంతా కుటుంబానికే. స్వప్రయోజనం శూన్యం.కుటుంబ అవసరాలు తమ అవసరాలుగా భావించి,భరిస్తారు కనుక భర్త.కానీ కనీసం కని పెంచిన తల్లి,తండ్రి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు,తాత,బామ్మ,వీరిగురించి మాట్లాడే స్వాతంత్ర్యం ఎంత మంది కలిగి ఉన్నారో మనకు తెలియందేం లేదు.కోడళ్ళపట్ల అత్త మామల ఆరళ్ళువినిపిస్తున్నాయి కానీ,నిజానికి మగవారి పట్ల  90%వినిపించని నిజాలెక్కువ.కంటి నీరు కార్చే యోగం కూడా లేదు.ఎంతసేపు ఆడవారిపై చేయి చేసుకున్న చరిత్రలో మగవారి దురహంకరమే  గాని ఎంత చెప్పినా వినని అర్ధాంగి మొండితనం బయటకు రాదు.మగవారిని రెచ్చగొట్టే చూపు తమ ఆడపిల్లలకు  ఉందని గుర్తించే తల్లిదండ్రు లెందరు? సమాజంలోజరుగుతున్నఅరాచకాలలో సూర్పనఖలకు కొదవ లేదు.  సమాజంలో  మగ వారినే అన్నిటికీ బాధ్యులుగా వ్యవహరిచడం,అవగాహనా లోపమే.ఎవరైనా మగవారు దొంగతనం చేస్తే,అందరు మగవాళ్ళు దొంగలే అన్నట్టు వ్యవహరిస్తోంది సమాజం.
            బ్రహ్మమొక్కటే అనే అంతరంగ అనుభవాన్ని,శ్రుతి మౌనంగా తెలియజేసినా,అలాగే మౌన వ్యాఖ్యతో దక్షిణా మూర్తి తెలియజేసినా అంతరంగంలోనే,తందనాన అని స్వానుభావాన్నిఆస్వాదించ వచ్చు.కానీ అందరికి బాహ్యంలో అందిస్తే అది సాధనకు వేసిన తెల్లని ముసుగు మాత్రమే.దీనివల్ల సంపూర్ణంగా వర్ణవ్యవస్థ తనవైభావాన్ని కోల్పోయింది.వేలితో మనకన్నుమనమే పొడుచుకున్నట్లయింది.
    సృష్టిలోఎక్కడైనా ఎక్కువతక్కువలే ఉన్నాయి. సమానత్వంఎండమావి.అంతరంగంలో ఆస్వాదించ వలసిన మౌనానికి మాటలిస్తే,అర్హత లేనివారు దుర్వినియోగం చేస్తారనే శ్రుతి,తత్వాన్ని రహస్యం అని సూచించింది. గురు కృపతో,సాగిన సాధనలో కలిగే తృప్తి,పాట విని పాడినంత సులువు కాదు,సాధన చెయ్యడం.అభినయించిన వారందరికీ అనుభవం అందితే అందరూఅభినయిస్తే సరిపోతుంది. కానీనటనలో త్రిపుటి ఉంది.అసలు సాధన త్రిపుటిని జయిం చడానికే.అది గెలిస్తే కలిగేది మౌనం.బాహ్యంలోఅసాధ్యం అంతరంగంలోమన శరీరానికున్న బాంధవ్యాలను నటనగా ప్రతిపాదించి సాధనలో పరిపక్వతకు సోపానంగా మలచు  కున్నవారు,ప్రయోజనాన్ని పొంద వచ్చు. ఏది ఏమైనా సృష్టికి ఏకత్వ ప్రతిపాదన అర్ధ రహితం.
          ఒక మనిషికి,ఒక మనిషికి పోలిక లేదు. యూనిఫాం వెయ్యవచ్చు కానీ ఎవరి జీవితం వారిదే. వేరేలా ఎవరిలానైనా ఉండాలనుకుంటే కాపీ అవుతుందే కానీ సహజత్వం ఉండదు.తను ఎదగాలి అనే తపన తనను విశిష్టంగా  చూపుతుంది. అందువల్లనే మనకు శాస్త్రం వినయ సంపన్నుడే విద్యావంతుడన్నది.కానీ దానికి కూడా పరిధి ఉన్నది. 
       ఒక తత్వవేత్త వినయమని,పామరునికి నమస్కరిస్తే ,అది అతని విజ్ఞతకు గుర్తు. కానీ పామరుడు అది తన జ్ఞానానికి గుర్తుగా భావిస్తే కలిగే అనర్ధం అతణ్ణి సాధనకు దూరం చేస్తుంది . అతి వినయం కూడా అగౌరవమే.తన తల్లిదండ్రులు సభలోకూడా గౌరవించ దగిన వారు .నిరక్షురు లైనా  దైవ సమానులు. ఇలా ప్రతివిషయంలోనూ ఎన్నో బేధాలు,అన్నీ ధర్మాన్ని రక్షించేవిగాఉండాలి. అల్లుడు శ్రీ మహా విష్ణువని,శాస్త్రాన్ని నమ్మి,లక్ష్మిగా కన్యను సమర్పించి పాద తీర్ధం తలమీద జల్లుకుని, వారితో మీరు మేము సమానమే అని నొక్కి వక్కాణించే కన్యాదాత,వియ్యాలవారికి కప్పేది ఇలాంటి అంచు లేని తెల్లని వస్త్రమే .కానీ అదేమాట వరుని తండ్రి పలికితే, శాలువాతో సత్కరించినట్లుంటుంది.ఇద్దరు చెప్పింది ఒక్కటే అయినా అర్ధం మాత్రం ,అన్వయం కాదు. ధర్మ సూక్ష్మాన్ని గుర్తించిన వారిని కీర్తి వరిస్తుంది. ఎవరికీ తెలియదులే అని,అన్నీసమానం అనే ముసుగు,ఎంతోకాలం వారిరంగును దాచి ఉంచలేదు. అందరూ సమానమైతే శిష్యుడు గురువు వద్ద ,ఎప్పటికీ ఏమీ నేర్చుకోనివ్వని పొగరు మాత్రమే యివ్వగలుగుతుంది.
     భగవంతునికి వస్తు రూపంగా ఏమిచ్చినా,అది ఆయన సృష్టి లోనిదే.అందువల్లనే ఆచార్యులందరు స్తుతినే,భగ
వంతునికి కానుకగా సమర్పించారు.వాక్కు పరమేస్వరానుగ్రహమైనా దానిని అందరూ,వారి స్వప్రయోజనం కోసం
అనవసరము,అధర్మము అయిన వాక్చాతుర్యానికి వాడే అవకాశం ఎక్కువ. దీనిని అధిగమించి భక్తినే సాధనగా
వాక్కును ప్రవహింప చేసే సంస్కారానికి,సంయమనం చాలా అవసరం.మనకిష్టమైన విధంగా వాడుకోమని దైవం
అనుగ్రహించిన శారీరిక,మానసికి,బుద్ధి శక్తులను,పరమాత్మను చేర్చే సోపానాలుగా వాడితే అది ధర్మం. పంచ
ప్రయోజనాలే[ఇంద్రియ సుఖాలే] గమ్యం అయితే అది అధర్మం. అధర్మానికి వాడే వాక్కులు,భగవంతునికి వ్యతిరేక
దిశా,ప్రయాణం చేయించి జన్మ పరంపరలకు కారణ మౌతాయి.స్వతంత్రం మనకు ప్రసాదించినా, వివేకంతోవాడితే
పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది. మనను మనమే పరమేశ్వరునికి సవినయంగా సమర్పించు కోవడాన్నే మనం
ధర్మం, అని భావిస్తే,అది ఇలలో కుమార్తెను మన మనసుగా భావించి లక్ష్మిగా,విష్ణువుకు సమర్పించడం ప్రధాన
ధర్మం.సవినయం లోపిస్తే అధర్మం.
         సంసారానికి పునాది గృహస్థాశ్రమమే. దీనికి వివాహ వ్యవస్థ సుసంపన్నమై,సరిగా తన పరిధిని కాపాడు
  కోలేకపోవడమే,ప్రస్తుత సమాజపు తీరుకు చాలావరకు కారణం. ఎన్నో జీవితాలు వీటికి ప్రతి బింబాలుగా సమాజంలో  కనిపించడం వలన,ఈ బ్లాగ్లో అనేకసార్లు,వివాహ సంబంధిత విషయాలు చర్చించడాన్ని విజ్ఞులు అర్ధం చేసుకోగలరు.సంస్కృతి ,సాంప్రదాయం కాపాడ గలిగేది సంసారం . అలా కాపాడిన సంసారి సత్యవ్రతుడు. దీనర్ధం మనకు పరిచయమే .ధర్మం కాలగతిలో మార్పుకు లోనైనా,ఆధారమైన సత్యం ఏమార్పు చెందదు. స్థిరంగా ఉన్న సత్యాన్ని దృష్టి నుండి జారి పోనీక దానికి ప్రదక్షిణంగాజీవితాన్నినడిపితే,కల్పాంతంలో మత్స్య రూపంలో బీజాలతో సహా ప్రళయంనుండి కాపాడి,సృష్టి నిపరమాత్మ కాపాడిన విషయం మనం పురాణాల్లో చూస్తాం . అంటే'అమ్మో కలికాలం,అన్నీ అలా జరుగు తున్నాయంతే 'మాకేం సంబంధంలేదు,అనేవాళ్ళు,సత్యవ్రతులెలాఅవుతారు?సత్యమే వ్రతంగా చాకచక్యంగా జీవించి భావితరాలకు మూలాలను పరిచయం చేసి ,వాటిని కాపాడే బాధ్యత అందించడమే మానవ కర్తవ్యం .దీనికి ధర్మాగ్రహం కూడా అవసరమే. అందువల్లనే దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ పరమావధిగా నారాయణుడు ,నారాయణి ఆయుధాలు ధరించి మనకు మార్గ దర్శనం చేశారు.దీనికి ఆయుధాలు ధరించి తిరగాలనేది ఉద్దేశం కాదు . ఆలోచనలో మంచి,చెడుల విశ్లేషణ చాలా అవసరం. అలా ప్రతి క్షణం జాగ్రత్తగా వేసే అడుగులు చూసి మాత్రమే ,పిల్లలు అప్రమత్తంగా ఉంటారు. లేకుంటే మోడరేషన్ పేరుతో వంచించ బడతారు .దీనికి తమను,తాము సవరించుకోని పెద్దలదే తప్పు. నిజానికి భగవంతుడు యుద్ధ ప్రాతిపదికకు మాత్రమే వాహనము , ఆయుధాలు ధరించినట్లు కనిపిస్తుంది . అలానే మానవ  శరీరంవాహనమైతే ఆలోచన ,ప్రవర్తన ,కార్యాచరణ ఇవే ఆయుధాలు.గెలవవలసిన శత్రువు అజ్ఞానమే .రూపం లేదు. అసలు ఉనికే లేదు . పోరాడవలసిన శత్రువుకు ఉన్న ఒకేఒక ఆయుధం ,కనిపించకుండా  పారిపోవడమే .స్వరూప జ్ఞానం జాగ్రత్తుగా అందితే మాత్రమే గెలుపు సాధ్యం . భగవంతుని స్మరణకు రానివ్వని  శత్రు లక్షణాలు,మానవ నైజాలుగా భావిస్తే ,వాటితో తల పడక తప్పదు . దీనిని అధిగమించి ,పాంచ భౌతిక విషయాలకు ఎంత వరకు అవసరమో అంతే విలువనిచ్చి గమ్యం వైపు ప్రయాణించే నేర్పు అందించే తల్లి దండ్రులకు పాదాభి వందనం.
          పంగల కర్ర అనే దానితో పిల్లలు ఆడుతుంటారు . y ఆకారంలోని కర్రకు రబ్బరు మ్ముక్క కట్టి ,ఒకరాయి తీసుకుని రబ్బరుతో వెనక్కి లాగి ,ఒక కాయనో లేదా మరో గమ్యాన్నో ,గురిచూసి కొడుతూ ఆడతారు. అలానే అర్జునునిలా అందరూ విలువిద్య నేర్వకున్నా ,సృష్టిలోని ప్రతివారు అన్ని విషయాలకు ,కొంత గురి నుపయోగించి తమ సమస్త వ్యవహారాలను సాగిస్తారు . కొన్నిగమ్యాలు  దగ్గరగా,కొన్ని దూరంగా భ్రమ  పెడుతున్నాయి . దగ్గర దానికి పట్టు బిగించినా ఓటమే . దూరానికి పట్టు తగ్గినా ఓటమే . ఈరెంటికీ ఆధారమైన గురి అనే దానిమీద దృష్టిని శాస్త్రం ఏకాగ్రత అంటుంది . కానీ ఏకాగ్రత  అంటే బాహ్య వస్తు ,విషయ ప్రతిపాదనం కాదు . గురి మీది అవగాహన ,ఆధ్యాత్మిక చైతన్యమే . గురిచూస్తున్న విషయాన్నిగమనిస్తున్న  సాక్షిని ,శరీర పర్యంతంగా చూస్తే జీవుడు .తన శరీరం కూడా అందులోనే లయిస్తే పరమాత్మ .      
          తల్లి,తండ్రుల సౌభాగ్యం పిల్లలు ,వీరి పట్ల అపారమైన ప్రీతి తల్లి ,తండ్రులకు . ప్రీతి అనే పేరుకూడా పరిచయం లేని పిల్లలకు ,తల్లి ,తండ్రులే ప్రపంచం .పిల్లలు ఈ దశలో ఉన్నంత వరకు పిల్లలకు  ,తల్లి,దండ్రుల సాన్నిధ్యం , అపారంగా అందుతుంది.ఇదే భక్తుడికి ,భగవంతుడికి ఉన్నఅనుబంధం.భగవంతుడికి సృష్టి అంతా సమానమైనా,మాయచేత  ఆవరింపబడిన జీవులకు, ఈ విషయం ,బుద్ధిలో ప్రకాసించదు . తనువూ మనసూ ఏకం చేసి , సృష్టి వైపు ద్రుష్టి పోనివ్వక సర్వమూ పరమాత్మ  అనే అచంచల విశ్వాసం వలన ,కష్ట నష్టాలను కనీసం దృష్టిలోనికి రానీయక ,సదా స్వామి పద కమల ప్రీతి రూపమైన భక్తితో రమించే భక్తులకు ,ప్రతి కదలికలోను పరమాత్ముని సామీప్యం అందుతూ ,మనసు అదే పనిగా పరమాత్మలో ,లీనమోవుతుంది. ఈ దశ నెమ్మదిగా మారి ,సాకార రూప ధ్యానం నుండి నిరాకార పరతత్వం వైపు , ప్రయాణమే,నిజానికి దీని వలన కలిగే లాభంఅంటుంది,త్రిపురా రహస్యం అనే గ్రంధం . ఇది దత్తాత్రేయులు , పరశురామునికి చేసిన ఉపదేశ రూపమైన గ్రంధం .
          ఇది ఒక జన్మలో జరిగే మార్పు అని చెప్పలేము . అందువల్లనే సాధకులందరికి ఒకే రకమైన అనుభవాలు , ఆచరణలుఉండవు . అందువలన సాకారం ,కొందరికి తృప్తి కలిగించినా ,వీరికి బుద్ధి నిరాకారం వైపు పారదు . అంత మాత్రాన లోటు ఏమిలేదు . వీరికి ఈ దశలో కలిగే తృప్తి అపారం . ఈమజిలీ నుండి బయట పడాలంటే ,తల్లిని విడిచి స్కూలుకు వెళ్ళే పిల్లల , మానసిక పరిస్థితే వీరిది . కానీ సృష్టి లోనికి వచ్చిన ప్రతి జీవి ప్రయాణం ,మోక్షమే . జీవాత్మ , పరమాత్మగా ప్రకాసించే వరకూ ప్రయాణం తప్పదు . పురాకృత పాపము  పుణ్యము ,సమానమైనపుడు ,ఏర్పడేదే మానవ జన్మ . అంటే ప్రారబ్ధ రూపానికిరానిది ఎంతో ఉంటుంది . దీనితో సంబంధం లేదు అనడం కుదరదు . భక్తిలో సంత్రుప్తులు కావచ్చు . కానీ మళ్లీ జ్ఞానం కోసంతిరిగి రారని అనలేము . భక్తిలో  సంచితాలన్నీ నశిస్తాయని ఎక్కడా చెప్పలేదు . జ్ఞానాగ్ని దగ్ధ కర్మణాం అన్నారు . అందువల్లనే సృష్టి మూలమైన పంచ భూతాలే తప్ప ,ఏమీ లేదనే నామరూప నిరాకరణ రూపమైన దృష్టినే జ్ఞానం అని ప్రతిపాదించారు పెద్దలు.
               పాంచ భౌతిక విషయాలు మనసును ఆకర్షించ లేని ఈ స్థితిని ,వైరాగ్యం అని భావించ వచ్చు . అంతేకానీ ఇంటిని సంసారాన్ని విడిచి పెట్టడమే ,వైరాగ్యం కాదు . ఈ భావాన్ని బలపరిచిన కొద్దీ ,తామరాకు మీది నీతి బొట్టులా మనసు , సాధనకు సహకరిస్తుంది . ఈ స్థితిలో జరిగే పూజ అత్యంత శక్తి వంతమైనది . బాహ్య ప్రపంచంలో విరమిస్తున్న మనసుకు ,పూజ  లోని ప్రతి పదార్ధము,శబ్దం,అంతరార్ధాన్ని పరిచయం చేస్తాయి .కదిలే ప్రతి భావము ఒక పువ్వై భగవంతుని కోసం విరబూస్తుంది .  ఇదే నిజానికి భగవదార్చన . ఇలా ఏర్చి కూర్చిన ,కదంబ మాల ,ఈ చిన్న blog .  ఉనికిని తన ఆత్మగాను ,పరమాత్మగాను  అనుభవానికి తెచ్చుకోవడమే మోక్షం. తను ఆత్మగా  సంభావించినది ,పర మాత్మ అని ,ఉప్పు బొమ్మ సముద్రంలో మిగలనట్లు   అంతా పరబ్రహ్మమే . ఇదే రమణ మార్గం .
                    'ఓం నమో భగవతే శ్రీ రమణాయ'           
      ఉగాది 'జయ'నామంతో వచ్చింది.ఉగాదిని సృష్టి ప్రారంభంగా భావిస్తాం . నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు మధు ,కైటభులనే రాక్షసులు ,స్వామి కర్ణం నుండి ఆవిర్భవించి లోకాలను అల్ల కల్లోలం చేస్తున్నారు .దేవతల ప్రార్ధన మేరకు  జగదంబ నారాయణుని ,కనులనుండి ,వైదొలగి నందు వలన ,నారాయణుడు ,మధు కైటభులను నశింప జేశాడని , దేవి సప్తశతి  తెలియ జేస్తుంది . పరమాత్మ కన్న జగత్తు వేరనే ,నిద్రా స్థితిలో మాత్రమే ,తమోగుణ సంబంధ మైన ,జగత్తుపట్ల ఆసక్తి ,దాన్ని ఆస్వాదించాలనే తపన ,మనిషికి కలుగుతాయి . ఇవే మధు ,కైటభులు .మధువు ఒక్కటే ,అదే అహం . కైటభాలు ఎన్నో ,అదే నాది . వెరసి నేను , నాది . మహా కాళీ స్వరూపం ,తమో గుణ లక్షణాలను  తొలగించి ,రజో గుణ రూపమైన సాధనకు ,దారి సుగమం చేస్తుంది . అంటే రాత్రి ముగిసి ,ఉషోదయ మైందని గుర్తుగా ఉగాది నిర్వహించ బడుతున్నది .కాళి నాలిక చూపడం ,సరస్వతి రూపానికి గుర్తు . తమోగుణం విడిచి ,కృషితో , జ్ఞానాన్ని కలిగి ,ఆ వెలుగులో సకల కార్యాలు నిర్వహిస్తూ పరమాత్మను చేరమని ,దారి చూపే వెలుగే ఉగాది .
     అందువలన మనకు ఉగాదికి ,దుర్గా స్వరూపిణిగా ,ప్రతి ఊరిలోను పొలిమేర కాచే తల్లిగా ,భావించి ,ఉత్సవాలు
చెయ్యడం జరుగుతూ ఉంటుంది . అంతరార్ధం గ్రహిస్తే ,అన్ని వేళలా తల్లి ,ఎవరి దృష్టి పడకుండా పిల్లలను కాపాడినట్లు
పాడి ,పంటలను కాపాడుతుందని ,ఉత్సవాలను ,పెద్దలు ,శాసించారు .వ్యక్తిగా చూసినా ,గ్రామ దేవత అనుగ్రహంతో, సమాజపు క్రూర దృష్టి నుండి ,ప్రతివారిని రక్షించేది అమ్మ ,అనుగ్రహమే .
   ఉగాది మర్నాటి నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి . అమ్మను దుర్గగా శరన్నవరాత్రులలో పూజిస్తే ,వసంత నవరాత్రులు ,శ్రీరామ నవమి ఉత్సవాలుగా జరుపుకోవడం మనకు తెలిసిందే . దుష్ట శిక్షణకు దుర్గా దేవి ఉగ్రత్వం అవసరమైనట్లే ,శిష్టరక్షణకు సంయమనంతో కూడిన ధర్మ రక్షణ అంతే అవసరం.దుష్టత్వాన్ని భంజనం చెయ్యడానికి,రాత్రి   రూపమైన దక్షిణాయణంలో దుర్గ ఆరాధనం చెయ్యడం ఆచారంలో కనిపిస్తున్నది . అలానే ధర్మానికి పట్టం కట్టే వసంత నవరాత్రులు ,శ్రీరామ జన్మదిన ,సీతా వివాహాలను జరపడం పరంపరగా వస్తున్నది . బయటి ప్రపంచంతో వ్యవహారానికి దుష్ట నియంత్రణకు కొంత కోపము ,ఉగ్రత్వము తప్పనిసరి . తమ పిల్లలే అయినా సవరించ వలసినప్పుడు దండన తప్పదు.అంతరంగ ఉన్నతికి ,ధర్మం యొక్క జననం తప్పదు .అదే రామ జననం . అదే ఉత్తరాయణం .తనలోని పది ఇంద్రియాలనే రావణాసురుడు ,మనసనే సీతమ్మను అనుక్షణం ఎత్తుకుపోతూనే ఉంటాడు.దీనిపై విజయమే రామరాజ్య స్థాపన.పదివేల సంవత్సరాలు రాముడు రాజ్యం పరిపాలించాడని అంటారు . అంటే రావణాసురుడి వ్యవహారమంతా చాలా చిన్నది .అలానే ఇంద్రియజయం ,చిత్తశుద్ధితో చాలా చిన్నది . కానీ ఎప్పుడూ జాగ్రత్త అవసరం .
         అందుకు శ్రీ ఆచార్య శంకరులు తప్పక రావలసిందే వైశాఖ పంచమికి . సాధన కూడా గ్రీష్మంలా సాగాలి .  భగవంతునితో సామీప్యాన్నిచ్చే ,తొలి ఏకాదశిగా తనలోతాను మనన మనే యోగ నిద్రలో ములగాలి .వ్యాసుని దయతో అధ్యయనం సాగి ,శ్రవణం దిశగా పరమాత్మ ఉపదేశాన్ని అంతరంగంలో వినాలి . సృష్టికి ముందు అంటే తనకు ప్రపంచం పరిచయానికి ముందు అర్ధనారీశ్వరం . భూతకాలం ,భవిష్యత్తు వీటిలో తనను ,తన శక్తిని వేరుగా చూపడం వీలుకాదు .అది ఏకం .వర్తమానం మాత్రమే తన శక్తి ప్రకటించ గలదు .అదే వర్తమాన స్వరూపమైన లక్షీ నారాయణ రూపం . స్వరూప   నిష్టలో ,యోగనిద్రా స్థితిలో ఆత్మాను సంధానం చేస్తూ ,తన వ్యవహారాలను సక్రమంగా నడిపేదే నిజమైన లక్ష్మీ కృప .
         జాగ్రత్తగా సాధన సాగితే ,హయగ్రీవ తత్వమైన గురు రూపం ,హృదయంలో ఆవిష్కృతమై ,యజ్ఞోపవీత రూపమైన బ్రహ్మ స్వరూపం అవగాహనకు అందడానికి ,సంధ్యా వందనమనే నిగూఢ తత్వం పరిచయ మౌతుంది . రెండు సంకల్పాల నడుమ సంధ్య,ధర్మాధర్మాలు ,సత్యాసత్యాలు ,ఇలా అన్ని ద్వందాలకు  ఆధారంగా ఉన్న పరతత్వం ,తన పాదాలను చూపుతూ ,ఆధారం పరబ్రహ్మ తత్వంగా వరద హస్తంతో పరిచయం చేస్తూ, శంఖ , చక్రాలు అవసరం లేదంటూ[జనన మరణ చక్రభ్రమణం లేదంటూ ,అంతరంగ శత్రువులపై శంఖాన్ని పూరించ వలసిన అవసరం లేదంటూ ]ఈ ప్రాపంచిక విషయాలు ఎప్పటికీ నిన్ను మభ్య  పెట్టలేవంటూ కటి హస్తాన్నిమనసుకు బాసటగా చూపి , 'వేంకటేశుడిగా 'సహస్రార కమలంలో వేంచేస్తాడు ,శ్రావణ పౌర్ణమికి శ్రవణా నక్షత్రంలో .తన సంపూర్ణ శక్తితో సాధనే,తిరుపతిలో [మూలాధారం ]అలివేలు మంగకు ,నిత్యమూ  తిరుమలలో స్వామి వారితో కళ్యాణం .వర్తమానం అనేది నిజానికి కాలాతీత స్థితి . భూత ,భవిష్యత్తు అనే రెంటినీ అధిగమించినపుడు ఉన్న స్వస్థితి ,మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం .
          కానీ ఇది జీవాత్మ ,పరమాత్మను ఏకం చేసిన క్షణం . సంసారం సముద్రంలా భయపెట్టకుండా వెంకటేశ్వరుని కృపతో కటి లోతు ఉన్న,చిన్న వాగులా కనిపిస్తున్నా ,ఏమరుపాటు తగదు .సృష్టిలో శరీరం కదులుతున్నంత వరకు ప్రమాదం ,ఇంద్రియాల రూపంలో మనసును కైవసం చేసుకోవచ్చు.ఇప్పుడు వసుదేవుని కాళ్ళు పట్టుకుని మనలో అప్పుడే ఉదయించిన మనలోని చిన్న కృష్ణుని ,మళ్లీ కంసుని బారిన పడకుండా ,నంద ,యశోదల వద్దకు చేర్చమని,దేవకిలాఅర్ధించకతప్పదు.లోపలి అనుభవం వల్ల ఎంతో ఆనందం,నందుడు ,పరమాత్మకున్న యశస్సును మరువక ఉండేది యశోద.వీరి నుండి ఏమాత్రం పక్కకు కదిలినా ,కంసుడు [అహం ]పంపిన పూతన ,సృష్టిని ఆస్వాదించే దిశగా ప్రోత్సహించ వచ్చు . సృష్టి అంతా పరమాత్మ లీలగా గుర్తించి ,పూతన నుండి రక్షించుకోవాలి . పరమాత్మ కృష్ణావతారం గ్రహించినపుడు వీరిని వధించి ఒక లీలగా దీన్ని మనకు ఉపదేశిస్తున్నారు. మనసులోని వృత్తులు ,వ్రుతాసురునిలా ,గమ్యం నుండి ఎత్తుకు పోవచ్చు .
     అనుక్షణం ,అప్రమత్తంగా లేకుంటే ,జ్ఞానం పేరుతో తమో గుణ లక్షణమైన నిష్క్రియత్వం వైపు మనసును వెళ్ళనీకుండా , గమనించమనే హెచ్చరిక ,శకటాసుర వధ . ఎప్పుడైనా న్యాయాన్యాయాలు ,ధర్మాధర్మాలు అంటూ మనసును [కొంగ]బకాసురుడు పట్టుకు పోవచ్చు . తస్మాత్ జాగ్రత . ఇలా కృష్ణావతారం ఎన్నో విషయాలకు అన్వయం అవుతుంది . ఇదే శ్రీ కృష్ణ జన్మాష్టమి .
          అందువల్ల పొలిమేరను ధర్మం అనే , కంచె వేసి కాపాడుకోక తప్పదు .అదే కదులుతున్న కాలంలో పోలేరమ్మ పూజ .భద్రంగా కాపాడుకున్న పదం ,ఓంకార రూపమైన విఘ్నాధిపతిగా కాపాడి ,అనంత పద్మనాభునితో  అనంతమైన పరతత్వంలో జాగరూకత నిస్తుంది.శరన్నవరాత్రులలో అమ్మ యొక్క అనుగ్రహం అన్ని లౌకిక శక్తులు ఏకమైనా,సాధకుని రక్షిస్తుంది.భూమి నుండి వచ్చిన శరీరం తననే నరకాసుర వధతో ,మోక్ష లక్ష్మి అనుగ్రహిస్తుంది . కర్తృత్వం విడిచి ,కార్తీకం పరమాత్మను సేవించమని ఆదేశిస్తుంది .
           ఇది చాలా జాగ్రత్తగా గమనించ వలసిన విషయం . సాధారణంగా ఇప్పటి కాలంలో అన్ని చోట్ల వినిపించే పదం అంతటా పరమాత్మ ఉన్నాడు,తనలోనుఉన్నాడు ,కనుక దేవాలయంతో పని లేదు .అజ్ఞానం వలన ,కుండలో ప్రతి బింబాన్నే సూర్యుడనుకునే తీరు స్పష్టంగా తెలుస్తున్నది . ఇది బాల్యావస్థ . జ్ఞాని అలా కనిపిస్తున్నా నిజం తెలిసినవాడు . అనుభవ జ్ఞానం లేనివారు బాల్యావస్థను,జ్ఞానవస్థకు అన్వయించడం బాధాకరం .అందుకే జీవాత్మ పరిధిలో ఉన్న సాధకుడు , గురువును ,ఆశ్రయించవలసిందే .మధురలో కరాగారంలోని చిన్ని కృష్ణుడు వసుదేవుడు చేరిస్తేనే ,నంద వ్రజం చేరాడు .
      పరమాత్మ ఆదేశిస్తున్న విధంగా లీలగా చెప్తున్న విషయాలను జాగ్రత్తగా అన్వయించి ,గమనించాలి . జీవాత్మ అనే పరిధిలోని వ్యక్తి ,కారాగారంలో బంధింప బడిన వానితో సమానం . మోహమనే తాళ్ళతో అన్ని సంబంధాలను పెనవేసి కట్టుకుని,దేన్నీ విడిచి పెట్టలేని దీనుడు.ప్రపంచాన్ని,పంచ భుతాత్మకంగా ఎరుగక ,ఎప్పుడూ అంతరంగంలోనికి ప్రవేశించక ,  అన్ని వైపులా వినిపిస్తున్న ,బ్రహ్మ మొక్కటే అనేదాన్ని తనకు తాను అన్వయించు కొని ,శాస్త్రాన్ని ,అది ఆదేశించిన జీవన విధానాన్ని విడిచి ,ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంగా ,దేవాలయం అనేది ,పనిలేని వాళ్ళు వెళ్ళే కేంద్రంగా భావించే వారికి కొదవలేదు .తాము జ్ఞానులు కనుక వీటి అవసరం లేదు అనుకునేవారి సంఖ్య పెరిగింది .
       నిజానికి శాస్త్ర ప్రకారం నిర్మించిన ఆలయాల్లో ,స్వయం వ్యక్త ఆలయాల్లో ఉన్న శక్తి ,సాధారణ ఇంద్రియాలు తెలుసుకో లేవు . తపస్సుతో పునీతమైన మనస్సుకు అందే శాంతి మాత్రమే ,ఇందుకు నిదర్శనం . ఎన్నో అద్భుతాలు కూడా ఎన్నోసార్లు కనువిప్పు కలిగిస్తాయి .చిన్నదైన జీవత్వం ,దైవత్వాన్ని గుర్తించి తన మోహ శృంఖల విముక్తం చెయ్యమని ప్రార్ధించే గుడులు ,భగవత్ కృపకు తార్కాణాలు . ఇంటిలోని పూజా మందిరం ,శాస్త్ర సమ్మతంగా ,ప్రాణ ప్రతిష్ఠ జరిపిన ఆలయం వలె,పురాకృత కర్మను కూడా ధిక్కరించి ,భగవత్ శక్తిని ప్రసరించ లేదు . కానీ ఆ శక్తి ,ఆలయంలోని విగ్రహ రూపుడైన పరమాత్మకు ఉంది .దీనికి  పూర్వ కర్మల పాప ఫలం ఇపుడు పరమాత్మను పొందే సాధనకు అవరోధం కలిగించ కుండా ,చెరువులోని నాచును పక్కకితోసి వస్తు దర్శనం చేసే వీలు కల్పిస్తుంది . సద్వస్తువు పరమాత్మ మాత్రమే . దీన్ని సాధనా సంపత్తిలో చేర్చుకోవాలి .
    శరీర పర్యంతం,జ్ఞాని కూడా ,శాస్త్రోక్త కర్మను విడిచి , తెలియని వారిని వంచింపరాదని ,గీతాచార్యుని శాసనం .కానీ
అనుభవ జ్ఞానం లేకున్నా వంచించే వారిని ఏమనగలం ?కనుక శరీరం సహకరించినంతకాలం ,దేవాలయ సాంప్రదాయాలను గౌరవించడం కర్తవ్యం . ఇదే కార్తికేయుని కర్మ సిద్దాంతం ,కార్తికంలో .ఇలా చూస్తే సంవత్సర కాలం ,విష్ణువుకు ఒక రోజు అనిచూస్తే ఉత్తరాయణం ,పగలు . దక్షిణాయణం రాత్రి . రాత్రి లోని బ్రహ్మ ముహూర్త కాలమే కార్తీకం . ఈ సమయంలో చేసే భక్తి ,కర్మ ,జ్ఞాన మార్గాలు , బ్రాహ్మీ ముహూర్త ఫలాలను అందిస్తాయి .
      అందుకున్న ఫలాలు ,మార్గశీర్ష లోని , శ్రేయో మార్గాన్ని పరిచయం చేస్తాయి . సుబ్రహ్మణ్య షష్టి ,సృష్టి రహస్యాన్ని మనముందుంచి ,మార్గ దర్శనం చేస్తుంది . అందువల్లనే స్వామి దేవసేనాద్యక్షుడు . సంవత్సరంలోని ఆరు ఋతువులు ఆరు ముఖాలు . పన్నెండు చేతులే నెలలు .ఉత్తర ,దక్షిణా యణాలే పాదాలు . కదిలే కాల[ళ]రూపుడే స్వామి . ఇలా కాలం , స్వామి రూపంగా ఆరాధించే వారికి దేవసేన ఆయన శక్తిగా అనుగ్రహించి ,నిరంతరం ప్రాపంచిక జీవనంలో కొట్టుకు పోతున్న వారికి ,దైవీ గుణాలను అందించి ,శ్రేయో మార్గాన్ని వారు అనుసరించేలా అనుగ్రహిస్తుంది . కాలం చైతన్య రూపంగా చూసే వారికి సుబ్రహ్మణ్యుని అంతరంగ శక్తి శ్రీ వల్లిగా ఆశీర్వదిస్తుంది .
       అరుణోదయ సమయమే ధనుర్మాసం . సంధ్యా సమయపాలనగా ,గోమయంతో చేసే గొబ్బెమ్మలతో లక్ష్మీ ఆవాహనం . గృహంలో, లక్ష్మీ నారాయణులకు ,బాల భోగం . అంటే ,కట్టు పొంగలి ,చెక్కరపొంగలి ,దద్ద్యోజనా లను
నివేదించడం . అంటే ఉదయ సంధ్యా సమయంలో చేసే ఈ పూజ సూర్యనారాయణ పూజ .అందువల్లనే మార్గశిర లక్ష్మివారలు గురువు ధనస్సులో ప్రవేశించే మాసంలో వస్తాయి . గురు అనుగ్రహమే నిజానికి లక్ష్మీ కృప . గోదాదేవి , శ్రీరంగ శాయిని పూజించి స్వామిని చేరినది ,ధనుర్మాసంలోనే.  మందంగా ఉన్న కాలం ,కొత్త స్ఫూర్తితో మకరసంక్రమణ పుణ్య కాలంలో,సూర్యుని పూజించి,ప్రత్యక్ష లక్ష్మీ నారాయణ కృపకు పాత్రులను చేస్తుంది . ఇది మెలకువలో అంటే జాగ్రదావస్థలో స్వస్వరూప చైతన్య[సూర్యుడు] దర్శనానికి సూచనగా గ్రహించవచ్చు .
     ధనుస్సు గురువుకు సంబంధించిన రాశి . అంటే ధను సంక్రమణం గురూపదేశం పొందడం గాను ,మకరం శని యొక్క   రాశి . మకరం తనలోని తమస్సును దూరంచేసుకునే సాధనా సమయంగాను భావించి ,భోగి మంటలలో తన తమో గుణాన్ని అలానే అసంపూర్ణ మిధ్యా జ్ఞానాన్ని విడిచి ,సాధనకు ఉదయ సంధ్యను వినియోగించు కోవాలి . ఇదే పౌష్య లక్ష్మి అనుగ్రహం . ఇదే కృషితో ధాన్యలక్ష్మితో బాటు ,అంతరంగ జ్ఞాన లక్ష్మి కృపకు సాధనం .